translateexpand_more

Gemini App Editing Skills News

Latest updates from Telugu Digital news sources.

10TV Telugu01 Jun, 03:51 pm
వావ్.. జెమిని యూజర్లకు పండగే.. ఇక తో వీడియోలను ఈజీగా మార్చేయొచ్చు.. ఎడిటింగ్ స్కిల్స్ అక్కర్లేదు

జెమిని యాప్ యూజర్లు ఇకపై వీడియోలలో మార్పులు చేయొచ్చు జెమిని ఓమ్నితో నచ్చిన వీడియో ఎడిటింగ్ చేయొచ్చు టెక్స్ట్, ఫొటోలు, ఆడియోలే కాదు.. వీడియోలు కూడా మార్చొచ్చు Gemini App : ఏఐతో వీడియోలు ఎడిట్ చేయొచ్చు తెలుసా? ఇటీవలే గూగుల్ జెమిని ఓమ్ని వీడియో ఎడిటింగ్ ఫీచర్‌ను భారతీయ యూజర్ల కోసం లేటెస్టుగా రిలీజ్ చేసింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా జెమిని యాప్‌లోనే లేదా వెబ్‌లో వీడియోలను ఎడిట్ చేయొచ్చు. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు ఎడిటింగ్ టూల్స్‌తో ఇబ్బంది పడాల్సిన పనిలేదు. జస్ట్ ఒక వీడియోను అప్‌లోడ్ చేస్తే సరిపోతుంది. మీకు ఎలా వీడియో ఎడిట్ చేయాలో ఏఐకి చెబితే సరిపోతుంది. గూగుల్ I/O 2026 ఈవెంట్‌లో వీడియో కంటెంట్ క్రియేషన్‌ కోసం ఈ ఫీచర్ తీసుకొచ్చింది గూగుల్. మీరు ఇచ్చే ఇన్‌పుట్ టైమ్ విషయంలో జెమిని ఓమ్ని టెక్స్ట్, ఫొటోలు, ఆడియో, వీడియోలను ఈజీగా ఎడిట్ చేయగలదు. చాట్‌బాట్‌కు కచ్చితమైన కమాండ్స్ ఇవ్వాలి. మీ మార్పును సింపుల్ లాంగ్వేజీలో వివరించడమే. మిగతాదంతా ఏఐ చూసుకుంటుంది. జెమిని ఓమ్ని ద్వారా వీడియోలను ఎలా ఎడిట్ చేయాలి? : వీడియోను ఎడిట్ చేయడం చాలా ఈజీ 1. మీరు ఏదైనా ఒక వీడియోను అప్‌లోడ్ చేయండి. 2. మీకు కావలసిన మార్పును కచ్చితంగా టైప్ చేయండి. 3. జెమిని వీడియోను ప్రాసెస్ చేసి దానికి అనుగుణంగా ఎడిట్ చేసిపెడుతుంది. 4. మీరు రిజల్ట్ ప్రివ్యూ చేయగలదు. మీకు నచ్చితే వీడియోను సేవ్ చేయొచ్చు. మీరు ఇవన్నీ మీ ఫోన్‌లోని జెమిని యాప్ ద్వారా లేదా నేరుగా బ్రౌజర్ నుంచి చేయవచ్చు. జెమిని ఓమ్నితో మరెన్నో అద్భుతాలు చేయొచ్చు. చిన్న మార్పులే కాదు.. వీడియోలో