translateexpand_more

Ghantasala News

Latest updates from Telugu Digital news sources.

Vaartha01 Jun, 06:13 pm
ఘంటసాలకు పుష్పాంజలి

Ghantasala Fans Tribute: తన మధుర గానామృతంతో దశాబ్దాల పాటు తెలుగు ప్రజలను ఉర్రూతలూగించిన అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావును స్మరించుకోవడం ప్రతి తెలుగువారి బాధ్యత అని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ పేర్కొన్నారు. తిరుపతి నగరంలోని స్థానిక వీవీ మహల్ రోడ్డు (VV Mahal Road) లో ఉన్న ఘంటసాల విగ్రహం వద్ద సోమవారం రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో ఆయన అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. Read Also: APSPDCL Power Complaints:విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం:శివశంకర్ ఘంటసాల వెంకటేశ్వరరావుపై ఉన్న అపారమైన భక్తిశ్రద్ధలతో ఆయన అభిమానులు ఒక సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ప్రతి నెల ఒకటో తారీఖున వీవీ మహల్ రోడ్డులోని ఘంటసాల విగ్రహాన్ని మంచి నీటితో పవిత్రంగా శుద్ధి చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించి, పుష్పాంజలి ఘటించడం వీరి ప్రత్యేకత. ఇందులో భాగంగానే జూన్ 1వ తేదీ (సోమవారం) నాడు విగ్రహాన్ని శుద్ధి చేసి, పూలమాలలు వేసి భక్తిపూర్వకంగా అర్చించారు. ఈ సందర్భంగా ఘంటసాల అపర అభిమాని అయిన వెంకట్రావును రాయలసీమ రంగస్థలి ప్రతినిధులు, సభ్యులు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ.. ఘంటసాల భౌతికంగా మనకు దూరమైనా ఆయన పాడిన పాటలు, పద్యాలు ప్రతి తెలుగు గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయాయన్నారు. భావితరాలకు ఆయన సంగీత వారసత్వాన్ని, జ్ఞాపకాలను అందించడానికే ప్రతి నెల ఈ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సంస్మరణ పూజా కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ తో పాటు సంస్థ సభ్యులు, ప్రముఖులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, లోక ప్రభాకర్ నాయుడు, చిత్రపు హనుమంతరావు పాల్గొన్నారు. అలాగే ఘంటసాల అభిమానులు కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి, పోలే జనార్దన్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, టీచర్ తిరుమలయ్య, గోవిందు, పురోహితుడు సురేష్ స్వామి, తులసి రామ్ నాయుడు, రామకృష్ణ మొదలియార్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని గానగంధర్వునికి పుష్పాంజలి సమర్పించారు. Rayilapur Fire Accident: రాయిలాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం! Tirupati Raxaul Express:తిరుపతి–రక్సౌల్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం! గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. Sai Sudha Play School: తిరుపతిలో సాయి సుధా ప్లే స్కూల్ ఏసీ క్యాంపస్ ప్రారంభం! APSPDCL Power Complaints:విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం:శివశంకర్ TTD Donation:టీటీడీకి రూ.11 లక్షల విరాళం అందించిన దుబాయ్ దాతలు! Janasena: తెలంగాణలో పవన్ కల్యాణ్ సభకు నో పర్మిషన్.. ప్రభుత్వంపై జనసేన తీవ్ర ఆగ్రహం Pawan Kalyan: హైదరాబాద్‌లో పవన్ కల్యాణ్ సభకు అనుమతి నిరాకరణ కేంద్ర ప్రభుత్వం పత్తి దిగుమతి సుంకం రద్దు చేయడంతో భారతీయ వస్త్ర పరిశ్రమ షేర్లు భారీగా... జమ్మూకశ్మీర్‌లో గత మూడు దశాబ్దాలుగా రావణకాష్టంలా మండుతున్న ఉగ్రవాద హింసకు క్రమంగా అడ్డుకట్ట పడుతోంది. ఎప్పుడూ... “బడి పిలుస్తోంది” అనేది కేవలం ఒక నినాదం మాత్రమే కాదని, ప్రతి చిన్నారి విద్య హక్కును... కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా... దేశవ్యాప్తంగా సీబీఎస్ఈ బోర్డు పరీక్షలతో పాటు ఇతర జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల నిర్వహణ తీరుపై... ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ పంచాయతీలను ఆర్థికంగా బలోపేతం చేయడం మరియు క్షేత్రస్థాయిలో పన్ను వసూళ్ల ప్రక్రియను వేగవంతం... ప్రముఖ తమిళ టెలివిజన్ నటి, బిగ్‌బాస్ ఫేమ్ జూలియానా (జూలీ) తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీగా పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడమే ధ్యేయంగా ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా... తెలంగాణలోని నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఒక అద్భుతమైన తీపికబురు అందించింది. రాష్ట్రంలో... మున్సిపల్ పాలకవర్గం, సీనియర్ నేతలతో పొన్నం ప్రభాకర్ భేటీ Ponnam Prabhakar: హుస్నాబాద్ మున్సిపాలిటీలో “ఏబీసీడీ...