translateexpand_more

Harish Rao 039 S Birthday News

Latest updates from Telugu Digital news sources.

Namasthe Telangana03 Jun, 07:01 am
హరీశ్ రావు జన్మదినం సందర్భంగా జహీరాబాద్ లో బీఆర్ ఎస్ నాయకుల పాదయాత్ర

జహీరాబాద్, జూన్ 3 : తమ అభిమాన ప్రజా నాయకుడు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు జన్మదిన సందర్భంగా జహీరాబాద్ పట్టణానికి చెందిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నాయకులు పాదయాత్ర చేపట్టారు. బుధవారం సంకటహర చతుర్ధిని పురస్కరించుకొని హరీశ్‌ రావు నిండు నూరేళ్లు ఆయురా రోగ్యాలతో ఉండాలని జహీరాబాద్ పట్టణంలోని భవాని మందిరం నుండి న్యాల్కల్ మండలం రేజింతల్ సిద్ధి వినాయక స్వామి వారి సన్నిధికి మాజీ కౌన్సిలర్ నామ రవికిరణ్ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా రేజింతల్ సిద్ధి వినాయక ఆలయంలో హరీశ్‌ రావు పేరుపైన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ నాయకులు, కౌన్సిలర్లు నామ స్రవంతి, అన్నపూర్ణ అశోక్ షేరి ,మజ్జిగ సుజిత విశ్వేశ్వర్, స్వప్న ప్రవీణ్, పాండు ముదిరాజ్, కొత్తూరు గ్రామ సర్పంచ్ మహాదేవి మల్లికార్జున పటేల్ , రేజింతల్ గ్రామ సర్పంచ్ కుడుముల ఉమారాణి మండల, పట్టణ పార్టీ మహిళా అధ్యక్షురాలు సరస్వతి రెడ్డి , మంజుల, మాజీ సర్పంచ్ రాజ్ కుమార్, యువ నాయకులు నాగూర్ అరుణ్, సాయి అరుణ్ రెడ్డి, శ్రీకాంత్ చిన్న, వడ్డెర శేఖర్, నరేష్ రెడ్డి, నిఖిల్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.