
‘శుభం’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న చిత్రం ‘దీవాన’. ఈ మూవీ టీమ్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో జరిపిన స్పెషల్ చిట్ చాట్. ‘శుభం’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న చిత్రం ‘దీవాన’. స్మేహ మణిమేగలై హీరోయిన్‌గా పరిచయమవుతోంది. ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మిస్తున్నారు. జూన్ 19న విడుదలయ్యేందుకు సిద్ధమైన ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి ఓ బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా రూపొందించారు. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్స్‌ను మేకర్స్ యమా జోరుగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా చిత్రబృందం ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి స్పెషల్‌గా ఇంటర్వ్యూ ఇచ్చారు. మరి, ‘దీవానా’ టీమ్ చెప్పిన ముచ్చట్లేంటో తెలియాలంటే.. పై వీడియో చూడాల్సిందే.