translateexpand_more

Interview News

Latest updates from Telugu Digital news sources.

Chitrajyothy01 Jun, 03:00 pm
అర్జున్ రెడ్డి’కి, దీవానా’కి ఉన్న తేడా ఇదే.. టీమ్ స్పెషల్ ఇంటర్వ్యూ

‘శుభం’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న చిత్రం ‘దీవాన’. ఈ మూవీ టీమ్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో జరిపిన స్పెషల్ చిట్ చాట్. ‘శుభం’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న చిత్రం ‘దీవాన’. స్మేహ మణిమేగలై హీరోయిన్‌గా పరిచయమవుతోంది. ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మిస్తున్నారు. జూన్ 19న విడుదలయ్యేందుకు సిద్ధమైన ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి ఓ బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా రూపొందించారు. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్స్‌ను మేకర్స్ యమా జోరుగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా చిత్రబృందం ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి స్పెషల్‌గా ఇంటర్వ్యూ ఇచ్చారు. మరి, ‘దీవానా’ టీమ్ చెప్పిన ముచ్చట్లేంటో తెలియాలంటే.. పై వీడియో చూడాల్సిందే.

Chitrajyothy28 May, 07:35 am
విజయ్ ఏదో చేయాలనే తపనతో ఉన్నాడు.. కాస్త టైం ఇవ్వాలి

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, ప్రీతి ముకుందన్, అభిరామి ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ 'బ్లాస్ట్ జోన్'. సినిమా విడుదల సందర్భంగా అర్జున్ సర్జ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.. యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, ప్రీతి ముకుందన్, అభిరామి ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ 'బ్లాస్ట్ జోన్'. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదల చేస్తోంది. సుభాష్ కె రాజ్ దర్శకత్వంలో ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన చిత్రమిది. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా అర్జున్, ప్రీతీ ముకుందన్, అభిరామి, సుభాష్ 'ఏబీఎన్ చిత్రజ్యోతి'కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. సినిమాతో పాటు, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గురించి అర్జున్ సర్జ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు..

Chitrajyothy27 May, 09:41 am
పాములు, మొసళ్ళను కూడా తింటాను

టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి (Rana Daggubati) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగా కెరీర్ ని మొదలుపెట్టిన రానా.. టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి (Rana Daggubati) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగా కెరీర్ ని మొదలుపెట్టిన రానా.. స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకోలేనప్పటికీ నటుడిగా పాన్ ఇండియా క్రేజ్ ని అందుకున్నాడు. బాహుబలి సినిమాలో భల్లాలదేవా పాత్రలో రానా నటన ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసింది. ప్రస్తుతం నిర్మాతగా, బిజినెస్ మ్యాన్ గా, నటుడిగా బిజీగా ఉన్న రానా ఒక ఇంటర్వ్యూలో తనకిష్టమైన ఫుడ్ గురించి చెప్పి అభిమానులను షాక్ కి గురిచేశాడు. రానా ఒక ఫుడ్ లవర్ అని అందరికీ తెల్సిందే. సాధారణంగా ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే పెరుగన్నమో, రసమో వేసుకొని తింటారు. కానీ, రానా మాత్రం పొగలు కక్కే బిర్యానీ, హలీమ్ తింటాడట.. ఈ విషయాన్నీ స్వయంగా రానా భార్య మిహీక ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇక అదే విషయాన్నీ రానా కూడా ఒప్పుకున్నాడు. ముక్క లేనిదే ముద్ద దిగదని.. తనెంత నాన్ వెజిటేరియనో ఉదాహారణలతో కూడా చెప్పుకొచ్చాడు. ఇండియాలో ఉన్నప్పుడు సి ఫుడ్ ఎక్కువ ఇష్టపడతానని చెప్పిన రానా .. విదేశాలలో పాములను, మొసళ్ళను కూడా తిన్నానని చెప్పి షాక్ ఇచ్చాడు. ' నేను ఫుల్ మాంసాహారిని. ఏ దేశం వెళ్తే అక్కడి లోకల్ ఫుడ్ ని తింటాను. మీరు భయపడే వాటిని కూడా నేను తిన్నాను. పాములు, మొసళ్ళను కూడా తిన్నాను. అలాంటి నాన్ వెజిటేరియన్ అయిన నేను చంద్రబాబు నాయుడు పాత్ర కోసం ఫుల్ వెజ్ తినాల్సి వచ్చింది. బరువు తగ్గడానికి మొత్తం శాకాహారిగా మారాను.

Sakshi23 May, 02:40 pm
లావుగా ఉన్నా.. జనాలు చూస్తారా అని తారక్ అడిగాడు

- May 23 2026 7:55 PM | Updated on May 23 2026 7:55 PM జూ.ఎన్టీఆర్ ప్రస్తుతం ఫిజిక్ మెంటైన్ చేస్తూ ఫిట్ ఉన్నాడు. - కెరీర్ ప్రారంభంలో మాత్రం కాస్త బొద్దుగా ఉండేవాడు. - రాఖీ మూవీ టైంలో ఇదే విషయమై పలు విమర్శలు కూడా వచ్చాయి.

Telugu Times01 Jun, 02:04 pm
సింగ్ గీతం'లో స్ట్రాంగ్ విలన్ క్యారెక్టర్ చేశాను. ఇలాంటి జానర్ లో ఇప్పటివరకు సినిమా రాలేదు

లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తన అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌ ‘సింగ్ గీతం’ తో ముందుకు వస్తున్నారు. ప్రతిష్టాత్మక బ్యానర్లు వైజయంతి మూవీస్, స్వప్న సినిమా పై నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండెపుడి ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఇప్పటికే విడుదలైన ‘సింగ్ గీతం’ టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘సింగ్ గీతం’ జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.ఈ సందర్భంగా హీరోయిన్ శాలిని కొండెపుడి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. సింగ్ గీతం జర్నీ ఎలా మొదలైయింది? -ఇంతకుముందు నేను జయమ్మ పంచాయితీ, శుభం, మై డియర్ దొంగ చిత్రాలు చేశాను. తెలిసిన వారి ద్వారా ఈ సినిమాలో ఒక నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర ఉందని తెలిసింది. సింగీతం గారి సినిమా అంటే ఎలాంటి పాత్ర అయినా చేయాలని నిర్ణయించుకున్నాను. ఆడిషన్‌కి వెళ్లాను. ఆడిషన్ ఇచ్చిన నెల రోజుల తర్వాత ఓకే అయ్యింది. -ఇలాంటి జానర్‌లో ఇప్పటివరకు సినిమా రాలేదు. ఈ సినిమాలో ప్రతిది మ్యూజికల్ గా వుంటుంది. ప్రతి ఆర్టిస్ట్‌కి కొంచెం శృతిలో పాడటం రావాలి. ఇందుకోసం చాలా వర్క్‌షాప్స్ చేశాం. ఈ కథ ఎలా ఉండబోతుంది? సంగీతం గారి దర్శకత్వంలో వర్క్ చేయడం ఎలా అనిపించింది ? -ఈ కథ ఆలోచన సింగీతం గారికి చాలా ఏళ్ల క్రితమే వచ్చింది. అయితే ఈ రోజుకీ ఎంతో రిలెవెంట్‌గా అనిపించే కథ ఇది. ఇందులో ప్రతి మాట మ్యూజికల్‌గా ఉంటుంది. సంభాషణలు కూడా పాటల్లా సాగుతాయి. -ఇటీవల విడుదలైన పాట ద్వారా ప్రేక్షకులకు సినిమా టోన్‌పై కొంత క్లారిటీ

Interview News Keyword | Telugu Digital