translateexpand_more

Hyderabad Crime News News

Latest updates from Telugu Digital news sources.

Andhra Jyothy02 Jun, 07:16 am
గండిపేట ఫేక్ జీవో కేసు.. వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు బిగుస్తున్న ఉచ్చు

హైదరాబాద్, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): గండిపేట వందల కోట్ల రూపాయల ల్యాండ్ నకిలీ జీవోల కేసులో (Gandipet Fake GO Case) సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు పరారీ అయ్యారని పోలీసులు తెలిపారు. ఏపీలోని నరసరావుపేటలో బ్రహ్మనాయుడు ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అండ్ గ్యాంగ్ కేరళ, కర్ణాటకలో చక్కర్లు కొడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి వీరి కోసం గాలిస్తున్నారు.

అక్రమ జీవోలను సృష్టించి రూ.వందల కోట్ల విలువైన ల్యాండ్‌ను కాజేసే కుట్రలో మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. భూ కబ్జా చేసిన బ్రహ్మనాయుడు అండ్ గ్యాంగ్ వెంటనే భూమిని విక్రయించేందుకు ప్రయత్నాలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. సోషల్ మీడియాలో ఈ నకిలీ జీవోలను బ్రహ్మనాయుడు అండ్ గ్యాంగ్ వైరల్ చేశారని పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో నకిలీ జీవోలు వైరల్ కావడంతో సైబర్ క్రైమ్ పోలీసులు.. బ్రహ్మనాయుడు అండ్ గ్యాంగ్‌పై నిఘా పెట్టారు.

వైసీపీ నేతలు బ్రహ్మనాయుడు, రాధాకృష్ణ ఇద్దరూ కలిపి మరికొన్ని జీవోలు సృష్టించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో పదిమంది నిందితుల్లో ఐదుగురిని అరెస్ట్ చేశామని, మరో ఐదుగురి కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు. ఫేక్ జీవో కేసులో కడప జిల్లాకు చెందిన మరో వైసీపీ నేత ప్రమేయం కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ కేసులో కీలక నిందితుడు రాధాకృష్ణపైన ఇప్పటికే 9 కేసులు ఉన్నట్లు గుర్తించారు. అరెస్ట్ అయిన నిందితులను కస్టడీకి తీసుకొని విచారిస్తామని పోలీసులు పేర్కొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి...

ధాన్యం కొనుగోళ్లలో రేవంత్ సర్కార్ విఫలం: రాంచందర్‌రావు

బెట్టింగ్ రాకెట్‌పై సీఐడీ ఉక్కుపాదం.. 11 మంది అరెస్ట్

Read Latest  AP News And Telangana News And National News

And Telugu News

Andhra Jyothy02 Jun, 03:02 am
హైదరాబాద్ లో నకిలీ ఫోన్ పే యాప్ మోసం.. ఆరుగురి అరెస్ట్

హైదరాబాద్‌, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో నకిలీ డిజిటల్ చెల్లింపు యాప్‌లతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను కంచన్‌బాగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బక్రీద్ సందర్భంగా గొర్రెల వ్యాపారిని మోసం చేసిన ఈ ఘటనలో ఇద్దరు మైనర్లతో సహా మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు బక్రీద్ కోసం ఐదు గొర్రెలను కొనుగోలు చేస్తున్నట్లు నమ్మించి వ్యాపారితో ఒప్పందం కుదుర్చుకున్నారు. అనంతరం నకిలీ ఫోన్‌పే యాప్‌ను ఉపయోగించి చెల్లింపు చేసినట్లు చూపించే ఫేక్ రసీదును చూయించి అక్కడి నుంచి పరారయ్యారు.

డబ్బు ఖాతాలో జమ కాలేదని గుర్తించిన బాధిత గొర్రెల వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన కంచన్‌బాగ్ పోలీసులు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించి నిందితులను గుర్తించారు. దర్యాప్తు అనంతరం నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుంచి మొబైల్ ఫోన్లు, ద్విచక్ర వాహనాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ మోసంలో ఇద్దరు మైనర్లు కూడా పాల్గొన్నట్లు గుర్తించారు.

ఈ వార్తలు కూడా చదవండి...

ధాన్యం కొనుగోళ్లలో రేవంత్ సర్కార్ విఫలం: రాంచందర్‌రావు

బెట్టింగ్ రాకెట్‌పై సీఐడీ ఉక్కుపాదం.. 11 మంది అరెస్ట్

Read Latest  AP News And Telangana News And National News

And Telugu News