
Watch : రెండు నెలల పాటు సాగిన ఐపీఎల్ టి20 మెరుపుల తర్వాత, భారత క్రికెటర్లు ఇప్పుడు సంప్రదాయ రెడ్ బాల్ క్రికెట్ ఆడేందుకు తమ గేర్ మార్చేశారు. భారత్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య జూన్ 6 నుంచి ఏకైక టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ముమ్మరంగా సన్నద్ధమవుతోంది. దీనికి సంబంధించిన ఒక ప్రత్యేక వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో భారత ఆటగాళ్లు టి20 మోడ్ నుంచి టెస్ట్ ఫార్మాట్‌లోకి మారి, నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తూ పాతే నయా రికార్డులకు పునాది వేస్తున్నారు. నెట్స్‌లో రాహుల్, జైస్వాల్ జోరు.. బీసీసీఐ విడుదల చేసిన వీడియోలో టీమిండియా ఫీల్డింగ్ ప్రాక్టీస్ సెషన్‌తో పాటు కఠినమైన బ్యాటింగ్ విన్యాసాలు కనిపించాయి. ముఖ్యంగా సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్.. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌తో పాటు ఇతర భారతీయ స్పిన్నర్ల బౌలింగ్‌లో డిఫెన్స్, షాట్ సెలెక్షన్‌ను పరీక్షిస్తూ సుదీర్ఘ సమయం బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. మరోవైపు యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ సైతం ఎర్ర బంతితో తన బ్యాటింగ్‌ను పదును పెట్టుకుంటూ కనిపించాడు. ఈ ప్రాక్టీస్ సెషన్ అంతటా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆటగాళ్ల కదలికలను, వారి ఫుట్‌వర్క్‌ను డేగ కన్నుతో గమనిస్తూ తగిన సూచనలు ఇవ్వడం విశేషం. ఎనిమిదేళ్ల తర్వాత తలపడనున్న భారత్-ఆఫ్ఘనిస్తాన్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడటం ఇది కేవలం రెండోసారి మాత్రమే. ఇంతకుముందు 2018 సంవత్సరంలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ రెండు జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో భారత జట్టు పూర్తి ఆధిపత్యం చెలాయించి, 262 పరుగుల భారీ ఇన్నింగ్స్ తేడాతో ఘన విజయం సాధించింది. ఇప్పుడు దాదాపు ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ రెండు ఆసియా జట్లు సుదీర్ఘ ఫార్మాట్‌లో ముఖాముఖి తలపడబోతుండడంతో మ్యాచ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. న్యూ చండీగఢ్ స్టేడియం టెస్ట్ డెబ్యూ ఈ చారిత్రాత్మక మ్యాచ్‌కు పంజాబ్‌లోని న్యూ చండీగఢ్ వేదిక కానుంది. మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేయబోతోంది. ఈ మైదానంలో జరగబోయే మొట్టమొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఇదే కావడం గమనార్హం. సరికొత్త పిచ్, సరికొత్త మైదానంలో ఆఫ్ఘన్ స్పిన్ సవాలును తిప్పికొట్టి మరోసారి జయకేతనం ఎగరేయాలని భారత్ భావిస్తుండగా, ఈసారి టీమిండియాకు గట్టి పోటీ ఇవ్వాలని ఆఫ్ఘనిస్తాన్ పట్టుదలతో ఉంది. మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..