translateexpand_more

India Pakistan Cricket Rivalry News

Latest updates from Telugu Digital news sources.

TV9 Telugu03 Jun, 12:19 pm
క్రికెట్ లవర్స్ కు గుడ్ న్యూస్.. భారత్ - పాక్ పోరుకు సర్వం సిద్ధం! మ్యాచ్ డేట్ ఎప్పుడంటే

క్రికెట్ అంటే కేవలం ఒక ఆట కాదు, చాలా మందికి ఒక ఎమోషన్. అందులోనూ ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఉంటే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం భారత్, పాక్‌లోని క్రికెట్ అభిమానులే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ అంతా ఈ మ్యాచ్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తూ ఉంటారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షి సంబంధాలు దెబ్బతినడంతో రెండు దేశాల మధ్య సాధారణ సిరీస్‌ జరగడం లేదు. కేవలం ఐసీసీ ఈవెంట్స్‌లోనే భారత్, పాక్ జట్లు తలపడుతున్నాయి. దీంతో ఎప్పుడో ఒక సారి జరిగే ఈ హైహోల్టేజ్ మ్యాచ్‌ల కోసం క్రికెట్ అభిమానులు మునుపటి కంటే మరింత ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఐపీఎల్ ఫీవర్ నుంచి బయటికి వస్తున్న క్రికెట్ అభిమానులు మరోసారి క్రికెట్ ఫీవర్‌తో ఊగిపోయే టైమ్ వచ్చేస్తోంది. ఈ నెల 14న ఆదివారం భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. అది కూడా ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్ కప్ టోర్నీలో ఢీకొంటున్నాయి. ఈ నెల 12 నుంచి ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ ఎడ్జ్‌బాస్టన్ స్టేడియం వేదికగా జరగనుంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఇప్పటికే వన్డే వరల్డ్ కప్ 2025 గెలిచిన ఉత్సాహంతో ఉన్న ఇండియన్ ఉమెన్స్ టీమ్.. టీ20 వరల్డ్ కప్ గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని భారత జట్టు తమ తొలి మ్యాచ్‌లోనే పాకిస్థాన్‌తో తలపడనుంది. ఫస్ట్ మ్యాచ్లోనే పాక్ జట్టును చిత్తు చేసి.. టోర్నీని ఘనంగా ఆరంభించాలనే పట్టుదలతో భారత అమ్మాయిలు ఉన్నారు. మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

India Pakistan Cricket Rivalry News Keyword | Telugu Digital