translateexpand_more

Indiaindipendencmovement News

Latest updates from Telugu Digital news sources.

TeluguOne03 Jun, 09:16 am
నేతాజీ సుభాష్ చంద్రబోస్ సతీమణి ఎమిలీ షెంకల్ త్యాగమయ గాథ

భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరు వినగానే ఆజాద్ హింద్ ఫౌజ్, దేశభక్తి నినాదాలు, ఆయన అద్వితీయ సైనిక వ్యూహాలు మాత్రమే అందరికీ గుర్తుకు వస్తాయి. కానీ ఆయన సుదీర్ఘ రాజకీయ, విప్లవ జీవితంలో అత్యంత మానవీయమైన, వ్యక్తిగతమైన ఒక ముఖ్య అధ్యాయం దశాబ్దాల పాటు అధికారిక చరిత్రలో వెలుగులోకి రాకుండా ఉండిపోయింది. అదే ఆస్ట్రియన్ మహిళ ఎమిలీ షెంకల్‌తో ఆయనకు ఉన్న అనుబంధం. పత్రాలు, లేఖలు, ఇటీవల కాలంలో బహిర్గతమైన ప్రభుత్వ రహస్య దస్త్రాల ఆధారంగా పరిశీలిస్తే.. నేతాజీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ త్యాగమయ గాథ ఎంతో ఆసక్తిని, ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 1934లో వియన్నా నగరంలో ఈ కథకు పునాది పడింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ తన ప్రసిద్ధ గ్రంథం ది ఇండియన్ స్ట్రగుల్ రచనలో సహాయం కోసం ఒక ఆస్ట్రియన్ యువతిని నియమించుకున్నారు. ఆమె పేరు ఎమిలీ షెంకల్. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం క్రమంగా బలపడి, వారిద్దరినీ జీవిత బంధం వైపు నడిపించింది. ఐరోపా ప్రవాసంలో ఉన్న కాలంలో వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగి.. 1937 డిసెంబర్‌లో వారు రహస్యంగా వివాహం చేసుకున్నారు. అనంతరం 1942 నవంబర్‌లో వారికి అనిత అనే కుమార్తె జన్మించింది. ఈ వివరాలన్నీ కేవలం ఊహాగానాలు కావు. నేతాజీ రీసెర్చ్ బ్యూరో ప్రచురించిన సేకరించిన రచనల ప్రకారం.. 1934 నుండి 1942 మధ్య కాలంలో బోస్ ఎమిలీకి రాసిన 162 లేఖలు.. ఆమె నుండి వచ్చిన 18 లేఖలు ఇందుకు బలమైన ప్రాథమిక ఆధారాలుగా నిలుస్తున్నాయి. అయితే.. ఒక గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు తన వివాహాన్ని ప్రపంచానికి బహిరంగంగా ప్రకటించకపోవడం వెనుక బలమైన రాజకీయ, భద్రతా కారణాలు ఉన్నాయి. నాటి నాజీ జర్మనీలో ఒక భారతీయ విప్లవ నాయకుడు స్థానిక మహిళను వివాహం చేసుకోవడం సామాజికంగా ఎన్నో ఇబ్బందులకు దారితీసే అవకాశం ఉండేది. మరోవైపు బ్రిటిష్ ఇంటెలిజెన్స్ వర్గాలు నిరంతరం నేతాజీ కదలికలపై నిఘా ఉంచడం వల్ల.. కుటుంబ భద్రతతో పాటు స్వాతంత్ర్య ఉద్యమం కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆయన భావించారు. అందుకే ఐరోపా నుండి ఆసియాకు బయలుదేరే ముందు బోస్ తన సోదరుడు శరత్ చంద్రబోస్‌కు బెంగాలీ భాషలో ఒక లేఖ రాసి ఎమిలీకి ఇచ్చారు. ఒకవేళ తాను మరణిస్తేనే ఆ సమాచారాన్ని కుటుంబానికి చేరవేయాలని ఆమెకు సూచించడం వారి నిగూఢ బంధానికి అద్దం పడుతుంది. వైవాహిక జీవితంలో కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే కలసి ఉండే భాగ్యం ఎమిలీకి దక్కింది. మిగిలిన కాలమంతా సుదూర ప్రాంతాల నుండి లేఖల రూపంలోనే సాగింది. 1943లో నేతాజీ జలాంతర్గామి ద్వారా ఐరోపాను వీడి ఆసియాకు వెళ్ళినప్పుడు, కేవలం రెండు నెలల వయసున్న పసిపాపతో ఎమిలీ ఒంటరిగా మిగిలిపోయింది. దేశ విముక్తి అనంతరం తిరిగి వస్తానని చెప్పిన భర్త.. 1945లో విమాన ప్రమాదానికి గురయ్యారనే వార్త ఆమెను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పాశ్చాత్య సమాజంలో ఆమెకు మరో వివాహం చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ.. నేతాజీపై ఉన్న ప్రేమ, గౌరవంతో ఆమె జీవితాంతం ఒంటరిగానే గడపాలని నిర్ణయించుకున్నారు. అత్యంత కఠినమైన పరిస్థితుల్లో కూడా ఆత్మాభిమానాన్ని కోల్పోకుండా జీవించడం ఆమె వ్యక్తిత్వ ఉన్నతిని తెలియజేస్తుంది. స్వాతంత్య్రానంతరం ఏర్పడిన భారత ప్రభుత్వాలకు ఈ కుటుంబం గురించిన పూర్తి సమాచారం తెలుసనే సత్యం 2016లో విడుదలైన డీక్లాసిఫైడ్ ఫైల్స్ ద్వారా స్పష్టమైంది. నాటి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ 1952 జూన్‌లో ఆర్థిక, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల నుండి వియన్నాలో ఉన్న ఎమిలీకి చిన్న మొత్తాలలో నిధులు ఎలా పంపాలో సలహా కోరినట్లు పత్రాలు వెల్లడిస్తున్నాయి. అలాగే 1955లో నెహ్రూ భారతదేశ పర్యటనకు రావాలని ఆహ్వానించినప్పటికీ.. తన తల్లి అనారోగ్యం కారణంగా రాలేకపోతున్నట్లు ఎమిలీ లేఖ రాశారు. దీనిని బట్టి అధికారిక స్థాయిలో వీరి మధ్య సంప్రదింపులు జరిగాయని అర్థమవుతోంది. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, నేతాజీ కుమార్తె అనితా బోస్ 1960లో భారతదేశాన్ని సందర్శించినప్పుడు ప్రధాని నెహ్రూ అధికారిక నివాసంలోనే బస చేశారు. కాంగ్రెస్ పార్టీ 1964 వరకు ఆమెకు ఏడాదికి ఆరువేల రూపయాలు స్టైపెండ్ రూపంలో పంపుతూ వచ్చింది. అయితే.. జర్మన్ జాతీయురాలైన ఎమిలీ షెంకల్ మాత్రం కాంగ్రెస్ నుండి ఎలాంటి ఆర్థిక సహాయాన్ని స్వీకరించడానికి నిరాకరించారు. టెలిగ్రాఫ్ విభాగంలో చిన్న ఉద్యోగం చేస్తూ.. ఎవరిపైనా ఆధారపడకుండా, నేతాజీ భార్య అనే హోదాను ఎక్కడా వాడుకోకుండా కూతురిని పెంచిన ఆమె ఆత్మాభిమానం విమర్శకులకు సైతం ఆదర్శంగా నిలుస్తుంది. భారతదేశ అధికారిక చరిత్రలో ఎమిలీ షెంకల్ పేరు సుదీర్ఘకాలం పాటు మరుగున పడిపోవడం వెనుక నాటి రాజకీయ సమీకరణాలు కూడా కారణమనే వాదనలు ఉన్నాయి. స్వాతంత్ర్య సమరంలో నేతాజీ సైనిక పాత్రను మాత్రమే పాఠ్యపుస్తకాల్లో చేర్చి.. ఆయన వ్యక్తిగత జీవితాన్ని, త్యాగాలను పక్కన పెట్టేశారు. కొన్ని వర్గాలు బోస్ జర్మనీ పర్యటనను కేవలం వ్యక్తిగత కారణాలతో ముడిపెడుతూ చులకనగా మాట్లాడటానికి

Indiaindipendencmovement News Keyword | Telugu Digital