
ఇజ్రాయెల్ సైనిక చర్యల నేపథ్యంలో అమెరికాతో జరుగుతున్న పరోక్ష చర్చలను ఇరాన్ నిలిపివేసింది. ఇది మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలను తగ్గించే దౌత్య ప్రయత్నాలకు పెద్ద దెబ్బగా చెప్పొచ్చు. ఇరాన్‌ కు చెందిన సెమీ-అధికారిక టాస్నిమ్ వార్తా సంస్థ ప్రకారం.. లెబనాన్‌ లో ఇజ్రాయెల్ సైనిక దాడులు పునరుద్ధరించిన నేపథ్యంలో టెహ్రాన్ వాషింగ్టన్‌ తో మధ్యవర్తుల ద్వారా సందేశాల మార్పిడిని నిలిపివేసింది. ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాలు, ముఖ్యంగా లెబనాన్, గాజాలో, పూర్తిగా నిలిచిపోయేవరకు చర్చలకు తిరిగి రాబోమని ఇరాన్ స్పష్టం చేసింది.ఇజ్రాయెల్ యొక్క కొనసాగుతున్న కార్యకలాపాలు కాల్పుల విరమణ ప్రయత్నాలను దెబ్బతీస్తున్నాయని, అలాగే విస్తృత ప్రాంతీయ చర్చలను క్లిష్ట తరం చేస్తున్నాయని టెహ్రాన్ ఆరోపించింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ మాట్లాడుతూ లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు ప్రాంతీయ దేశాలు, అంతర్జాతీయ మధ్యవర్తుల మధ్య చర్చల్లో ఉన్న విస్తృత కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అని పేర్కొన్నారు.వాషింగ్టన్‌తో కుదిరే ఏదైనా దీర్ఘకాలిక ఒప్పందంలో ఇజ్రాయెల్ సైనిక చర్యలకు సంబంధించి హామీలు ఉండాలని టెహ్రాన్ పదేపదే వాదిస్తూ ఆ విషయాలను నొక్కి చెప్పింది. దక్షిణ లెబనాన్, బీరుట్ దక్షిణ శివార్లలోని హిజ్బుల్లా లక్ష్యాలపై ఇజ్రాయెల్ తన కార్యకలాపాలను తీవ్రతరం చేయడంతో ఈ తాజా దౌత్య ప్రతిష్టంభన ఏర్పడింది. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు.. ఈ దాడులను ఇజ్రాయెల్ భూభాగంపై హిజ్బుల్లా చేస్తున్న దాడులకు ప్రతీకారంగా సమర్థించుకున్నారు. అయితే, లెబనాన్, ఇరాన్ దేశాలు ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ప్రయత్నాలను దెబ్బతీస్తోందని ఆరోపించాయి.చర్చల నిలిపివేతను లెబనాన్ సంఘర్షణకు ఇరాన్ అధికారులు నేరుగా ముడిపెట్టారు. లెబనాన్‌లోని సైనిక కార్యకలాపాలు విస్తృత ప్రాంతీయ పరిష్కారానికి ప్రధాన అడ్డంకిగా ఉన్నాయని వారు స్పష్టం చేశారు. ఈ ఉద్రిక్తతలు కొనసాగితే యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అని