translateexpand_more

Isi Plot News

Latest updates from Telugu Digital news sources.

Oneindia Telugu01 Jun, 12:09 pm
సినిమా తెచ్చిన సెగ.. కదిలిన దావూద్ నెట్ వర్క్

బాలీవుడ్ యాక్షన్ స్పై థ్రిల్లర్ ధురంధర్ సినిమా అండర్ వరల్డ్ మాఫియా డీ-కంపెనీలో తీవ్ర కలకలం రేపింది. పాకిస్థాన్ నుంచి మోస్ట్ వాంటెడ్ డాన్ దావూద్ ఇబ్రహీం నడుపుతున్న ఈ గ్యాంగ్.. ఈ సినిమా భారీ విజయం సాధించిన వెంటనే ముంబైలోని తమ గ్రౌండ్ నెట్‌వర్క్‌ను ఒక్కసారిగా యాక్టివేట్ చేసినట్లు నిఘా వర్గాల ద్వారా సంచలన సమాచారం బయటకు వచ్చింది. రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో రెండు భాగాలుగా వచ్చిన ఈ బ్లాక్‌బస్టర్ సినిమాలో బడే సాహెబ్ అనే పాత్రను చూపించారు. మరణ శయ్యపై ఉన్న ఈ పాత్ర దావూద్ ఇబ్రహీం పోలికలను నూటికి నూరు శాతం పోలి ఉండటమే ఈ వివాదానికి కారణమైంది. దావూద్ ఇంకా బతికే ఉన్నాడని ప్రపంచానికి నిరూపించాలనే తొందరలో డీ-కంపెనీ ఈ ముంబై ప్లాన్‌కు తెరలేపినట్లు తెలుస్తోంది.ముంబై వీధుల నుంచి కొత్త రిక్రూట్మెంట్ .. ఐఎస్ఐ హస్తం ఈ సినిమా తెచ్చిన సెగతో సరికొత్త ఉగ్ర కుట్రకు పాల్పడటం కోసం డీ-కంపెనీ కొత్త సభ్యుల వేటను ప్రారంభించిందని నిఘా వర్గాలు తెలిపాయి. ఈ రిక్రూట్మెంట్ బాధ్యతలను చోటా షకీల్ గ్యాంగ్‌కు అప్పగించగా.. వీరికి ఆయుధాలు సరఫరా చేయడం, శిక్షణ ఇచ్చే బాధ్యతలను పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ తీసుకుంది. ఈ ఉగ్ర కుట్రను ముంబైలో అమలు చేసే బాధ్యతను పాత షూటర్ మున్నా జింగాడాకు అప్పగించారు. అయితే రిక్రూట్ అయిన కొత్త సభ్యులకు అసలు కారణాన్ని చెప్పకుండా.. ముంబైలోని బాంద్రా గరీబ్ నగర్‌లో అక్రమ మసీదుపై జరిగిన బుల్డోజర్ చర్యను చూపించి, వారిని తప్పుదోవ పట్టించి మతం పేరుతో రెచ్చగొట్టినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి.ఉగ్రకుట్రను భగ్నం చేసిన ఢిల్లీ పోలీసులు ఇటీవల ఢిల్లీ పోలీసులు జరిపిన ఓ రహస్య ఆపరేషన్‌లో