translateexpand_more

Jason Sanjay Movie Update News

Latest updates from Telugu Digital news sources.

NTV Telugu03 Jun, 05:18 am
జాసన్ సంజయ్ అచ్చు విజయ్ లాగే ఉంటాడు

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ వారసుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్న జాసన్ సంజయ్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా సిగ్మా అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. జులై 31న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది సిగ్మా. ఈ నేపథ్యంలో తాజాగా ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు జాసన్ సంజయ్ గురించి సందీప్ కిషన్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జాసన్ సంజయ్ వర్క్, డెడికేషన్ గురించి సందీప్ కిషన్ మాట్లాడుతూ ' జాసన్ ఎంతో కష్టపడే స్వభావం ఉన్న వ్యక్తి, సంజయ్ అండ్ టీమ్ సిగ్మా సినిమా కోసం చాలా కాలంగా వర్క్ చేస్తున్నారు. సినిమా షూటింగ్‌కు వెళ్లడానికి ముందే కథపై, ప్రీ-ప్రొడక్షన్ మరియు ఎడిట్ వర్క్‌పై ఫుల్ ఫ్లెడ్జ్ గా గా వర్క్ చేసారు. సినిమాపై సంజయ్‌కు ఉన్న నిబద్ధత ఈ హోమ్‌వర్క్‌లోనే కనిపిస్తుంది. జాసన్ సంజయ్‌లో ఉన్న ఓర్పు తనను ఎంతగానో ఆకట్టుకుంది. జాసన్ ఓపిక గురించి చాలా నేర్చుకోవచ్చు. కేవలం 25 ఏళ్ల వయసులోనే అంత ప్రశాంతంగా, క్లారిటీతో డైరెక్షన్ చేయడం నన్ను ఆశ్చర్యపరిచింది. తను ఏం చేయాలనుకుంటున్నాడనే దానిపై జాసన్ సంజయ్‌కు పూర్తి స్పష్టత ఉంది. అలాగే సంజయ్ విదేశాలలో ఫిల్మ్ మేకింగ్, ఎడిటింగ్ కోర్సులు చదివాడు, అంత చిన్న వయసు ఉన్న దర్శకుడితో తాను పనిచేసి చాలా కాలమైంది. చూడటానికి సంజయ్ సరిగ్గా వాళ్ళ నాన్న విజయ్ లాగే ఉంటాడు, అంత పెద్ద స్టార్ వారసుడైనప్పటికీ ఎంతో ఒదిగి ఉండే మనస్తత్వం, వినయం ఉన్న అబ్బాయ్' అని అన్నాడు.

Jason Sanjay Movie Update News Keyword | Telugu Digital