
ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల చిరకాల స్వప్నం ఎట్టకేలకు సాకారమైంది. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దేశ 18వ రైల్వే జోన్ 'దక్షిణ కోస్తా రైల్వే' (SCoR) సోమవారం అధికారికంగా తన కార్యకలాపాలను ప్రారంభించింది. ప్రత్యేక రైల్వే పరిపాలన, మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలు నెరవేరాయి. ఈ చరిత్రాత్మక పరిణామంతో ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఒక కొత్త శకానికి నాంది పలికినట్లయింది.కొత్త జోన్ స్వరూపం ఇదీ..దక్షిణ మధ్య రైల్వే (SCR) మరియు ఈస్ట్ కోస్ట్ రైల్వే (ECoR) జోన్లలోని కొన్ని భాగాలను పునర్వ్యవస్థీకరించి ఈ కొత్త జోన్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లు ఉన్నాయి. మొత్తం 385 రైల్వే స్టేషన్లతో విస్తరించి ఉన్న ఈ జోన్‌లో 62,000 మంది సిబ్బంది పనిచేయనున్నారు. వార్షికంగా సుమారు రూ.15,500 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. సాధారణ రోజుల్లో 500 ప్యాసింజర్ రైళ్లు, 800 గూడ్స్ రైళ్లను నడపనుంది. విశాఖపట్నం, గంగవరం, కృష్ణపట్నం, కాకినాడ, త్వరలో రానున్న మూలపేట పోర్టులను అనుసంధానించడం ద్వారా ఈ జోన్ సరుకు రవాణా, మల్టీమోడల్ లాజిస్టిక్స్‌కు ఊతమివ్వనుంది.సంబరాల్లో నేతలు, ప్రజలుకొత్త రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం కావడంతో ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ప్రజలు, రాజకీయ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సోమవారం శ్రీకాకుళం జిల్లాలోని పలు రైల్వే స్టేషన్లను స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి సందర్శించి, ప్రజల ఆనందంలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,