translateexpand_more

Kovai Sarala News

Latest updates from Telugu Digital news sources.

Asianet News Telugu03 Jun, 10:42 am
పెళ్లిపై కోవై సరళ షాకింగ్ కామెంట్ .. సింగిల్ గా ఉండటానికి అసలు కారణం ఇదే

ప్రముఖ హాస్య నటి కోవై సరళ.. తనదైన కామెడీతో నవ్వులు పూయిస్తూ రాణిస్తోంది. గత నాలుగున్నర దశాబ్దాలుగా సినిమాలు చేస్తూ అలరిస్తోంది. ఈ ఏజ్‌లోనూ నవ్విస్తూ ఆకట్టుకుంటోంది. వెయ్యికిపైగా సినిమాలు చేసినా ఇప్పటికీ అలరిస్తూనే ఉంది. 64ఏళ్ల వయసులోనూ నవ్వించే ప్రయత్నం చేస్తుంది కోవై సరళ. అయితే ఆమె ఇప్పటకీ ఒంటరిగానే ఉంది. మ్యారేజ్‌ చేసుకోలేదు. తాజాగా కోవై సరళ పెళ్లిపై స్పందించింది. మ్యారేజ్‌ ఎందుకు చేసుకోలేదో తెలిపింది. అదే సమయంలో పెళ్లిపై తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టింది. మ్యారేజ్‌ చేసుకోవాలనే రూల్‌ ఏం లేదని తెలిపింది. ఫ్రీడంగా ఉండాలనే ఉద్దేశంతోనే తాను పెళ్లి చేసుకోలేదని వెల్లడించింది. ఒంటరిగా భూమి మీదకి వచ్చాం, వచ్చాక బంధాలు వచ్చాయ్‌, ఒకరి మీద ఆధారపడి బ్రతకాలి అని తాను అనుకోవడం లేదని చెప్పింది. మ్యారేజ్‌ చేసుకోవడం తనకు ఇష్టం లేదని, సింగిల్‌గా గడిపే జీవితమే బెస్ట్ అని, అందుకే తాను మ్యారేజ్‌కి దూరంగా ఉన్నట్టు తెలిపింది. సింగిల్‌గా ఉంటేనే స్వేచ్ఛగా జీవించవచ్చు అని చెప్పింది కోవై సరళ. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పంచుకుంది ఈ సీనియర్‌ నటి. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కోవై సరళ..ఎంజీఆర్‌ పై అభిమానంతో సినిమాల్లోకి వచ్చింది. ఆమె `వెళ్లి రతం` అనే మూవీతో నటిగా వెండితెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ వంటి భాషల్లో సినిమాలు చేసి మెప్పించింది. తెలుగులోనూ వందకుపైగా చిత్రాల్లో నటించింది. `భైరవ ద్వీపం`, `అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి`, `పెళ్లి`, `సుప్రభాతం`, `క్షేమంగా వెళ్లి లాభంగా రండి`, `నువ్వే కావాలి`, `తిరుమల తిరుపతి వెంకటేశా`, `సింహారాశి`, `సందడే సందడి`, `టైగర్‌ హరిశ్చంద్ర ప్రసాద్‌`, `మహానంది`, `వీరభద్ర`, `స్టైల్‌`, `దేశముదురు`, `నేనింతే`, `రెబల్‌`, `టెంపర్‌` వంటి చిత్రాల్లో నటించింది. చివరగా `సీతా పయణం` చిత్రంలో మెరిసింది.