translateexpand_more

Kriti Sanon Vs Rashmika Mandanna News

Latest updates from Telugu Digital news sources.

Zee Telugu03 Jun, 03:03 am
కాక్ టెయిల్ 2 కోసం షాహిద్, కృతి, రష్మిక ఎంత తీసుకున్నారు

Rashmika Mandanna Remuneration:బాలీవుడ్‌లో ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో కాక్‌టెయిల్ 2 ఒకటి. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ రొమాంటిక్ కామెడీ-డ్రామా జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. Rashmika Mandanna Fee 2012లో విడుదలైన కాక్‌టెయిల్ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఆ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్, దీపికా పదుకొణె, డయానా పెంటీ ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పుడు ఆ సినిమాకు కొనసాగింపుగా కాక్‌టెయిల్ 2 రూపొందుతోంది. ఈ చిత్రానికి హోమీ అదజానియా దర్శకత్వం వహిస్తున్నారు. Kriti Sanon vs Rashmika Mandanna సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ నటీనటుల పారితోషికాల గురించి కూడా చర్చ జరుగుతోంది. అందులో ముఖ్యంగా షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక మందన్నల్లో ఎవరు అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్నారనే విషయం అభిమానుల్లో ఆసక్తి కలిగిస్తోంది. Shahid Kapoor Remuneration వివిధ మీడియా కథనాల ప్రకారం, ఈ సినిమాలో అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడు షాహిద్ కపూర్. ఆయనకు సుమారు రూ.35 కోట్లు పారితోషికంగా అందినట్లు సమాచారం. ప్రస్తుతం బాలీవుడ్‌లో స్టార్ హీరోగా కొనసాగుతున్న షాహిద్‌కు ఉన్న మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు ఈ మొత్తాన్ని చెల్లించినట్లు తెలుస్తోంది. Kriti Sanon Remuneration ఇక హీరోయిన్‌ల విషయానికి వస్తే, కృతి సనన్ మరియు రష్మిక మందన్న ఇద్దరూ దాదాపు రూ.15 కోట్ల చొప్పున పారితోషికం అందుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల వరుస విజయాలతో ఇద్దరూ మంచి క్రేజ్ సంపాదించడంతో వారికి భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. Cocktail 2 Budget ఈ సినిమా మొత్తం బడ్జెట్ సుమారు రూ.80 కోట్ల వరకు ఉండొచ్చని సమాచారం. కథలో కునాల్, ఎల్లీ, దియా అనే మూడు ప్రధాన పాత్రల చుట్టూ కథ తిరుగుతుందని చెబుతున్నారు. స్నేహం, ప్రేమ, భావోద్వేగాల నేపథ్యంలో కథ సాగనున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఒక ఆసక్తికర విషయం ఏమిటంటే, తేరీ బాతోన్ మేన్ ఐసా ఉల్జా జియా తర్వాత షాహిద్ కపూర్, కృతి సనన్ మరోసారి కలిసి నటిస్తున్నారు. ఇప్పటికే ముంబైలో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటోంది. జూన్ మొదటి వారంలో ట్రైలర్ విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న కాక్‌టెయిల్ 2 బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితం సాధిస్తుందో చూడాలి.

Kriti Sanon Vs Rashmika Mandanna News Keyword | Telugu Digital