translateexpand_more

Kuwait Airport Attack News

Latest updates from Telugu Digital news sources.

Sakshi03 Jun, 11:43 am
కువైట్ ఎయిర్ పోర్టుపై ఇరాన్ దాడి.. భారతీయుడి మృతి

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కువైట్: ఇవాళ (బుధవారం) తెల్లవారుజామున కువైట్ విమానాశ్రయంపై ఇరాన్ జరిపిన డ్రోన్ దాడిలో ఓ భారతీయ పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదం పట్ల కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. అమెరికా దాడులకు ప్రతీకారంగా గల్ఫ్‌ దేశాలపైకి డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్‌ విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో కువైట్‌ ఎయిర్‌పోర్టుపై జరిగిన దాడిలో భారతీయుడు మృతి చెందినట్లు భారత ఎంబసీ వెల్లడించింది. మృతుడి కుటుంబంతో సంప్రదింపులు జరుపుతోందని.. బాధిత కుటుంబానికి.. అలాగే ఈ ఘటనలో గాయపడిన వారికి సాయం అందించడానికి కువైట్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని ఎంబసీ అధికారులు వెల్లడించారు. కాల్పుల విరమణ ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ.. ఇరాన్ అమెరికా (US) మధ్య పెరిగిన ఉద్రిక్తతల నడుమ ఈ దాడి జరిగింది. ఈ దాడిలో ఒకరు మరణించడమే కాకుండా.. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాకిన ఇరాన్ డ్రోన్లతో ప్యాసింజర్ టెర్మినల్‌కు భారీ నష్టం కలిగింది. కాగా, కువైట్‌లోని అమెరికా బలగాలను లక్ష్యంగా చేసుకుని వచ్చిన పలు డ్రోన్లను తాము అడ్డుకున్నామని.. ఆ దేశం వైపు ప్రయోగించిన ఇరాన్ క్షిపణులు మార్గమధ్యంలోనే కూలిపోయాయని అమెరికా సైన్యం తెలిపింది. అమెరికా నౌకాదళానికి చెందిన ఐదో విమాన దళం ఉన్న బహ్రెయిన్‌ను లక్ష్యంగా చేసుకుని వచ్చిన క్షిపణులు, డ్రోన్లను కూడా అమెరికా, బహ్రెయిన్ బలగాలు అడ్డుకున్నట్లు పేర్కొంది. దీనికి ప్రతిచర్యగా, హార్ముజ్ జలసంధిలోని ఖేష్మ్ ద్వీపంలో ఉన్న ఇరాన్ సైనిక గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్‌పై అమెరికా దాడులు చేసింది. తిరుమల : అలిపిరి వద్ద పోలీసుల ఓవరాక్షన్‌.. వైఎస్సార్‌సీపీ నేతలతో అనుచిత ప్రవర్తన (ఫొటోలు) చిరంజీవితో 16 సినిమాలు.. ఈమెతో పాటు కూతుళ్లు కూడా హీరోయిన్లే (ఫొటోలు) 'పెద్ది' భామ.. చీరలో నిండుగా అందంగా (ఫొటోలు) 'కాక్‌టెయిల్ 2' మూవీ ట్రైలర్ లాంచ్‌...రష్మిక సందడి (ఫొటోలు) తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా క్షమాభిక్షపై 91 మంది విడుదల (ఫొటోలు) DK శివ కుమార్ ప్రమాణ స్వీకారంలో సీఎం రేవంత్ డీకే శివకుమార్‌ అనే నేను.. కర్ణాటక నూతన సీఎంగా ...! బిసీసీఐ మాస్టర్ ప్లాన్ డేంజరస్ ఓపెనింగ్ జోడీ రెడీ.. రేవంత్ కు KTR ఓపెన్ ఛాలెంజ్..నేను సిద్ధం నువ్వు సిద్దమా? ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం.. ఊపిరాడక 21 మంది మృతి

Oneindia Telugu03 Jun, 07:25 am
కువైట్ ఎయిర్ పోర్ట్ పై భారీ దాడి

అమెరికాతో కాల్పుల విరమణ ప్రతిపాదనలకు సంబంధించిన షరతులు బెడిసి కొట్టిన తర్వాత.. ఇరాన్ విజృంభిస్తోంది. గల్ఫ్ రీజియన్ అమెరికా మిత్రదేశాలపై విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో తాజాగా కువైట్ పై మిస్సైళ్లను సంధించింది. వైమానిక దాడులను తీవ్రతరం చేసింది. బహ్రెయిన్‌లో కూడా దాడులు జరిగినట్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ పరిణామాలు కాల్పుల విరమణకు అతిపెద్ద సవాలుగా నిలిచాయి.బోట్సువానా జాతీయ పతాకంతో ఇరాన్‌కు వెళ్తున్న ఓ ఖాళీ చమురు ట్యాంకర్‌ను అమెరికా సైన్యం అడ్డుకున్న కొద్దిసేపటికే ఈ దాడులు చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ తాజా దాడులు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని సాగింది. ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు, వరుస క్షిపణుల దాడిలో కువైట్ ఎయిర్ పోర్ట్ టెర్మినల్ 1 భారీగా దెబ్బతింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వార్తలు అందుతున్నాయి.దాడి అనంతరం విమాన సర్వీసులన్నింటినీ కూడా నిలిపివేశారు. కువైట్ కు రావాల్సిన కొన్ని విమానాలను ఇతర గమ్యస్థానాలకు మళ్లించారు. దాడి వల్ల మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని కువైట్ జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (DGCA) ప్రకటించింది. దీనిపై కువైట్ న్యూస్ ఏజెన్సీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ దాడిని కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ సవూద్ అబ్దుల్‌అజీజ్ అల్ ఒటాయిబి నిర్ధారించారు. ఎయిర్ పోర్ట్ టెర్మినల్ 1ను ఇరాన్ లక్ష్యంగా చేసుకుందని అన్నారు.ఈ ఘటన చోటు చేసుకున్న వెంటనే అత్యవసర సహాయక బృందాలు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించాయి. గాయపడిన వారి వివరాలు, వారి ఆరోగ్య పరిస్థితిపై గానీ, లేదా విమానాశ్రయ కార్యకలాపాల పునరుద్ధరణపై గానీ అధికారులు ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. గతంలో కూడా కువైట్ ఎయిర్ పోర్ట్ ధ్వంసానికి గురైన విషయం తెలిసిందే. మరమ్మతులు పూర్తి చేసుకుని, దశలవారీ పునఃప్రారంభమైంది. ఈ నెల 1 నుంచి విమానాశ్రయం కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది.ఈ లోపే మరోసారి ఇరాన్ దాడి చేయడం చర్చనీయాంశమైంది. అమెరికా-ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధం 96వ రోజుకు చేరుకుంది. సంఘర్షణ మొదలైన తర్వాత కువైట్ పౌర మౌలిక సదుపాయాలపై జరిగిన అత్యంత ముఖ్యమైన సంఘటనలలో ఇదీ ఒకటి. కాగా బహ్రెయిన్‌పై కూడా దాడులు చేసిన ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్స్ వెల్లడించింది. ఈ క్షిపణులను ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు అడ్డుకున్నాయని యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది.