
లక్ష్మీనారాయణ యోగం వల్ల మిథున రాశి వారికి అత్యంత శుభ ఫలితాలు కలుగుతాయి. శుక్ర బుధ గ్రహాల కలయిక వల్ల ఏర్పడే ఈ యోగం వీరికి మంచి జీవితాన్ని అందిస్తుంది. ఎప్పటినుంచో పెండింగ్లో పడిన పనులు పూర్తవుతాయి. వీరి కెరీర్ కూడా అద్భుతంగా సాగుతుంది. పనిచేసే చోట ప్రశంసలు దక్కుతాయి. ప్రమోషన్ దక్కే అవకాశాలు కూడా అధికంగానే కనిపిస్తున్నాయి. ఈ సమయంలో వీరు ఒక కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఊహించని ఆర్థిక లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది. కన్యా రాశి వారికి శుక్ర బుధ గ్రహాల వల్ల ఏర్పడే లక్ష్మీనారాయణ యోగం అద్భుతమైన వృత్తి అవకాశాలను అందిస్తుంది. వీరి గౌరవాన్ని పెంచుతుంది. ఇక ఉద్యోగం చేసే వారికి పని చేసే చోట పై అధికారుల నుండి పూర్తి సపోర్టు లభిస్తుంది. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు మంచి విజయం దక్కుతుంది. తులా రాశి వారికి లక్ష్మీనారాయణ యోగం ఒక అద్భుతం అనే చెప్పాలి. వీరికి సకల సౌకర్యాలు, విలాసాలు అందుతాయి. పూర్వీకుల ఆస్తి నుండి కూడా మంచి లాభాలు వస్తాయి. ఒక పెద్ద ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది. పాత గొడవలు ఈ సమయంలోనే పరిష్కారం అవుతాయి. ప్రశాంతమైన జీవితం దక్కుతుంది. శుక్ర బుధ గ్రహాల వల్ల ధనుస్సు రాశి వారికి కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుంది. వీరికి అదృష్టం తోడుగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ దక్కే అవకాశం ఉంది. కోరుకున్న కంపెనీల నుంచి ఉద్యోగ ఆఫర్ కూడా రావచ్చు.