translateexpand_more

Local Politics Telangana News

Latest updates from Telugu Digital news sources.

Vaartha31 May, 05:11 pm
హుస్నాబాద్ లో ఏబీసీడీ రాజకీయం..కౌన్సిలర్లు సైడ్ లైనేనా

Husnabad Municipal Politics: హుస్నాబాద్, మే 31:సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలో ప్రస్తుతం “ఏబీసీడీ రాజకీయం“ నడుస్తోందంటూ రాజకీయ వర్గాలు, పాలకవర్గ సభ్యుల మధ్య తీవ్ర చర్చ సాగుతోంది. మున్సిపల్ వ్యవహారాల్లో ప్రజలు ఎన్నుకున్న వార్డు ప్రతినిధుల కంటే కొందరు ప్రభావశీల నేతల పాత్రే ఎక్కువగా ఉందనే ప్రచారం స్థానికంగా జోరుగా వినిపిస్తోంది. Read Also : తెలంగాణలోని డిగ్రీ, పీజీ కాలేజీలకు వేసవి సెలవులు పొడగింపు స్థానిక రాజకీయ విశ్లేషకుల కథనం ప్రకారం.. హుస్నాబాద్ మున్సిపల్ పరిపాలనను శాసిస్తున్న ఆ ‘నలుగురు’ నేతల పేర్లలోని మొదటి అక్షరాల ఆధారంగా ఈ “ఏబీసీడీ ఫార్ములా” ప్రచారంలోకి వచ్చింది: వీరితో పాటు హుస్నాబాద్ పట్టణ కేంద్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వడ్డెపల్లి రమణ చుట్టూనే మున్సిపల్ రాజకీయాలన్నీ తిరుగుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మున్సిపాలిటీ పరిధిలో చేపట్టే వివిధ రకాల అభివృద్ధి పనులు, రోజువారీ పరిపాలనా నిర్ణయాలు, నిధుల కేటాయింపుల విషయంలో ఎన్నికైన కౌన్సిలర్ల అభిప్రాయాలకు తగిన ప్రాధాన్యత లభించడం లేదని కొందరు వార్డు సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ల వార్డులలో వివక్ష చూపుతున్నారని, ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల ప్రమేయం లేకుండానే తెరవెనుక ముఖ్య నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. తాము కేవలం కౌన్సిల్ సమావేశాల్లో సంతకాలు పెట్టడానికే పరిమితమయ్యామా? అని కొందరు అంతర్గతంగా వాపోతున్నారు. ఈ పొలిటికల్ ప్రచారంలో ఎంతవరకు వాస్తవం ఉందనే అంశంపై పట్టణంలో చర్చ సాగుతున్నప్పటికీ.. మున్సిపల్ పాలనలో పారదర్శకత లోపించిందనే విమర్శలు వస్తున్నాయి. వార్డు ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన కౌన్సిలర్ల వ్యవస్థకు పూర్తి ప్రాధాన్యత కల్పించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. ఈ రాజకీయ గందరగోళానికి తెరదించి, మున్సిపల్ పరిపాలన సజావుగా