translateexpand_more

Markets Shut By 8 Pm Pakistan News

Latest updates from Telugu Digital news sources.

Oneindia Telugu01 Jun, 12:29 pm
మార్కెట్లు, షాపింగ్ మాల్స్ రాత్రి 8 గంటలకే మూసివేత.. ప్రభుత్వం సంచలన ఆదేశాలు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. దాదాపు మూడు నెలలుగా సాగుతున్న ఇరాన్- అమెరికా యుద్ధం కారణంగా పేద, మధ్య తరగతి, అభివృద్ది చెందుతున్న, అభివృద్ధి చెందిన దేశాలు సైతం తీవ్ర సంక్షోభంలో మునిగిపోయాయి. ప్రపంచ వాణిజ్యానికి కీలకంగా ఉన్న హార్మూజ్ జలసంధిపై ఇరాన్ ఆంక్షలు విధించడంతో ప్రపంచ దేశాలకు చమురు, గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. ఇక అసలే అంతంత మాత్రంగా ఉన్న పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. ఇప్పటికే అప్పులతో పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ప్రజలకు కనీస అవసరాలను సమకూర్చడంలో అక్కడి ప్రభుత్వం తీవ్రంగా విఫలం అయింది. ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. దేశ ప్రజలకు పూట గడవడమే ఇబ్బందిగా మారింది. అలాగే పాకిస్థాన్ లో ఇంధన, విద్యుత్ సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ తో పాటు దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో మార్కెట్లు, షాపింగ్ మాల్స్ ను రాత్రి 8 గంటలకే మూసివేయాలని పాకిస్థాన్ ప్రభుత్వం మరోసారి కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. పెరుగుతున్న అంతర్జాతీయ ఇంధన ధరలు, దేశంలో తీవ్రతరం అవుతున్న విద్యుత్ కొరతను అధిగమించడానికి ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పాకిస్థాన్ లోని ఇస్లామాబాద్, పంజాబ్, బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా వంటి ప్రధాన రాష్ట్రాల్లోని మార్కెట్లు, షాపింగ్ మాల్స్, స్టోర్లను ఇకపై రాత్రి 8 గంటలకే మూసివేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. మరోవైపు రెస్టారెంట్లు, బేకరీలు, టాండూర్లు, పెళ్లి వేడుకలు జరిగే హాల్స్ రాత్రి 10 గంటల కల్లా క్లోజ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సొంత ఇళ్లల్లో జరిగే పెళ్లిళ్లు కూడా రాత్రి 10 గంటల వరకే అనుమతులు ఇస్తున్నారు. అలాగే అత్యవసరమైన

Markets Shut By 8 Pm Pakistan News Keyword | Telugu Digital