translateexpand_more

Pakistan News

Latest updates from Telugu Digital news sources.

AP7AM31 May, 12:55 pm
ధురంధర్’లో చూపించింది అక్షరాలా నిజం

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ సిరీస్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించిన వేళ, పాకిస్థాన్‌కు చెందిన ఓ మాజీ మేయర్, జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆ చిత్రాలలో పాకిస్థాన్‌ను ప్రతికూలంగా చూపించారని కొందరు విమర్శిస్తున్న నేపథ్యంలో, అందులో చూపించిన ప్రతీ అంశం వాస్తవమేనని ఆరిఫ్ అజాకియా అనే పాక్ జర్నలిస్ట్ స్పష్టం చేశారు. అంతేకాదు, తాను పాకిస్థానీని కాదని, భారత మూలాలున్న వ్యక్తినని ప్రకటించి సంచలనం రేపారు.గతేడాది డిసెంబర్‌లో ‘ధురంధర్’, ఈ ఏడాది మార్చిలో దానికి సీక్వెల్ విడుదలై ప్రపంచవ్యాప్తంగా రూ. 3100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే. పాకిస్థాన్‌లోని కరాచీ నగరానికి చెందిన ల్యారీ ప్రాంతంలోని నేర సామ్రాజ్యాలు, వాటిపై భారత నిఘా వర్గాలు జరిపిన కౌంటర్-టెర్రరిజం ఆపరేషన్ల ఆధారంగా ఈ చిత్రాలను తెరకెక్కించారు. అయితే, ఈ సినిమాలు పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా రాజకీయ అజెండాతో రూపొందించారని కొన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ ఆరోపణలను ఖండిస్తూ ఆరిఫ్ అజాకియా ముందుకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.ఇటీవల జరిగిన ‘టాక్ జర్నలిజం 2026’ కార్యక్రమంలో జర్నలిస్ట్ సౌరభ్ ద్వివేదితో మాట్లాడుతూ ఆరిఫ్ అజాకియా ఈ వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఏఎన్ఐ వార్తా సంస్థ పంచుకుంది. "సినిమాలో చూపించిన ల్యారీ ప్రాంతంలోనే నేను పుట్టి పెరిగాను. ఆ కాలంలో కరాచీలోని ఒక పట్టణానికి మేయర్‌గా కూడా పనిచేశాను. కాబట్టి, ‘ధురంధర్’ చిత్రంలో చూపించిన ప్రతి విషయం నిజమని, అక్కడి పరిస్థితులను నేను

Oneindia Telugu01 Jun, 12:29 pm
మార్కెట్లు, షాపింగ్ మాల్స్ రాత్రి 8 గంటలకే మూసివేత.. ప్రభుత్వం సంచలన ఆదేశాలు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. దాదాపు మూడు నెలలుగా సాగుతున్న ఇరాన్- అమెరికా యుద్ధం కారణంగా పేద, మధ్య తరగతి, అభివృద్ది చెందుతున్న, అభివృద్ధి చెందిన దేశాలు సైతం తీవ్ర సంక్షోభంలో మునిగిపోయాయి. ప్రపంచ వాణిజ్యానికి కీలకంగా ఉన్న హార్మూజ్ జలసంధిపై ఇరాన్ ఆంక్షలు విధించడంతో ప్రపంచ దేశాలకు చమురు, గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. ఇక అసలే అంతంత మాత్రంగా ఉన్న పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. ఇప్పటికే అప్పులతో పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ప్రజలకు కనీస అవసరాలను సమకూర్చడంలో అక్కడి ప్రభుత్వం తీవ్రంగా విఫలం అయింది. ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. దేశ ప్రజలకు పూట గడవడమే ఇబ్బందిగా మారింది. అలాగే పాకిస్థాన్ లో ఇంధన, విద్యుత్ సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ తో పాటు దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో మార్కెట్లు, షాపింగ్ మాల్స్ ను రాత్రి 8 గంటలకే మూసివేయాలని పాకిస్థాన్ ప్రభుత్వం మరోసారి కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. పెరుగుతున్న అంతర్జాతీయ ఇంధన ధరలు, దేశంలో తీవ్రతరం అవుతున్న విద్యుత్ కొరతను అధిగమించడానికి ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పాకిస్థాన్ లోని ఇస్లామాబాద్, పంజాబ్, బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా వంటి ప్రధాన రాష్ట్రాల్లోని మార్కెట్లు, షాపింగ్ మాల్స్, స్టోర్లను ఇకపై రాత్రి 8 గంటలకే మూసివేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. మరోవైపు రెస్టారెంట్లు, బేకరీలు, టాండూర్లు, పెళ్లి వేడుకలు జరిగే హాల్స్ రాత్రి 10 గంటల కల్లా క్లోజ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సొంత ఇళ్లల్లో జరిగే పెళ్లిళ్లు కూడా రాత్రి 10 గంటల వరకే అనుమతులు ఇస్తున్నారు. అలాగే అత్యవసరమైన

AP7AM31 May, 11:08 am
పాకిస్థాన్ ఐఎస్ఐ కొత్త అస్త్రం ఇతడేనా

భారత్‌లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ కొత్త ఆయుధాన్ని ప్రయోగిస్తోందా? సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ముసుగులో యువతను ఉగ్రవాదం వైపు మళ్లిస్తూ, దాడులకు కుట్రలు పన్నుతున్న పాకిస్థానీ షాజాద్ భట్టి కార్యకలాపాలు చూస్తుంటే అవుననే అంటున్నాయి భారత భద్రతా ఏజెన్సీలు. ఒకప్పుడు సోషల్ మీడియా స్టార్‌గా ఉండి, ఇప్పుడు ఐఎస్ఐ ఆపరేటివ్‌గా మారినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భట్టి, పాక్ కొత్త వ్యూహంలో కీలక పాత్రధారిగా మారాడని అధికారులు అనుమానిస్తున్నారు.తాజాగా మే 30, 31 తేదీల్లో ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్... భట్టికి చెందిన నెట్‌వర్క్‌పై భారీ ఆపరేషన్ నిర్వహించింది. 8 నుంచి 9 మంది అనుమానితులను అరెస్ట్ చేసింది. వీరి నుంచి పాకిస్థాన్‌లో తయారైన 4 హ్యాండ్ గ్రెనేడ్లు, 2 గ్లాక్ పిస్టళ్లు, 24 రౌండ్ల తూటాలు, దొంగిలించిన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలోని ఒక చారిత్రక ఆలయం, సోనిపట్ హైవేపై ఉన్న దాబా, హరియాణాలోని హిసార్ సైనిక శిబిరంపై దాడికి వీరు ప్లాన్ చేసినట్టు విచారణలో తేలింది.ఎవరీ షాజాద్ భట్టి?పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన భట్టి, '333' అనే హ్యాండిల్‌తో సోషల్ మీడియాలో గుర్తింపు పొందాడు. భారత్-పాక్ సంబంధాలు, మతపరమైన అంశాలపై పోస్టులు పెడుతూ ఫాలోయింగ్‌ను పెంచుకున్నాడు. అయితే, 2013లోనే ఇతనిపై పాక్‌లో దొంగతనం, దోపిడీ, అత్యాచారం వంటి కేసులున్నాయి. 2015లో దుబాయ్ పారిపోయి, అక్కడ ఐఎస్ఐ హ్యాండ్లర్లయిన అబిద్ జాట్, అజ్మల్ గుజ్జర్ వంటి వారితో సంబంధాలు ఏర్పరుచుకున్నట్టు ఏజెన్సీలు గుర్తించాయి.డబ్బు, కీర్తి ప్రతిష్ఠల ఆశ చూపి సోషల్ మీడియా ద్వారానే

Eenadu31 May, 10:50 am
ఉగ్రవాదులకు సాయంగా భారత్ లోకి అక్రమంగా టెలికామ్ సంకేతాలు

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉగ్రవాద పోషణలో పాక్‌ వంకర బుద్ధి మారడంలేదు. జమ్మూ కశ్మీర్‌లోని ఉగ్ర నెట్‌వర్క్‌ల కోసం అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్‌ నిబంధనల ఉల్లంఘనలకు కూడా పాల్పడుతోంది. ఇందుకోసం సరిహద్దుల వెంట భారత్‌ వైపు అక్రమంగా సెల్యూలర్‌ సంకేతాలను పంపిస్తోంది. ఇది ఉగ్రవాదుల రహస్య కమ్యూనికేషన్లకూ ఊపిరిగా ఉపయోగపడుతోందని అధికారులు వెల్లడించారు. ఇటీవల పాకిస్థాన్‌ చర్యలు అధికారుల అనుమానాలను మరింత బలపరుస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ పీర్‌ పంజాల్‌ పర్వతశ్రేణుల్లో చొరబాట్లు పెరుగుతున్నాయి. దీనికి తోడు నియంత్రణ రేఖకు అటువైపు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఏర్పాటు చేసిన సెల్‌ టవర్ల సంకేతాలు కరుడు గట్టిన ఉగ్రవాదులున్న జైళ్లకు చేరుతున్నాయి. కశ్మీర్‌లోని పర్వతశ్రేణులు సహజంగా చాలా వరకు సంకేతాలను అడ్డుకొంటున్నా.. మైదాన ప్రాంతం ఉన్న జమ్మూలో మాత్రం ఈ సంకేతాలు భారత్‌లోకి చొరబడి ఉగ్రనెట్‌వర్క్‌లకు చేరుతున్నాయి. ముఖ్యంగా కతువా, రాజౌరీ, పూంచ్‌ జిల్లాలు, జమ్మూలోని కోట్‌ బల్వాల్‌ జైలు వంటి ప్రదేశాల వద్ద పాక్‌ టెలికామ్‌ సిగ్నల్స్‌ను మన దళాలు గుర్తించాయి. కొన్ని జైళ్లలో ఇప్పటికే జామర్లను ఏర్పాటు చేసినా వీటిని అడ్డుకోవడంలో విఫలం అవుతున్నాయి. అక్రమంగా కారాగారాల్లోకి చేరిన ఫోన్లను ఖైదీలు వినియోగిస్తున్నారు. జమ్మూకశ్మీర్‌లో మొత్తం 14 జైళ్లు, రెండు కరెక్షన్‌ హోమ్‌లు ఉన్నాయి. పాకిస్థాన్‌ టవర్లు చైనాకు చెందిన సీడీఎంఏ టెక్నాలజీని వినియోగిస్తున్నాయి. వీటిల్లో అత్యున్నత స్థాయి ఎన్‌క్రిప్షన్‌ సాధ్యమవుతుంది. ఇది ఉగ్రవాదులు వాడే వైఎస్‌ఎంఎస్‌కు ఉపయోగపడుతుంది. సీడీఎంఏ పలు సిగ్నల్స్‌ను ఏకకాలంలో అనుమతిస్తుంది. దీంతో భద్రతా ఏజెన్సీల ఎలక్ట్రానిక్‌ మానిటరింగ్‌ సమస్యాత్మకంగా మారుతుంది. దీంతో ఉగ్రవాదులు వైఎస్‌ఎంఎస్‌ టెక్నాలజీని విరివిగా వాడుతున్నారు. దీంతో పాక్‌ పంపే సిగ్నల్స్‌తో పీవోకేలోని హ్యాండ్లర్లు, చొరబాటుదారులు, వారికి ఆశ్రయం ఇచ్చే వారితో నిరంతరం టచ్‌లో ఉంటున్నారు. ఈ అక్రమ విధానాలతో పాకిస్థాన్‌

Oneindia Telugu01 Jun, 04:56 pm
పాకిస్థాన్ కు మరోసారి భారత్ బిగ్ షాక్

చీనాబ్- బియాస్ సొరంగం ప్రాజెక్ట్ చాలా ముఖ్యమైనదని హిమాచల్ గవర్నర్ కవిందర్ గుప్తా తాజాగా తెలిపారు. ఈ ప్రాజెక్ట్ చీనాబ్ నదిలోని మిగులు జలాలను బియాస్ పరీవాహక ప్రాంతానికి మళ్లించి, పాకిస్థాన్ కు నీటి సరఫరాను నిలిపివేస్తుందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో జూన్ 1న ప్రారంభమైన జనగణన స్వీయ-గణన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడిన గవర్నర్.. తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్ కు గుణపాఠం చెప్పడం అత్యవసరమన్నారు.ఇది గత లోపాలను సరిదిద్దే చర్య అని.. పంజాబ్, హిమాచల్, హర్యానా, ఉత్తరా ఖండ్ రాష్ట్రాల అవసరాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. జనగణన గణాంకాలు పేదరిక నిర్మూలన, ఆరోగ్య సంరక్షణ, విద్య, మౌలిక సదుపాయాల అభివృద్ధి పథకాల రూపకల్పనలో ప్రభుత్వానికి తోడ్పడతాయని గవర్నర్ తెలిపారు. హిమాచల్‌ లో పౌరులు జూన్ 1 నుండి జూన్ 15 వరకు ఆన్‌ లైన్ పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా స్వీయ గణన చేసుకోవచ్చు. ఈ పదిహేను రోజుల్లో కుటుంబ సభ్యులందరి వివరాలను వ్యక్తిగతంగా నమోదు చేయాలి. ఖచ్చితమైన సమాచారం అందించి, ఈ జనగణన డ్రైవ్‌ లో సహకరించాలని గవర్నర్ ప్రజలకు పిలుపునిచ్చారు.ఇక భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకునే ఉన్నాయి. గతేడాది ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్, పహల్గామ్ లోయలో ఉగ్రవాదులు జరిపిన మారణ హోమంలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్ర స్థావరాలపై దాడులు చేసి వాటిని ధ్వంసం చేసింది.వందలాది మంది ఉగ్రవాదులను ఏరివేసింది. అలాగే పాకిస్థాన్ పై కఠిన ఆంక్షలు విధించింది. ఆంక్షల్లో భాగంగా ఇరు దేశాల మధ్య వాణిజ్యం నిలిపివేత, సింధూ జలాల పంపిణీ నిలిపివేత చేశారు.  ఇక భారత్, పాకిస్థాన్ మధ్య 1960, సెప్టెంబరు 19న జరిగిన ఒప్పందం ప్రకారం ఈ నదీ వ్యవస్థ మొత్తం నీటిలో 20 శాతం భారత్, 80 శాతం పాకిస్థాన్‌ వినియోగించుకోవాలి. 

Chitrajyothy26 May, 11:49 am
Ntr Fans: తారక్‌ బర్త్‌డే.. ఆ కుటుంబానికి ఎంత అభిమానమో.. | Ntr birthday celebrations at Pakistan avm

ఎన్టీఆర్‌కు (Jr Ntr) పాన్‌ ఇండియా స్థాయిలో క్రేజ్‌ ఉంది. కెరీర్‌ బిగినింగ్‌ నుంచీ పౌరాణిక, జానపద, సాంఘిక పాత్రలు ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నారు. ఎన్టీఆర్‌కు (Jr Ntr) పాన్‌ ఇండియా స్థాయిలో క్రేజ్‌ ఉంది. కెరీర్‌ బిగినింగ్‌ నుంచీ పౌరాణిక, జానపద, సాంఘిక పాత్రలు ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నారు. ఆయన డైలాగ్‌ డెలివరీ భాషపై పట్టు గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అలాగే సింగిల్‌ టేక్‌లో సీన్‌ చేయగల సత్తా ఉన్న నటుడు. ప్రస్తుతం తారక్‌ కథానాయకుడిగా ‘డ్రాగన్‌’ (Dragon) చిత్రం తెరకెక్కుతోంది. ఆయన బర్త్‌ డే కానుకగా మే 20న ఈ సినిమా ఫస్ట్‌ గ్లింప్స్‌ విడుదలైంది. తారక్‌కు ఇండియానే కాకుండా జపాన్‌, యూఎస్‌ఏలో కూడా అభిమానులున్నారు. అయితే పాకిస్థాన్‌లో కూడా ఎన్టీఆర్‌కు అభిమానులున్నారు. అవును ఇది నిజం.. ఎన్టీఆర్‌ బర్త్‌డేను పాకిస్థాన్‌కు చెందిన ఓ కుటుంబం ఘనంగా సెలబ్రేట్‌ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. తారక్‌ పుట్టినరోజును సెలబ్రేట్‌ చేసిన వ్యక్తి పేరు సులేమాన్‌. ఆయన కుటుంబం అంతా ఈ నెల 20 ఒక చోట చేరి కేక్‌ కట్‌ చేసి సెలబ్రేట్‌ చేశారు. అంతే కాదు కేక్‌పై డ్రాగన్‌ టర్న్స్‌ 43 అని రాయించారు. ఇంట్లో వాళ్లంతా కలిసి హ్యాపీ బర్త్‌ డే అన్నా అని పాడుతూ విష్‌ చేస్తూ తారక్‌ పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

Sakshi27 May, 01:52 am
ట్రంప్ ప్లాన్ తో పాక్ పాస్ పోర్ట్ చెల్లదా

“ఈ పాస్‌పోర్ట్‌ ఇజ్రాయెల్‌కు చెల్లదు”.. అని పాకిస్థాన్‌ పాస్‌పోర్ట్‌పై కనిపిస్తున్న వాక్యం ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. కారణం… అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన తాజా ప్రతిపాదనే. పశ్చిమాసియా శాంతి ఒప్పందాల్లో భాగంగా పాకిస్థాన్‌ కూడా ఇజ్రాయెల్‌తో సంబంధాలు సాధారణీకరించాలని ట్రంప్‌ ఒత్తిడి తెస్తుండటంతో… “పాకిస్థాన్‌ తన పాస్‌పోర్ట్‌ నిబంధనలనే మార్చాల్సి వస్తుందా?” అనే చర్చ మొదలైంది. ట్రంప్‌ తాజాగా “అబ్రహామ్‌ అకార్డ్స్‌” విస్తరణపై మాట్లాడారు. సౌదీ అరేబియా, ఖతర్‌, టర్కీతో పాటు పాకిస్థాన్‌ కూడా ఈ ఒప్పందాల్లో చేరాలని ఆయన సూచించారు. మిడిల్‌ ఈస్ట్‌లో శాంతి, ఆర్థిక సహకారం, వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం ఇజ్రాయెల్‌తో ముస్లిం దేశాలు సంబంధాలు ఏర్పరచుకోవాలని ట్రంప్‌ అభిప్రాయపడ్డారు. “ఈ ఒప్పందంలో భాగం కావాలనుకోని దేశాలు భవిష్యత్తు డీల్‌లో ఉండకూడదు” అంటూ ఆయన స్పష్టం చేశారు. అయితే పాకిస్థాన్‌ మాత్రం వెంటనే ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. పాక్‌ రక్షణ మంత్రి ఖ్వాజా అసిఫ్‌ మాట్లాడుతూ… “ఇజ్రాయెల్‌పై నమ్మకం లేదు. పాలస్తీనా సమస్య పరిష్కారం కాకుండా మేం గుర్తింపు ఇవ్వం” అని స్పష్టం చేశారు. మరోవైపు ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాఖ్‌ దార్‌ కూడా అదే మాట చెప్పారు. 1967 సరిహద్దుల ప్రకారం స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పడితేనే ఇజ్రాయెల్‌ను గుర్తించే అంశం పరిశీలిస్తామని పాకిస్థాన్‌ చెబుతోంది. అబ్రహం అకార్డ్స్‌ అబ్రహం అకార్డ్స్‌.. 2020లో అమెరికా మధ్యవర్తిత్వంలో ఇజ్రాయెల్‌–అరబ్‌ దేశాల మధ్య కుదిరిన సంబంధాల సాధారణీకరణ ఒప్పందాల పేరు. యూదులు, ముస్లింలు, క్రైస్తవులందరికీ సామాన్య పితామహుడిగా భావించే “అబ్రహాం” పేరు మీద ఈ ఒప్పందాలకు పేరు పెట్టారు. వాణిజ్యం, పర్యాటకం, సాంకేతికత, భద్రతా సహకారాన్ని పెంచడం వీటి ప్రధాన లక్ష్యం. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, బహ్రెయిన్‌, మొరాకో

Sakshi28 May, 02:12 am
ఒక సాధారణ మోడల్ ఎలా కోకైన్ క్వీన్’ అయ్యింది

పాకిస్తాన్ డ్రగ్స్ సామ్రాజ్యంలో ప్రస్తుతం ఒకే ఒక్క పేరు మార్మోగుతోంది. అదే అన్మోల్ అలియాస్ ‘పింకీ’. మోడలింగ్ రంగంలో మెరిసిపోవాలని ఆశపడిన ఒక సాధారణ యువతి, ఎలా కోకైన్ సిండికేట్‌కు రాణిగా మారింది? పోలీసుల కళ్లు గప్పి 17 ఏళ్ల పాటు డ్రగ్స్ సామ్రాజ్యాన్ని ఎలా ఏలింది? ఇప్పుడు రాజకీయ నేతల పేర్లను బయటపెడుతూ పాక్ వ్యవస్థను ఎలా షేక్ చేస్తోంది? కలల ప్రపంచం నుండి ‘చీకటి’ లోకానికి.. బలూచిస్థాన్‌కు చెందిన అన్మోల్, తన అందంతో మోడలింగ్ రంగంలో నిలదొక్కుకోవాలని కరాచీకి చేరుకుంది. గ్లామర్ ప్రపంచంలో రాణించాలని ప్రయత్నించిన ఆమెకు, కరాచీలోని హై-ప్రొఫైల్ పార్టీలు, డ్రగ్స్ సంస్కృతితో పరిచయం ఏర్పడింది. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశ, హంగులతో కూడిన జీవనశైలిపై ఏ‍ర్పడిన వ్యామోహం ఆమెను మెల్లమెల్లగా మాదకద్రవ్యాల వైపు నెట్టాయి. ఒక మోడల్‌గా ప్రయత్నించి విఫలమైన ఆమె, ఆ తర్వాత డ్రగ్స్ వ్యాపారంలో తిరుగులేని శక్తిగా ఎదిగింది. సామ్రాజ్య విస్తరణ: రహస్య నెట్‌వర్క్ పింకీ డ్రగ్స్ నెట్‌వర్క్ కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్ తదితర నగరాల్లో వేళ్లూనుకుంది. తన గ్యాంగ్‌లో మహిళలను క్యూరియర్‌లుగా వాడుకుంటూ, ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడేది. వాట్సాప్ ద్వారా ఆర్డర్లు స్వీకరించి, నేరుగా డెలివరీ చేసే అధునాతన పద్ధతిని ఆమె అనుసరించింది. పింకీ స్వయంగా డ్రగ్స్ తయారీలోనూ, వాటి నాణ్యతను పరీక్షించడంలోనూ శిక్షణ పొందిందని, తన వద్ద ఉన్న ‘వైట్’, ‘గోల్డెన్ స్టఫ్’ అత్యుత్తమమైనవని ఆమె గర్వంగా చెప్పుకునేదని పోలీసులు తెలిపారు. అరెస్టు: సంచలన నిజాల వెల్లడి 2026, మే 12న కరాచీ పోలీసులు నిర్వహించిన మెరుపు దాడిలో పింకీ అరెస్టయింది. ఆమె వద్ద కోకైన్ హైడ్రోక్లోరైడ్, కెటామైన్, వివిధ రసాయనాలు భారీ మొత్తంలో దొరికాయి. విచారణలో ఆమె గత 17

Eenadu27 May, 03:14 am
పాక్ మధ్యవర్తిత్వమే పెద్ద సమస్య

పాకిస్థాన్‌పై అమెరికా సెనెటర్ లిండ్సేగ్రాహం తీవ్రంగా మండిపడ్డారు. అమెరికా-ఇరాన్‌ (USA-Iran) మధ్య కొనసాగుతోన్న శాంతి చర్చల్లో పాక్‌ మధ్యవర్తిత్వం వహిస్తోన్న సంగతి తెలిసిందే. పాక్‌ మధ్యవర్తిత్వం వహించడమే పెద్ద సమస్య అంటూ ఆయన విమర్శలు చేశారు. ఇరాన్‌తో శాంతిచర్చల్లో పాల్గొంటున్న దేశాలు అబ్రహాం ఒప్పందాలపై సంతకాలు చేయాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ (Donald Trump) పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఇజ్రాయెల్‌తో వైరం నేపథ్యంలో పాక్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ (Khawaja Asif) దీన్ని తోసిపుచ్చారు. ఈ క్రమంలోనే లిండ్సే (Lindsey Graham) పాక్‌ వ్యవహారంపై విరుచుకుపడుతూ ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టారు. పాక్‌ మధ్యవర్తిగా వ్యవహరించడమే అతిపెద్ద సమస్య అని పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌ (Israel)పై సుదీర్ఘకాలంగా అది విద్వేషంతో రగిలిపోతుందన్నారు. టెల్‌అవీవ్‌కు వ్యతిరేకంగా గతంలో పాక్‌ (Pakistan) ఉన్నతస్థాయి అధికారులు చేసిన వ్యాఖ్యలు ఆందోళనకరంగా ఉన్నాయి. ఇజ్రాయెల్‌పై నమ్మకం లేనందున అబ్రహాం ఒప్పందంలో పాల్గొనేది లేదని ఖవాజా చేసిన వ్యాఖ్యలను లిండ్సే ప్రస్తావించారు. ఆ వ్యాఖ్యలు తనను భయాందోళనకు గురిచేశాయన్నారు. అబ్రహాం ఒప్పందాలపై సంతకాలు చేయాలంటూ ట్రంప్‌ ఇచ్చిన పిలుపుపై పాక్‌ వెంటనే సమాధానం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఇటీవల అమెరికాతో ఘర్షణల నేపథ్యంలో ఇరాన్‌ తన సైనిక విమానాలను పాక్‌ ఎయిర్‌బేస్‌లలో పార్క్‌ చేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీన్ని లిండ్సే తన పోస్టులో ప్రస్తావిస్తూ.. ఈ విషయం అబద్ధమని కొట్టిపారేయలేమన్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా

Eenadu26 May, 06:41 am
Trump-Pakistan: ట్రంప్‌ ‘అబ్రహం అకార్డ్స్‌’ మెలిక.. అడకత్తెరలో పాకిస్థాన్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికా-ఇరాన్‌ మధ్య శాంతి ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహిస్తున్నామంటూ గొప్పలు చెబుతోన్న పాక్‌ పరిస్థితి ట్రంప్‌ (Donald Trump) ప్రతిపాదనతో ఇప్పుడు కుడితిలో పడిన ఎలుకలా మారింది. ఈ శాంతి ఒప్పందానికి ‘అబ్రహం అకార్డ్స్‌ (Abraham Accords)’ మెలికపెట్టిన అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్‌.. అందులోకి పాక్‌ను ఆహ్వానించారు. దీంతో మన దాయాది పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. పైగా ఇందుకు సంబంధించిన పోస్ట్‌లో పాకిస్థాన్‌ (Pakistan) ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ను ప్రస్తావించకపోవడం ఆ దేశానికి మరింత అవమానకరం. అసలేం జరిగిందంటే.. ఇరాన్‌తో శాంతి చర్చలకు (US-Iran Peace Deal) సంబంధించిన ట్రంప్‌ తాజాగా తన ట్రూత్‌ ఖాతాలో సుదీర్ఘ పోస్ట్‌ చేశారు. అరబ్‌ దేశాలు చారిత్రక అబ్రహం అకార్డ్స్‌లో తప్పనిసరిగా చేరాల్సిందేనని రాసుకొచ్చారు. ‘‘సౌదీ అరేబియా, ఖతార్‌, పాకిస్థాన్‌, తుర్కియే, జోర్డాన్‌ దేశాలు తక్షణమే అబ్రహం అకార్డ్స్‌పై సంతకం చేయాలి. ఇందులో ఒకట్రెండు దేశాలు ఇందుకు అంగీకరించకపోవచ్చు. కానీ, చాలా దేశాలు సిద్ధంగానే ఉన్నాయి. పశ్చిమాసియాలో ఆర్థిక, సామాజిక పురోగతికి ఈ అకార్డ్స్‌ (ఒప్పందాలు) ఎంతగానో ఉపయోగపడతాయని ఇదివరకే రుజువైంది. చర్రితలోనే కనీవిని ఎరుగని ఒప్పందాలు ఇవి. పశ్చిమాసియా ఐక్యత, బలాన్ని చాటిచెబుతాయి. దీనిపై సౌదీ, ఖతార్‌ తొలుత సంతకాలు చేయాలి. మిగతా దేశాలు కూడా వీటిని అనుసరించాలి. ఇరాన్‌ కూడా ఇందులో చేరితో అది చాలా గొప్ప విషయం అవుతుంది’’ అని ట్రంప్‌ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయా దేశాధినేతల పేర్లను అమెరికా అధ్యక్షుడు తన పోస్ట్‌లో పేర్కొన్నారు. అయితే, పాకిస్థాన్‌ విషయానికొచ్చేసరికి ఆ దేశ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ పేరు కాకుండా.. ఆర్మీ చీఫ్‌ ఆసిమ్‌ మునీర్‌ పేరును ప్రస్తావించడం మరింత చర్చనీయాంశమైంది. పాక్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని తొక్కిపెట్టి

Sakshi31 May, 01:07 pm
పాక్ మాజీ కెప్టెన్ కు అవమానం

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న వ‌న్డే సిరీస్‌లో పాకిస్తాన్ శుభారంభం చేసింది. శ‌నివారం రావ‌ల్పిండి వేదిక‌గా తొలి వ‌న్డేలో పాకిస్తాన్ 5 వికెట్ల తేడాతో విజ‌యం సాధించి 1000వ వ‌న్డేను మ‌ధురానుభూతిగా మ‌ల్చుకుంది. మ్యాచ్‌లో హాఫ్ సెంచ‌రీతో మెరిసిన బాబ‌ర్ ఆజంకు అవ‌మానం జ‌రిగింది. పాక్ వెయ్యి వ‌న్డేలు పూర్తి చేసుకున్న క్ర‌మంలో ఆ జ‌ట్టు మాజీ క్రికెట‌ర్ మ‌హ్మ‌ద్ యూస‌ఫ్ జ‌ట్టులో ఉండే

Eenadu24 May, 08:21 am
Pakistan: పాక్‌లో రైలుపై ఆత్మాహుతి దాడి.. 24మంది మృతి

- ఇంటర్నెట్‌ డెస్క్‌: పాకిస్థాన్‌లో ఆత్మాహుతిదాడి (Explosion in Pakistan ) చోటుచేసుకుంది. - క్వెట్టా ప్రాంతంలోని చమన్ ఫాటక్ రైల్వేస్టేషన్‌ సమీపంలో భారీ పేలుడు సంభవించింది. - ఈ ఘటనలో 24 మంది ప్రాణాలు కోల్పోగా..

Sakshi28 May, 06:40 am
చైనా షాడో గేమ్ లో పాక్ .. కశ్మీర్ పై హైవోల్టేజ్ డ్రామా

పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ చైనా పర్యటన తర్వాత మళ్లీ కశ్మీర్‌ అంశాన్ని తెరపైకి తెచ్చారు. పాక్‌, చైనా కశ్మీర్‌ అంశాన్ని మరోసారి ప్రస్తావించాయి. ‘చరిత్రలో మిగిలిన సమస్య(left over from history)’ అంటూ UN తీర్మానాల ప్రకారం పరిష్కారం కావాలని పేర్కొన్నాయి. అయితే, షరీఫ్‌.. చైనా పర్యటనలో ఏం జరిగిందనే అంశాలపై చర్చ మొదలైంది. భారత్‌పై కుట్రతో రెండు దేశాలు ఏం ప్లాన్‌ చేశాయనే చర్చ జోరందుకుంది. మరోవైపు.. దీనిపై భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ జమ్ముకశ్మీర్‌, లడఖ్‌ భారత్‌లో అంతర్భాగాలని స్పష్టం చేసింది. పాక్‌ పీఎం షరీఫ్‌ నాలుగు రోజుల చైనా పర్యటనలో అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో పాటు ఉన్నతాధికారులతో విస్తృత చర్చలు జరిపారు. అధికారికంగా ఈ భేటీల్లో CPEC (చైనా–పాకిస్థాన్‌ ఆర్థిక కారిడార్‌) విస్తరణ, గ్వాదర్‌ పోర్ట్‌ను ప్రాంతీయ ట్రేడ్‌ హబ్‌గా అభివృద్ధి చేయడం, రక్షణ సహకారం, ఆర్థిక పెట్టుబడులు ప్రధాన అంశాలుగా ఉన్నప్పటికీ అసలు వ్యూహాత్మక చర్చలు భిన్నంగా ఉన్నాయని అంతర్జాతీయ విశ్లేషణలు చెబుతున్నాయి. ప్రకటనలో కశ్మీర్‌ను మళ్లీ ప్రస్తావించడం వెనుక చైనా–పాక్‌ ఉమ్మడి వ్యూహం ఉందని నిపుణులు భావిస్తున్నారు. పాకిస్తాన్‌ దీర్ఘకాలంగా కశ్మీర్‌ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై ఉంచేందుకు ప్రయత్నిస్తోంది. చైనా మద్దతుతో ఆ ప్రయత్నానికి కొత్త ఊపొచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా భారత్‌ పెరుగుతున్న ఆర్థిక, సైనిక ప్రభావాన్ని కట్టడి చేయడం ఈ వ్యూహంలో ఒక భాగంగా కనిపిస్తోంది. ఇక చైనా వైపు నుంచి చూస్తే, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌లో కీలక భాగమైన CPEC భద్రత అత్యంత ప్రాధాన్యం. గిల్గిట్‌–బాల్టిస్తాన్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ గుండా వెళ్లే ఈ కారిడార్‌పై భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అయినప్పటికీ బీజింగ్‌ ఆ ప్రాంతాల్లో పెట్టుబడులు

Sakshi29 May, 08:19 am
ప్రపంచం దూరమవుతున్నా.. భారత్ మా వెంటే

ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ.. మరోసారి భారత్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రపంచంలోని అనేక దేశాల్లో ఇజ్రాయెల్‌పై వ్యతిరేక భావనలు పెరుగుతున్నా.. భారత్‌లో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఇండియాలో ఇజ్రాయెల్‌కు అసాధారణమైన ఆదరణ ఉంది అని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. వెస్ట్ బ్యాంక్‌లో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడిన నెతన్యాహు.. భారత్‌తో ఇజ్రాయెల్‌కు ప్రత్యేక సంబంధం ఉందన్నారు. “ప్రపంచంలో చాలా చోట్ల మమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు. కానీ భారత్‌లో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. అక్కడ ఇజ్రాయెల్‌కు విపరీతమైన మద్దతు ఉంది” అని పేర్కొన్నారు. అంతేకాదు.. “నాకు ప్రపంచంలో ఎక్కడా లేనంత భారత్‌లోనే ఎక్కువ ఫాలోవర్లు ఉండొచ్చు” అంటూ కూడా వ్యాఖ్యానించారు. దీంతో ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నెతన్యాహు ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా భారత్‌పై నెతన్యాహు ఇదే తరహాలో స్పందించారు. 2018లో తన భార్యతో కలిసి భారత్‌ పర్యటనకు వచ్చిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ.. “అది లవ్ ఫెస్ట్‌లా అనిపించింది” అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. భారత ప్రజల్లో ఇజ్రాయెల్‌పై అపార గౌరవం ఉందని కూడా వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా.. అమెరికాలో మాత్రం ఇజ్రాయెల్‌పై వ్యతిరేక భావనలు పెరుగుతున్నట్లు ఇటీవల వెలువడిన సర్వేలు చెబుతున్నాయి. తాజా ప్యూ రీసెర్చ్ సర్వే ప్రకారం అమెరికన్లలో 60 శాతం మంది ఇజ్రాయెల్‌పై ప్రతికూల అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే ప్రపంచ వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటారని నెతన్యాహుపై నమ్మకం లేదని చాలామంది పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నెతన్యాహు మరో సంచలన ఆరోపణ కూడా చేశారు. అమెరికాలో ఇజ్రాయెల్ వ్యతిరేక భావనలు పెరగడానికి పాకిస్థాన్‌కు చెందిన

10TV Telugu24 May, 07:49 am
పాకిస్థాన్‌లో జాఫర్ ఎక్స్‌ప్రెస్‌పై బీఎల్ఏ ఆత్మాహుతి దాడి.. పాకిస్థాన్ సైనికులతో‌సహా 24 మంది దుర్మరణం

- Pakistan : పాకిస్థాన్ బాంబుల మోతతో దద్దరిల్లింది. - బలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టాలో భారీ ఆత్మాహుతి దాడి జరిగింది. - జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు టార్గెట్‌గా చేసుకొని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) దాడికి పాల్పడింది.

Pakistan News Keyword | Telugu Digital