translateexpand_more

Mette Frederiksen News

Latest updates from Telugu Digital news sources.

Andhra Jyothy03 Jun, 04:02 pm
సోషల్ మీడియా కంటే ధూమపానం బెటర్

ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియా ప్రభావంతో టీనేజర్లు, యువత పెడదారి పడుతున్న తీరుపై ఐరోపాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో డెన్మార్క్ ప్రధాని మెట్టే ఫ్రెడరిక్సన్ కీలక వ్యాఖ్యలు చేశారు. యువతకు సోషల్ మీడియాతో ఎంత నష్టం జరుగుతోందో సమాజం గుర్తించలేకపోతోందని ఆమె అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పిల్లల భద్రతపై జరిగిన ఒక సమావేశంలో తాజాగా ఆమె ఈ వ్యాఖ్యల చేశారు.

‘సోషల్ మీడియా కంటే ధూమపానంతో ప్రమాదం తక్కువని నాకు అనిపిస్తుంటుంది. నేను ఈ కాలంలో పిల్లల్ని పెంచాల్సి వస్తే ఇదే చెబుతా’ అని ఆమె అన్నారు. కానీ తాను ప్రస్తుతం ప్రధానిగా ఉన్నాను కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని కూడా చెప్పారు. ‘మన తీరులో ఏదో తప్పు ఉంది. మనం ఇంకా పాత సమస్యలను తలుచుకుని భయపడుతున్నాం. ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడింది’ అని సోషల్ మీడియాను ఉద్దేశిస్తూ ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, సోషల్ మీడియాతో ధూమపానాన్ని పోలిస్తే సమాజంలో తప్పుడు సంకేతాలు వెళతాయని కూడా అనేక మంది ఆందోళన వ్యక్తం చేశారు.

సోషల్ మీడియాతో పిల్లల జీవితాలు మారుతున్న తీరును పెద్దలు అర్థం చేసుకోలేకపోతున్నారని డెన్మార్క్ ప్రధాని అన్నారు. పిల్లలు గంటలకు గంటలు సోషల్ మీడియాలో గడిపేసేలా కంపెనీలు ఒక వ్యవస్థను రూపొందించాయని అన్నారు. ఇది వారి ఎదుగుదల, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వినియోగంపై డెన్మార్క్ ఇప్పటికే కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. 15 ఏళ్లు దాటాకే సోషల్ మీడియాను వినియోగించేందుకు అక్కడ అనుమతిస్తారు.

ఈ వార్తలనూ చదవండి:

నెతన్యాహు తీరుతో ట్రంప్‌కు షాక్! నీకేమైనా మెంటలా అంటూ..

12.5 శాతం సుంకం తప్పదన్న ట్రంప్.. స్పందించిన భారత్

Mette Frederiksen News Keyword | Telugu Digital