translateexpand_more

Modi Likes Popular Desi Healthy Drinks News

Latest updates from Telugu Digital news sources.

Samayam Telugu03 Jun, 11:52 am
ప్రధాని మోడీ మెచ్చిన హెల్తీ దేశీ డ్రింక్స్ ఇవే

నార్త్ ఇండియాలోని పాపులర్ హెల్తీ డ్రింక్ ఇది. పచ్చి మామిడి, చక్కెర లేదా బెల్లంతో పాటు పుదీనా ఆకులు, నల్ల ఉప్పు, జీలకర్ర పొడితో తయారుచేస్తారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు మీ ఎనర్జీని పెంచడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి. సత్తు డ్రింక్ నార్త్ ఇండియాలో చాలా ఫేమస్. వేయించిన శనగ పిండి, నిమ్మరసం, నీళ్లు, నల్ల ఉప్పు, జీలకర్ర, చక్కెర లేదా బెల్లంతో దీనిని తయారు చేస్తారు. ఇందులోని ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని కూల్ చేస్తాయి. అలాగే ఇందులో పొటాషియం, మెగ్నీషియం కూడా ఉంటాయి. పెరుగుతో తయారుచేసే హెల్తీ డ్రింక్ ఇది. క్రీమీగా, మంచి రుచితో ఉండే లస్సీ తాగితే శరీరం కూల్ అవుతుంది. పెరుగు, చక్కెర, చల్లటి నీళ్లు లేదా పాలు కలిపి తయారుచేస్తారు. స్వీట్ లస్సీ అయితే రోజ్ వాటర్, దాల్చినచెక్క, కుంకుమ పువ్వు, డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తారు. గోవాతో పాటు మహారాష్ట్ర వంటి కొంకణ్ తీర ప్రదేశాల్లో ఈ షర్బత్ చాలా పాపులర్. కోకుమ్ పండ్లతో తయారుచేసే ఈ డ్రింక్ రుచికి తియ్యగా, పుల్లగా ఉంటుంది. కానీ ఇందులోని పోషకాలు అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తాయి. వేసవి వచ్చిందంటే చాలామంది మజ్జిగ ఎక్కువగా తాగుతుంటారు. ఇది ఒంట్లో వేడిని తగ్గించడంతో పాటు ఎనర్జీని అందిస్తుంది. పెరుగును చిలికి కొద్దిగా నీళ్లు, జీలకర్ర పొడి, నల్ల ఉప్పు, పుదీనా, కొత్తిమీర వంటి మసాలాలు వేసి తయారు చేస్తారు. సౌత్ ఇండియాలో పాపులర్ అయిన హెల్తీ డ్రింక్ ఇది. బెల్లం, నీళ్లు, యాలకులు, శొంఠి, నిమ్మరసంతో తయారుచేస్తారు. ఇది చాలా రుచిగా ఉంటుంది. అలాగే వేసవిలో బాడీని కూల్ చేస్తుంది. కేరళ సంప్రదాయ పానీయం సంబరమ్. పెరుగును చిలికి అందులో అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు వేసి తయారు చేస్తారు. ఇది బాడీని హైడ్రేట్‌గా ఉంచుతుంది. జీర్ణశక్తికి మేలు చేస్తుంది. గోవా, మహారాష్ట్రలో ఈ డ్రింక్ చాలా పాపులర్. కోకుమ్ రసంలో కొబ్బరి పాలు కలిపి తయారు చేస్తారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి పేగులను ఆరోగ్యంగా ఉంచి బాడీని హైడ్రేట్ చేస్తాయి. సౌత్ ఇండియాలో ఈ డ్రింక్ చాలా పాపులర్. మజ్జిగలోనే కరివేపాకు, అల్లం, కరివేపాకు, జీలకర్ర వేసి తయారు చేస్తారు. వేసవిలో దీనికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది.

Modi Likes Popular Desi Healthy Drinks News Keyword | Telugu Digital