translateexpand_more

Mohini Mani Death News

Latest updates from Telugu Digital news sources.

Samayam Telugu30 May, 04:49 am
కోలీవుడ్ హీరో అజిత్ కుమార్ ఇంట తీవ్ర విషాదం... తల్లి మోహిని మణి కన్నుమూత

తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ తల్లి మోహిని మణి వయోభారం, అనారోగ్య సమస్యల కారణంగా శనివారం ఉదయం కన్నుమూశారు. ఈ బాధాకరమైన వార్త తెలియగానే తమిళ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. గత కొంతకాలంగా వయో సహజమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మోహిని మణి (84) చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆమెకు ముగ్గురు కుమారులు అజిత్ కుమార్, అనూప్ కుమార్, అనిల్ కుమార్ ఉన్నారు.* వాచ్‌మెన్ నుంచి స్టార్ నటుడిగా.. 6.5లక్షల చెట్లతో అడవినే సృష్టించిన టాలీవుడ్ విలన్! అజిత్ తండ్రి పి.ఎస్. మణి (పి. సుబ్రమణ్యం) కూడా 2023లో అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. తల్లి మరణవార్త విన్న వెంటనే దుబాయ్‌లో ఉన్న నటుడు అజిత్ కుమార్ హుటాహుటిన చెన్నైకి పయనమయ్యారు. కుటుంబ సభ్యులు, అత్యంత ఆప్తుల సమక్షంలోనే ఆమె అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మోహిని మణి మృతి పట్ల తమిళనాడుకు చెందిన పలువురు రాజకీయ నాయకులు, చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు, లక్షలాది మంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అజిత్ కుమార్ కేవలం వెండితెరపైనే కాకుండా, అంతర్జాతీయ మోటార్ రేసింగ్ ప్రపంచంలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల కాలంలో ఆయన వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఆయన కథానాయకుడిగా మగిజ్ తిరుమేని దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ‘విదాముయార్చి’, అధిక్ రవిచంద్రన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. ఇటు సినిమాలతో పాటు ప్రొఫెషనల్ కార్ రేసింగ్‌లోనూ అజిత్ సత్తా చాటుతున్నారు. * ‘నాన్నకు