translateexpand_more

Monsoon News

Latest updates from Telugu Digital news sources.

Asianet News Telugu01 Jun, 04:59 pm
ఒకవైపు నిప్పుల కొలిమి.. ఇంకోవైపు పిడుగుల వాన ! వాతావరణంలో వింత మార్పులు.. అలర్ట్ జారీ

తెలుగు రాష్ట్రాల్లో వెదర్ రూట్ మార్చింది. ఒకే టైమ్‌లో ఎండలు దంచికొడుతూ, మరోవైపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు వణికిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే రెండు రోజులు (మంగళవారం, బుధవారం) వాతావరణం చాలా విచిత్రంగా మారబోతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక కీలక అప్డేట్ ఇచ్చారు. ఒక పక్కన భానుడు నిప్పుల కురిపిస్తుంటే.. మరోపక్కన పిడుగులతో వర్షం విరుచుకుపడే ఛాన్స్ ఉందని ఆయన హెచ్చరించారు. వాతావరణంలో ఏర్పడిన ఒక భారీ ద్రోణి ప్రభావంతో ప్రస్తుతం వానలు పడుతున్నాయి. దీనికి రుతుపవనాల ప్రభావం కూడా తోడవుతోందని సమాచారం. తూర్పు విదర్భ నుంచి ప్రారంభమై తెలంగాణ, రాయలసీమ, దక్షిణ అంతర్గత కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి మీదుగా దక్షిణ కేరళ వరకు ఈ ద్రోణి విస్తరించి ఉంది. దీని ఎఫెక్ట్ వల్ల ఏపీలో మంగళవారం, బుధవారం పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షంతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల స్పీడ్‌తో ఈదురుగాలులు కూడా వీస్తాయని అధికారులు తెలిపారు. మంగళవారం ఏపీలోని పలు జిల్లాల్లో వానలు బీభత్సం సృష్టించే ఛాన్స్ ఉంది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు పడొచ్చు. శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వానలు పడే ఛాన్స్ ఉంది. అలాగే, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి, పశ్చిమగోదావరి, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, వైఎస్సార్ కడప, తిరుపతి జిల్లాల్లో కూడా పిడుగులతో కూడిన చిరుజల్లులు పడే అవకాశం ఉంది. తెలంగాణలో కూడా అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాల అలర్ట్ ఉన్నప్పటికీ, కొన్ని జిల్లాల్లో ఎండలు నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతున్నాయి. పోలవరం, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 42 నుంచి 44 డిగ్రీల వరకు టెంపరేచర్స్ రికార్డ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే కాకినాడ, కోనసీమ, ప్రకాశం, నెల్లూరు వంటి జిల్లాల్లో 40-42 డిగ్రీల ఎండలు ఉంటాయి. సోమవారం నెల్లూరు జిల్లా గూడూరులో అత్యధికంగా 43.6 డిగ్రీలు, మార్కాపురం నందనమారెళ్లలో 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ వింత వాతావరణ పరిస్థితుల వల్ల చిన్నపిల్లలు, వృద్ధులు బయట తిరగొద్దని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. వాన పడేటప్పుడు పొరపాటున కూడా చెట్ల కింద, కరెంట్ స్తంభాల దగ్గర, పెద్ద పెద్ద హోర్డింగ్స్ కింద ఉండొద్దని అధికారులు తెలిపారు.

Eenadu31 May, 06:02 am
ఎల్ నినో ప్రభావం.. నైరుతి’లో తగ్గనున్న వర్షాలు

దేశంలో ఈ ఏడాది నైరుతి రుతుపవన కాలంలో (జూన్‌-సెప్టెంబరు) సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదవుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. దీర్ఘకాల సగటుతో పోలిస్తే 90% వర్షమే ఈ సీజన్‌లో కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఫసిపిక్‌ మహాసముద్రంలో ప్రస్తుతం తటస్థంగా ఉన్న ఎల్‌నినో పరిస్థితులు క్రమంగా బలపడి రుతుపవనాల కాలం నాటికి పూర్తిగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. దీని ప్రభావంతో దేశంలోని ప్రధాన వ్యవసాయ ఆధారిత ప్రాంతాలలో వర్షాలు సాధారణం కంటే తక్కువగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణలోనూ ఈసారి వర్షపాతం మిశ్రమంగా ఉండనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ వార్త చదివారా: కేదార్‌నాథ్‌ కాలినడక మార్గంలో 19 కి.మీ. ట్రాఫిక్‌ రద్దీ

TV9 Telugu31 May, 07:56 am
ఓ వైపు ఎండలు.. మరోవైపు వర్షాలు.. రుతుపవనాలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్

ఓవైపు ఎండలు మరోవైపు... మరోవైపు వర్షాలు.. ఇది తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాతావరణ పరిస్థితి. తెలంగాణను హీట్‌వేవ్ భయపెడుతుంటే.. ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో ఎండ తీవ్రత పీక్ స్టేజ్‌కు చేరింది. ఇవాళ వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. మరోవైపు కేరళ తీరానికి రుతుపవనాల రాక ఈసారి కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. తెలంగాణలో జూన్‌లో కూడా ఎండలు, వడగాల్పులు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. జూన్ నెలలో రుతుపవనాలు ప్రవేశించే అవకాశాలు ఉన్నప్పటికీ, ఎల్‌నినో ప్రభావం వల్ల వేడి వాతావరణం ఇలాగే కొనసాగవచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనివల్ల రాష్ట్రంలో ఒకవైపు రుతుపవనాల ఆగమనం, మరోవైపు హీట్‌వేవ్ పరిస్థితులు ఒకేసారి నెలకొనే విచిత్ర వాతావరణం కనిపించనుంది. జూన్ నెలలో ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాలతో పాటు మధ్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఉత్తర తెలంగాణలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉండనుంది. అక్కడ సాధారణం కంటే 45% నుండి 55% వరకు వర్షాభావ పరిస్థితులు ఉండొచ్చని అంచనా. తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ - వాతావరణ హెచ్చరికలు : హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. నైరుతి రుతుపవనాలు రాబోయే 3-4 రోజుల్లో నైరుతి, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, లక్షద్వీప్ దీవులు, కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు, నైరుతి, పశ్చిమ-మధ్య, తూర్పు-మధ్య మరియు ఈశాన్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాల్లోకి మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. విదర్భ, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర

Asianet News Telugu29 May, 01:43 am
ఏపీ, తెలంగాణకు బిగ్ అలర్ట్.. మారనున్న వాతావరణం.. ఆ జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక

ఈ మే నెలలో ఎండలు, ఉక్కపోతతో జనాలు ఊపిరాడకుండా ఇబ్బంది పడ్డారు. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో రికార్డు స్థాయిలో 46 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడదెబ్బ కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ హాట్ అప్‌డేట్స్‌కు ఎండ్ కార్డ్ పడే టైం వచ్చేసింది. వాతావరణంలో పెను మార్పులు స్టార్ట్ అయ్యాయి. ఇటీవల కాస్త స్లో అయిన నైరుతి రుతుపవనాలకు (Monsoon) సడన్‌గా బూస్టింగ్ దొరికింది. లక్షద్వీప్ కింద యాక్టివేట్ అయిన ఒక పవర్‌ఫుల్ విండ్ సిస్టమ్, ఈ రుతుపవనాలను వేగంగా ఇండియా వైపు నెడుతోందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీంతో మే 31 లేదా జూన్ 1 కల్లా కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకడం ఖాయమని ఐఎండీ చెప్పింది. జూన్ 5 నుంచి 10 మధ్యలో ఇవి తెలుగు రాష్ట్రాల్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నాయి. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో జంగ్మీ (Typhoon Jangmi) అనే భీకర ట్రాపికల్ స్టోర్మ్ అంతకంతకూ బలపడుతోంది. ఇది ప్రజెంట్ గంటకు 85 కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ, జపాన్ వైపు దూసుకెళ్లే ఛాన్స్ ఉంది. దీని వేగం గంటకు 175 కిలోమీటర్లకు చేరే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే, ఈ టైపూన్ ఎఫెక్ట్ వల్ల ఎల్‌నినో కండిషన్స్ పెరిగే అవకాశం ఉంది. ఈ ఎల్‌నినో వల్లే యాక్చువల్‌గా మే 26నే రావాల్సిన రుతుపవనాలు కాస్త ఆలస్యమై జూన్ స్టార్టింగ్‌కు షిఫ్ట్ అయ్యాయి. సరిగ్గా గతేడాది లాంటి సీన్ ఇక్కడ రిపీట్ అవుతుండటం గమనార్హం. అయినప్పటికీ, అంటార్కిటికా నుంచి వస్తున్న చల్లని గాలులు, యాక్టివ్ అయిన భూమధ్య రేఖ మనకు ప్లస్ పాయింట్‌గా మారాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం చాలా విచిత్రమైన వాతావరణ పరిస్థితులు

Asianet News Telugu31 May, 02:47 am
రుతుపవనాల రాకపై ఐఎండీ అప్ డేట్.. ఏపీ, తెలంగాణకు వానలు వచ్చేది అప్పుడేనా

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం రూట్ మార్చింది. ఒకే టైంలో ఎండలు దంచికొడుతుంటే, మరోవైపు సడన్ వానలు షాకిస్తున్నాయి. అటు భానుడి భగభగలు, ఇటు ఉరుములు-మెరుపులతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో విభిన్నమైన క్లైమేట్ కండిషన్స్ రికార్డ్ అవుతున్నాయి. ఆదివారం పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉండగా, మరికొన్ని చోట్ల వడగాళ్లు పడే అవకాశముంది. ఇదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో ఎండలు దంచికొట్టనున్నాయి. సాధారణంగా జూన్ 1 కల్లా కేరళను తాకాల్సిన నైరుతీ రుతుపవనాల రాక ఈసారి కాస్త లేట్ కానుంది. మే 26నే వస్తాయని ముందుగా అంచనా వేసిన భారత వాతావరణ శాఖ, తాజాగా ఆ డేట్‌ను జూన్ 4, 5 మధ్యకు మార్చింది. ప్రస్తుతం ఈ గాలులు తమిళనాడులోని కన్యాకుమారి ప్రాంతాన్ని తాకేందుకు అనుకూలంగా ఉన్నాయి. కేరళకు జూన్ 4న లేదా 5న వస్తే.. మన తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి జూన్ 10 దాటొచ్చని నిపుణులు చెప్తున్నారు. పైగా ఈసారి ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు వచ్చేసరికి గాలుల వేగం తగ్గి, వర్షాల జోరు కాస్త తగ్గే అవకాశం ఉందనే వార్తలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం మధ్య పాకిస్థాన్ నుండి ఉత్తర కోస్తాంధ్ర వరకు ఒక ద్రోణి విస్తరించి ఉంది. దీనికి తోడు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, లక్షద్వీప్ నుంచి మరో ద్రోణి యాక్టివ్‌గా ఉన్నాయి. ఈ సిస్టమ్స్ వల్ల సముద్ర మట్టం నుంచి దాదాపు 1 కిలోమీటర్ నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు బలమైన మేఘాలు కమ్ముకున్నాయి. వీటి ప్రభావంతో మే 31 నుంచి జూన్ 3 వరకు కోస్తాంధ్ర, యానాం, రాయలసీమతో పాటు