translateexpand_more

Mumbai Press Meet News

Latest updates from Telugu Digital news sources.

SkyC Media03 Jun, 08:43 am
ఎఫ్ డబ్ల్యూఐసీఈ సంస్థకు లీగల్ నోటీస్ అందించాం

బాలీవుడ్ పరిశ్రమలో ప్రస్తుతం రణ్‌వీర్ సింగ్ డాన్3 వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.ఫిర్యాదును పరిశీలించిన ఎఫ్‌డబ్ల్యూఐసీఈ మే 25న నటుడిపై నాన్-కోఆపరేషన్ డైరెక్టివ్ జారీ చేసింది. పరిశ్రమలోని సభ్యులెవరూ అతనితో సహకరించవద్దని, కలిసి పని చేయవద్దని ఈ ఉత్తర్వుల్లో ఆదేశించింది. ఈ పరిణామాలపై రణ్‌వీర్ సింగ్ టీమ్ ఇప్పటి వరకు పూర్తిగా మౌనం వహించింది. ఫలితంగా ఈ వివాదంపై అనేక ఊహాగానాలు వచ్చాయి. అయితే జూన్ 2 మంగళవారం రోజున రణ్‌వీర్ టీమ్ ఎఫ్‌డబ్ల్యూఐసీఈ సంస్థకు లీగల్ నోటీస్ పంపింది. సినిమా బాగా రావాలనే ఉద్దేశంతోనే ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నామని, పరిశ్రమపై తమకు గౌరవం ఉందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఎఫ్‌డబ్ల్యూఐసీఈ చీఫ్ అడ్వైజర్ అశోక్ పండిట్ తమకు లీగల్ నోటీస్ అందిన విషయాన్ని ధ్రువీకరించారు. రణ్‌వీర్ సింగ్ వివాదం తీవ్రరూపం దాల్చడంతో ఈరోజు జూన్ 3న ముంబైలో ఒక ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఈ ప్రెస్ మీట్‌లో ఎఫ్‌డబ్ల్యూఐసీఈ తన తదుపరి కార్యాచరణను మరియు లీగల్ నోటీసుపై స్పందనను అధికారికంగా వెల్లడించనుంది. ప్రస్తుతం ఎఫ్‌డబ్ల్యూఐసీఈ ఇచ్చిన ఆదేశాలు చట్టపరంగా ఎంతవరకు బైండింగ్ అవుతాయనే దానిపై చర్చ జరుగుతోంది. ఇది కేవలం నాన్-కోఆపరేషన్ డైరెక్టివ్ మాత్రమేనని, బ్యాన్ కాదని సంస్థ చెబుతోంది. ఈ లీగల్ నోటీసులతో ఈ వ్యవహారం త్వరలోనే న్యాయస్థానానికి చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Mumbai Press Meet News Keyword | Telugu Digital