
వాషింగ్టన్: తెలుగు సంస్కృతి గొప్పతనాన్ని చాటేలా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్).. అమెరికాలో సాంస్కృతిక సంబరాలను ఘనంగా నిర్వహించింది. న్యూజెర్సీ చాప్టర్ ఆధ్వర్యంలో, నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి నేతృత్వంలో ఫోర్డ్స్ నగరంలోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్‌లో ఈ వేడుకలు నిర్వహించారు. ఇటీవల పద్మ పురస్కారాలు పొందిన నటుడు మురళీమోహన్, ప్రముఖ క్యాన్సర్ వ్యాధి నిపుణులు నోరి దత్తాత్రేయుడులను నాట్స్ నేతలు ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. సమాజానికి, తెలుగు జాతికి వారు చేసిన సేవలను కొనియాడారు. అమెరికాలో ఉంటున్న తెలుగువారు మన సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు చేస్తున్న కృషి అభినందనీయమని మురళీమోహన్ అన్నారు. తెలుగు మూలాలను ఎప్పటికీ మరిచిపోకుండా ఉండాలని సూచించారు. క్యాన్సర్ పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని డా.నోరి దత్తాత్రేయుడు వివరించారు. ఈ వ్యాధిపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రవాసంలో ఉన్న తెలుగు వారందరినీ ఒకే తాటిపైకి తెచ్చి.. మన సంస్కృతిని కాపాడుకోవడానికి నాట్స్ నిరంతరం కృషి చేస్తుందని ఛైర్మన్ కిశోర్ కంచర్ల అన్నారు. అమెరికాలో తెలుగువారి మేలు కోసం నాట్స్ ఎన్నో కార్యక్రమాలు చేపడుతోందని నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి తెలిపారు. నాట్స్ 2.0 ద్వారా నేటి తరానికి.. భావితరానికి ఓ వారధి నిర్మించామని, తెలుగు సంస్కృతిని తరతరాల పాటు నిలబెట్టేలా నాట్స్ కృషి చేస్తోందని మాజీ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని అన్నారు. ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ మోహన కృష్ణ మన్నవ, గంగాధర్ దేసు, సామ్ మద్దాలి, అరుణ గంటిలను సన్మానించారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల
