translateexpand_more

Nhpc Ofs Retail Investors News

Latest updates from Telugu Digital news sources.

Samayam Telugu03 Jun, 11:14 am
ప్రభుత్వ సంస్థలో మోదీ సర్కార్ వాటా విక్రయం.. మరీ ఇలా ఎగబడ్డారేంటి? అమ్మకానికి మరో 30 కోట్ల షేర్లు

NHPC OFS Price : ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కిందటి రోజు (జూన్ 2) ప్రభుత్వ సంస్థ, నవరత్న హోదా కలిగిన హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కంపెనీ NHPC ఓఎఫ్ఎస్ (ఆఫర్ ఫర్ సేల్) లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. ముందుగా నాన్ రిటైల్ ఇన్వెస్టర్ల కోసం తీసుకురాగా.. ఊహించని స్థాయిలో రెస్పాన్స్ లభించింది. మొత్తం 3 శాతం వాటాకు సమానమైన 30.13 కోట్ల షేర్లను అందుబాటులో ఉంచగా.. దీనికి 3.47 రెట్ల మేర రెస్పాన్స్ లభించింది. అంటే 30.13 కోట్ల షేర్లు అందుబాటులో ఉంటే.. 104 కోట్లకుపైగా షేర్లకు బిడ్స్ దాఖలయ్యాయి. అంటే ఒక్కో షేరు కోసం ముగ్గురికిపైగా పోటీపడుతున్నారు. ఈ లెక్కన ప్రభుత్వం అమ్ముతున్న షేర్లను కొనేందుకు జనం/ఇన్వెస్టర్లు ఎగబడ్డారని చెప్పొచ్చు. మొత్తం 6 శాతం వాటాను విక్రయించాలని నిర్ణయించింది. ఇక్కడ తొలుత 3 శాతం వాటా విక్రయించి.. రెస్పాన్స్ బాగుంటే.. ఓవర్ సబ్‌స్క్రిప్షన్ లేదా గ్రీన్ షూ ఆప్షన్ కింద ఉంచి.. తర్వాత విక్రయించాలని భావించింది. మొత్తం 6 శాతం వాటాకు సమానమైన 60.27 కోట్ల షేర్లను ఓఎఫ్ఎస్ కోసం పక్కన ఉంచింది. ముందుగా 3 శాతం వాటా షేర్లను అందుబాటులో ఉంచి రూ. 2139 కోట్లు.. మొత్తం 6 శాతం వాటా విక్రయంతో అయితే రూ. 4,279 కోట్ల మేర సమీకరించాలని ప్లాన్ చేసింది.ఇప్పుడు తొలిరోజే నాన్ రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి డిమాండ్ భారీగా రాగా.. ఇప్పుడు బుధవారం రోజు మిగతా గ్రీన్ షూ ఆప్షన్ కింద ఉంచిన 30.13 కోట్ల షేర్లను కూడా విక్రయానికి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక్కడ జూన్ 3న రిటైల్ ఇన్వెస్టర్లు, అర్హులైన ఉద్యోగులకు అందుబాటులో ఉండగా.. మళ్లీ నాన్ రిటైల్ ఇన్వెస్టర్లు కూడా పార్టిసిపేట్ చేసేందుకు వీలుంటుంది. ఒక్కో షేరు రూ. 71 కే..ఆఫర్ ఫర్ సేల్ కింద షేర్ ఫ్లోర్ ప్రైస్‌ను రూ. 71 గా నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇది సోమవారం రోజు క్లోజింగ్ ప్రైస్‌ రూ. 77.19 కంటే 8 శాతం తక్కువకే అందుబాటులో ఉంచింది. అంటే మార్కెట్ ధర కంటే చాలా తక్కువకే షేర్లు కొనుగోలు చేయొచ్చన్నమాట. ఈ క్రమంలోనే ఓఎఫ్ఎస్ తొలిరోజు షేరు పడిపోగా.. ఇన్వెస్టర్ల నుంచి మంచి రెస్పాన్స్ నేపథ్యంలో బుధవారం రోజు ఈ షేరు పుంజుకుంది. మార్కెట్లు పడిపోయినా ఈ స్టాక్ 3 శాతానికిపైగా పెరిగి రూ. 74.74 వద్ద స్థిరపడింది. మార్కెట్ విలువ రూ. 75.44 వేల కోట్లకు చేరుకుంది. కోల్ ఇండియా నుంచి ఇంకెన్నో..కేంద్ర ప్రభుత్వం గత కొంత కాలంగా పలు ప్రభుత్వ సంస్థలు సహా బ్యాంకుల్లోనూ వాటాల్ని విక్రయిస్తోంది. ఇందులో BHEL, కోల్ ఇండియా, ఐఆర్‌ఎఫ్‌సీ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసీ వంటివి ఉన్నాయి.

Nhpc Ofs Retail Investors News Keyword | Telugu Digital