Tata Sons Listing: టాటా గ్రూప్ హోల్డింగ్ సంస్థ టాటా సన్స్‌ను స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదు చేయడంపై చాలా కాలంగా చర్చ కొనసాగుతోంది. గత రెండు రోజులుగా టాటా సన్స్ బోర్డు సమావేశాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే టాటా సన్స్ లిస్టింగ్ చేయాలన్న వాదనను వ్యతిరేకిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)కి టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ నోయల్ టాటా లేఖ రాశారు. టాటా సన్స్ లిస్టింగ్ జరిగినట్లయితే టాటా గ్రూప్ దీర్ఘకాల స్వరూపం మారిపోతుందని, ట్రస్టుల దాతృత్వ కార్యక్రమాలు, లక్ష్యాలను దెబ్బతీస్తుందని ఆయన లేఖలో పేర్కొన్నట్లు జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. టాటా ట్రస్ట్స్ అంతర్గత వ్యవహారాల్లోనూ, టాటా సన్స్ లిస్టింగ్ వివాదాస్పద అంశంగా మారిన విషయం తెలిసిందే. టాటా సన్స్‌ను స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదు చేస్తే హోల్డింగ్ కంపెనీ ప్రాధాన్యతలు కాస్తా దీర్ఘకాల సంస్థాగత నిర్మాణం నుంచి స్వల్పకాల మార్కెట్ అంచనాల వైపు మళ్లుతాయని టాటా ట్రస్టులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి, రిజర్వ్ బ్యాంకుకు, అధికారులకూ నివేదించినట్లు సమాచారం. టాటా గ్రూప్ వ్యాపారాలు, వ్యూహాత్మక రంగాలకు దీర్ఘకాల మూలధనాన్ని అందించే వ్యవస్థగా టాటా సన్స్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే టాటా ట్రస్టుల ప్రతినిధిగా నోయల్ టాటా నేరుగా ప్రభుత్వ వర్గాలతో మాట్లాడుతున్నారట. లిస్టింగ్ చేస్తే వచ్చే సమస్యలేంటి?టాటా సన్స్ లిస్టింగ్ చేయడం వల్ల తప్పనిసరిగా త్రైమాసిక ఫలితాల వెల్లడి, స్టాక్ మార్కెట్ ఒత్తిళ్లు, ప్రజా వాటాదారుల నుంచి డిమాండ్లు వంటివి ఉంటాయి. అలాగే ఎయిరిండియా, సెమీకండక్టర్ వంటి వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టేందుకు ప్రజల నుంచి పెద్దగా ఆసక్తి కనబడకపోవచ్చు. ఎందుకంటే ఇవి దీర్ఘకాలం పాటు నష్టాలు కొనసాగించే అవకాశం ఉంటుంది. స్టాక్ మార్కెట్ ఒత్తిడి, టాటా ట్రస్టుల దీర్ఘకాల లక్ష్యాలకు అనుగుణంగా ఉండకపోవచ్చు. వీటి కారణంగా టాటా గ్రూప్ వర్గాలుగా చీలిపోయే ప్రమాదం ఉందని చర్చల్లో పాల్గొన్న వ్యక్తిని ఉటంకిస్తూ జాతీయా మీడియాలు పేర్కొన్నాయి. ఆరోగ్య సంరక్షణ, విద్య, జీవన ప్రమాణాల మెరుగుదల వంటి వాటిలో దాతృత్వ సామర్థ్యానికి టాటా సన్స్ యాజమాన్య నిర్మాణం, డివిడెండ్లే కీలకం. ఆర్‌బీఐ రూల్స్రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త రూల్స్ ప్రకారం అప్పర్ లేయర్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు నిర్దిష్ట కాల పరిమితిలోగా స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ కావాలి. లేదంటే మినహాయింపు పొందాలి. లేదా వర్గీకరణ మార్పు చేపట్టాలి. అప్పర్ లేయర్ కోర్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీగా టాటా సన్స్ వర్గీకరణ జరగడంతోనే ఈ సంస్థ లిస్టింగ్ అంశం వెలుగులోకి వచ్చింది. దీంతో తప్పనిసరి లిస్టింగును తప్పించుకోవడానికి, నియంత్రణపరమైన మార్గాలను సంస్థ వెతుకుతోంది. డెట్ ప్రొఫైల్ లో మార్పులు, రెగ్యులేటరీ వర్గీకరణలో మార్పులు వంటి వాటిపై దృష్టి పెట్టింది. టాటా సన్స్ లిస్టింగుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఇద్దరు ట్రస్టీలు వేణు శ్రీనివాసన్, విజయ్ సింగ్ పేర్కొనడంతో ఈ అంశం వివాదాస్పదంగా మారింది.
Noel Tata Written To Rbi News
Latest updates from Telugu Digital news sources.
Samayam Telugu02 Jun, 01:16 am
టాటా గ్రూప్ లో కీలక పరిణామం.. కి నోయల్ టాటా లేఖ.. టాటా సన్స్ లిస్టింగ్ పై కీలక