translateexpand_more

Norway Flower Shop News

Latest updates from Telugu Digital news sources.

AP7AM03 Jun, 04:10 pm
నార్వేలో ఈ పూల దుకాణం చూస్తే స్టన్నయిపోతారు

నమ్మకం అనేది మనుషుల మధ్యే కాదు, వ్యాపారంలోనూ కీలకమేనని నిరూపిస్తోంది నార్వేలోని ఓ పూల దుకాణం. సిబ్బంది పర్యవేక్షణ లేకుండా, కేవలం కస్టమర్ల నిజాయతీపై ఆధారపడి నడుస్తున్న ఈ దుకాణానికి సంబంధించిన వీడియోను ఓ భారతీయుడు పంచుకోగా, అది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. స్కాండినేవియన్ దేశాల్లోని సామాజిక నమ్మకానికి ఇది అద్దం పడుతోందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.నార్వేలో నివసిస్తున్న ఆదిత్య అనే భారతీయుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను పోస్ట్ చేశాడు. రాత్రి 10 గంటల సమయంలో చిత్రీకరించిన ఈ వీడియోలో, ఓ పూల దుకాణం మూసి ఉన్నప్పటికీ, కుండీల్లోని మొక్కలు, పూలన్నీ బయటే అమ్మకానికి ఉన్నాయి. వాటిని కొనుగోలు చేసే విధానాన్ని వివరిస్తూ అక్కడ ఓ బోర్డు ఉంది. వినియోగదారులు తమకు నచ్చిన మొక్కను ఎంచుకుని, దాని ధరను అక్కడ సూచించిన నంబర్‌కు ఆన్‌లైన్‌లో చెల్లించి తీసుకువెళ్లవచ్చు.ఈ దృశ్యాన్ని వివరిస్తూ ఆదిత్య, "ఇది రాత్రి 10 గంటల సమయం. దుకాణం మూసి ఉంది, దుకాణదారుడు కూడా లేడు. కానీ పూలన్నీ బయటే ఉన్నాయి. మీకు నచ్చినవి తీసుకుని, డబ్బులు చెల్లించి వెళ్లడమే. స్కాండినేవియాలో ఇలాగే ఉంటుంది. ఇదే మానవ నమ్మకం" అని వ్యాఖ్యానించాడు.ఈ వీడియో ఆన్‌లైన్‌లో ఎంతో మందిని ఆకట్టుకుంది. నిరంతర పర్యవేక్షణ లేకుండా కేవలం నమ్మకంపై వ్యాపారం చేయడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నార్వే, స్వీడన్ వంటి నార్డిక్ దేశాల్లో ఇలాంటి 'హానెస్టీ బాక్స్‌లు' సర్వసాధారణం. అక్కడి ప్రజల నిజాయితీ, సామాజిక బాధ్యతే ఇలాంటి వ్యవస్థలు విజయవంతంగా నడవడానికి కారణమని తెలుస్తోంది. డిజిటల్