translateexpand_more

Nutritious Roti Recipe News

Latest updates from Telugu Digital news sources.

NTV Telugu01 Jun, 01:22 pm
గోధుమ రోటీ బోర్ కొట్టిందా..? ఓట్స్ రోటీ ట్రై చేయండి.. ఆరోగ్యానికి మేలు, రుచిలోనూ సూపర్

Oats Roti Recipe: ప్రస్తుతం ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది తమ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటున్నారు. ముఖ్యంగా గోధుమ పిండి లేదా మైదా పదార్థాలకు బదులుగా పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాలను ఎంచుకుంటున్నారు. అలాంటి వాటిలో ఓట్స్ ప్రముఖ స్థానం దక్కించుకున్నాయి. సాధారణంగా ఓట్స్‌ను బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటారు. అయితే ఓట్స్‌తో రుచికరమైన రోటీలను కూడా తయారు చేసుకోవచ్చు. ఓట్స్‌లో ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగిస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి, మధుమేహంతో బాధపడేవారికి కూడా ఓట్స్ మంచి ఎంపికగా పరిగణిస్తారు. అందుకే రోజువారీ ఆహారంలో ఓట్స్‌ను చేర్చుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. గోధుమ రోటీలకు ప్రత్యామ్నాయంగా ఓట్స్ రోటీని తయారు చేసుకోవడం చాలా సులభం. ఈ రోటీ గ్లూటెన్ రహితంగా ఉండటంతో పాటు ఆరోగ్యకరమైన పోషకాలను అందిస్తుంది. ఇంట్లోనే కొద్ది పదార్థాలతో మెత్తగా, రుచికరంగా తయారు చేసుకోవచ్చు. ఓట్స్ రోటీకి కావలసిన పదార్థాలు * 1 కప్పు ఓట్స్ పిండి * 1/4 టీస్పూన్ ఉప్పు ముందుగా ఓట్స్‌ను మిక్సర్‌లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. తర్వాత జల్లెడతో జల్లించి మెత్తటి పిండిని వేరుచేయాలి. ఇప్పుడు ఒక పాత్రలో ఒక కప్పు నీటిని మరిగించాలి. నీరు మరిగిన తర్వాత అందులో నెయ్యి, ఉప్పు వేసి కలపాలి. అనంతరం ఓట్స్ పిండిని కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మూతపెట్టి సుమారు 10 నిమిషాలు పక్కన ఉంచాలి. కొద్దిగా చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని మెత్తటి పిండి ముద్దలా కలుపుకోవాలి. ఆ తర్వాత పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఓట్స్