పంటి నొప్పికి లవంగం రామబాణంలా పనిచేస్తుందని చెబుతారు పెద్దలు. లవంగాల్లో ఉండే యూజినాల్ అనే సహజ ఆనస్థెటిక్ నొప్పిని మొద్దుబారేలా చేస్తుంది. పంటినొప్పి ఉన్న పంటి కింద లవంగాన్ని ఉంచి నమలాలి. లేదా ఒక దూదిపై రెండు చుక్కల లవంగం ఆయిల్ వేసి నొప్పి ఉన్న పంటిపై ఉండాలి. ఇలా చేయడం వల్ల పంటినొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు. ఇదే విషయాన్ని EJPMR అధ్యయనం సైతం పేర్కొంది. ఇది సహజసిద్ధమైన క్రిమినాశని. పళ్ల సందుల్లో ఇరుక్కున్న ఆహార పదార్థాలు, బ్యాక్టీరిను తొలగించి వాపును తగ్గిస్తుంది. దీనిని ఎలా ఉపయోగించాలంటే.. ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో అర స్పూన్ ఉప్పు కలిపి ఆ నీటిని నోట్లో పోసుకుని ఒక నిమిషం పాటు బాగా పుక్కిలించి ఊసేయాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే శక్తివంతమైన యాంటీ బ్యాక్టీరియల్ సమ్మేళనం ఉంటుంది. ఇది పంటి నొప్పిని కలిగించే బ్యాక్టీరియాను చంపడమే కాకుండా నొప్పిని కూడా తగ్గిస్తుంది. దీనిని ఎలా వాడాలంటే ఒక వెల్లుల్లి పాయను తీసుకుని బాగా దంచి దానికి కొద్దిగా ఉప్పు కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ పేస్ట్‌ను నొప్పి ఉన్న పంటిపై రాయాలి. లేదా వెల్లుల్లి పాయను నెమ్మదిగా నమలవచ్చు. పంటి నొప్పి వల్ల దవడ వాచిపోయినా లేదా బాగా నొప్పి ఉన్నా ఐస్ ప్యాక్ బాగా పనిచేస్తుంది. చల్లదనం రక్తనాళాలను సంకోచింపజేసి నొప్పి తగ్గిస్తుంది. దీనిని ఎలా వాడాలంటే ఒక బట్టలో కొన్ని ఐస్ ముక్కలు ఉంచి దానిని నొప్పి ఉన్న దవడపై సుమారు 15 నిమిషాల పాటు ఉంచాలి. రోజులో అప్పుడప్పుడు ఇలా చేయడం వల్ల కొంత ఉపశమనం లభిస్తుంది. పంటి నొప్పిని, చిగుళ్ల సమస్యలను తగ్గించడానికి మరొక శక్తివంతమైన సహజ ఔషధం జామ ఆకులు. మనకు చాలా సులభంగా దొరికే జామ ఆకుల్లో అనేక ఆయుర్వేద గుణాలు ఉన్నాయి. జామ ఆకుల్లో వాపును తగ్గించే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, బ్యాక్టీరియాను చంపే యాంటీ మైక్రోబియల్, నొప్పిని తగ్గించే అనాల్జెసిక్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని ఎలా వాడాలంటే రెండు లేదా మూడు లేత జామ ఆకులను తీసుకుని వాటిని నీటితో శుభ్రంగా కడగాలి. వాటిని నోట్లో వేసుకుని బాగా నమలడం వల్ల ఆ రసం పంటికి, చిగుళ్లకు తగిలి నొప్పి, వాపు తగ్గుతాయి. ఒకవేళ జామ ఆకులు నమలడం కష్టంగా అనిపిస్తే 5 లేత జామ ఆకులను తీసుకుని ఒక గ్లాస్ నీటిలో వేసి బాగా మరిగించాలి. ఆ నీళ్లు కొద్దిగా రంగు మారిన తర్వాత ఆ నీటిని వడకట్టి గోరువెచ్చగా అయిన తర్వాత అందుకో కొద్దిగా ఉప్పు కలిపి నోట్లో పోసుకుని బాగా పుక్కిలించి ఊసేయాలి. ఇలా చేయడం వల్ల కూడా పంటి నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. అయితే ఇవన్నీ చేసినా కూడా పంటి నొప్పి ఉంటే వెంటనే డాక్టర్‌ని సంప్రదించండి. ముఖ్యగమనిక : ఈ కథనంలోని సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. కొందరు నిపుణులు, కొన్ని అధ్యయనాలు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేశాము. వీటిని పాటించే ముందు నిపుణుల సలహా తీసుకోండి. అలాగే వీటిని పాటించడం, పాటించకపోవడం పూర్తిగా మీ వ్యక్తిగత విషయం. సమయం తెలుగు వీటిని ధృవీకరించడం లేదు. రచయిత గురించికిషోర్ రెడ్డికిషోర్ రెడ్డి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 10 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2020లో సమయం తెలుగులో చేరిన కిషోర్ రెడ్డి లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన న్యూట్రిషియన్, డైట్ ప్లాన్, రోగాలు - లక్షణాలు, ఫిట్‌నెస్, ఇంటి చిట్కాలు, ఫ్యాషన్, హోమ్ డెకార్, రిలేషన్‌షిప్ వార్తలతో పాటు వివిధ ఆరోగ్య అంశాలపై ఆరోగ్య నిపుణులు, న్యూట్రిషనిస్ట్, డైటీషియన్లు, ఆయుర్వేద నిపుణులు ఇచ్చిన సలహాలు, సమాచారం ఆధారంగా విస్తృత స్థాయిలో వార్తల్ని రాశారు. అంతేకాకుండా క్లీవ్ ల్యాండ్ క్లినిక్, మాయో క్లినిక్, WHO, హార్వర్డ్ వంటి పరిశోధనలు ఆధారంగా కూడా కంటెంట్ అందించారు. ఈ సమాచారాన్ని నిజమో కాదో తెలుసుకోవడానికి నిపుణుల సలహా తీసుకోమని కూడా వివరించారు. ఈ ఆర్టికల్స్ పాఠకులకు అర్థమయ్యేలా సరళమైన భాషలో రాస్తారు.కిషోర్ రెడ్డి 2015లో సాక్షి జర్నలిజం స్కూల్‌లో జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. అనంతరం సాక్షి న్యూస్ ఛానెల్‌లో (20.08.2016 నుంచి 23.03.2020 వరకు) సబ్ ఎడిటర్‌గా పనిచేశారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్, విద్య, ఉద్యోగం వార్తలు రాశారు. ముఖ్యంగా ఎడ్యుకేషన్ / జాబ్స్ సెక్షన్ చూసుకునేవారు. ఆ తర్వాత 02.04.2020 నుంచి సమయం తెలుగులో విద్య, ఉద్యోగ వార్తలతో పాటు టెక్నాలజీ న్యూస్, అడ్వర్టయిజ్‌మెంట్స్ కూడా రాశారు. ఖాళీ సమయంలో పుస్తకాలు చదవడం, ప్రముఖల ఇంటర్వ్యూలు చూడటం, కొత్త కొత్త అంశాల గురించి తెలుసుకోవడానికి ఆయన ఇష్టపడతారు.... ఇంకా చదవండి
Panti Noppi Taggalante Em Cheyali News
Latest updates from Telugu Digital news sources.
Samayam Telugu03 Jun, 04:59 pm
పంటి నొప్పి తగ్గేందుకు అమ్మమ్మలు, నానమ్మలు చెప్పిన ఇంటి చిట్కాలు