translateexpand_more

Peddi Full Cast Remunarations News

Latest updates from Telugu Digital news sources.

Zee Telugu03 Jun, 01:40 am
పెద్ది’ టికెట్ రేట్స్ పెంపుకు అనుమతులు ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Peddi Ticket Rates Hike: గత కొన్నేళ్లుగా తెలుగులో విడుదలైన భారీ చిత్రాలకు మొదటి వారం పది రోజులు టికెట్ రేట్స్ పెంచుకోవడానికి ప్రబుత్వాలు ప్రత్యేక అనుమతులు మంజూరు చేస్తోంది.ఏపీతో పోల్చితే తెలంగాణలో టికెట్ రేట్స్ భారీగా ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ ‌లో టికెట్ పెంచుకోవడానికి అనుమతులు ఇచ్చిన తర్వాత హైయ్యెస్ట్ టికెట్ రేట్ మల్టీప్లెక్స్‌లో రూ. 275గా ఉంది. కానీ తెలంగాణలో మల్టీప్లెక్స్‌లో రూ. 295 టికెట్ రేట్ ఉంది. దీనికి అదనంగా రూ. 125 రూపాయలు. వెరసి మొత్తంగా రూ. 420 టికెట్ రేట్ అయింది. ఓ రకంగా సామాన్య మధ్య తరగతి ప్రేక్షకులకు భారం అని చెప్పాలి. టికెట్ రేట్స్ పెంపు వల్ల కామన్ పీపుల్ థియేటర్స్ వైపు రావడమే మానేసారు. అయినా.. సినిమా వాళ్లకు ఈ విషయం తెలిసి కూడా టికెట్ రేట్స్ పెంచినా అభిమానులు ఎగబడి చూస్తున్నారనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం దగ్గర తమ పలుకుబడి ఉపయోగించి టికెట్ రేట్స్ పెంచుకోవడానికి ప్రత్యేక అనుమతులు తెచ్చుకుంటున్నారు. మరికొంత మంది ప్రేక్షకుల తరుపున టికెట్ రేట్స్ పెంపును నిరసిస్తూ కోర్టులను ఆశ్రయిస్తున్నారు. అభిమానులు మాత్రం టికెట్ రేట్స్ పెంచితే ఏంటి.. ? బాగుంటే ప్రేక్షకులు పెరిగిన టికెట్ రేట్స్ లెక్కలు పట్టించుకోరు అనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి టికెట్ రేట్స్ పెంచుకోవడం అనే పంథా నడుస్తూనే ఉంది. ఏది ఏమైనా అభిమానులకు మాత్రం తమ ఫేవరేట్ హీరో సినిమాకు టికెట్ రేట్స్ పెంపుతో ఫస్ట్ డే కలెక్షన్స్‌లో రికార్డులు కొట్టవచ్చనే లెక్కలు వేసుకుంటున్నారు.ఇక సింగిల్ స్క్రీన్స్‌లో రూ. 100 పెంపుకు అనుమతులు ఇచ్చింది. ఈ పెంపు అనేది 10 రోజులు పాటు ఉంటుందని తెలిపింది. ‘పెద్ది’ సినిమా విషయానికొస్తే.. రామ్ చరణ్ ఈ సినిమా కోసం బాగానే కష్టపడ్డాడు. ఆరు పలకల దేహం కోసం ఎన్నో కష్టాలు పడ్డాడు. అంతేకాదు కుస్తీతో పాటు క్రికెట్‌లో ట్రెయిన్ అయ్యాడు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సాంగ్ నుంచి టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఇప్పటికే ఓవర్సీస్‌లో విడుదలకు ముందే $ వన్ మిలియన్ యూఎస్ డాలర్స్ రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో ఇప్పటికే టికెట్స్ నిమిషాల్లో సేల్ అవుతున్నాయి. తెలంగాణలో పెంచిన జీవో అనుగుణంగా బుక్ మై షో ఓపెన్ చేయడంతో అభిమానులు టికెట్ కోసం ఎగబడుతున్నారు. మొత్తంగా పెద్ది సినిమా ప్రీమియర్స్‌తో కలిపి ఎంత మేరకు కలెక్ట్ చేస్తుందో చూడాలి. Also Read:Jr NTR Top Disaster Movies: జూనియ‌ర్ ఎన్టీఆర్ కెరీర్ లో స్పీడ్ బ్రేకర్స్ గా నిలిచిన టాప్ డిజాస్ట‌ర్ చిత్రాలు ఇవే.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Peddi Full Cast Remunarations News Keyword | Telugu Digital