translateexpand_more

Peddi News

Latest updates from Telugu Digital news sources.

10TV Telugu02 Jun, 02:42 pm
ఇకపై నా ప్రతి సినిమాకు ఆయనే మ్యూజిక్ అందిస్తారు.. పెద్ది’ డైరెక్టర్ బుచ్చిబాబు కీలక ప్రకటన

Buchibabu sana: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్‌లో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్ర పెద్ది. రా అండ్ రస్టిక్ కంటెంట్ తో స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న ‘పెద్ది’ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్లను ముమ్మరం చేసింది. కాగా, ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత, సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ అద్భుతమైన స్వరాలను అందించారు. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో బుచ్చిబాబు.. రెహమాన్‌తో తనకున్న అనుబంధాన్ని పంచుకుంటూ ఒక సంచలన ప్రకటన చేశారు. Raveena Tandon: నటి రవీనా టండన్ ఇంట్లో రూ.25 లక్షల వజ్రాభరణాల చోరీ.. పనిమనిషే పక్కా ప్లాన్ చేసి ఈ సినిమా కోసం ఏఆర్ రెహమాన్‌తో కలిసి పనిచేయడం తన జీవితంలోనే మర్చిపోలేని అనుభూతి అని బుచ్చిబాబు ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఆయనతో సాగిన జర్నీ ఒక అద్భుతమని, ఆయన అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయని కొనియాడారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన పాటలు సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్‌తో దూసుకుపోతున్నాయి. ఇదే ఇంటర్వ్యూలో బుచ్చిబాబు(Buchibabu sana) ఒక క్రేజీ నిర్ణయాన్ని వెల్లడిస్తూ.. రెహమాన్ వర్కింగ్ స్టైల్‌కు తాను పూర్తిగా ఫిదా అయ్యానని చెప్పారు. అందుకే ఇకపై తాను తీయబోయే అన్ని సినిమాలకూ ఆయనే మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉంటారని స్పష్టం చేశారు. ఒక దర్శకుడు సంగీత దర్శకుడిపై ఈ స్థాయి నమ్మకాన్ని ఉంచడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కాంబినేషన్ జూన్ 4న థియేటర్లలో ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి. దీంతో, బుచ్చిబాబు చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

10TV Telugu02 Jun, 11:58 am
చరణ్ కంటి నుండి రక్తం.. పెద్దాయన ఫోన్ చేస్తే గుండె ఆగినంత పనైంది.. బుచ్చిబాబు ఎమోషనల్

Buchibabu: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన రా అండ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా, షూటింగ్ లొకేషన్‌లో జరిగిన ఒక భయానక ప్రమాదం గురించి దర్శకుడు బుచ్చిబాబు షాకింగ్ విషయాలను పంచుకున్నారు. ఒక కీలకమైన యాక్షన్ సీన్ చిత్రీకరిస్తున్న సమయంలో రామ్ చరణ్ కంటికి తీవ్ర గాయమై రక్తం వచ్చిందని, ఆ దృశ్యం కెమెరాలోనే రికార్డ్ అయిందని ఆయన తెలిపారు. Trisha Krishnan: కుక్క ఫోటోతో కౌంటర్.. ట్రోలర్స్ కి గట్టి సమాధానం ఇచ్చిన త్రిష కోట్లాది మంది అభిమానించే స్టార్ హీరోకు తన సెట్స్‌లో అలా గాయం కావడంతో తనకు చేతులు, కాళ్లు ఆడలేదని బుచ్చిబాబు ఎమోషనల్ అయ్యారు. ఆ వెంటనే ఇంటి నుండి మెగాస్టార్ చిరంజీవి ఫోన్ చేయడంతో, తనపై గట్టిగా తిడతారేమోనని విపరీతమైన భయంతో గుండె ఆగినంత పనైందని పేర్కొన్నారు. అయితే ఫోన్ ఎత్తిన బుచ్చిబాబు(Buchibabu)కు చిరంజీవి ఊహించని విధంగా ఎంతో కూల్‌గా మాట్లాడి పెద్ద షాక్ ఇచ్చారు. చిరంజీవి గారు దర్శకుడిని అస్సలు తిట్టకుండా, ఎంతో పరిణతితో అసలు ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నారని బుచ్చిబాబు చెప్పారు. “కంగారు పడకు బుచ్చి.. ఆ గాయం అయిన వీడియో క్లిప్ ఒకసారి నాకు పంపించు” అని చిరంజీవి ధైర్యం చెప్పిన తీరు, ఆయన ఇచ్చిన సపోర్ట్ తనను ఎంతగానో ఆశ్చర్యపరిచాయని బుచ్చిబాబు ఆనాటి సంఘటనను గుర్తుచేసుకున్నారు.

SkyC Media02 Jun, 11:45 am
పెద్ది ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న సరికొత్త చిత్రం పెద్ది. ఈ సినిమాకు సంబంధించిన పెద్ది ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. వృద్ధి సినిమాస్ పతాకంపై నిర్మాత వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమా థియేటర్లలోకి రాకముందే పెద్ది ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారా బడ్జెట్ మొత్తాన్ని తిరిగి రాబట్టడం విశేషం. నిర్మాణ సంస్థ అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం ఈ సినిమా కోసం 350 కోట్ల భారీ బడ్జెట్ ను కేటాయించారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ను జూన్ 4 తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి చిత్ర బృందం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రస్తుత మార్కెట్ లో ఒక పెద్ద సినిమా విడుదలకు ముందే పూర్తి బడ్జెట్ రికవరీ చేయడం చాలా అరుదైన విషయంగా చెబుతున్నారు. చిత్ర నిర్మాత వెంకట సతీష్ కిలారు పక్కా ప్రణాళికతో నాన్ థియేట్రికల్ హక్కులను భారీ ధరలకు విక్రయించారు. దీంతో శాటిలైట్, డిజిటల్, ఓవర్సీస్ హక్కుల రూపంలో నిర్మాతలకు భారీగా ఆదాయం సమకూరినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ప్రీ రిలీజ్ థియేట్రికల్ ఒప్పందాలు కూడా ఊహించని రీతిలో భారీ స్థాయిలోనే ముగిశాయి. ఫలితంగా సినిమా విడుదలకు ముందే పెద్ది ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారా బడ్జెట్ మొత్తం 100 శాతం రికవరీ అయిపోయింది. ఈ బిజినెస్ క్లోజ్ అవ్వడంతో పెద్ది నిర్మాతలు సేఫ్ జోన్ లోకి వెళ్లడమే కాకుండా అప్పుడే లాభాల్లోకి వచ్చేసారు. ఫలితంగా జూన్ 4 నుండి థియేటర్ల ద్వారా వచ్చే వసూళ్లు అన్నీ నిర్మాతలకు నికర లాభాలుగా మారనున్నాయి. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ పై డిస్ట్రిబ్యూటర్లకు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు ఉన్న నమ్మకం మరోసారి స్పష్టంగా నిరూపితమైంది. ప్రస్తుత పోటీ మార్కెట్ లో ఇటువంటి బిజినెస్ డీల్స్ క్లోజ్ అవ్వడం నిజంగా పెద్ద రికార్డు అని చెప్పాలి. చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను మరింత వేగవంతం చేస్తూ ప్రేక్షకులలో అంచనాలను భారీగా పెంచుతోంది. రాబోయే రోజుల్లో థియేట్రికల్ రన్ ద్వారా ఈ సినిమా మరిన్ని కొత్త రికార్డులను సృష్టించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బాక్సాఫీస్ వద్ద సినిమా సాధించే వసూళ్లు ఈ లాభాల శాతాన్ని మరింత పెంచుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చిత్రం సాధించిన ప్రీ రిలీజ్ విజయం టాలీవుడ్ లోని ఇతర పెద్ద సినిమాలకు ఒక కొత్త మార్గాన్ని చూపిస్తోంది. రామ్ చరణ్ క్రేజ్ కారణంగానే బిజినెస్ వర్గాల్లో ఈ స్థాయి డిమాండ్ ఏర్పడిందని స్పష్టంగా అర్థమవుతోంది. జూన్ 4 న థియేటర్లలో బొమ్మ పడిన తర్వాత ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Chitrajyothy02 Jun, 10:29 am
దేవుడా.. రామ్ చరణ్ బాడీగార్డ్ మామూలోడు కాదు బాబోయ్

అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో చెప్పడం చాలా కష్టం. ప్రస్తుతం ఇండస్ట్రీలో అయితే రామ్ చరణ్ (Ram Charan) బాడీగార్డ్ కి అదృష్టం వరించింది అని చెప్పొచ్చు. ఇప్పుడు ఎక్కడ చూసినా.. అతనే కనిపిస్తున్నాడు. నిజం చెప్పాలంటే బాడీగార్డ్ కే బాడీగార్డ్ కావాల్సివస్తోంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పర్సనల్ బాడీగార్డ్ కెవిన్ కె కుంట (Kevin K Kunta) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెద్ది ప్రమోషన్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇతగాడి పేరు మారుమ్రోగిపోతోంది.

తాజాగా పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కెవిన్ చేసిన పనికి ఫ్యాన్స్ మాత్రమే కాదు.. హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా షాక్ అయ్యింది. అంతలా కెవిన్ ఏం చేశాడంటే.. సాధారణంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే.. హీరోల వీరాభిమానులు అందరిని దాటుకొని హీరోల వద్దకు వచ్చి సెల్ఫీలు తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. వారిని అడ్డుకోవడానికి బాడీగార్డ్ లు వస్తారు. వారిని పక్కకు నెట్టి హీరో ఆ అభిమానికి సెల్ఫీ ఇస్తాడు. ఇది ప్రతిసారి జరిగేదే. కానీ, ఈసారి.. చరణ్ దగ్గరకు ఆ అభిమానిని పోనివ్వకుండా మధ్యలోనే కెవిన్ అడ్డుపడ్డాడు. అంతేకాకుండా అతడిని ఒక ఉదుటున ఎత్తిపట్టుకొని ఆమడ దూరంలో పడేశాడు. ఒక మనిషిని ఆ రేంజ్ లో ఎత్తుకొని పక్కన పడేయడం చూసిన జాన్వీ ఒక్కసారిగా షాక్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

అసలు కెవిన్ అలా ఎలా చేయగలిగాడు .. ఇతను మామూలోడు కాదు బాబోయ్ అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. నిజంగానే కెవిన్ మామూలోడు కాదు. ఆఫ్రికా ఖండంలోని గాంబియా దేశానికి చెందిన కెవిన్, ప్రస్తుతం ఇటలీలో నివసిస్తూ అక్కడ ప్రొఫెషనల్‌ మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ ఫైటర్‌గా రికార్డులు సృష్టించాడు. ఇటలీలో నేషనల్ మిడిల్‌వెయిట్ MMA ఛాంపియన్‌ గా నిలిచిన కెవిన్, ఎన్నో అంతర్జాతీయ రింగ్ ఫైట్స్‌లో పవర్‌ఫుల్ టైటిల్స్ గెలుచుకున్నాడు. కేవలం రింగ్ లోపలే కాకుండా, రియల్ లైఫ్‌లో సెలబ్రిటీలు, అంతర్జాతీయ విఐపిలకు అత్యున్నత స్థాయి క్లోజ్ ప్రొటెక్షన్ VVIP సెక్యూరిటీ అందించే ప్రొఫెషనల్ బాడీగార్డ్‌గా కూడా ఇతనికి భారీ డిమాండ్ ఉంది. ఆ రేంజ్ రికార్డు ఉండబట్టే చరణ్ మీద ఈగ కూడా వాలకుండా చూసుకుంటున్నాడు. కెవిన్ కి నెలకు రూ 4 లక్షల జీతమని టాక్. ఇక తన బాడీగార్డ్ గురుంచి చరణ్ సైతం చెప్పుకొచ్చాడు. కెవిన్ ని తన కోసం కాదని.. పిల్లల కోసం నియమించినట్లు తెలిపాడు. ఏదిఏమైనా నాలుగేళ్లుగా చరణ్ కి సెక్యూరిటీగా ఉంటున్న కెవిన్ కి ఇప్పుడు గుర్తింపు వచ్చింది.

10TV Telugu02 Jun, 04:12 am
రామ్ చరణ్ 'పెద్ది'కి పోటీ వస్తున్న మృణాల్ ఠాకూర్, పూజ హెగ్డే

Peddi : రామ్ చరణ్ పెద్ది సినిమా జూన్ 4న భారీగా రిలీజ్ కానుంది. పాన్ ఇండియా వైడ్ ఈ సినిమా తెలుగుతో పాటు కన్నడ, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో కూడా రిలీజ్ అవుతుంది. చరణ్ కి నార్త్ లో కూడా భీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని తెలిసిందే. అందుకే నార్త్ లో కూడా పెద్ది సినిమా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. జియో స్టూడియోస్ ఈ సినిమాని హిందీలో రిలీజ్ చేస్తుంది. నార్త్ ని కూడా టార్గెట్ చేసి ముంబై, భోపాల్, ఢిల్లీలో పెద్ది సినిమా ఈవెంట్స్ నిర్వహించారు. అయితే టాలీవుడ్ లో, సౌత్ లో పెద్ది సినిమాకు ఎలాంటి పోటీ లేకపోయినా నార్త్ లో మాత్రం పెద్ది సినిమాకు పెద్ద పోటీనే ఉంది. Also Read : Peddi Collections : ఇలా అయితే కష్టమే.. పెద్ది కలెక్షన్స్ పై భారీ ఎఫెక్ట్.. నిరాశ వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్.. వరుణ్ ధావన్ హీరోగా మృణాల్ ఠాకూర్, పూజ హెగ్డే హీరోయిన్స్ గా తెరకెక్కిన సినిమా ‘హై జవానీ తో ఇష్క్‌ హోనా హై’. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ డేవిడ్ ధావన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 5న హిందీలో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా కూడా నార్త్ అంతా భారీగానే రిలీజ్ చేస్తున్నారు. వరుణ్ ధావన్, మృణాల్ ఠాకూర్, పూజ హెగ్డే ముగ్గురూ స్టార్స్. ఎంత కాదనుకున్నా ఈ సినిమా నుంచి పెద్దికి నార్త్ లో మాత్రం గట్టి పోటీ ఎదురవుతుంది. అయితే పెద్ది జూన్ 4 రిలీజ్ అయితే ఇది జూన్ 5 కాబట్టి మొదటి రోజు మాత్రం నార్త్ లో పెద్దికి భారీగా ఓపెనింగ్స్ వస్తాయని తెలుస్తుంది. మరి ఈ పోటీ తట్టుకొని పెద్ది నార్త్ లో నిలబడుతుందా లేదా చూడాలి.

AP7AM02 Jun, 03:14 am
విజయవాడ ఈవెంట్ తర్వాత.. హైదరాబాద్ పై 'పెద్ది' యూనిట్ ఫోకస్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, దర్శకుడు బుచ్చిబాబు సానా రూపొందించిన పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ విడుదలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రచార కార్యక్రమాలను చిత్ర బృందం ఉద్ధృతం చేసింది. ఈ నెల‌ 4న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ప్రమోషన్లలో భాగంగా నేడు హైదరాబాద్‌లో ఓ భారీ ప్రెస్ మీట్ నిర్వహించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది.నిన్న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో లక్షలాది అభిమానుల మధ్య అట్టహాసంగా జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్, సినిమాపై ఉన్న హైప్‌ను మరింత పెంచింది. అదే ఉత్సాహాన్ని కొనసాగిస్తూ, చిత్ర బృందం ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ కార్యక్రమానికి హీరో రామ్ చరణ్‌తో పాటు హీరోయిన్ జాన్వీ కపూర్, సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్, దర్శకుడు బుచ్చిబాబు సానా, కీలక పాత్రధారులు జగపతి బాబు, దివ్యేందు శర్మ, నిర్మాత వెంకట సతీష్ కిలారు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను, పాత్రల వివరాలను, చివరి నిమిషం అప్‌డేట్స్‌ను పంచుకోనున్నారు.విలేజ్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రూపుదిద్దుకున్న 'పెద్ది' చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ట్రైల‌ర్‌, టీజర్లు, పాటలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్ సరికొత్త లుక్, బుచ్చిబాబు టేకింగ్, ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తాయని ఫ్యాన్స్