translateexpand_more

Ar Rahman News

Latest updates from Telugu Digital news sources.

SkyC Media01 Jun, 03:54 am
రామ్ చరణ్ పెద్ది అడ్వాన్స్ సేల్స్ 800కే మార్క్ దాటాయి

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం పెద్ది అడ్వాన్స్ సేల్స్ నార్త్ అమెరికాలో సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. ఈ సినిమా జూన్ 3 తేదీన ప్రీమియర్ల ద్వారా ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించిన నార్త్ అమెరికా ప్రీమియర్ల విక్రయాలు ప్రస్తుతం 800,000 డాలర్ల మార్కును దాటి దూసుకుపోతున్నాయి. సినిమా విడుదలకు ముందే అక్కడ అత్యంత భారీ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ నమోదు అవుతుండటం విశేషం. కొద్ది రోజుల క్రితం ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ కలెక్షన్లు దాదాపు 620,000 డాలర్లుగా ఉన్నాయి. అప్పుడు సుమారు 22,000 టికెట్లు అమ్ముడుపోగా ప్రస్తుతం ఆ నంబర్ వేగంగా పెరుగుతోంది. జూన్ 4 తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది. దీంతో రామ్ చరణ్ కెరీర్‌లోనే ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓవర్సీస్ ఓపెనింగ్‌గా నిలిచేలా కనిపిస్తోంది. ఈ సినిమా 1980ల నాటి ఆంధ్రప్రదేశ్ నేపథ్యంలో సాగే ఒక పల్లెటూరి స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా వస్తోంది. ఇందులో హీరో తన గ్రామాన్ని ఏకం చేయడానికి కుస్తీ, క్రికెట్ ఆటలను ఆయుధాలుగా ఎంచుకుంటాడు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు, బొమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తుండగా శృతి హాసన్ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. దర్శకుడు బుచ్చిబాబు సన తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఫలితంగా ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకులలో మరియు అభిమానులలో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ నేపథ్యంలో భారతదేశంతో పాటు విదేశాల్లోనూ ఈ సినిమాకు సంబంధించిన టికెట్ల బుకింగ్స్ విపరీతంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం

Telugu Times31 May, 10:15 am
పెద్ది’ కోసం రెండేళ్ళు చాలా ఇష్టంతో కష్టపడ్డాం. పెద్ది తప్పకుండా ఇండస్ట్రీ గర్వపడేలా చేస్తుంది

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ దేశవ్యాప్తంగా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం ఇప్పటికే అద్భుతమైన గ్లింప్స్, రెండు చార్ట్ బస్టర్ పాటలు, పవర్ ఫుల్ థియేట్రికల్ ట్రైలర్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పెద్ది జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది. జూన్ 3న ప్రత్యేక ప్రీమియర్‌లు ప్రదర్శించనున్నారు. ఈ నేపధ్యంలో చిత్ర బృందం చెన్నైలో గ్రాండ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. చెన్నై ప్రెస్ మీట్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ.. చెన్నై మీడియాకు నమస్కారం. ‘మగధీర’, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాల ప్రమోషన్స్ కోసం చెన్నైకి వచ్చాను. ఇక్కడికి ఎప్పుడు వచ్చినా నాకు సొంత ఇంటికి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. ‘పెద్ది’ కోసం మేమంతా రెండున్నరేళ్లు కష్టపడ్డాం. నేను 285 రోజులు షూటింగ్‌లో పాల్గొన్నాను. డైరెక్టర్ బుచ్చిబాబు ఈ సినిమా కోసం దాదాపు ఐదేళ్లు శ్రమించారు. ఈ సినిమాకు బిగ్గెస్ట్ సెంటర్ పిల్లర్ ఏఆర్ రెహమాన్ గారు. ఆయనలాంటి లెజెండ్‌తో పనిచేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. శివన్న గారిని స్క్రీన్‌పై చూస్తే ఓ ఫైర్‌లా అనిపిస్తుంది. ‘జైలర్’లో ఆయన సీన్స్ చూస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. ఒక ఐకానిక్ పెర్ఫార్మెన్స్. ఆయన కళ్లే ఎన్నో ఎమోషన్స్ మాట్లాడతాయి. రత్నవేలు గారితో నేను నాలుగు సినిమాలు చేశాను. ఆయన ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాకు ఆయన బిగ్గెస్ట్ అసెట్. దివ్యేందు రియల్ లైఫ్‌లో కూడా గ్యాంగ్‌స్టర్‌లా యాక్ట్ చేస్తుంటారు. దివ్యేందు, నేను ఒకే ఎత్తు

Chitrajyothy02 Jun, 12:29 am
పెద్ది.. నా జీవితంలో టాప్ ఫిల్మ్ గా నిలుస్తుంది

‘‘పెద్ది (Peddi) నా జీవితంలో టాప్‌ ఫిల్మ్‌గా నిలుస్తుంది. ‘పెది’్ద చాలా చేసింది. నటుడిగా ఎంతో సంతృప్తిని ఇచ్చింది. నన్ను వ్యక్తిగతంగా మార్చింది’’ అని అన్నారు రామ్‌చరణ్ (Ram Charan). ఆయన కథానాయకుడుగా, జాన్వీ కపూర్‌ కథానాయికగా బుచ్చిబాబు సానా తెరకెక్కించిన చిత్రం ‘పెద్ది’. మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థల సమర్పణలో వృద్ధి సినిమాస్‌ బ్యానర్‌పై వెంకట సతీశ్‌ కిలారు నిర్మించారు. సినిమా ఈనెల 4న విడుదలవుతున్న సందర్భంగా విజయవాడలో గ్రాండ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు.

అ సంద‌ర్భంగా రామ్‌చరణ్‌ మాట్లాడుతూ ‘‘దర్శకుడు బుచ్చిబాబు (Buchi Babu) దీన్ని కథలా చెప్పలేదు. ఒక వ్యక్తి ప్రయాణంలా చెప్పారు. ఈ చిత్రంలో నటన కష్టంతో చేసిన పని కాదు. ఇష్టంతో చేసిన పని. ‘రంగస్థలం’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత పెద్దికి అలా అనిపించింది. ఈ సినిమా అభిమానులు, ప్రేక్షకుల కోసం చేశా. వారి కోసం చేతులు విరగ్గొట్టుకోవడమే కాదు రక్తం చిందిస్తా’ అని అన్నారు.

‘‘ఈ చిత్రంలో చాలా ప్రత్యేకత ఉంటుంది. నా జీవితానికి అర్థం ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయడం. నా ఐడెంటిటీ తెలుగు నేలకు కనెక్ట్‌ అయి ఉంది’ అన్నారు హీరోయిన్‌ జాన్వీకపూర్‌. ‘ఎనిమిదేళ్ల తర్వాత మంచి క్యారెక్టర్‌ వచ్చింది. ఈ చిత్రంలో అప్పలసూరిగా బుచ్చిబాబు ఊహించారు.. ఆయన డిజైన్‌ చేసిన క్యారెక్టర్‌ చాలా బాగుంటుంది’’ అని జగపతిబాబు అన్నారు.

దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ ‘ఇది కమర్షియల్‌ ఫిల్మ్‌ కాదు. కమర్షియల్‌గా కనిపించే ఎమోషనల్‌ డ్రామా ఇది. ఆట ఒక మనిషికి గౌరవం, గుర్తింపు తీసుకొస్తుందని చెప్పే కథ’ అని అన్నారు. సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహ్మాన్‌ లైవ్‌ పెర్ఫార్మెన్స్‌ ఇచ్చారు. కార్యక్రమంలో గేయరచయిత అనంతశ్రీరాం, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్‌, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, చిత్ర నిర్మాతలు వెంకట సతీశ్‌ కిలారు, రవి తదితదరులు పాల్గొన్నారు.

Chitrajyothy01 Jun, 11:40 am
ఈ ఏడాది ప్రథమార్థానికి పెద్ది’నే దిక్కు

మే నెలలో సినిమాల మెరుపులు అంతంత మాత్రమే. ఇప్పుడు అందరి చూపు ‘పెద్ది’ (Peddi)పైనే. భారీ అంచనాలతో రాబోతోన్న ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అవుతుందనీ, బాక్సాఫీస్‌కు కళ తీసుకొస్తుందని అభిమానులతోపాటు ఇండస్ట్రీ జనం కూడా నమ్ముతున్నారు. మే నెలలో సినిమాల మెరుపులు అంతంత మాత్రమే. ఇప్పుడు అందరి చూపు ‘పెద్ది’ (Peddi)పైనే. భారీ అంచనాలతో రాబోతోన్న ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అవుతుందనీ, బాక్సాఫీస్‌కు కళ తీసుకొస్తుందని అభిమానులతోపాటు ఇండస్ట్రీ జనం కూడా నమ్ముతున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా హవా నడుస్తోంది. పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానున్న సినిమా కావడంతో సినిమా టీమ్‌ దేశంలోని ప్రధాన నగరాల్లో సినిమాను ప్రమోట్‌ చేస్తోంది. సంక్రాంతి సినిమాల తర్వాత చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోవడం, సమ్మర్‌ సినిమాలు కూడా ఇలా వచ్చి.. అలా వెళ్లిపోవడంతో ఈ సీజన్‌కు ఇదే పెద్ద సినిమాగా నిలిచింది. దీనిపైనే ప్రేక్షకుల ఆశలున్నాయి. అలాగే ఈ సినిమాపై బరువు, బాధ్యత కూడా అలాగే ఉంది. ఈ నెల మూడో తేదీ రాత్రి నుంచి పెద్ది ప్రీమియర్లు షురూ కానున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సినిమా జోరు గట్టిగానే ఉంది. ఓవర్సీస్‌లో అభిమానుల హంగామా మామూలుగా లేదు. నార్త్‌లో ‘పెద్ది’ ఎలా ఆడుతోంది అన్నదానిపై ఈ సినిమా స్థాయి ఆధారపడి ఉంటుంది. నార్త్‌ ప్రేక్షకుల దృష్టి సినిమాపై పడటం కోసం రెహమాన్‌తో కలిసి భారీగా ప్రమోట్‌ చేశారు. జాన్వీ కపూర్‌, ఏ.ఆర్‌ రెహమాన్‌, చరణ్‌కి అక్కడున్న గుర్తింపునకు మంచి ఓపెనింగ్స్‌ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే రెహమాన్‌ అందించిన పాటలు సౌత్‌తోపాటు నార్త్‌లోనూ చక్కని ఆదరణ పొందాయి. టీజర్‌, ట్రైలర్‌లకు మంచి స్పందన దక్కింది. స్పోర్ట్స్‌ బ్యాక్‌ డ్రాప్‌ సినిమా

10TV Telugu01 Jun, 01:37 am
నా కొడుకు కూడా రామ్ చరణ్ లా ఉండాలి.. 'పెద్ది' వేదికపై ఏఆర్ రెహమాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

AR Rahman: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న సరికొత్త యాక్షన్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రతిభావంతుడైన దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. అంతకంటే ముందుగానే, అంటే జూన్ 3న ప్రత్యేక ప్రీమియర్ షోలను కూడా ప్లాన్ చేశారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ కార్యక్రమాలతో బిజీగా గడుపుతోంది. Rasha Thadani: శ్రీనివాస మంగాపురం హీరోయిన్ రాశా టడాని.. ట్రెడిషనల్ లుక్‌లో మెరిసిన తార.. ఫొటోలు ఈ ప్రమోషన్స్ లో భాగంగా చెన్నైలో నిర్వహించిన గ్రాండ్ ప్రెస్ మీట్ లో ఆస్కార్ విన్నర్, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్(AR Rahman) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి లాంటి లెజెండరీ నటుడి వారసత్వాన్ని అందుకోవడం, ఆయన స్థాయికి తగ్గట్టుగా రాణించడం ఎంత కష్టమో రెహమాన్ గుర్తుచేశారు. అయితే రామ్ చరణ్ ఆ అంచనాలను తలక్రిందులు చేస్తూ, ఇండస్ట్రీలో తనకంటూ ఒక సొంత ఇమేజ్, ఐడెంటిటీని క్రియేట్ చేసుకుని సరికొత్త ప్రమాణాలను నెలకొల్పారని ప్రశంసించారు. తన కుమారుడు కూడా చరణ్ లాగే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నట్లు ఆయన ఆకాంక్షించారు. తెలుగు సినీ ఇండస్ట్రీపై తనకున్న అభిమానాన్ని చాటుకున్న రెహమాన్.. కీరవాణి, మణిశర్మ, దేవిశ్రీ ప్రసాద్, థమన్ వంటి అద్భుతమైన టాలెంట్ ఉన్న పరిశ్రమలో తాను భాగం కావడం సంతోషంగా ఉందన్నారు. బుచ్చిబాబు సానా ఈ సినిమా కథను వివరించినప్పుడు అందులోని మట్టి వాసన, స్ఫూర్తిదాయకమైన కథాంశం తనను

Asianet News Telugu01 Jun, 02:41 pm
గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కోసం విజయవాడకు చేరుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

#PEDDI గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కోసం విజయవాడకు చేరుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ వార్తకు సంబంధించిన

TV9 Telugu01 Jun, 04:09 pm
నా జీవితానికి అర్ధం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడమే

మెగా స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. జూన్ 4న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొద్ది రోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తుంది చిత్రయూనిట్. తాజాగా ఈ సినిమా పీ రిలీజ్ ఈవెంట్ ను విజయవాడలో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ లో నటుడు జాన్వీ మాట్లాడుతూ..మాట్లాడుతూ.. తెలుగులో మాట్లాడి ఆకట్టుకున్నారు. మీరు మా పై చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. పెద్ది సినిమా పై కూడా ఇదే ప్రేమ చూపిస్తారని అనుకుంటున్నా.. ఈ సినిమా చాలా స్పెషల్.. ఈ సినిమాలో చాలా విషయం ఉంది.. మీ జీవితానికి అర్ధం ఏంటి అనేది ఈ సినిమాలో చూస్తారు. నా జీవితానికి అర్ధం మిమ్మల్ని అలరించడం, సినిమాలు చేయడం.. నా ఐడెంటిటీ ఈ భూమితో, మీతో కనెక్ట్ అయ్యి ఉంది. మేము చేసిన ఈ సినిమా మీకు నచ్చుతుందని అనుకుంటున్నా.. ఈ సినిమా నాకు చాలా ఇచ్చింది. చరణ్ తో నటించే ఛాన్స్ ఇచ్చింది.. బుచ్చి బాబు నాకు తెలిసిన మోస్ట్ ప్యాషినేట్ డైరెక్టర్.. సినిమా టీమ్ అందరూ సినిమా కోసం బెస్ట్ ఇచ్చారు.. మీరందరూ ఇలా వస్తే మా కష్టానికి ఫలితం దక్కిందని అనుకుంటున్నా.. అంటూ అద్భుతంగా తెలుగులో మాట్లాడింది జాన్వీ. ప్రేక్షకులు దేవుళ్ళు అని మా అమ్మ చెప్తుంటుంది. జగదేకవీరుడు సినిమాలోని శ్రీదేవి చెప్పిన డైలాగ్ చెప్పిన జాన్వీ..

Zee Telugu01 Jun, 05:02 am
పెద్ది ఐటమ్ సాంగ్ లో అసభ్య స్టెప్పులపై దుమారం.. జాన్వి, రామ్ చరణ్ సమాధానం ఇదే

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Hallallallo Song Controversy:కొంతమంది ప్రేక్షకులు ఆ పాటలోని కొన్ని స్టెప్పులు అసభ్యంగా ఉన్నాయని సోషల్ మీడియాలో విమర్శలు చేశారు. 2026లో ఇలాంటి డ్యాన్స్ మూవ్స్ అవసరమా అని ప్రశ్నించారు. దీంతో ఈ వివాదం మరింత పెద్దదిగా మారింది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ తాజాగా స్పందించాడు. తనకు అసభ్యంగా చూపించే ఉద్దేశం ఎప్పుడూ లేదని స్పష్టం చేశాడు. ‘నాటు నాటు’ పాటను ఎంతగా ఆస్వాదించానో, ‘హల్లల్లల్లో’ పాటను కూడా అదే ఉత్సాహంతో చేశానని చెప్పాడు. పాటలో ఎవరినీ కించపరచడం లేదా అసభ్యంగా చూపించడం తమ లక్ష్యం కాదని వివరించాడు. అలాగే ప్రేక్షకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడంలో ఎలాంటి తప్పు లేదని కూడా చరణ్ పేర్కొన్నాడు. ఎవరు ఎలా స్వీకరించినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పి వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం చేశాడు. మరోవైపు జాన్వీ కపూర్ కూడా ఈ అంశంపై స్పందించింది. పాటకు ఇలాంటి స్పందన వస్తుందని తాను అసలు ఊహించలేదని తెలిపింది. షూటింగ్ సమయంలో తాము కేవలం దర్శకుడు చెప్పిన విధంగా డ్యాన్స్ చేశామని, అందులో తమకు ఎలాంటి అసభ్యత కనిపించలేదని చెప్పింది. నటీనటులుగా దర్శకుడి విజన్‌ను నమ్మి పనిచేస్తామని జాన్వీ వివరించింది. పాట చిత్రీకరణ సమయంలో ఎలాంటి అభ్యంతరకర భావన కలగలేదని కూడా స్పష్టం చేసింది. ఇదిలా

AP7AM30 May, 04:13 pm
విజయ్ గారి పట్ల గర్విస్తున్నాను

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' చిత్రం ప్రమోషన్ల కోసం చెన్నైలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చెన్నైతో తనకున్న విడదీయరాని బంధాన్ని గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. తన కెరీర్, కొత్త సినిమా, సహనటులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రి, నటుడు విజయ్‌పై చేసిన ప్రశంసలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.చెన్నైతో విడదీయరాని బంధంచెన్నైకి వచ్చినప్పుడల్లా తనకు మాటలు రావని, ఒకరకమైన భావోద్వేగంలో ఉండిపోతానని రామ్ చరణ్ అన్నారు. "నేను పుట్టింది, పెరిగింది ఇక్కడే. మా అమ్మగారిది కూడా ఈ నగరమే. అందుకే చెన్నైకి వస్తే నా సొంత ఇంటికి వచ్చిన అనుభూతి కలుగుతుంది. మగధీర, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాల ప్రమోషన్లకు వచ్చినప్పుడు కూడా ఇదే ఫీలింగ్ కలిగింది" అని ఆయన తెలిపారు. వేదికపై ఉన్న ఎందరో లెజెండ్స్ ముందు మాట్లాడటం సంతోషంగా ఉందన్నారు.ఇది కష్టం కాదు.. ఇష్టంతో చేసిన సినిమాతన కొత్త సినిమా గురించి మాట్లాడుతూ, ఇది ఎంతో ఇష్టపడి, ప్రేమించి చేసిన చిత్రమని చరణ్ స్పష్టం చేశారు. "ఈ సినిమా కోసం మేమంతా రెండున్నరేళ్లుగా దాదాపు 285 రోజులు పనిచేశాం. కానీ మా దర్శకుడు బుచ్చిబాబు మాత్రం గత ఐదారేళ్లుగా ఈ కథపైనే జీవిస్తున్నారు. సుకుమార్ గారు నాకు బుచ్చిబాబు లాంటి అద్భుతమైన రైటర్‌ను పరిచయం చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు. ఈ చిత్రానికి ఏ.ఆర్. రెహమాన్ గారు సెంట్రల్ పిల్లర్ లాంటి వారు," అని వివరించారు. షూటింగ్ తర్వాత ప్రతిరోజూ ఇంటికి వెళ్లి సినిమా గురించి

Chitrajyothy31 May, 06:53 pm
చిరంజీవి వారసుడిలా నా వారసుడు కూడా ఎదగాలి

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా చిత్రం ‘పెద్ది’ (Peddi) దేశవ్యాప్తంగా హ్యుజ్ బజ్‌ను క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోన్న విషయం తెలిసిందే. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలకు సిద్ధమైంది. జూన్ 3న ప్రత్యేక ప్రీమియర్‌లు ప్రదర్శించనున్నారు. ఈ నేపధ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్‌ను యమా జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో చెన్నైలో జరిగిన గ్రాండ్ ప్రెస్ మీట్‌లో సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ (AR Rahman) చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

ఈ కార్యక్రమంలో ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ.. ‘‘చిరంజీవి (Chiranjeevi) బిగ్గెస్ట్ స్టార్. ఆయన స్థాయిని అందుకోవడం అంత తేలిక కాదు. అయితే ఆయన కుమారుడిగా రామ్ చరణ్ కొత్త ప్రమాణాలను నెలకొల్పి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. చిరంజీవి కొడుకుగా ఇండస్ట్రీలోకి వచ్చి ఒక ఐడెంటిటీ, ఇమేజ్ సంపాదించుకోవడం చాలా కష్టం. కానీ ఆయన వారసత్వాన్ని ఘనంగా నిలబెట్టాడు రామ్ చరణ్. నా వారసుడు కూడా సంగీతంలో ఇలానే ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నాను.

ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే నాకు చాలా ఇష్టం. కీరవాణి, మణిశర్మ, దేవిశ్రీ ప్రసాద్, థమన్ వంటి అద్భుతమైన సంగీత దర్శకులు ఉన్న పరిశ్రమలో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉంది. ఈ సినిమా కథను బుచ్చిబాబు చెప్పినప్పుడు నాకు చాలా స్ఫూర్తిగా అనిపించింది. చాలా మంచి కథ, మట్టి కథ ఇది. ఈ చిత్రానికి పని

Asianet News Telugu29 May, 02:05 pm
పెద్ది ఎవరి కోసం చూడాలి ? అసలెందుకు చూడాలి ?.. 5 కారణాలు ఇవే

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన పెద్ది మూవీ గ్రాండ్ రిలీజ్ కి అన్ని ఏర్పాట్లు చక చకా పూర్తవుతున్నాయి. టికెట్ ధరలు పెంచుకునేందుకు కూడా ఏపీ ప్రభుత్వం అనుమతి ఇస్తూ జీవో జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. భోపాల్ జరిగిన మ్యూజిక్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. ముంబైలో లాంచ్ చేసిన ట్రైలర్ ఒక రేంజ్ లో వైరల్ అవుతోంది. బుచ్చిబాబు ఈ చిత్రాన్ని స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు. ఇదిలా ఉండగా జూన్ 4న రిలీజ్ అవుతున్న ఈ చిత్రాన్ని అసలు ఎందుకు చూడాలి అని ప్రశ్నించుకున్నప్పుడు 5 కారణాలు కనిపిస్తాయి. అవేంటో అప్పుడు చూద్దాం. రాంచరణ్ ఈ చిత్రంలో నట విశ్వరూపం ప్రదర్శించినట్లు ప్రచారం జరుగుతోంది. నటన మాత్రమే కాదు క్రికెటర్ గా, కుస్తీ వీరుడిగా, రన్నర్ గా కనిపించేందుకు చరణ్ తన ఫిజిక్ ని మార్చుకున్న విధానం అద్భుతం అని అంటున్నారు. రాంచరణ్ నటనలో, బాడీలో ఇంకెన్ని వేరియేషన్స్ ఉంటాయో సినిమా చూసే తెలుసుకోవాలి. కొన్ని సన్నివేశాల్లో చరణ్ నటన కంటతడి పెట్టించేలా ఉంటుంది అంటూ ప్రచారం జరుగుతోంది. ముందు నుంచి జాన్వీ కపూర్ గ్లామర్ ని హైలైట్ చేస్తూ వస్తున్నారు. ట్రైలర్, సాంగ్స్ లో జాన్వీ గ్లామరస్ గా కాస్త కొంటెతనం ఉన్న అమ్మాయిలా కనిపిస్తోంది. రాంచరణ్, జాన్వీ కపూర్ మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంటుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పెద్ది కనుక హిట్టై, అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ వస్తే బుచ్చిబాబు నేరుగా క్రేజీ పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. బుచ్చిబాబుకి ఇది రెండవ చిత్రం మాత్రమే. బుచ్చిబాబు పెద్ది చిత్రంతో ఇచ్చే సర్ప్రైజ్ ఎలిమెంట్స్

Chitrajyothy24 May, 07:23 am
Ram Charan: నా ఫిల్మ్ లైబ్రరీలో.. 'పెద్ది' నంబర్ వన్ | In My Film Library Peddi Movie Will Number One.. Says Ram Charan srk

- Home » Tollywood » In My Film Library Peddi Movie Will Number One.. - Says Ram Charan srk ABN , Publish Date - May 24 , 2026 | 12:53 PM 'పెద్ది' అందరి మనసుని తాకుతుంది. - మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సినిమా ఇది.

Chitrajyothy28 May, 04:28 pm
ఆడియో జ్యూక్ బాక్స్ విడుదల.. పెద్ది’ టీమ్ తప్పు చేసిందా

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన ‘పెద్ది’ మూవీ జ్యూక్ బాక్స్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఇందులో ‘మస్సా మస్సా’ సాంగ్ విన్నవారంతా.. ‘పెద్ది’ టీమ్ తప్పు చేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan), జాన్వీ కపూర్ (Janhvi Kapoor) జంటగా, క్రియేటివ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ (Peddi). ఈ మూవీ ప్రమోషన్స్‌ని మేకర్స్ ఓ రేంజ్‌లో నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన పాటలు చార్ట్‌బస్టర్స్‌గా నిలిచాయి. ఇక మ్యూజికల్ హంగామాలో భాగంగా గురువారం ఈ సినిమాకు సంబంధించిన పూర్తి ఆడియో జ్యూక్ బాక్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ (AR Rahman) స్వరపరిచిన ఈ ఆల్బమ్, విడుదలైన కొద్ది సేపట్లోనే సోషల్ మీడియాను షేక్ చేస్తూ, దూసుకెళుతోంది. ఈ జ్యూక్ బాక్స్ విడుదల తర్వాత ‘పెద్ది’ టీమ్ పెద్ద తప్పు చేసిందంటూ అభిమానులు, నెటిజన్లు స్పందిస్తుండటం విశేషం. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి మూడు పాటలను మేకర్స్ విడివిడిగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ పాటలు ఇప్పటికే చార్ట్‌బస్టర్స్‌గా నిలిచాయి. అయితే, ఈ ఆడియో జ్యూక్ బాక్స్‌లో అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ‘మస్సా మస్సా’ (Massa Massa) సాంగ్‌ను కూడా యాడ్ చేయడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కానీ, ఈ సాంగ్‌ని కూడా విడిగా రిలీజ్ చేసి ఉంటే.. సెన్సేషన్‌ని క్రియేట్ చేసేదని, ఈజీగా 100 మిలియన్ల వ్యూస్‌ని రాబట్టేదని, సినిమాపై ఇంకా భారీగా అంచనాలను పెంచేసేదని ఫ్యాన్స్, నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. అసలీ పాటను ఇప్పటి

10TV Telugu28 May, 10:17 am
మోస్ట్ అవైటెడ్.. పెద్ది 'మస్సా.. మస్సా' సాంగ్ వచ్చేసింది.. ఇక్కడ వినేయండి

Massa Massa Song: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ విడుదలకు సిద్ధమవుతోంది. భారీ అంచనాలున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుని సినిమాపై అంచనాలను స్కై హైకి తీసుకెళ్లింది. Ram Charan: స్వయంగా మోదీ అడిగారు.. ‘పెద్ది’ మూవీ వికసిత్ భారత్ అని చెప్పాను: రామ్ చరణ్ ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ దేశవ్యాప్తంగా జోరుగా సాగుతున్నాయి. బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్స్‌తో చిత్ర యూనిట్ ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇందులో భాగంగా తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఒక గ్రాండ్ ప్రెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌లోనే ‘పెద్ది’ సినిమా నుండి మోస్ట్ అవేటెడ్ ‘మస్సా మస్సా(Massa Massa Song)’ అనే సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఎంతో ఇన్‌స్పిరేషనల్ లిరిక్స్‌తో సాగే ఈ పాట ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ సాంగ్‌కు సోషల్ మీడియాలో క్రేజీ రెస్పాన్స్ వస్తోంది. ఇది చార్ట్‌బస్టర్‌గా నిలిచి మోస్ట్ సెలబ్రేటెడ్ సాంగ్ కానుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఈ పాటపై ఫ్యాన్స్ నుండి ఒక ఆసక్తికరమైన టాక్ వినిపిస్తోంది. ఈ ‘మస్సా మస్సా’ సాంగ్ మాతృభాష తెలుగు కంటే.. హిందీ వర్షన్‌లోనే వినడానికి చాలా బాగుందంటూ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఈ పాటతో ‘పెద్ది’ ప్రమోషన్స్ నెక్ట్స్ లెవెల్‌కు చేరుకున్నాయి.

Chitrajyothy24 May, 07:13 am
AR Rahman: రామ్ చరణ్ డ్యాన్స్‌తో.. నా పాటలను మరో స్థాయికి తీసుకెళ్లాడు | With His Dancing Ram Charan Took My Songs To Another level Says AR Rahman srk

- Home » Tollywood » With His Dancing Ram Charan Took My Songs To Another level Says AR Rahman srk ABN , Publish Date - May 24 , 2026 | 12:43 PM మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా 'పెద్ది' దేశవ్యాప్తం... - రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) హీరోగా బుచ్చిబాబు సాన (Buchi Babu Sana) ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం పెద్ది (Peddi) మ‌రో రెండు వారాల్లో ప్రేక్ష‌కుల ఎదుట‌కు రానుంది. - ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ మ‌ధ్య‌ప్ర‌దేశ్ భోపాల్‌లో ‘పెద్ది కి ఆవాజ్’ పేరిట ఓ స్పెష‌ల్ ఈవెంట్ నిర్వ‌హించారు.

NTV Telugu24 May, 05:10 am
AR Rahman Peddi: ‘బాహుబలి’ చూసాకే తెలుగు సినిమాపై ప్రేమ పెరిగింది..

- గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వస్తున్న ‘పెద్ది’ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. - దాదాపు చాలా ఏళ్ల తర్వాత ఆయన ఒక స్ట్రెయిట్ తెలుగు ప్రాజెక్ట్‌ను ఒప్పుకోవడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. - భోపాల్ ఈవెంట్ సాక్షిగా రెహమాన్ ఈ విషయంపై స్పందిస్తూ..

NTV Telugu27 May, 03:00 am
యూఎస్ కే కాదు.. యూకేలోనూ పెద్ది’ దుమ్మురేపుతోంది

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) జంటగా నటించిన మోస్ట్ అవేటెడ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (PEDDI). ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్-ఇండియా చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ క్రమంలో సినిమా ఓవర్సీస్ మార్కెట్‌లో అప్పుడే సరికొత్త రికార్డుల వేట మొదలుపెట్టింది. తాజా సమాచారం ప్రకారం యూఎస్ఏ (USA) మార్కెట్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా యూకే (UK – యునైటెడ్ కింగ్‌డమ్) మార్కెట్‌లో ‘పెద్ది’ అడ్వాన్స్ బుకింగ్స్ సాలిడ్‌గా, చాలా స్టడీగా దూసుకుపోతుండటం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమా తర్వాత రామ్ చరణ్‌కు అంతర్జాతీయంగా, ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్‌లో విపరీతమైన క్రేజ్ పెరిగింది. దానికి తగ్గట్టుగానే ‘పెద్ది’ సినిమా ఓవర్సీస్ బుకింగ్స్ ఓపెన్ అయిన కొద్ది రోజుల్లోనే భారీ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని మెగా అభిమానులు ఈ సినిమా టికెట్ల కోసం ఎగబడుతుండటంతో అక్కడ ప్రీ-సేల్స్ సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేస్తున్నాయి. సమాచారం ప్రకారం యూకేలో ‘పెద్ది’ చిత్రం లేటెస్ట్‌గా 12,500 కి పైగా టికెట్ సేల్స్ జరుపుకుని విడుదలకి ముందే సరికొత్త రికార్డు నమోదు చేసింది. ప్రీ-సేల్స్ ట్రెండ్ చూస్తుంటే ప్రీమియర్స్.. మొదటి రోజు కలెక్షన్ల పరంగా రామ్ చరణ్ కెరీర్‌లోనే ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలవడం ఖాయమని ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Chitrajyothy25 May, 09:01 am
Home » Bollywood » A.R. Rahman: ‘Ramayan’ Will Redefine Indian Cinema on the Global Stage avm ABN ,...

Home » Bollywood » A.R. Rahman: ‘Ramayan’ Will Redefine Indian Cinema on the Global Stage avm ABN , Publish Date - May 25 , 2026 | 02:31 PM హిందీలో తెరకెక్కుతున్న ఇతిహాసం ‘రామాయణ్‌’పై సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ ఆసక్...

123Telugu23 May, 07:49 pm
Peddi: ఆ పోరాటం మీ గుండెల్ని తాకుతుంది.. ‘పెద్ది’ మూవీపై రామ్ చరణ్ ఎమోషనల్ కామెంట్స్

- మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. - ఈ సినిమా తన కెరీర్‌లోనే బెస్ట్ ఫిల్మ్ అవుతుందని చరణ్ చాలా కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు. - భోపాల్ వేదికగా జరిగిన ‘పెద్ది కి ఆవాజ్’ మ్యూజికల్ ఈవెంట్‌లో ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Samayam Telugu24 May, 09:40 am
టాలీవుడ్‌లో మోస్ట్ హైప్డ్ మూవీ: 29 ఏళ్ల క్రితమే రూ. 15 కోట్ల బిజినెస్, ‘రక్షకుడు’ అరుదైన రికార్డు!

- రచయిత గురించివీరేష్ బిళ్ళవీరేశ్ బిళ్ల ‘సమయం తెలుగు’లో కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. - ఇక్కడ సినీ రంగానికి చెందిన తాజా వార్తలు, స్టోరీలు రాస్తుంటారు. - ఆయన గతంలో ఏపీ, తెలంగాణకు సంబంధించిన ఆసక్తికర వార్తలు, పొలిటికల్ న్యూస్, సినిమా, క్రికెట్, లైఫ్‌ స్టైల్ కథనాలు రాశారు.

Sakshi23 May, 06:22 pm
చరణ్ డాన్స్‌తో వాటి అందం రెట్టింపు అయింది: ఏఆర్ రెహమాన్

- May 23 2026 11:37 PM | Updated on May 23 2026 11:37 PM మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు ప్రేక్షకులను ఊర్రూతలూగిస్తున్నాయి. - చికిరి” పాట దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించంది. - రారా” పాట కూడా భారీ హిట్ అయింది.

SkyC Media31 May, 10:55 am
రేపే విజయవాడలో పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న 'పెద్ది' చిత్ర యూనిట్ ప్రమోషన్లను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికను అధికారికంగా ప్రకటించారు. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జూన్ 1, 2026 న ఈ భారీ వేడుక జరగనుంది. రేపు సాయంత్రం 5 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుందని చిత్ర బృందం తెలిపింది. ఈ ఈవెంట్ కోసం ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల నుంచి భారీగా అభిమానులు తరలివచ్చే అవకాశం ఉంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను జూన్ 4 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ముగిసిన కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రచార కార్యక్రమాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రం 1980 ల నాటి గ్రామీణ ఆంధ్రప్రదేశ్ నేపథ్యంలో సాగే ఒక పవర్‌ఫుల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కింది. ఇందులో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. ఇదిలా ఉండగా కన్నడ స్టార్ నటుడు శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించడం విశేషం. దీంతో ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాపై అటు పరిశ్రమలోనూ, ఇటు ప్రేక్షకులలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ చాలా బలంగా

NTV Telugu24 May, 06:16 am
Peddi: రామ్ చరణ్ ‘పెద్ది’ .. ‘హెల్లాళ్లాలో’ వీడియో సాంగ్ అవుట్!

- గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు వీకెండ్ అదిరిపోయే మాస్ ట్రీట్ వచ్చేసింది. - దర్శకుడు బుచ్చిబాబు సన ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (PEDDI) నుండి మోస్ట్ అవైటెడ్ స్పెషల్ మాస్ సాంగ్ ‘హెల్లాళ్ళల్లో’ (#Hellallallo) ఫుల్ వీడియో సాంగ్ నెట్టింట విడుదలై సంచలనం సృష్టిస... - భోపాల్‌లో జరిగిన గ్రాండ్ మ్యూజికల్ ఈవెంట్‌లో లైవ్ పర్ఫార్మెన్స్‌తో ఊపేసిన ఈ పాట..

SkyC Media01 Jun, 05:41 am
నా కొడుకు కూడా చరణ్ లా మారాలి

చెన్నై నగరంలో జరిగిన పెద్ది సినిమా ప్రమోషన్స్ గ్రాండ్ ప్రెస్ మీట్ లో రామ్ చరణ్ పై ఏఆర్ రెహమాన్ చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచాయి. చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరైన ఈ వేడుకలో సంగీత దర్శకుడు రెహమాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సినిమా ప్రమోషన్ల లో భాగంగా నిర్వహించిన ఈ ప్రెస్ మీట్ కు భారీ సంఖ్యలో మీడియా ప్రతినిధులు తరలివచ్చారు. ఈ ప్రెస్ మీట్ లో ఆయన సినిమా విశేషాలతో పాటు ముఖ్యమైన విషయాలను పంచుకున్నారు. రామ్ చరణ్ పై ఏఆర్ రెహమాన్ చేసిన వ్యాఖ్యలు మెగా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. చిరంజీవి లాంటి లెజెండరీ స్టార్ వారసత్వాన్ని అందుకోవడం ఎంత కష్టమో ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. సినీ పరిశ్రమలో ఒక లెజెండ్ వారసుడిగా రావడం వెనుక ఉండే ఒత్తిడిని ఆయన వివరించారు. రామ్ చరణ్ ఆ అంచనాలను పూర్తిగా మించి తన సొంత ఇమేజ్ ను సృష్టించుకున్నాడని కొనియాడారు. దీంతో పాటు ఆయన పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక ఐడెంటిటీని కూడా ఏర్పరచుకున్నారని స్పష్టం చేశారు. రామ్ చరణ్ నటుడిగా కొత్త ప్రమాణాలు నెలకొల్పాడని రెహమాన్ ఈ వేదికపై గొప్పగా ప్రశంసించారు. ఇదిలా ఉండగా ఈ వ్యాఖ్యలు సినీ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. తన కుమారుడు కూడా రామ్ చరణ్ లాగే ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఫలితంగా ఈ వ్యాఖ్యలు విన్న వారందరికీ ఎంతో హార్ట్ టచింగ్ గా అనిపించాయి. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ పై ఏఆర్ రెహమాన్

Samayam Telugu24 May, 07:43 am
శృతి, జాన్వీలతో చరణ్ మాస్ జాతర... ‘పెద్ది’ నుండి స్పెషల్ సాంగ్ ఫుల్ వీడియో వచ్చేసింది

- రచయిత గురించివీరేష్ బిళ్ళవీరేశ్ బిళ్ల ‘సమయం తెలుగు’లో కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. - ఇక్కడ సినీ రంగానికి చెందిన తాజా వార్తలు, స్టోరీలు రాస్తుంటారు. - ఆయన గతంలో ఏపీ, తెలంగాణకు సంబంధించిన ఆసక్తికర వార్తలు, పొలిటికల్ న్యూస్, సినిమా, క్రికెట్, లైఫ్‌ స్టైల్ కథనాలు రాశారు.

SkyC Media31 May, 11:56 am
పెద్ది ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా పవన్ కళ్యాణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పెద్ది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించి ఒక క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ గ్రాండ్ ఈవెంట్‌కు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ వార్త మెగా అభిమానుల్లో భారీ అంచనాలను, అపరిమితమైన ఉత్సాహాన్ని నింపింది. రామ్ చరణ్ పెద్ది సినిమా ప్రీ-రిలీజ్ వేడుకను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. ఈ భారీ బహిరంగ వేడుక కోసం విజయవాడ నగరంలో సర్వం సిద్ధం చేస్తున్నారు. జూన్ 1 వ తేదీన సాయంత్రం 5 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం ఈ మహా వేడుకకు ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఈ సినిమాపై టాలీవుడ్‌లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇదొక పవర్‌ఫుల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. దీంతో ఈ సినిమా పాటలపై భారీ క్రేజ్ ఏర్పడింది. ఈ ప్రతిష్టాత్మక చిత్రం జూన్ 4 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇదిలా ఉండగా జూన్ 1 న జరిగే ఈ వేడుకకు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ రావడంతో పాటు స్టేడియానికి భారీగా జనాలు వచ్చే అవకాశం ఉంది. అభిమానుల తాకిడిని తట్టుకునేలా నిర్వాహకులు పక్కా ప్లాన్ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్‌తో పాటు పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కూడా హాజరుకానున్నారు. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఒకే వేదికపై కనిపించనుండటంతో రాజకీయ, సినీ వర్గాల్లో ఆసక్తి

10TV Telugu30 May, 04:07 pm
చెన్నైలో రామ్ చరణ్ పెద్ది’ గ్రాండ్ ఈవెంట్.. ఫొటోలు వైరల్

చెన్నైలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్ర గ్రాండ్ ఈవెంట్(Peddi Chennai Event) అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు చిత్ర దర్శకుడు బుచ్చిబాబు, మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, నటుడు దివ్యేన్దు శర్మ హాజరై సందడి చేశారు. ప్రముఖుల కలయికతో కూడిన ఈ ఈవెంట్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

AP7AM01 Jun, 05:42 pm
విజయవాడలో గ్రాండ్ గా 'పెద్ది' ప్రీ రిలీజ్ ఈవెంట్... 'మస్సా మస్సా' వీడియో సాంగ్ రిలీజ్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం 'పెద్ది'. ఈ సాయంత్రం విజయవాడలో పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. హీరో రామ్ చరణ్, హీరోయిన్ జాన్వీ కపూర్, దర్శకుడు బుచ్చిబాబు సానా, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తదితరులు ఈ ఈవెంట్ కు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో 'మస్సా మస్సా' అనే పవర్‌ఫుల్ సాంగ్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. ఇప్పటికే ఆడియో రూపంలో సంగీత ప్రియులను ఆకట్టుకున్న ఈ పాట, ఇప్పుడు మేకింగ్ విజువల్స్‌తో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.ఈ వీడియో సాంగ్‌లో సినిమా కోసం రామ్ చరణ్ పడిన కష్టాన్ని, ఆయన డెడికేషన్‌ను కళ్లకు కట్టినట్టు చూపించారు. పాత్రకు తగ్గట్టుగా శరీరాకృతిని మార్చుకోవడం కోసం, యాక్షన్ సన్నివేశాల కోసం ఆయన చేసిన కఠినమైన కసరత్తులు, శిక్షణకు సంబంధించిన విజువల్స్ చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. చరణ్ హార్డ్ వర్క్ మైండ్ బ్లోయింగ్ అనేలా ఉందని కామెంట్లు చేస్తున్నారు.ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ఈ హై-ఎనర్జీ ట్రాక్‌కు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా, విశాల్ మిశ్రా తన గాత్రంతో ప్రాణం పోశారు. 1980ల నాటి గ్రామీణ ఆంధ్రప్రదేశ్ నేపథ్యంలో, స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా 'పెద్ది' రూపొందుతోంది. ఇందులో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్

Ar Rahman News Keyword | Telugu Digital