translateexpand_more

Baahubali News

Latest updates from Telugu Digital news sources.

NTV Telugu24 May, 05:10 am
AR Rahman Peddi: ‘బాహుబలి’ చూసాకే తెలుగు సినిమాపై ప్రేమ పెరిగింది..

- గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వస్తున్న ‘పెద్ది’ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. - దాదాపు చాలా ఏళ్ల తర్వాత ఆయన ఒక స్ట్రెయిట్ తెలుగు ప్రాజెక్ట్‌ను ఒప్పుకోవడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. - భోపాల్ ఈవెంట్ సాక్షిగా రెహమాన్ ఈ విషయంపై స్పందిస్తూ..

Telugu Times01 Jun, 02:00 am
స్పిరిట్ లో ఖాకీ పవర్.. ప్రభాస్ ఫ్యాన్స్ కు భారీ ట్రీట్ రెడీ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) కెరీర్‌లో ప్రతి సినిమా ఒక కొత్త జానర్‌ను టచ్ చేస్తూ వస్తోంది. బాహుబలి (Baahubali) తర్వాత ఆయన చేసిన సినిమాల్లో యాక్షన్, రొమాన్స్, సైన్స్ ఫిక్షన్, మైథాలజీ వంటి విభిన్న కథలు కనిపించాయి. కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, ప్రభాస్ మార్కెట్‌పై మాత్రం ఎలాంటి ప్రభావం చూపలేకపోయాయి. అలాంటి సినిమాల్లో సాహో(Saaho) కూడా ఒకటి. భారీ స్థాయిలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో ప్రభాస్ పాత్రపై అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ముఖ్యంగా పోలీస్ అవతారంలో ఆయనను పూర్తిస్థాయిలో చూడాలన్న కోరిక అప్పట్లో నెరవేరకపోవడంతో కొంత నిరాశ వ్యక్తమైంది. అయితే ఇప్పుడు ఆ లోటును డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) తెరకెక్కిస్తున్న స్పిరిట్(Spirit) భర్తీ చేయబోతున్నట్లు సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇప్పటికే ఈ సినిమా కథలో ప్రభాస్ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ గా కనిపించనున్నాడనే సమాచారం ఉంది. తాజా అప్‌డేట్స్ ప్రకారం ప్రస్తుతం షూటింగ్ లో భాగంగా ప్రభాస్‌పై ఐపీఎస్ ఆఫీస‌ర్ లుక్‌కు సంబంధించిన కీలక సన్నివేశాలు తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఖాకీ దుస్తుల్లో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారనుందని టాక్ వినిపిస్తోంది. ప్రభాస్‌ను ఇప్పటివరకు ఎన్నో మాస్, స్టైలిష్ పాత్రల్లో చూసిన ప్రేక్షకులకు స్పిరిట్ కొత్త అనుభూతిని ఇవ్వబోతుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. సందీప్ రెడ్డి వంగా సినిమాలకు ప్రత్యేకమైన ఎమోషనల్ ఇంటెన్సిటీ, యాక్షన్ ట్రీట్‌మెంట్ ఉండటంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింత పెరిగాయి. ముఖ్యంగా పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రభాస్ ఎలా కనిపిస్తాడు, ఆయన పాత్ర ఎంత ప్రభావవంతంగా ఉంటుంది అన్న ఆసక్తి అభిమానుల్లో రోజురోజుకీ పెరుగుతోంది. రిలీజ్ కు టైమ్ ఇంకా ఉన్నప్పటికీ, స్పిరిట్

Baahubali News Keyword | Telugu Digital