translateexpand_more

Chiranjeevi News

Latest updates from Telugu Digital news sources.

10TV Telugu02 Jun, 11:58 am
చరణ్ కంటి నుండి రక్తం.. పెద్దాయన ఫోన్ చేస్తే గుండె ఆగినంత పనైంది.. బుచ్చిబాబు ఎమోషనల్

Buchibabu: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన రా అండ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా, షూటింగ్ లొకేషన్‌లో జరిగిన ఒక భయానక ప్రమాదం గురించి దర్శకుడు బుచ్చిబాబు షాకింగ్ విషయాలను పంచుకున్నారు. ఒక కీలకమైన యాక్షన్ సీన్ చిత్రీకరిస్తున్న సమయంలో రామ్ చరణ్ కంటికి తీవ్ర గాయమై రక్తం వచ్చిందని, ఆ దృశ్యం కెమెరాలోనే రికార్డ్ అయిందని ఆయన తెలిపారు. Trisha Krishnan: కుక్క ఫోటోతో కౌంటర్.. ట్రోలర్స్ కి గట్టి సమాధానం ఇచ్చిన త్రిష కోట్లాది మంది అభిమానించే స్టార్ హీరోకు తన సెట్స్‌లో అలా గాయం కావడంతో తనకు చేతులు, కాళ్లు ఆడలేదని బుచ్చిబాబు ఎమోషనల్ అయ్యారు. ఆ వెంటనే ఇంటి నుండి మెగాస్టార్ చిరంజీవి ఫోన్ చేయడంతో, తనపై గట్టిగా తిడతారేమోనని విపరీతమైన భయంతో గుండె ఆగినంత పనైందని పేర్కొన్నారు. అయితే ఫోన్ ఎత్తిన బుచ్చిబాబు(Buchibabu)కు చిరంజీవి ఊహించని విధంగా ఎంతో కూల్‌గా మాట్లాడి పెద్ద షాక్ ఇచ్చారు. చిరంజీవి గారు దర్శకుడిని అస్సలు తిట్టకుండా, ఎంతో పరిణతితో అసలు ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నారని బుచ్చిబాబు చెప్పారు. “కంగారు పడకు బుచ్చి.. ఆ గాయం అయిన వీడియో క్లిప్ ఒకసారి నాకు పంపించు” అని చిరంజీవి ధైర్యం చెప్పిన తీరు, ఆయన ఇచ్చిన సపోర్ట్ తనను ఎంతగానో ఆశ్చర్యపరిచాయని బుచ్చిబాబు ఆనాటి సంఘటనను గుర్తుచేసుకున్నారు.

Asianet News Telugu02 Jun, 10:25 am
చిరు అన్న అంటే అందుకే నాకు ఇష్టం, ఇద్దరినీ కూర్చోబెట్టి రిక్వస్ట్ చేశారు..దెబ్బకి మైండ్ పోయింది

సినిమా పట్ల చిరంజీవికి డెడికేషన్, క్రమశిక్షణ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమా కోసం చిరంజీవి ఎంత కష్టానికైనా వెనుకాడరు. కెరీర్ బిగినింగ్ నుంచి తన ట్యాలెంట్ నిరూపించుకుంటూ కష్టపడ్డారు కాబట్టే చిరంజీవి టాలీవుడ్ లో నెంబర్ 1 గా దశాబ్దాల పాటు కొనసాగారు. చిరంజీవి గురించి ఓ ఇంటర్వ్యూలో కమెడియన్ బాబు మోహన్ ఆసక్తికర సంఘటనని పంచుకున్నారు. చిరంజీవి గారికి అస్సలు కోపం అనేది రాదు. చిరంజీవి గారిని నేను ముద్దుగా చిరన్న పిలిస్తా. ముఠామేస్త్రి సినిమా సమయంలో ఒక సంఘటన చోటు చేసుకుంది. నేను, బ్రహ్మి, చిరన్న కాంబోలో సన్నివేశాలు ఉన్నాయి. కానీ మా ముగ్గురి డేట్లు ఒకేసారి కుదరడం లేదు. నేను రోజుకు ఆరు షిఫ్ట్స్ వర్క్ చేస్తూ బిజీగా ఉన్నాను. బ్రహ్మానందం కూడా బిజీగా ఉన్నారు. దీనితో మా ఇద్దరి డేట్లు ఒకేసారి కుదిరితే షూటింగ్ పూర్తి చేయాలని చిరంజీవి గారు వెయిట్ చేస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతోంది కానీ.. మా డేట్లు అడ్జెస్ట్ కావడం లేదు. దీనితో చిరంజీవి గారు మా ఇద్దరినీ ఒక రోజు పిలిచారు. ఇద్దరినీ కూర్చోబెట్టి రిక్వెస్ట్ చేశారు. ఒక రెండు గంటలు మీరిద్దరూ టైం అడ్జెస్ట్ చేస్తే షూటింగ్ పూర్తి చేద్దాం అని అన్నారు. మీకు ఎప్పుడు కుదురుతుందో చెప్పండి అని అడిగారు. మేము బిజీగా ఉండడంతో ఎప్పుడు టైం ఇవ్వాలి అనేది అర్థం కాలేదు. దీనితో చిరన్నకి చిన్నపాటి అసహనం కలిగింది. సరే కనీసం ఎర్లీ మార్నింగ్ 4 గంటల నుంచి 6 గంటల మధ్యలో టైం ఇస్తారా అని అడిగారు నేను ఆశ్చర్యపోయా. ఏంటి చిరంజీవి గారు ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు షూటింగ్ కి రాగలరా అనే డౌట్ వచ్చింది. లేదు చిరన్న ఎర్లీ మార్నింగ్ మీకు ఇబ్బంది అవుతుందేమో ఇంకో డేట్ చూసుకుందాం అని అడిగా. లేదు బాబు మోహన్ నేనేం ఫీల్ కావట్లేదు. ఆ టైం నాకు ఓకె ఎలాంటి ఇబ్బంది లేదు అని అన్నారు. నాకు ఆ రోజు కూడా వరుసగా షూటింగ్స్ ఉన్నాయి. ముఠామేస్త్రి షూటింగ్ కి కాస్త ముందుగా వెళ్లి అక్కడ చెట్టు పక్కన కాసేపు పడుకుందాం అని అనుకున్నా. చిరంజీవి గారు ఎలాగూ 4 గంటలకు రాలేరు. చిరన్న 4 గంటలకు ఎందుకు వస్తారు ఆలస్యం అవుతుందిలే. కాసేపు పడుకోవచ్చు అనుకున్నా. షూటింగ్ లొకేషన్ కి వెళ్లేసరికి మా అందరికంటే ముందే చిరన్న వచ్చి కాలుమీద కాలు వేసుకుని కూర్చుని ఉన్నారు. నా మైండ్ పోయింది. మరోవైపు నుంచి బ్రహ్మానందం పరిగెత్తుకుంటూ వస్తున్నారు. మమ్మల్ని చూసి నవ్వుతూ నేను ఆలస్యంగా వస్తానని అనుకున్నారా అని అన్నారు. అందుకే చిరన్న అంటే నాకు ఇష్టం. చిరంజీవి గారి క్రమశిక్షణ ఆ విధంగా ఉంటుంది అని బాబు మోహన్ ప్రశంసించారు.

AP7AM02 Jun, 01:31 am
పెద్ది' వేదికపై మంత్రి కందుల దుర్గేశ్ కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా పరిశ్రమ అభివృద్ధికి తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని, పరిశ్రమకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ భరోసా ఇచ్చారు. విజయవాడలో జరిగిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తరపున చిత్ర పరిశ్రమకు ఈ హామీ ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. "ఏపీలో షూటింగ్‌లతో పాటు స్టూడియోలు, రికార్డింగ్ థియేటర్ల వంటి మౌలిక సదుపాయాలు నిర్మించేందుకు నిర్మాతలు ముందుకు రావాలి. వారికి సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇచ్చేందుకు మేం సిద్ధంగా ఉన్నాం" అని ఆయన పిలుపునిచ్చారు. దీనివల్ల స్థానిక ప్రతిభకు కూడా ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా 'పెద్ది' సినిమాపై మంత్రి ప్రశంసలు కురిపించారు. గ్లింప్స్, ట్రైలర్ చూస్తుంటే ఇదొక అద్భుతమైన దృశ్యకావ్యంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. "చెన్నైలో పుట్టి, హైదరాబాద్‌లో పెరిగినా... రామ్ చరణ్ ఈ రస్టిక్ పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయారు. నటన ఆయన నరనరాన ఉంది. రామ్ చరణ్, జాన్వి కపూర్‌ల జంట... అలనాటి చిరంజీవి, శ్రీదేవిల జంటను గుర్తు చేస్తోంది" అని అన్నారు. దర్శకుడు బుచ్చిబాబు తూర్పు గోదావరి జిల్లా వాసి కావడం గర్వంగా ఉందని, ఆయన ప్రతిభతో పాటు వినయం గొప్పదని అభినందించారు. ఈ సినిమా భారీ విజయం సాధించి, దీనిపై ఆధారపడిన వందలాది కుటుంబాలకు మేలు కలగాలని మంత్రి మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.