translateexpand_more

Entertainment News

Latest updates from Telugu Digital news sources.

AP7AM02 Jun, 02:40 am
సుస్మిత సేన్ తో బంధంపై ఏళ్ల తర్వాత స్పందించిన లలిత్ మోదీ.. సంచలన నిజాలు వెల్లడి

ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ, విశ్వసుందరి సుస్మితా సేన్ మధ్య 2022లో నడిచిన ప్రేమాయణం అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సుస్మితను 'గోల్డ్ డిగ్గర్' (డబ్బు కోసం ఆశపడే వ్యక్తి) అంటూ సోషల్ మీడియాలో తీవ్రంగా విమర్శించారు. ఈ ఆరోపణలపై లలిత్ మోదీ ఏళ్ల తర్వాత స్పందించారు. సుస్మితపై వచ్చిన విమర్శలన్నీ అవాస్తవమని, తమ బంధంలో ఖర్చులన్నీ ఆమే భరించేదని స్పష్టం చేశారు.ఇటీవల 'హ్యూమన్స్ ఆఫ్ బాంబే'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో లలిత్ మోదీ ఈ విషయాలను పంచుకున్నారు. "ఆమెను గోల్డ్ డిగ్గర్ అనడం చాలా తప్పు. వాస్తవానికి మా ప్రయాణాల్లో ఖర్చులన్నీ ఆమే చూసుకునేది. చెప్పాలంటే.. నేనొక కెప్ట్ బాయ్‌ఫ్రెండ్‌లా (ఆమె పోషణలో ఉన్న ప్రియుడిలా) ఉండేవాడిని" అని మోదీ అన్నారు. తమలో ఎవరైనా డిగ్గర్ ఉంటే, అది వజ్రాల కోసం వెతికిన తానేనని ఆయన చమత్కరించారు. సుస్మిత తన కంటే ముందే ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్నారని, ఆమెకు సొంతంగా వజ్రాల వ్యాపారం కూడా ఉందని తెలిపారు.2022 జులైలో లలిత్ మోదీ.. సుస్మితతో కలిసి విహారయాత్రల్లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, ఆమెను తన 'బెటర్ హాఫ్' అని ప్రకటించారు. దీంతో సుస్మితపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. లలిత్ మోదీ సంపద కోసమే ఆమె బంధం కొనసాగిస్తోందని ఆరోపణలు గుప్పించారు.అయితే ఆనాటి ట్రోలింగ్‌పై సుస్మిత కూడా ఎంతో హుందాగా స్పందించారు. "నేను బంగారం కంటే లోతుగా తవ్వుతాను. నాకు ఎప్పటినుంచో వజ్రాలంటేనే ఇష్టం. వాటిని ఇప్పటికీ నేనే

AP7AM02 Jun, 01:31 am
పెద్ది' వేదికపై మంత్రి కందుల దుర్గేశ్ కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా పరిశ్రమ అభివృద్ధికి తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని, పరిశ్రమకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ భరోసా ఇచ్చారు. విజయవాడలో జరిగిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తరపున చిత్ర పరిశ్రమకు ఈ హామీ ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. "ఏపీలో షూటింగ్‌లతో పాటు స్టూడియోలు, రికార్డింగ్ థియేటర్ల వంటి మౌలిక సదుపాయాలు నిర్మించేందుకు నిర్మాతలు ముందుకు రావాలి. వారికి సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇచ్చేందుకు మేం సిద్ధంగా ఉన్నాం" అని ఆయన పిలుపునిచ్చారు. దీనివల్ల స్థానిక ప్రతిభకు కూడా ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా 'పెద్ది' సినిమాపై మంత్రి ప్రశంసలు కురిపించారు. గ్లింప్స్, ట్రైలర్ చూస్తుంటే ఇదొక అద్భుతమైన దృశ్యకావ్యంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. "చెన్నైలో పుట్టి, హైదరాబాద్‌లో పెరిగినా... రామ్ చరణ్ ఈ రస్టిక్ పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయారు. నటన ఆయన నరనరాన ఉంది. రామ్ చరణ్, జాన్వి కపూర్‌ల జంట... అలనాటి చిరంజీవి, శ్రీదేవిల జంటను గుర్తు చేస్తోంది" అని అన్నారు. దర్శకుడు బుచ్చిబాబు తూర్పు గోదావరి జిల్లా వాసి కావడం గర్వంగా ఉందని, ఆయన ప్రతిభతో పాటు వినయం గొప్పదని అభినందించారు. ఈ సినిమా భారీ విజయం సాధించి, దీనిపై ఆధారపడిన వందలాది కుటుంబాలకు మేలు కలగాలని మంత్రి మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.

Entertainment News Keyword | Telugu Digital