translateexpand_more

Ram Charan Chennai News

Latest updates from Telugu Digital news sources.

AP7AM30 May, 04:13 pm
విజయ్ గారి పట్ల గర్విస్తున్నాను

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' చిత్రం ప్రమోషన్ల కోసం చెన్నైలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చెన్నైతో తనకున్న విడదీయరాని బంధాన్ని గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. తన కెరీర్, కొత్త సినిమా, సహనటులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రి, నటుడు విజయ్‌పై చేసిన ప్రశంసలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.చెన్నైతో విడదీయరాని బంధంచెన్నైకి వచ్చినప్పుడల్లా తనకు మాటలు రావని, ఒకరకమైన భావోద్వేగంలో ఉండిపోతానని రామ్ చరణ్ అన్నారు. "నేను పుట్టింది, పెరిగింది ఇక్కడే. మా అమ్మగారిది కూడా ఈ నగరమే. అందుకే చెన్నైకి వస్తే నా సొంత ఇంటికి వచ్చిన అనుభూతి కలుగుతుంది. మగధీర, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాల ప్రమోషన్లకు వచ్చినప్పుడు కూడా ఇదే ఫీలింగ్ కలిగింది" అని ఆయన తెలిపారు. వేదికపై ఉన్న ఎందరో లెజెండ్స్ ముందు మాట్లాడటం సంతోషంగా ఉందన్నారు.ఇది కష్టం కాదు.. ఇష్టంతో చేసిన సినిమాతన కొత్త సినిమా గురించి మాట్లాడుతూ, ఇది ఎంతో ఇష్టపడి, ప్రేమించి చేసిన చిత్రమని చరణ్ స్పష్టం చేశారు. "ఈ సినిమా కోసం మేమంతా రెండున్నరేళ్లుగా దాదాపు 285 రోజులు పనిచేశాం. కానీ మా దర్శకుడు బుచ్చిబాబు మాత్రం గత ఐదారేళ్లుగా ఈ కథపైనే జీవిస్తున్నారు. సుకుమార్ గారు నాకు బుచ్చిబాబు లాంటి అద్భుతమైన రైటర్‌ను పరిచయం చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు. ఈ చిత్రానికి ఏ.ఆర్. రెహమాన్ గారు సెంట్రల్ పిల్లర్ లాంటి వారు," అని వివరించారు. షూటింగ్ తర్వాత ప్రతిరోజూ ఇంటికి వెళ్లి సినిమా గురించి