translateexpand_more

Peddi Movie Bookings News

Latest updates from Telugu Digital news sources.

NTV Telugu03 Jun, 03:14 am
పెద్ది నైజాం బుకింగ్స్ ఓపెన్.. కానీ ఆ థియేటర్స్ ఇంకా పెండింగ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చి బాబు సన డైరెక్షన్ లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ. ఈ రోజు సాయంత్రం 8 గంటల షోస్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఏపీతో మిగిలిన అన్ని రాష్టాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ దూసుకెళ్తున్న పెద్ది నైజాం విషయంలో అనేక తర్జన భర్జన అనంతరం తెలంగాణ ప్రభుత్వం ‘పెద్ది’ సినిమాకు టికెట్స్ పెంచుతూ ప్రత్యేక జీవోను జారీ చేసింది. సినిమాపై ఉన్న విపరీతమైన అంచనాలకు తోడు తెలంగాణ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జీవో ఈ చిత్రానికి మరింత బూస్ట్‌ ఇచ్చింది. దీంతో నైజాం వ్యాప్తంగా బుకింగ్స్ ఓపెన్ చేసిన నిమిషాల్లోనే థియేటర్లు హౌస్‌ఫుల్ అవుతున్నాయి. ప్రభుత్వ జీవో ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సింగిల్ స్క్రీన్స్‌లో పది రోజుల పాటు రోజుకు 5 షోలు ప్రదర్శించుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనితో పాటు టికెట్ రేట్ల పెంపునకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ స్క్రీన్స్‌లో 100 రూపాయలు, మల్టిప్లెక్స్‌లలో 125 రూపాయలు అదనంగా పెంచుకునేందుకు వీలు కల్పించింది. ఇక ఈ రోజు ప్రదర్శించే స్పెషల్ ప్రిమియర్ షోల కోసం ఏకంగా 600 రూపాయల వరకు టికెట్ ధరలను అమ్ముకునేలా ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ప్రభుత్వ జీవో విడుదలైన వెంటనే నైజాం ఏరియాలో బుకింగ్స్ ఓపెన్ చేశారు. టికెట్లు ఆన్‌లైన్‌లోకి అలా వచ్చాయో లేదో.. ఇలా నిమిషాల వ్యవధిలోనే హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. మల్టిప్లెక్స్ చైన్ అయిన PVR బుకింగ్స్ ఇంకా ఓపెన్ కావాల్సి ఉంది. PVR లో కూడా బుకింగ్స్ ఓపెన్ అయితే మరింత జోరు కనిపించనుంది.

Peddi Movie Bookings News Keyword | Telugu Digital