translateexpand_more

Peddi Movie First Talk News

Latest updates from Telugu Digital news sources.

Zee Telugu03 Jun, 02:02 am
పెద్ది’ ముందు పెద్ద టార్గెట్.. రామ్ చరణ్ ఈ సారి గట్టిగా కొట్టాల్సిందే

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Ram Charan Peddi Target Business: గత కొన్నేళ్లుగా వేసవిలో పెద్ద సినిమాలు విడుదల తేదీలు ప్రకటిస్తున్నా.. అనుకున్న సమయానికి విడుదల కావడం లేదు. ఒకప్పుడు సమ్మర్ వస్తుందంటే పెద్ద సినిమాలు క్యూ కట్టేవి. కానీ గత నాలుగైదేళ్లుగా ఈ సీజన్‌లో బడా స్టార్ హీరోల సినిమాలేవి విడుదల కావడం లేదు. ఇక రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమా వేసవి సెలవులను టార్గెట్ చేస్తూ రంగంలోకి దిగింది. బుచ్చిబాబు సన కూడా తన గురువు సుకుమార్ బాటలో రామ్ చరణ్‌తో రంగస్థలం మాదిరే పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో ‘పెద్ది’ సినిమాను తెరకెక్కించాడు. అంతేకాదు ఈ సినిమా కోసం రామ్ చరణ్ తన లుక్‌ సహా పూర్తిగా ట్రాన్‌ఫామ్ అయ్యాడు. అంతేకాదు వస్తాదుగా హనుమంతుడిని పోలిన లుక్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా టికెట్ రేట్స్ పెంచుకోవడాకి ప్రత్యేక అనుమతులు మంజూరు చేశారు. మరోవైపు ‘పెద్ది’ కి పాజిటివ్ టాక్ వస్తే ఈ చిత్రాన్ని ఆపడం ఎవరి తరం కాదు. ఇప్పటికే ఈ సినిమా ప్రీ సేల్స్ కలిపి రూ. 30 కోట్ల గ్రాస్ వసూళ్లు దాటాయి. ఇక మొదటి రోజు ఈ సినిమా రూ. 120 కోట్ల గ్రాస్ నుంచి 150 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశాలున్నాయని ఈ సినిమా బుకింగ్స్ చూస్తే చెప్పవచ్చు. వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్.. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే.. తెలంగాణ (నైజాం) - రూ. 48 కోట్లు.. రాయలసీమ(సీడెడ్) - రూ. 24 కోట్లు.. ఉత్తరాంధ్ర - రూ. 18 కోట్లు ఉమ్మడి తూర్పు గోదావరి - రూ. 10.20 కోట్లు.. ఉమ్మడి పశ్చిమ గోదావరి - రూ. 8.25 కోట్లు.. ఉమ్మడి గుంటూరు - రూ.11.20 కోట్లు.. ఉమ్మడి కృష్ణా - రూ. 9.30 కోట్లు.. ఉమ్మడి నెల్లూరు - రూ. 6.30 కోట్లు.. తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ కలిపి రూ. 135.25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తెలుగు రాష్ట్రాల్లో చేసింది. కర్ణాటక - రూ. 17 కోట్లు.. తమిళనాడు - 5.25 కోట్లు.. కేరళ - రూ. 2 కోట్లు.. హిందీ + రెస్ట్ ఆఫ్ భారత్ కలిపి - రూ. 25 కోట్లు.. ఓవర్సీస్ - రూ. 34 కోట్లు.. ప్రపంచ వ్యాప్తంగా ‘పెద్ది’ సినిమా రూ. 218.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే బాక్సాఫీస్ దగ్గర రూ. 220కోట్ల షేర్ (రూ. 400 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టాలి. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం బ్రేక్ ఈవెన్ కావడం పెద్దికి పెద్ద విషయం కాదు. ఈ సినిమాతో రామ్ చరణ్ పవర్‌ఫుల్ కమ్ బ్యాక్ ఇస్తాడా లేదా అనేది చూడాలి. Also Read:Jr NTR Top Disaster Movies: జూనియ‌ర్ ఎన్టీఆర్ కెరీర్ లో స్పీడ్ బ్రేకర్స్ గా నిలిచిన టాప్ డిజాస్ట‌ర్ చిత్రాలు ఇవే.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Peddi Movie First Talk News Keyword | Telugu Digital