
Sumalatha Devi: బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో సుమలత దేవి ఫిర్యాదు
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్య సుమలత దేవి (Sumalatha Devi) ఫిర్యాదు చేశారు.
© 2026 telugu.digital

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్య సుమలత దేవి (Sumalatha Devi) ఫిర్యాదు చేశారు.

పంజాబ్ లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలో పోలీసులు భారీ డ్రగ్స్, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 47 కిలోల హెరాయిన్‌తో పాటు పిస్టళ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. దేశంలోకి చొరబడుతున్న మాదకద్రవ్యాల ముఠాలపై పోలీసుల నిఘా, కఠిన చర్యలకు ఇది తాజా ఉదాహరణ. ఈ ఘటన దేశ భద్రతకు, యువత భవిష్యత్తుకు పొంచి ఉన్న ముప్పును మరోసారి ఎత్తిచూపుతోంది.

Hadnoor Police Station | పోలీస్‌స్టేషన్‌లోనే ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. కౌన్సెలింగ్ ఇస్తుండగా కలకలం

Telangana Police Jobs: 7,437 పోస్టులకు బిగ్ అప్డేట్.. SI, కానిస్టేబుల్ పరీక్షలు ఎప్పుడంటే?

హైదరాబాద్‌లోని బేగంపేటలో క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్ హత్య కేసును హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. ప్యాసింజర్లుగా క్యాబ్ ఎక్కిన మహారాష్ట్రకు చెందిన ఓ దొంగల ముఠా ఈ హత్యకు పాల్పడినట్లు గుర్తించారు.

Hyderabad murder: A man was brutally attacked and killed inside a wine shop in Bandlaguda under Nagole police limits in Hyderabad. Assailants chased him with knives and axes. Police are investigating the motive and identifying the accused using CCTV. హైదరాబాద్ నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడలో వైన్ షాప్ లోపల ఒక వ్యక్తిని కత్తులు, వేటకొడవలతో దాడి చేసి హత్య చేశారు. బాధితుడు పారిపోయినా హంతక
Tirupati Police Advisory To Tirumala Devotees: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతి జిల్లా పోలీసులు భక్తుల్ని అలర్ట్ చేశారు. వదంతులు వ్యాప్తి చేయకూడదని.. సోషల్ మీడియాలో పోస్టుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తప్పుడు ప్రచారం చేసేవారు, వదంతులు వ్యాప్తి చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కేవలం టీటీడీ, పోలీసులు ఇచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలన్నారు. పోలీసు సిబ్బంది, టీటీడీ సూచనల్ని మాత్రమే పాటించాలన్నారు.

belagavi Shocking incident in Belagavi, Karnataka: A car driver was fined for not wearing a helmet. The aggrieved driver then drove to the police station while wearing a helmet—a video of the incident has gone viralకర్ణాటక బెలగావిలో షాకింగ్ ఘటన.. హెల్మెట్ ధరించలేదని కారు డ్రైవర్ కు జరిమానా.. హెల్మెట్ ధరించి కారు నడుపుతూ స్టేషన్ కు వెళ్లిన బాధితుడు.. వైరల్ వీడియో..

పదో తరగతి విద్యార్థిని అదృశ్యమైన కేసులో గుంటూరు జిల్లా పోలీసుల తీరుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసుల నిర్లక్ష్యంపై మండిపడిన ధర్మాసనం, "గుంటూరు జిల్లా పోలీసులు చాలా గ్రేట్" అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది.కేసు వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గత జూన్ నెలలో ఓ బాలిక ట్యూషన్‌కు వెళ్లి అదృశ్యమైంది. దీనిపై బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, మూడు నెలలు గడిచినా బాలిక ఆచూకీ లభించకపోవడంతో, ఆయన హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.బుధవారం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం, పోలీసుల పనితీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఆధునిక సాంకేతికత అందుబాటులో ఉన్నప్పటికీ ఒక బాలికను కనిపెట్టలేకపోవడం సిగ్గుచేటని అభిప్రాయపడింది. గతంలో సమాచార హక్కు చట్టం చీఫ్ కమిషనర్‌ను పోలీస్ స్టేషన్‌కు రాకుండా అడ్డుకున్న ఘటనను గుర్తుచేస్తూ, ఇలాంటి పోలీసులు ఉండటం ప్రభుత్వానికే సిగ్గుచేటని ఘాటు వ్యాఖ్యలు చేసింది.కేసు విచారణలో పోలీసులు సరైన స్ఫూర్తితో పనిచేయడం లేదని పేర్కొన్న కోర్టు, గురువారం నాటికల్లా బాలికను తమ ముందు హాజరుపరచాలని ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది

విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న నలుగురు పోలీసు అధికారుల బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో వారు మరికొంత కాలం జైలులోనే గడపాల్సి ఉంటుంది.ఈ కేసులో నిందితులుగా ఉన్న మాజీ సీఐ నాగరాజు (ఏ1), హెడ్ కానిస్టేబుల్ జంగం నాని (ఏ3), హెడ్ కానిస్టేబుల్ బాబురావు (ఏ5), సాంబయ్య (ఏ6) తమకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ విజయవాడలోని 8వ ఏడీజే కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన న్యాయస్థానం, నిందితుల అభ్యర్థనను తోసిపుచ్చుతూ వారి పిటిషన్లను కొట్టివేసింది.ప్రస్తుతం ఈ నలుగురు రిమాండ్ ఖైదీలుగా వేర్వేరు జైళ్లలో ఉన్నారు. సీఐ నాగరాజు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉండగా, జంగం నాని ఏలూరు సబ్ జైలులో, బాబురావు అవనిగడ్డ సబ్ జైలులో, సాంబయ్య గన్నవరం సబ్ జైలులో ఉన్నారు. తాజా తీర్పు నేపథ్యంలో వారంతా జైలుకే పరిమితం కానున్నారు. ఈ కేసులో తదుపరి విచారణ ఎలా సాగుతుందనే అంశంపై ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది

లేని భూమిని కాగితాల్లో సృష్టించిన రియల్ ముఠా డబ్బుతో అధికారులను ఏమార్చి.. నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసి.. వాటిని బ్యాంకుల్లో తనాఖా పెట్టి ఏకంగా రూ. 4.11 కోట్లు రుణం తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఏడుగురిని అరెస్టు చేసిన పోలీసులు.. బుధవారం సబ్ రిజిస్ట్రార్‌ను సైతం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. లేని భూమితో బ్యాంకు రుణాలు రూ.4.11 కోట్లు కొట్టేసి రియల్ వ్యాపారం హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): లేని భూమిని కాగితాల్లో సృష్టించిన రియల్ ముఠా డబ్బుతో అధికారులను ఏమార్చి.. నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసి.. వాటిని బ్యాంకుల్లో తనాఖా పెట్టి ఏకంగా రూ. 4.11 కోట్లు రుణం తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఏడుగురిని అరెస్టు చేసిన పోలీసులు.. బుధవారం సబ్ రిజిస్ట్రార్‌ను సైతం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఫిర్యాదు అందినా పట్టించుకోకుండా నిందితులకు సహకరించిన పోలీసులపైనా చర్యలు చేపట్టారు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై జవహర్‌నగర్ ఏసీపీ చక్రపాణి, కీసర సీఐ అంజనేయులతో కలిసి మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్ వివరాలు వెల్లడించారు... ప్రస్తుతం చంపాపేట ఎస్ఆర్వోగా ఉన్న మహ్మద్ యూసఫ్ రహమాన్ గతంలో కీసరలో సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేశారు. ఆ సమయంలో కొంతమంది రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఆయన్ను సంప్రదించారు. కేవలం కాగితాల్లోనే భూమిని సృష్టించి, వాటిని నిజమైన వ్యక్తులకు సంబంఽధించిన భూమి పత్రాలుగా రిజిస్ట్రేషన్ చేయించారు. అందుకుగాను సబ్ రిజిస్ట్రార్‌కు రూ. 5లక్షలు ముట్టజెప్పారు. తాను మంచివాడినని నిరూపించుకోవడానికి జరిగిన మోసంపై గతేడాది డిసెంబర్లో కీసర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే కేవలం కంప్లైంట్ రావడమే తప్ప.. ఈఎంఐల విషయంలో గానీ, ఆర్థిక లావాదేవీల గురించి గానీ, బ్యాంకు అధికారుల నుంచి కూడా సమస్యలు లేకపోవడంతో.. అప్పట్లో కొంతమంది పోలీసులు ఈ ముఠాకు సహకరించారు. కాగా ఇటీవల కీసర పోలీస్ స్టేషన్లో కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను ఇటీవల బాధ్యతలు

దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియాన్ మృతి కేసులో సీబీఐ దర్యాప్తునకు బాంబే హైకోర్టు బుధవారం ఆదేశించింది. ఈ కేసు దర్యాప్తులో ముంబై పోలీసులు... ముంబై, సెప్టెంబరు 2: దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియాన్ మృతి కేసులో సీబీఐ దర్యాప్తునకు బాంబే హైకోర్టు బుధవారం ఆదేశించింది. ఈ కేసు దర్యాప్తులో ముంబై పోలీసులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారని.. గత ఆరేళ్లుగా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీన్ని ప్రమాదవశాత్తు మరణంగా ఎలా పరిగణిస్తారని పోలీసులను ప్రశ్నించింది. వారి దర్యాప్తు తీరు చూస్తుంటే సమాధానాల కన్నా ఎక్కువ సందేహాలే వ్యక్తమవుతున్నాయని ఆక్షేపించింది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు అవసరమని పేర్కొంటూ 44 పేజీల తీర్పును వెలువరించింది. 2020 జూన్ 8న ముంబైలోని మలాడ్‌లో ఓ నివాస భవనం పైనుంచి పడి దిశా సాలియాన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆ తర్వాత వారం రోజులకే సుశాంత్‌సింగ్ తన ఇంట్లో మరణించడంతో.. ఈ రెండు ఘటనల మధ్య ఏదో సంబంధం ఉందంటూ తీవ్ర దుమారం రేగింది. ఈ నేపథ్యంలోనే తన కుమార్తెపై సామూహిక అత్యాచారం జరిపి హత్య చేశారంటూ కోర్టును ఆశ్రయించిన సతీశ్ సాలియాన్.. మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రేపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, సీబీఐ దర్యాప్తు చేపట్టాలని కోరారు. ఈ క్రమంలోనే సతీశ్ సాలియాన్ వాంగూల్మాన్ని నమోదు చేసి, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ బాంబే హైకోర్టు సీబీఐని ఆదేశించింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ

గుంటూరు జిల్లా పోలీసులపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీరియస్ అయింది. బాలిక మిస్సింగ్ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అమరావతి, సెప్టెంబర్ 2 (ఆంధ్రజ్యోతి): గుంటూరు జిల్లా పోలీసులపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (AP High Court) సీరియస్ అయింది. బాలిక మిస్సింగ్ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఈ రోజుల్లో పదో తరగతి విద్యార్థిని ఆచూకీ గుర్తించలేకపోయారంటే ఇంతకంటే సిగ్గుపడాల్సిన విషయం ఏముందని అభిప్రాయపడింది. ఏదైమైనా గుంటూరు జిల్లా పోలీసులు చాలా గ్రేట్ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. పోలీస్‌స్టేషన్‌కి రాకుండా ఇన్ఫర్మేషన్ చీఫ్ కమిషనర్‌ను అడ్డుకున్నారని హైకోర్టు చురకలంటించింది. ఇలాంటి పోలీసులు ఉండటం ఏపీ ప్రభుత్వానికి సిగ్గుచేటని ఘాటుగా న్యాయస్థానం వ్యాఖ్యానించింది. తన కుమార్తె ట్యూషన్‌కు వెళ్లి కనిపించకుండా పోయిందని జూన్‌లో పట్టాభిపురం పోలీసులకు ఓ వ్యక్తి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మూడు నెలలు అవుతున్న తన కుమార్తె ఆచూకీ గుర్తించడంలో పోలీసులు విఫలం అయ్యారని హైకోర్టులో ఆమె తండ్రి హెబీయస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయంపై ఈరోజు (బుధవారం) హైకోర్టులో విచారణ జరిగింది. పోలీసులు సరైన స్ఫూర్తితో వ్యవహరిస్తే.. బాలికను కనుగొనేందుకు ఇన్ని రోజులు ఎందుకు పడుతుందని ప్రశ్నించింది. రేపటి లోగా బాలికను కోర్టు ముందు హాజరుపరచాలని ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాను ఆదేశించింది. పిఠాపురం అభివృద్ధిపై పవన్ కల్యాణ్ స్పెషల్ ఫోకస్ సత్ఫలితాలిస్తున్న అక్షర ఆంధ్ర... సంపూర్ణ అక్షరాస్యత దిశగా అడుగులు వేస్తున్నాం: మంత్రి లోకేశ్ ఏపీలో ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర కరువు పరిస్థితులు: మంత్రి ఆనం

దేశంలో అతిపెద్ద జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ (LIC) 70వ వార్షికోత్సవం సందర్భంగా రెండు కొత్త జీవిత బీమా పథకాలను ప్రకటించింది. ఎల్ఐసీ బీమా ప్లాటినం (ప్లాన్ 770), ఎల్ఐసీ జీవన్ రక్ష (ప్లాన్ 894) పేరుతో వీటిని సంస్థ విడుదల చేసింది. ఎల్ఐసీ సీఈఓ, ఎండీ ఆర్. దొరైస్వామి ఈ కొత్త ప్లాన్లను ప్రారంభించారు. ఈ రెండు పాలసీలు సెప్టెంబర్ 7 నుంచి విక్రయానికి అందుబాటులోకి రానున్నాయి. బీమా ప్లాటినం (Plan 770)ను పొదుపు, జీవిత రక్షణ, భవిష్యత్ ఆదాయం కలిపిన పాలసీగా ఎల్ఐసీ రూపొందించింది. ఇది నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్ వ్యక్తిగత ప్లాన్. పరిమిత కాలంపాటు ప్రీమియం చెల్లించే విధానం ఇందులో ఉంటుంది. ఈ పాలసీలో ప్రీమియం చెల్లించే కాలంలో ప్రతి సంవత్సరం చెల్లించిన ప్రతి రూ.1,000 వార్షిక ప్రీమియానికి రూ.70 గ్యారెంటీడ్ అడిషన్ జమ అవుతుంది. ప్రీమియం చెల్లింపు కాలం పూర్తయిన ఐదో సంవత్సరం చివర్లో పాలసీదారు జీవించి ఉంటే బేసిక్ సమ్ అష్యూర్డ్‌లో 70 శాతానికి సమానమైన బూస్టర్ ఇన్కమ్ బెనిఫిట్ లభిస్తుంది. అంతేకాకుండా, పాలసీ పేఔట్ పీరియడ్‌లో ప్రతి సంవత్సరం బేసిక్ సమ్ అష్యూర్డ్‌లో 10 శాతం రెగ్యులర్ ఇన్కమ్ బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది. పేఔట్ పీరియడ్ అంటే పాలసీ కాలవ్యవధి నుంచి ప్రీమియం చెల్లించే కాలాన్ని మినహాయించిన తర్వాత మిగిలే కాలం. బీమా ప్లాటినంలో కనీస బేసిక్ సమ్ అష్యూర్డ్ రూ.3 లక్షలు. గరిష్ఠ పరిమితిని నిర్దిష్టంగా పేర్కొనలేదు. అయితే ఎల్ఐసీ బోర్డు ఆమోదించిన అండర్‌రైటింగ్ పాలసీ నిబంధనలు వర్తిస్తాయి. బీమా మొత్తాన్ని రూ.10,000 చొప్పున పెంచుకుంటూ ఎంచుకోవచ్చు. ప్రీమియం చెల్లింపు వ్యవధిని 7, 10, 12, 15 లేదా 18 సంవత్సరాలు ఎంచుకోవచ్చు. ఎంచుకున్న టర్మ్‌ను బట్టి ప్రవేశ వయసు కనీసం 30 రోజులు, గరిష్ఠంగా 55 సంవత్సరాల వరకు ఉంటుంది. గరిష్ఠ మెచ్యూరిటీ వయసు 75 సంవత్సరాల వరకు ఉండొచ్చు. అదనపు రక్షణ

ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. మాదాపూర్, రాయదుర్గం ప్రాంతాల్లో రోడ్లు, ట్రాఫిక్ నిర్వహణ, కనెక్టివిటీపై ఐఏఎల్ఏ (IALA) రెండో అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ట్రాఫిక్ విభాగం జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సున్‌ప్రీత్ సింగ్ పలు కీలక సూచనలు చేశారు. ఐటీ కారిడార్‌లో రద్దీని తగ్గించడంతో పాటు వాహనదారులు, పాదచారుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఐటీ కారిడార్‌లో యుటిలిటీ పనుల కోసం తరచూ రోడ్లను తవ్వుతున్నప్పటికీ.. పనులు పూర్తైన తర్వాత రోడ్లను సక్రమంగా, నాణ్యతతో పునరుద్ధరించడం లేదని ట్రాఫిక్ అధికారులు గుర్తించారు. దీంతో రోడ్లు unevenగా మారి ప్రమాదాలకు అవకాశం పెరుగుతోందని తెలిపారు. యుటిలిటీ పనులు పూర్తైన వెంటనే సంబంధిత సంస్థలు రోడ్లను సకాలంలో నాణ్యతతో పునరుద్ధరించాలని సూచించారు. మరోవైపు ఓలా, ఉబర్ వాహనాల అనియంత్రిత పార్కింగ్ కూడా ట్రాఫిక్ రద్దీకి కారణమవుతోందని అధికారులు తెలిపారు. ఉద్యోగులను పికప్, డ్రాప్ చేసే సమయంలో రోడ్లపై వాహనాలు గుమిగూడకుండా ఐటీ సంస్థలు, ప్రధాన సంస్థలు తమ ప్రాంగణాల్లోనే పికప్, డ్రాప్ ప్రాంతాలతో పాటు ఓలా, ఉబర్ వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ లేదా హోల్డింగ్ ఏరియాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఐటీ కారిడార్‌లో రోడ్ల అభివృద్ధి, కనెక్టివిటీపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. ప్రతిపాదిత రోడ్డు అభివృద్ధి ప్రణాళికను పరిశీలించిన ట్రాఫిక్ అధికారులు.. రహదారుల అనుసంధానం, ట్రాఫిక్ ప్రవాహం, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. ఫ్రీ లెఫ్ట్‌లు, జంక్షన్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించారు. అవసరమైన ప్రాంతాలను గుర్తించి ఫ్రీ లెఫ్ట్ మార్గాలను ఏర్పాటు చేయడంతో పాటు జంక్షన్లలో ఛానలైజేషన్, రోడ్డు జ్యామెట్రీలో మార్పులు చేపట్టాలని సూచించారు. దీంతో జంక్షన్ల వద్ద వాహనాల వేచి ఉండే సమయం తగ్గి ట్రాఫిక్ మరింత సాఫీగా సాగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. అలాగే రోడ్డు

హైదరాబాద్ శంషాబాద్‌లో నకిలీ కరెన్సీ తయారు చేస్తున్న ముఠా గుట్టును శంషాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ఈ వ్యవహారంలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. హైదరాబాద్: నకిలీ కరెన్సీ తయారు చేసి చలామణి చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను శంషాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి సుమారు రూ.2.90 లక్షల విలువైన నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద నుంచి నకిలీ నోట్లతో పాటు వాటి తయారీకి ఉపయోగించిన పరికరాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు నకిలీ నోట్లను ఎక్కడ తయారు చేస్తున్నారు? ఎలా చలామణి చేస్తున్నారు? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ముఠా వెనుక మరికొందరు ఉన్నారా? నకిలీ కరెన్సీ తయారీకి అవసరమైన సామగ్రిని ఎక్కడి నుంచి సమకూర్చుకున్నారు? అనే కోణాల్లోనూ విచారణ కొనసాగుతోంది. మైనారిటీ మహిళల ఆర్థిక సాధికారతకు పెద్దపీట: మంత్రి అజహరుద్దీన్ సైబరాబాద్ పరిధిలో 10 మంది నకిలీ డాక్టర్ల అరెస్ట్

మొన్న సాదిక్‌ఖాన్.. నేడు గౌస్ మోహిద్దీన్.. కాకినాడలో లవ్ జిహాద్ కేసులు కలకలం రేపుతున్నాయి. సాదిక్‌ఖాన్ అరాచకాలతో ఓ ఫ్యామిలీ బలైతే.. ఇప్పుడు గౌస్ మోహిద్దీన్ బాధితులు బయటకొచ్చారు. గౌస్ మొహిద్దీన్ అనే వ్యక్తి ప్రేమ, పెళ్లి పేరుతో మతం మార్చి మోసం చేశాడంటూ కాకినాడ ఎస్పీకి ఓ మహిళ ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. కాకినాడ జిల్లాలో లవ్ జిహాద్ కేసులు పెరుగుతున్నాయి. సాదిక్‌ఖాన్ కేసు మరువక ముందే.. గౌస్ మొహిద్దీన్ కేసు తెరపైకి వచ్చింది. ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ గౌస్ మొహిద్దీన్ అనే వ్యక్తిపై బాల రమ్యశ్రీ అనే మహిళ కాకినాడ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. జగన్నాధపురానికి చెందిన గౌస్ మొహిద్దీన్ తనను 8 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని తెలిపింది. ప్రేమ పేరుతో దగ్గరై, పెళ్లి చేసుకున్న తర్వాత.. మతం మార్చి చిత్రహింసలకు గురి చేశాడని కంప్లైంట్లో పేర్కొంది. ఒత్తిడి చేసి మతం మారేలా చేశాడని బాధితురాలు ఆరోపించింది. అంతేకాదు.. తనతో పాటు మరో ఐదుగురిని కూడా ఇలాగే మోసం చేసినట్టు ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో లవ్ జిహాద్ల వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది. ప్రేమ పేరుతో గౌస్ మొహిద్దీన్ పలువురు యువతులను మోసం చేశాడని బాధితురాలు తెలిపింది. ఒకరికి తెలియకుండా మరొకర్ని ట్రాప్ చేసి, వారితో సహజీవనం చేశాడని బాల రమ్యశ్రీ ఆరోపించింది. తనను ముస్లిం సంప్రదాయంలో వివాహం చేసుకున్న తర్వాత వేధింపులకు గురిచేశాడని వెల్లడించింది. ఎన్నోసార్లు తప్పించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ.. తనను.. తమ కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది. గౌస్ మోహిద్దీన్‌పై ఇప్పటికే ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో ఆ కేసులో ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నాడని.. ఇదే అదను భావించి తమ తల్లిదండ్రుల దగ్గరకు వచ్చానని బాధితురాలు చెప్పింది. అయితే.. గౌస్ మొహిద్దీన్ నుంచి తనకు రక్షణ కల్పించి, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాకినాడ ఎస్పీని కోరినట్టు తెలిపింది. “జలం… జీవం

విజయవాడ గాదె సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో అరెస్టయిన నలుగురు పోలీసు అధికారులకు కోర్టులో చుక్కెదురైంది. సీఐ నాగరాజుతో పాటు మరో ముగ్గురు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కోర్టు డిస్మిస్ చేసింది. విజయవాడ: గాదె సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో అరెస్టయిన నలుగురు పోలీసు అధికారుల బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న A1 సీఐ నాగరాజు, A3 హెడ్ కానిస్టేబుల్ జంగం నాని, A5 హెడ్ కానిస్టేబుల్ బాబురావు, A6 సాంబయ్య దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కోర్టు డిస్మిస్ చేసింది. సాయి కృష్ణ లాకప్ డెత్‌కు సంబంధించిన కేసులో పోలీసులు నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం A1 సీఐ నాగరాజు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. A3 జంగం నాని ఏలూరు సబ్ జైలులో, A5 బాబురావు అవనిగడ్డ సబ్ జైలులో, A6 సాంబయ్య గన్నవరం సబ్ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. తమకు బెయిల్ మంజూరు చేయాలని నలుగురు నిందితులు కోర్టును ఆశ్రయించగా.. విచారణ అనంతరం వారి పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. దీంతో నలుగురూ ప్రస్తుతం జైల్లోనే కొనసాగనున్నారు. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో తదుపరి విచారణపై ఉత్కంఠ నెలకొంది. గొడ్డలి పార్టీ అన్నింట్లోనూ క్రెడిట్ చోరీకి యత్నిస్తోంది: సీఎం చంద్రబాబు రైతులను అడ్డం పెట్టుకుని డ్రామాలు ఆడొద్దు: ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి

హైదరాబాద్ నగర పరిధిలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ డాక్టర్ల దందాపై సైబరాబాద్ పోలీసులు దాడులు చేశారు. అర్హత లేకపోయినా వైద్యుల అవతారమెత్తి క్లినిక్‌లు నడుపుతున్న 10 మంది ఫేక్ డాక్టర్లను అరెస్ట్ చేశారు. హైదరాబాద్, సెప్టెంబర్ 1: నగరంలో అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ డాక్టర్ల దందాపై సైబరాబాద్ పోలీసులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అర్హత లేకపోయినా వైద్యుల అవతారమెత్తి క్లినిక్‌లు నడుపుతున్న 10 మంది ఫేక్ డాక్టర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (SOT), వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఈ మెరుపు దాడుల వివరాలను కుత్బుల్లాపూర్ జోన్ డీసీపీ కోటి రెడ్డి వెల్లడించారు. ఏకకాలంలో దాడులు.. 10 ఫేక్ క్లినిక్‌ల సీజ్ మేడ్చల్ - మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని పలు ప్రాంతాల్లో నకిలీ క్లినిక్‌ల దందా విచ్చలవిడిగా సాగుతోందన్న పక్కా సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. పేట్ బషీరాబాద్, మేడ్చల్, జగద్గిరిగుట్ట, సూరారం, పటాన్ చెరు, ఆర్సీ పురం తదితర పోలీసు స్టేషన్ల పరిధిలో ఏకకాలంలో దాడులు నిర్వహించి, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 10 నకిలీ క్లినిక్‌లను సీజ్ చేశారు. టెన్త్, బీకామ్ చదివి.. సెలైన్లు ఎక్కిస్తూ! టెన్త్, ఇంటర్, బీకామ్ వంటి చదువులు మాత్రమే చదివిన ఈ కేటుగాళ్లు, ఎలాంటి కనీస మెడికల్ నాలెడ్జ్ లేదా గుర్తింపు పొందిన డిగ్రీలు లేకుండానే క్లినిక్‌లు తెరిచి ప్రాక్టీస్ చేస్తున్నారని విచారణలో తేలింది. చిన్నపిల్లలకు వైద్యం: ఎలాంటి అర్హత లేకున్నా క్లినిక్‌లలో ఏకంగా బెడ్లు ఏర్పాటు చేసి, అమాయక రోగులకు, చిన్నపిల్లలకు వైద్యం అందిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సిరంజీలు, సెలైన్ల వాడకం: తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో వచ్చే పేషెంట్లకు ఎడాపెడా సెలైన్లు, ఐవీ ఫ్లూయిడ్స్ (IV Fluids) ఎక్కిస్తూ ప్రాణాలపైకి తెస్తున్నారని పోలీసులు తెలిపారు. సామగ్రి సీజ్: దాడుల సమయంలో ఈ క్లినిక్‌ల నుంచి పెద్ద ఎత్తున బీపీ మిషన్లు, స్టెతస్కోప్‌లు

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్యలను అధిగమించడానికి ప్రత్యేక క్యారేజ్‌వేల ఏర్పాటుకు పోలీసు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ట్రాఫిక్ కష్టాలు దూరం చేసేందుకు ప్రయత్నాలు హైదరాబాద్ సిటీ: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్యలను అధిగమించడానికి ప్రత్యేక క్యారేజ్‌వేల ఏర్పాటుకు పోలీసు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. దీని వల్ల వాహనాలు సులభంగా వెళ్లడానికి వీలవుతుందని భావిస్తున్నారు. ఈ మేరకు సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ సన్‌ప్రీత్‌సింగ్, ట్రాఫిక్ డీసీపీ సంక్రాంతి రవికుమార్, అదపు డీసీపీ జి.హనుమంతరావు, మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ కె.చంద్రశేఖర్ రెడ్డి పలు ప్రాంతాల్లో మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముఖ్యంగా ప్రజా రవాణాకు ప్రాధాన్యత ఇవ్వడం, యూటర్న్లు, జంక్షన్ల ఆప్టిమైజేషన్ ద్వారా ట్రాఫిక్ ఆలస్యాన్ని తగ్గించడంపై ప్రత్యేక దృష్టి సారించారు. కేపీహెచ్‌బీ, మాదాపూర్ ట్రాఫిక్ పోలీస్స్టేషన్ల పరిధిలోని జేఎన్టీయూ నుంచి సింక్రోనీ (రాయదుర్గం) మెట్రోస్టేషన్ మార్గంలో రద్దీ ఎక్కువగా ఉండడంతో ఇక్కడ ప్రత్యేక క్యారేజ్‌వే ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. చర్లపల్లి-తిరుచానూరు మధ్య 2 ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్: వరుస వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు ఇన్స్పెక్టర్ను నియమించడంలో తాత్సారం జరుగుతుంది. వారం రోజులు గడుస్తోన్నా ఇన్స్పెక్టర్ నియామకంలో ఉన్నతాధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఏ అధికారి వచ్చినా 10 వారాలు కూడా ఉండకుండా సస్పెన్షన్లకు గురవుతుండడంతో ఈసారి ఎస్‌హెచ్‌వో నియామకంలో మరింత పారదర్శకత ఉండేలా చేపట్టాలని యోచిస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నివాసముండే పరిధి ఠాణాలోనే వరుస వివాదాలు చోటుచేసుకుంటుండడంపై ఉన్నతాధికారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నివాసంతో పాటు సీఎం క్యాంప్ కార్యాలయ కిందికి వచ్చే ఈ పోలీస్‌స్టేషన్‌లో ఇన్స్పెక్టర్లు విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యాన్ని కనబరుస్తుండడంతో పాటు అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ పోలీసు శాఖకే మచ్చతెచ్చారు. దీంతో ఇటీవల లైంగిక వేధింపుల కేసులో ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌రెడ్డిని సస్పెండ్ చేసి, ఆయన స్థానంలో ముత్తుయాదవ్ను నియమించారు. ఆయన కూడా విధి నిర్వహణలో తీవ్ర నిరక్ష్యాన్ని కనబరచడమే కాకుండా మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌పై చర్యలు తీసుకోవడంలోనూ, ఆయనను అరెస్టు చేయడంలోనూ అశ్రద్ధ వహించారు. బాధితులకు న్యాయం చేయకుండా నిందితులు పారిపోవడానికి ఆస్కారం కలిగించారనే ఆరోపణలతో గత నెల 25న ముత్తుయాదవ్‌పై వేటుపడింది. అప్పటి నుంచి ఇక్కడ ఇన్స్పెక్టర్ను నియమించడానికి ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. జల్లెడపడుతున్న నిఘా వర్గాలు సీఎం రేవంత్‌రెడ్డి నివాసం ఉండే ఈ ఠాణాకు సమర్ధుడైన ఇన్స్పెక్టర్ను నియమించాలని, ఆ స్థాయి అధికారి కోసం నిఘా వర్గాలు జల్లెడపడుతున్నాయి. అటు ఇంటెలిజెన్స్, ఇటు ఎస్బీ ఈ ఠాణాకు ఇన్స్పెక్టర్ను నియమించడంలో కీలకపాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎప్పటిలాగే ఇన్స్పెక్టర్ నియామకంలో పాత్ర ఉండే అధికారులను పక్కనబెట్టి ఈసారి గుర్తించిన ఉన్నతాధికారుల ప్రమేయంతో ఈ పోస్టును భర్తీ చేయాలని యోచిస్తున్నారు. అందుకే నియామకంలో ఆలస్యం జరుగుతుందని పేర్కొంటున్నారు. దగ్గరపడుతున్న వినాయక చవితి వేడుకలు వినాయక చవితి వేడుకలు దగ్గర పడుతుండడంతో జూబ్లీహిల్స్ ఠాణాకు ఇంకా ఇన్స్పెక్టర్ను నియమించకపోవడంతో వినాయక మండపాల కమిటీ ప్రతినిధుల సమావేశాలు, మైత్రి

Karimnagar: పోగొట్టుకున్న ఫోన్‌ను బాధితుడికి అందించిన కరీంనగర్ పోలీసులు! Karimnagar: కరీంనగర్ రూరల్, దుర్షేడ్ గ్రామానికి చెందిన కొల్లూరి అంజయ్య అనునతడు గత సంవత్సరం కరీంనగర్ రూరల్ మండలం దుర్షేడ్ లో తన యొక్క ఐక్యు సెల్ ఫోన్ పోగొట్టుకొనగా కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినాడు. పోలీసులు సి.ఈ.ఐ.ఆర్ టెక్నాలజీ సహాయంతో పోగొట్టుకున్న సెల్ ఫోన్ ను ట్రేస్ చేసి పెద్దపల్లి లో పట్టుకోవడం జరిగింది. అట్టి ఫోను యజమాని అయిన కొల్లూరి అంజయ్య కు ఇన్స్పెక్టర్ ఏ.నిరంజన్ రెడ్డి సెల్ ఫోను ను అందజేశారు. సెల్ ఫోన్ ను ట్రేస్ చేయడంలో కృషి చేసిన టెక్ టీం కానిస్టేబుల్ చిట్యాల రాంసాయి మరియు ఫైజాన్ లను సిఐ ఏ. నిరంజన్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా సీఐ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఎవరు కూడా విలువైన వస్తువులను అజాగ్రత్తగా పర వేసుకోకూడదని జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. పొరపాటున అజాగ్రత్తగా ఏదైనా విలువగల వస్తువులను పోగొట్టుకొనిన, దొంగిలించబడ్డ వెంటనే పోలీసులకు సమాచారం అందించి ఫిర్యాదు చేయాలని తెలిపారు

నగరంలోని చందానగర్‌లో భారీగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లను ఆర్సీ పురం ఎస్ఓటి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తనిఖీలు చేపట్టగా.. ఈ ఇంజెక్షన్లతో ఇద్దరు వ్యక్తులు దొరికారు. హైదరాబాద్: నగరంలోని చందానగర్‌లో భారీగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లను ఆర్సీ పురం ఎస్ఓటి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు చందానగర్ పీజేఆర్ స్టేడియం వద్ద చేపట్టిన తనిఖీల్లో స్టెరాయిడ్ ఇంజెక్షన్లతో ఇద్దరు వ్యక్తులు పోలీసులకు చిక్కారు. వారి నుంచి రూ. లక్ష విలువ చేసే ఈ ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకుని, నిందితులిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చట్టవిరుద్ధంగా స్టెరాయిడ్లు విక్రయిస్తున్న వీరిని సరసాయి రామ్, కుంచాల రవీంద్రలగా గుర్తించారు. నిందితుల దగ్గర మెఫెంటెరమైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు (Wofen 10ml) ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఇద్దరి మధ్య లావాదేవీలు అన్నీ ఆన్లైన్ పేమెంట్స్ ద్వారానే జరిగినట్లు వెల్లడించారు. అయితే ఈ విక్రయాల్లో వినియోగదారులుగా ఉన్న దీపక్, సాయి ప్రసాద్, షకీల్, కిషోర్, నితీష్ అనే మరో ఐదుగురు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది

తెలంగాణ జానపద కళారంగంలో ఎంతో ప్రజాదరణ పొందిన జానపద నటులు, డ్యాన్సర్లు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ ల వ్యవహారం ఇప్పుడు సంచలన మలుపు తిరిగింది. సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన వేములవాడ హోటల్ రూమ్ ఘటన తర్వాత, ఈ వివాదం కాస్తా క్రిమినల్ కేసు వైపు వెళ్ళింది. హైదరాబాద్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో మాధురి రాథోడ్ తన ఫిర్యాదులో 'ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి పెళ్లి చేసుకుంటానని నమ్మించి, నాతో శారీరక సంబంధం పెట్టుకుని తీవ్రంగా మోసం చేసాడు. కేవలం మోసం చేయడమే కాకుండా, నా పరువుకి భంగం కలిగించేలా ప్రవర్తించాడు. నా వ్యక్తిగత ఫోన్లో ఉన్న దృశ్యాలు, వీడియోలని ఉపయోగించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత ద్వారా మార్ఫింగ్ వీడియోలని సృష్టించాడు. నాకు ఇతరులతో అక్రమ సంబంధాలు ఉన్నట్లు చిత్రీకరిస్తూ ఆ ఏఐ మార్ఫింగ్ వీడియోలని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసి తీవ్ర మనోవేదనకి గురిచేశాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఫిర్యాదులోని అంశాలని పరిశీలించిన పోలీసులు, ఈశ్వర్ సాయిపై నూతన భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 69 కింద కేసు నమోదు చేశారు. మోసపూరిత వాగ్దానాలు, పెళ్లి చేసుకుంటాననే నెపంతో శారీరక సంబంధం పెట్టుకోవడం వంటి నేరాల కింద ఈ సెక్షన్ వర్తిస్తుంది. ఇది నాన్-బెయిలబుల్ అఫెన్స్ కావడంతో ఈ వ్యవహారం మరింత తీవ్రరూపం దాల్చింది. ఈశ్వర్ సాయి ప్రస్తుతం పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నట్లు సమాచారం. అతడిని పట్టుకునేందుకు నార్సింగి పోలీసులు రెండు ప్రత్యేక పోలీసు బృందాలని రంగంలోకి దించి జల్లెడ పడుతున్నారు. ఆగస్టు నెలలో వేములవాడలోని ఒక లాడ్జి లేదా హోటల్ గదిలో ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్‌లు కలిసి ఉన్న సమయంలో, ఈశ్వర్ సాయి భార్య శరణ్య అక్కడికి చేరుకోవడంతోవివాదం మొదలైన విషయం తెలిసిందే. టాక్సిక్ కి షాకింగ్ రేటింగ్ ఇచ్చిన మహేష్ కుమారుడు గౌతమ్ 'పుష్ప'లో చీరకట్టుపై అల్లు అర్జున్ షాకింగ్

హైదరాబాద్ రాయదుర్గంలో సోమవారం తెల్లవారుజామున ఒక ఘోరమైన హిట్ అండ్ రన్ ప్రమాదం చోటుచేసుకుంది. ఓఆర్ఆర్ రోటరీ నుంచి ఖాజాగూడ గ్రామం వైపు వెళ్లే ప్రధాన రహదారిపై వేగంగా వచ్చిన ఇన్నోవా కారు కాలినడకన వెళ్తున్న నందులాల్ అనే వ్యక్తిని బలంగా ఢీకొట్టింది. ఈ తీవ్రమైన ఘటనలో నందులాల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ప్రమాదాన్ని చూసి సహాయం చేయడానికి పరుగెత్తుకు వచ్చిన జైద్ షా కాద్రి అనే విద్యార్థి కూడా అదే వాహనం తగలడంతో తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి కారును నిలపకుండా అక్కడి నుండి వేగంగా పరారయ్యాడు. ఈ హిట్ అండ్ రన్ ఘటనపై కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు వెంటనే దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రమాదానికి కారణమైన ఇన్నోవా వాహనాన్ని నడిపినది ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్, టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద్ సాయి కుమారుడు సందీప్‌గా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. దీంతో పోలీసులు వేగంగా స్పందించి సందీప్‌ను అరెస్ట్ చేసి, ప్రమాదానికి వాడిన కారును తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆనంద్ సాయి తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందడమే కాకుండా యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. 2024 లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీటీడీ ట్రస్ట్ బోర్డులో జనసేన నామినీగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ప్రమాద సమయంలో వాహనం ఏ వేగంతో వెళ్తోంది, డ్రైవర్ మద్యం సేవించి ఉన్నారా లేదా అనే అంశాలపై పోలీసులు తీవ్రంగా విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా, గాయపడిన విద్యార్థి జైద్ షా కాద్రిని స్థానికులు తక్షణమే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ విద్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, అతని ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెలువడాల్సి ఉంది. మరోవైపు ప్రాణాలు కోల్పోయిన నందులాల్ కుటుంబ నేపథ్యం, ఇతర వివరాలను సేకరించే పనిలో పోలీసులు

Suryapet: సూర్యాపేటలో 'సైబర్ వారియర్స్' కు ప్రత్యేక శిక్షణ & సమీక్ష! ఈ వార్తకు సంబంధించిన

ఉమ్మడి ఏపీ విభజన తర్వాత తొలిసారిగా పోలీసు స్పోర్ట్ మీట్ జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా వ్యాఖ్యానించారు. పోలీసు ఉద్యోగం చేసేవారు 24 గంటలూ అలర్ట్‌గా ఉండాలని ఆదేశించారు. అమరావతి, సెప్టెంబర్ 1 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఏపీ విభజన తర్వాత తొలిసారిగా పోలీసు స్పోర్ట్ మీట్ జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా (AP DGP Harish Kumar Gupta) వ్యాఖ్యానించారు. పోలీసు ఉద్యోగం చేసేవారు 24 గంటలూ అలర్ట్‌గా ఉండాలని ఆదేశించారు. పోలీసు ఉద్యోగం నిత్యం అనేక సవాళ్లతో కూడుకున్న పని అని తెలిపారు. ఏపీ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్‌ను డీజీపీ ఈరోజు (మంగళవారం) ప్రారంభించి, మాట్లాడారు. పోలీసులకు క్రీడల పట్ల కూడా అంత ఆసక్తి కనబరిచే సమయం ఉండదని.. కానీ క్రీడల వల్ల మెంటల్, ఫిజికల్ ఫిట్నెస్ వస్తోందని వివరించారు. ఇప్పుడు ఇలా అందరూ కలిసి క్రీడల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని డీజీపీ చెప్పారు. ఇక్కడ పోటీల్లో గెలవాలని చాలా కష్టపడతారని, ఆలోచన చేస్తారని అన్నారు. ఇదే విధంగా విధుల్లో కూడా అనేక సవాళ్లను ఎదుర్కొని ఆయా కేసులు చేధించేలా పని చేయాలని దిశానిర్దేశం చేశారు. నిత్యం క్రీడలు ఆడటం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని వివరించారు. పోలీసులు వృత్తి రీత్యా ఎంత బిజీగా ఉన్నా... క్రీడల్లో రాణించేలా పాల్గొనాలని సూచించారు. ఏపీ పోలీసులకు క్రీడల్లో జాతీయ స్థాయిలో గుర్తింపు ఉందని డీజీపీ కొనియాడారు. గతంలో అనేక పతకాలు వచ్చినా, భవిష్యత్తులో రాష్ట్ర పోలీసులు సాధించే విజయాలతో ఏపీకి క్రీడల్లో మరింత గుర్తింపు రావాలని సూచించారు. యువత కూడా చదువు, ఉద్యోగాలతో పాటు క్రీడల్లో రాణించాలని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా పిలుపునిచ్చారు. జగన్ హయాంలో వెలిగొండ ప్రాజెక్ట్‌కు గ్రహణం పట్టింది: సీఎం చంద్రబాబు పవన్ కల్యాణ్ ఆదేశాలు.. ఏపీలో పర్యావరణ పరిరక్షణకు స్పెషల్ డ్రైవ్ రోశయ్య స్ఫూర్తితో యువత రాజకీయాల్లోకి రావాలి: మంత్రి లోకేశ్
యూట్యూబ్‌లో జానపద గీతాలతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ‘ప్రమీల ఓ ప్రమీల’, ‘బాసింగ బలాలే’ వంటి పాపులర్ ఫోక్ సాంగ్స్‌తో గుర్తింపు పొందిన ఈశ్వర్ సాయి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకుని మోసం చేశాడంటూ తోటి డ్యాన్సర్ మాధురి రాథోడ్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన నార్సింగి పోలీసులు ఈశ్వర్ సాయిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.ఈ వివాదం కొద్దిరోజుల క్రితం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మొదలైంది. ఇప్పటికే వివాహమై ఒక బాబు ఉన్న ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్‌తో కలిసి వేములవాడలోని ఒక హోటల్ గదిలో ఉండగా.. ఆయన భార్య శరణ్య అక్కడికి చేరుకుని వారిద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ సమయంలో ఇరువర్గాల మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదం, గొడవకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఆ తర్వాత యూట్యూబ్ ఇంటర్వ్యూలు, సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకుంటూ వివరణలు ఇచ్చే ప్రయత్నం చేశారు.* నా కెరీర్లో 'మోస్ట్ ఆల్ఫా' మూమెంట్ అదే... 'పుష్ప 2'లో లేడీ గెటప్‌పై బన్నీ ఓపెన్ కామెంట్స్ఇటీవల ఈ వివాదం మరింత ముదిరి నార్సింగి పోలీస్ స్టేషన్‌కు చేరింది. ఈశ్వర్ సాయి పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని, నమ్మించి మోసం చేశాడని మాధురి రాథోడ్ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ఏఐ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ మార్ఫింగ్ చేసిన నకిలీ వీడియోలు సృష్టించి సోషల్ మీడియాలో తన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నాడని, డిజిటల్ వేధింపులకు గురిచేస్తున్నాడని ఆమె ఆరోపించారు.* వెండితెరపై తమ్ముళ్లతో రొమాన్స్.. నిజ జీవితంలో అన్నలకు జోడీగా... హీరోయిన్ల క్రేజీ లవ్ స్టోరీస్మాధురి రాథోడ్ చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును
Nepal Floods Missing Indians 2026 : నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో చెలరేగిన వినాశకర ప్రళయం అంతులేని శోకాన్ని మిగుల్చింది. ఈ ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య వెయ్యి దాటగా.. 4,471 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. గల్లంతైన వారిలో కైలాస మానససరోవర యాత్రకు వెళ్లిన 275 మంది భారత పౌరులతో పాటు మరొక 128 మంది భారత సంతతి వ్యక్తులు ఉన్నారని విదేశాంగ శాఖ వెల్లడించింది. రోజురోజుకూ నదుల్లో మృతదేహాలు కొట్టుకొస్తుండటంతో నేపాల్ శవాగారాలన్నీ నిండిపోయి, మృతదేహాలను భద్రపరచడం, గుర్తించడం అధికారులకు అత్యంత సంక్లిష్టంగా మారింది. గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేసేందుకు నేపాల్ ప్రభుత్వం బాధితుల వివరాలతో పవర్ పాయింట్ స్లైడ్షోలను కూడా సిద్ధం చేసింది.మృతదేహాల అప్పగింతకు 9 అంచెల ప్రక్రియ..ఈ విపత్కర పరిస్థితిలో మృతుల కుటుంబాలకు సహాయం అందించేందుకు ఖాఠ్మాండులోని భారత రాయబార కార్యాలయం ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. నేపాల్ ప్రభుత్వం వెబ్సైట్లో విడుదల చేస్తున్న ఫోటోలు, వివరాల ద్వారా మృతదేహాలను గుర్తించిన పక్షంలో.. భౌతికకాయాలను స్వదేశానికి తరలించేందుకు స్థానిక అధికారులతో సమన్వయం చేస్తామని ఎంబసీ తెలిపింది. దీనికోసం నేపాల్ ప్రభుత్వం రూపొందించిన 9 అంచెల నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా మృతదేహ అవశేషాల డాక్యుమెంటేషన్, లభ్యమైన ఫోటోలు, వివరాలను నమోదు చేయాలి. అలాగే పోస్టుమార్టం నిర్వహణ, మరణానికి గల కారణాల నిర్ధారణ, అధికారికంగా వ్యక్తి గుర్తింపు, వేలిముద్రలు, డీఎన్ఏ, ఫోరెన్సిక్ శాంపిళ్ల సేకరణ, మృతుడి పాస్‌పోర్ట్ లేదా ఐడీ వెరిఫికేషన్, ఎంబసీ లేదా కాన్సులర్ సమన్వయ ప్రక్రియ పూర్తి, హ్యాండోవర్ మెమో, రసీదుల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.అయితే వీటిని గుర్తించడానికి బాధితుల మొదటి శ్రేణి బంధువుల డీఎన్ఏ పోలిక తప్పనిసరి. బంధువులు తమ డిఎన్ఏ ప్రొఫైళ్లను dnacodis@nepalpolice.gov.np కి ఇమెయిల్ చేయవచ్చని లేదా నేరుగా రక్త నమూనాలను అందించవచ్చని సూచించారు. భారత ఎంబసీ సాయం కోసం కూడా ఈ వివరాలను eoikathmandufloodsupport@gmail.com కి కాపీ

తెలంగాణ జానపద పాటలు, డాన్స్ షోలతో విపరీతమైన ప్రజాదరణ పొందిన బాసింగ బలాలు ఫేమ్, ప్రముఖ ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయి చట్టపరమైన చిక్కుల్లో పడ్డాడు. వెండితెర, బుల్లితెరపై తన స్టెప్పులతో గుర్తింపు తెచ్చుకున్న అతడి అసలు స్వరూపం బయటపడటంతో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, శారీరకంగా వాడుకొని, తీరా సమయం వచ్చేసరికి ముఖం చాటేసి మోసం చేశాడంటూ అతడితో పాటు డాన్స్ చేసే తోటి కళాకారిణి మాధురి రాథోడ్ పోలీసులను ఆశ్రయించింది.బాధితురాలు మాధురి రాథోడ్ తెలిపిన వివరాల ప్రకారం.. వీరిద్దరి మధ్య జానపద పాటల షూటింగ్‌లు, సోషల్ మీడియా రీల్స్ చేసే క్రమంలో పరిచయం ఏర్పడింది. బాసింగ బలాలు పాటతో పాటు మరికొన్ని ప్రాజెక్టులలో ఇద్దరూ కలిసి నటించడంతో ఆ పరిచయం కాస్తా చొరవగా మారింది. ఆ తర్వాత మాధురిపై ప్రేమ పేరిట వల విసిరిన ఈశ్వర్ సాయి, ఆమెను పెళ్లి చేసుకుంటానని బలంగా నమ్మించాడు. అతడి మాటలను నిజమని నమ్మిన మాధురి, అతడితో సహజీవనానికి సైతం అంగీకరించింది.సహజీవనం.. ఆపై బెదిరింపులు!పెళ్లి చేసుకుంటాననే నెపంతో ఈశ్వర్ సాయి ఆమెను పలుమార్లు శారీరకంగా వాడుకున్నాడు. అయితే, కొంతకాలంగా పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా తప్పించు తిరగడం ప్రారంభించాడు. అనుమానం వచ్చి గట్టిగా నిలదీయగా.. పెళ్లి చేసుకునేది లేదని తెగేసి చెప్పడమే కాకుండా, ఈ విషయం బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని, కెరీర్ నాశనం చేస్తానని బెదిరింపులకు దిగాడు. దీంతో మోసపోయానని గ్రహించిన మాధురి రాథోడ్ నార్సింగి పోలీస్ స్టేషన్లో ఈశ్వర్ సాయిపై అధికారికంగా ఫిర్యాదు చేసింది. అందుకే అర్ధరాత్రి మాధురి రూమ్ కు వెళ్లాను: అసలు నిజం బయటపెట్టిన ఫోక్ యాక్టర్ ఈశ్వర్ సాయిపోలీసుల కేసు నమోదు.. నిందితుడి కోసం గాలింపు!బాధితురాలి ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు ఈశ్వర్ సాయిపై సెక్సువల్ అబ్యూస్, మోసం, బెదిరింపుల కింద కేసు నమోదు చేశారు. పోలీసుల విచారణ ముమ్మరం కావడంతో

Anakapalle: నర్సీపట్నంలో విచిత్ర చోరీ: వెండి వస్తువులతో పాటు భోజనం కూడా! Anakapalle: అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో విచిత్రమైన చోరీ ఘటన వెలుగు చూసింది. స్థానికులు, బాధితుల వివరాల మేరకు.. గ్రంధి వెంకట కృష్ణ దంపతులు ఇంట్లోలేని సమయంలో దొంగ చొరబడ్డారు. 10 తులాల వెండి వస్తువులను అపహరించాడు. వంట గదిలోకి వెళ్లి కుక్కర్లోని అన్నం, పెరుగు తినేశాడు. ఇంటికి వచ్చిన బాధితులు చోరీ జరిగిందని గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశారు.... మొత్తానికి ఇంటికి కన్నం వేయడమే కాకుండా తాపీ గా భోజనం చేసి వెళ్లడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది

ఆర్మీ కాంపౌండ్‌లో ఆయుధాల చోరీ నాలుగు ఏకే-47 రైఫిళ్లు మాయం రంగంలోకి దిగిన బొల్లారం పోలీసులు Madras Regiment Incident: సికింద్రాబాద్‌లోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే మద్రాస్ రెజిమెంట్(Madras Regiment Incident) ప్రాంతంలో సంచలన ఘటన వెలుగు చూసింది. ప్రహరీ గోడలు, మూడంచెల భద్రత, సీసీ కెమెరాల నిఘా ఉండే ఆర్మీ కాంపౌండ్‌లోకి చొరబడిన దుండగులు ఆయుధాల గది తాళాలు పగలగొట్టి ఏకంగా 12 అత్యాధునిక ఆయుధాలను అపహరించడం తీవ్ర ఆందోళనకు దారితీసింది. చోరీకి గురైన వాటిలో నాలుగు ఏకే-47 రైఫిళ్లు, ఒక ఇన్సాస్ రైఫిల్, ఆరు పిస్టళ్లతో పాటు భారీగా మందుగుండు సామగ్రి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఆర్మీ అధికారులు బొల్లారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. HYDRAA Ranganath: హైకోర్టును ఆశ్రయించిన హైడ్రా రంగనాథ్.. సింగిల్ జడ్జ్ తీర్పుపై సవాల్.. విచారణపై తీవ్ర ఉత్కంఠ సీసీ ఫుటేజ్ పరిశీలన, లోపలి వ్యక్తుల ప్రమేయంపై అనుమానాలు: రక్షణ రంగానికి చెందిన సున్నితమైన అంశం కావడంతో పోలీసులు వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతూ వేగంగా శోధిస్తున్నారు. ఆయుధాల బరువు, పరిమాణం దృష్ట్యా ఈ చోరీలో ఒకరి కంటే ఎక్కువ మంది పాల్గొని ఉంటారని, ఆర్మీ కాంపౌండ్ లోపలి వ్యక్తుల సహకారం ఉందా అనే కోణంలోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిబ్బందితో పాటు ఇటీవల లోపలికి వచ్చి వెళ్లిన వారి వివరాలు, సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరోవైపు ఆయుధాలు నిజంగానే చోరీ అయ్యాయా లేక రికార్డుల్లో తేడాల వల్ల మిస్సింగ్‌గా కనిపిస్తున్నాయా అనే కోణంలోనూ ఆర్మీ స్టాక్ రిజిస్టర్లను తనిఖీ చేస్తున్నారు

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. Eshwar Sai Missing: ఫోక్ డాన్సర్ 'భాసింగ బలాలు' ఫేమ్ ఈశ్వర్ సాయి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, శారీరకంగా వాడుకొని మోసం చేశాడని తోటి కళాకారిణి మాధురి రాథోడ్ ఫిర్యాదు చేశారు. దీంతో నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆయన పరారయ్యారు. వేములవాడలోని ఒక హోటల్లో ఈశ్వర్ సాయి, మాధురి కలిసి ఉండగా, భార్య వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో ఆయన తప్పించుకున్నారు. అతని కోసం పోలీసులు రెండు బృందాలుగా గాలిస్తున్నారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోలీసులు అతని ఆచూకీ కోసం దర్యాప్తు ముమ్మరం చేశారు. దీంతో నార్సింగి పోలీసులు రెండు ప్రత్యేక బృందాలుగా దర్యాప్తును వేగవంతం చేశారు. గత నెల 22న మాధురి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేస్తూ, తనపై, తన కుటుంబ సభ్యులతో కలిసి దాడి చేశారని పేర్కొన్నారు. అప్పటి నుండి ఈశ్వర్ సాయి పరారీలో ఉన్నట్లు సమాచారం. మాధురి, ఈశ్వర్ సాయికి చాలా కాలంగా సన్నిహితంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే, వేములవాడలోని ఒక హోటల్లో ఈశ్వర్ సాయి భార్య శరణ్య, వారిద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రేమ పేరుతో తనను వంచించి మోసం చేశారని మాధురి ఫిర్యాదు చేశారు. దీంతో నార్సింగి పోలీసులు సెక్షన్ 69 BNS ప్రకారం, పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకొని మోసం చేసినందుకు ఈ కేసు నమోదు చేశారు. పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అయితే, హోటల్ నుండి పరారైన ఈశ్వర్ సాయి ఇప్పటి వరకు ఎవరికీ అందుబాటులో లేడని పోలీసులు చెబుతున్నారు. ఈశ్వర్ సాయిని వెంటనే

టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న కాలంలో.. వినూత్న ఆవిష్కరణలు, ప్రయోగాలు నిత్యకృత్యంగా మారాయి. అయితే కొత్తదనం ఎంత ఆసక్తికరంగా ఉన్నా.. భద్రత విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ఊహించని పరిణామాలు తప్పవు. పాకిస్థాన్‌లో జరిగిన ఈ ఘటన అందుకు ఓ ఉదాహరణ. పాకిస్తాన్లో టెక్నాలజీ ప్రయోగం కాస్తా.. పోలీస్ వ్యాన్‌ను ఢీకొట్టే ఘటనగా మారింది. ఇంటర్నెట్ కనెక్షన్ ఒక్కసారిగా తెగిపోవడంతో రిమోట్ కంట్రోల్‌తో నడుస్తున్న ఓ ఆటోమేటిక్ కారు అదుపు తప్పి నేరుగా పోలీస్ వ్యాన్‌ను ఢీకొట్టింది. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని డీ-చౌక్ వద్ద జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయి నవ్వులు పూయిస్తోంది. ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెక్నాలజీని ప్రదర్శిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడి జర్నలిస్టు మహ్మద్ ఆలిజా కారులో ముందు సీట్లో కూర్చొని దాని ప్రత్యేకతలను వివరిస్తున్నారు. అబ్బొట్టాబాద్కు చెందిన టెక్నాలజీ ఔత్సాహికుడు ఇహ్సాన్ జాఫర్ రూపొందించిన ఈ ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెక్నాలజీపై రిపోర్టు చేసేందుకు తాను అక్కడికి వెళ్లినట్లు ఆలిజా వెల్లడించారు. కారు ముందుకు కదులుతుండగా.. ఒక్కసారిగా రిమోట్ ద్వారా నియంత్రించే స్టీరింగ్ స్పందించడం ఆపేసింది. పరిస్థితిని గమనించిన ఆలిజా వెంటనే హ్యాండ్‌బ్రేక్ వేసేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. కారు వేగంగా ముందుకు దూసుకెళ్లి అక్కడే ఉన్న పోలీస్ వ్యాన్‌ను ఢీకొట్టింది. కనెక్షన్ కట్.. కారు కంట్రోల్ ఔట్! ఈ కారును ఇంటర్నెట్, శాటిలైట్ కనెక్షన్ల సాయంతో రిమోట్‌గా నియంత్రిస్తున్నట్లు ఆలిజా తెలిపారు. అయితే ప్రయోగం జరుగుతున్న సమయంలో ఇంటర్నెట్ కనెక్షన్ తెగిపోవడంతో కారు నియంత్రణ కోల్పోయిందని చెప్పారు. అదృష్టవశాత్తూ ఘటన జరిగిన సమయంలో అక్కడ ట్రాఫిక్ తక్కువగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. అదే కారు రద్దీగా ఉండే రోడ్డుపై అదుపు తప్పి ఉంటే పరిస్థితి తీవ్రంగా ఉండేదని ఆలిజా పేర్కొన్నారు. అయితే పోలీసులు ఎలా స్పందించారో అనేది మాత్రం ఆయన వివరించలేదు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్

ఎటు చూసినా తుపాకులతో కాపలా కాసే బలగాలు.. రెప్పపాటు కాలం కూడా కన్ను మూయని నిఘా నేత్రాలు.. సాధారణ పౌరుడు అడుగు పెట్టాలన్నా వేల ప్రశ్నలు ఎదురయ్యే అత్యంత కట్టుదిట్టమైన మిలిటరీ జోన్! అలాంటి హైదరాబాద్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని మద్రాస్ రెజిమెంట్ స్థావరంలో ఎవరూ ఊహించని దిగ్భ్రాంతికర ఘటన వెలుగు చూసింది. శత్రువుల గుండెల్లో నిద్రపోయే ఆర్మీ అధికారుల స్థావరంలో చొరబడిన కొందరు కళ్లుచేదిరే చోరీకి ఒడిగట్టారు. పకడ్బందీ భద్రత ఉండే ఆయుధాగారంలోకే జొరబడి ఏకంగా 12 ప్రమాదకర తుపాకులను మాయం చేయడం ఇప్పుడు రక్షణ రంగాన్ని షాక్‌కు గురిచేస్తోంది.ఏకే-47లతో సహా ఆయుధాలు గాయబ్!ఈ చోరీ సాదాసీదాగా జరగలేదు. అతికొద్ది మందికి మాత్రమే ప్రవేశం ఉండే వెపన్స్ స్టోర్ రూమ్ తలుపుల తాళాలను అత్యంత చాకచక్యంగా పగలగొట్టారు. క్షణాల వ్యవధిలో 4 అత్యాధునిక ఏకే-47 రైఫిళ్లు, 6 పిస్టళ్లు, ఒక ఇన్సాస్ (INSAS) రైఫిల్‌తో పాటు మరో కీలక తుపాకీని ఊడ్చేశారు. వాటితో పాటు వాటిలోకి వాడే బుల్లెట్లను కూడా పట్టుకెళ్లారు. పొద్దున్నే డిపో తెరిచి చూసిన సైనిక సిబ్బందికి ఖాళీగా ఉన్న స్టాండ్లను చూసి దిమ్మతిరిగిపోయింది. ఆర్మీ స్థావరంలోనే ఈ స్థాయిలో ఆయుధాలు మాయమవ్వడం జాతీయ స్థాయిలో తీవ్ర కలకలం రేపుతోంది.AK 203: ఆర్మీని శాసించబోతున్న షేర్ గన్, నిమిషానికి 700 రౌండ్ల ఫైరింగ్లోపలి స్కెచ్ లేకపోతే సాధ్యమేనా?ఈ దారుణం వెనుక అసలు మాస్టర్‌మైండ్ ఎవరు? అనే ప్రశ్న ఇప్పుడు ప్రతీ ఒక్కరిని వేధిస్తోంది. ఆర్మీ కాంపౌండ్ చుట్టూ ఉండే ఎత్తైన గోడలు, భద్రతా గేట్లు, నిరంతరం తిరిగే పెట్రోలింగ్ టీమ్‌లను దాటుకుని బయటి వ్యక్తులు రావడం దాదాపు అసాధ్యం. అసలు ఆయుధాల గది ఎక్కడ ఉంది? తాళాలు ఎవరి వద్ద ఉంటాయి? సిబ్బంది ఏ సమయంలో మారతారు? అనే పక్కా సమాచారం ఉన్న లోపలి వ్యక్తుల హస్తం లేకుండా ఈ ఆపరేషన్ సాధ్యం కాదని విచారణ అధికారులు బలంగా అనుమానిస్తున్నారు

నేపాల్‌లోని రసువా జిల్లాలో ఇటీవల సంభవించిన వరదల్లో మరణించిన విదేశీ పౌరుల మృతదేహాలను గుర్తించి, వారి బంధువులకు అప్పగించే ప్రక్రియకు సంబంధించిన వివరాలను నేపాల్ అధికారులు విడుదల చేశారని ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాతే మృతదేహాలను అప్పగిస్తారని స్పష్టం చేసింది.నేపాల్ ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం.. మొదట మృతదేహాలకు సంబంధించిన పూర్తి వివరాలను నమోదు చేస్తారు. ఫొటోలు తీసి, పోస్టుమార్టం నిర్వహించి మరణానికి గల కారణాలను ధ్రువీకరిస్తారు. అనంతరం పాస్‌పోర్ట్, వేలిముద్రలు, డీఎన్ఏ వంటి ఫోరెన్సిక్ నమూనాల ఆధారంగా మృతుల గుర్తింపును అధికారికంగా నిర్ధారిస్తారు. ఈ ప్రక్రియ మొత్తం సంబంధిత దేశాల రాయబార కార్యాలయాల సమన్వయంతో జరుగుతుందని, చివరగా హ్యాండోవర్ మెమోపై సంతకాలు తీసుకుని మృతదేహాలను అప్పగిస్తారని ఎంబసీ వివరించింది.నేపాల్ పోలీస్ వెబ్సైట్లో ఉంచిన మృతుల ఫొటోలు, వివరాల ఆధారంగా బంధువులు ఎవరైనా గుర్తిస్తే, తదుపరి ప్రక్రియల కోసం స్థానిక అధికారులతో సమన్వయం చేసేందుకు ఖాట్మండులోని రాయబార కార్యాలయ అధికారులు సహాయం అందిస్తారని ప్రకటనలో పేర్కొన్నారు.అయితే, ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఇప్పటికే పెద్ద సంఖ్యలో మృతదేహాలకు తాత్కాలికంగా ఖననం చేసినట్లు నేపాల్ అధికారులు తెలిపారు. ఇలాంటి మృతదేహాలను గుర్తించాలంటే, మృతుల సమీప బంధువులతో డీఎన్ఏ సరిపోల్చడం తప్పనిసరి అని భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. ఇందుకోసం బంధువులు తమ డీఎన్ఏ ప్రొఫైళ్లను `dnacodis@nepalpolice.gov.np` లేదా `eoikathmandufloodsupport@gmail.com` అనే ఈమెయిల్ ఐడీలకు పంపవచ్చు. లేదంటే నేరుగా రక్త నమూనాలు కూడా ఇవ్వొచ్చని సూచించింది.సహాయం కోసం

Kankipadu: కంకిపాడులో పోలీసుల కాల్పుల కలకలం క్లూస్ టీమ్ విస్తృత తనిఖీలు ఈ వార్తకు సంబంధించిన

హత్యాయత్నం కేసు నమోదు చేయడంలో జాప్యం వహించిన పోలీసులపై తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని వీఆర్‌కు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు. రాజమండ్రి, సెప్టెంబర్ 01: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు పోలీసులపై తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని వీఆర్‌కు పంపుతూ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. రాజమండ్రి శివారులోని కోరుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల మహిళపై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనపై నాలుగు రోజులు ఆలస్యంగా పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. అవి జిల్లా ఎస్పీ దృష్టికి వెళ్లాయి. దాంతో ఈ కేసు నమోదు వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు పోలీసులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఎస్పీ నరసింహ కిషోర్ నిర్ణయించారు. అందులో భాగంగా వారిని వీఆర్‌కు పంపారు. కోరుకొండ ఎస్ఐ రమేశ్, రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి అవుట్ పోస్ట్ ఏఎస్ఐ శ్రీదేవితోపాటు హెడ్ కానిస్టేబుళ్లు లక్ష్మణ్, నాగమల్లేశ్వరరావును వీఆర్‌కు పంపుతూ తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. ప్రేమ పేరుతో మోసం.. బలవంతంగా పెళ్లి: కాకినాడ ఎస్పీకి మహిళ ఫిర్యాదు తిరుపతి విమానాశ్రయంలో విమాన వేళల్లో మార్పులు.. ప్రయాణికులకు బిగ్ అలర్ట్

కానిస్టేబుల్‌పై కత్తితో దాడి చేసిన నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారు. నిన్న రాత్రి కృష్ణాజిల్లా కంకిపాడు వద్ద నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు యత్నించారు. విజయవాడ, సెప్టెంబర్ 1: కానిస్టేబుల్‌పై కత్తితో దాడి చేసిన నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారు. నిన్న(సోమవారం) రాత్రి కృష్ణాజిల్లా కంకిపాడు వద్ద నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు యత్నించారు. అయితే పోలీసులపై రాళ్లు రువ్వుతూ, కత్తితో దాడి చేసేందుకు యత్నించడంతో నిందితుడిపై సీఐ కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. నిన్న తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల సమీపంలోని దేవరపల్లిలో పోలీస్ కానిస్టేబుల్‌పై యువకుడు కత్తితో దాడి చేయడం కలకలం రేపింది. పెట్రోలింగ్ విధుల్లో భాగంగా జాతీయ రహదారిపై తనిఖీలు చేపట్టగా.. అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు వ్యక్తులను కానిస్టేబుల్ గమనించాడు. వారి వద్ద ఉన్న బ్యాగులో ఏముందని ప్రశ్నిస్తుండగా.. ఇద్దరు యువకుల్లో ఓ వ్యక్తి అకస్మాత్తుగా తన వద్ద ఉన్న కత్తితో కానిస్టేబుల్‌పై దాడి చేశారు.. ఆపై నిందితులు ఇద్దరూ బైక్‌పై పరారయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గాయపడిన కానిస్టేబుల్‌ను ఆస్పత్రికి తరలించారు. నిందితుల కోసం గాలించగా కంకిపాడు వద్ద ఉన్నట్లు తెలుసుకున్న సీఐ, కానిస్టేబుల్ శ్రీనివాస్.. రాత్రి 11 గంటల సమయంలో అక్కడకు వెళ్లారు. నిందితుడు అవినాధ్ను పట్టుకునేందుకు ప్రయత్నించగా.. సీఐ, కానిస్టేబుల్‌పై రాళ్లు రువ్వడంతో పాటు కత్తితో దాడి చేశాడు. కానిస్టేబుల్ శ్రీనివాస్ ఛాతిలో కత్తితో పొడవంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అప్రమత్తమైన సీఐ.. అవినాధ్ కాళ్లపై కాల్పులు జరిపారు. ఆపై గాయపడిన యువకుడిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు అవినాధ్.. పెనమలూరు గ్రామ వాసిగా గుర్తించారు. ప్రస్తుతం కానిస్టేబుల్ శ్రీనివాస్, నిందితుడు అవినాధ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తిరుపతి విమానాశ్రయంలో విమాన వేళల్లో మార్పులు.. ప్రయాణికులకు బిగ్ అలర్ట్ ఎన్ని అడ్డంకులు వచ్చినా స్థానిక ఎన్నికలు జరగడం ఖాయం: మంత్రి నారాయణ

Amadalavalasa: ఫ్రెండ్లీ పోలీసింగే లక్ష్యం ఆమదాలవలసలో 'పల్లె నిద్ర'! Amadalavalasa: శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు ఆమదాలవలస నియోజకవర్గం బొబ్బిలి పేట గ్రామంలో డిఎస్పి వివేకానంద పల్లె నిద్ర' కార్యక్రమం చేపట్టారు. ప్రజలతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలు, సూచనలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె నిద్ర కార్యక్రమంతో ప్రజలకు పోలీసు వ్యవస్థపై నమ్మకాన్ని కలిగిస్తున్నామన్నారు. నేరాల నియంత్రణ, ప్రజల సహకారంతో పోలీసింగ్ ను మరింత బలోపేతం చేయడమే పల్లె నిద్ర ప్రధాన లక్ష్యమని అన్నారు. గ్రామాల్లో చిన్న చిన్న గొడవలు పెద్ద నేరాలుగాను, శాంతిభద్రతల సమస్యగా మారే అవకాశముందని, ఇలాంటి అంశాలను క్షేత్ర స్థాయిలో గుర్తించి, చర్యలు చేపడుతున్నామన్నారు. పోలీసు స్టేషన్లుకు వెళ్ళకుండానే వారి సమస్యలను నేరుగా పోలీసు అధికారులకు తెలిపేందుకు 'పల్లెనిద్ర' ఒక వేదికగా నిలుస్తుందన్నారు. క్షేత్ర స్థాయిలో ప్రజలతో మమేకమై, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విషయాలను, గ్రామంలో వివిధ రాజకీయ పార్టీల మధ్యగల విభేదాలను, భూతగాదాలను క్షేత్ర స్థాయిలో గుర్తించి, శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నం కాకుండా చూసేందుకు, ప్రజలకు రక్షణగా నిలిచే చట్టాలు, సైబరు మోసాలు, మహిళలు, రహదారి భద్రతపట్ల అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని వారు తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను తెలుసుకోవడానికే పల్లె నిద్ర కార్యక్రమం చేపట్టినట్లు ఆమదాలవలస సీఐ సన్యాసి నాయుడు నాయుడు అన్నారు. సోమవారం రాత్రి చీమలవలస గ్రామంలో ఆయన పర్యటించారు. ఆయన మాట్లాడుతూ పల్లెనిద్ర' కార్యక్రమం అనేది ప్రజలకు చేరువగా ఉంటూ వారి సమస్యలను తెలుసుకునే లక్ష్యంతో అధికారులు చేపడుతున్న ఒక కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా పోలీస్ అధికారులు గ్రామాలలో పర్యటించి, గ్రామస్థులతో సమావేశాలు నిర్వహిస్తారు. అలాగే గ్రామాల్లో రాత్రి బస చేసిన సీఐ స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. గ్రామాల్లో శాంతిభద్రతల పరిస్థితి, అసాంఘిక కార్యకలాపాలు, మద్యం, గంజాయి తదితర అంశాలపై ఆరా తీశారు. ప్రజలు ఎలాంటి సమస్యలు

నెల్లూరు నగరంలో రౌడీషీటర్ దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితులను అరెస్ట్ చేశారు. నెల్లూరు, సెప్టెంబర్ 01: నగరంలోని దారుణ హత్యకు గురైన రౌడీషీటర్ లక్ష్మీశెట్టి సాయితేజ హత్య కేసుని పోలీసులు ఛేదించారు. ఈ హత్యకు స్నేహితుల మధ్య పాత గొడవలు, విభేదాలే కారణమని తేల్చారు. వీరంతా మద్యం సేవించే సమయంలో సాయితేజ తలపై బండరాయితో కొట్టి హత్య చేసినట్లు వారు ఒప్పుకున్నారు. ఈ హత్య కేసులో మొత్తం 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొందరు పరారీలో ఉన్నట్లు గుర్తించారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు వివరించారు. ఈ సంఘటన స్థలంలో లభించిన ఆధారాలు, సైబర్ టెక్నాలజీ, సీసీటీవీ ఫూటేజీతోపాటు అనుమానితుల కదలికలపై నిఘాతో నిందితులను వెంటనే పట్టుకున్నామని పోలీసులు వెల్లడించారు. కేవలం 24 గంటల్లో ఈ కేసు ఛేదించిన డీఎస్పీలు గిరిధర్, జి. శ్రీనివాసరావు, సీఐ సీతారామయ్యతోపాటు సిబ్బందిని నెల్లూరు జిల్లా ఎస్పీ అజితా వెజెండ్ల అభినందించారు. శాంతిభద్రతలకి విఘాతం కలిగించినా, నేరాలకి పాల్పడినా ఎవరినీ ఉపేక్షించబోమని జిల్లా ప్రజలను ఈ సందర్భంగా ఎస్పీ హెచ్చరించారు. నగరంలోని స్థానిక ఆర్టీవో కార్యాలయం సమీపంలో రౌడీ షీటర్ లక్ష్మీశెట్టి సాయితేజ ఆదివారం అర్ధరాత్రి హత్యకు గురయ్యాడు. ఈ హత్యపై సమాచారం అందుకున్న డీఎస్పీలు ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాలను పోలీసులు జల్లెడ పట్టారు

కాక్రోచ్ జనతా పార్టీ సెప్టెంబర్ 5న ఇండియా గేట్ నుండి ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు నిర్వహించనున్న మార్చ్‌పై ఎలాంటి ఆంక్షలు విధించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ప్రస్తుతానికి దేశ రాజధానిలో ఏదైనా అనర్థం జరుగుతుందని భావించేందుకు ఎలాంటి తగిన కారణాలు లేవని ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. రాజ్యాంగబద్ధంగా అందరూ శాంతియుతంగా ప్రవర్తిస్తారని ఊహిస్తున్నామని వెల్లడించిన ఉన్నత న్యాయస్థానం, శాంతిభద్రతలను కాపాడే బాధ్యత పూర్తిగా ప్రభుత్వం మరియు పోలీసులదేనని తేల్చిచెప్పింది. ఢిల్లీలో శాంతిభద్రతల నిర్వహణకు సంబంధించి దాఖలైన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం ఈ సంచలన ఆదేశాలను జారీ చేసింది. ఈ వివాదం వెనుక సుదీర్ఘమైన విద్యార్థి పోరాటం మరియు నెరవేరని హామీల నేపథ్యం దాగి ఉంది. మొదట సాటిరికల్ ఆన్లైన్ ప్లాట్‌ఫాంగా ప్రారంభమైన సిజెపి, నీట్ పేపర్ లీక్, రీ-టెస్ట్ వివాదాలు మరియు విద్యార్థుల ఆత్మహత్యల తర్వాత తీవ్రమైన ఉద్యమ రూపం దాల్చింది. జంతర్ మంతర్‌లో సుదీర్ఘంగా 36 రోజుల పాటు నిరసనలు చేపట్టిన అనంతరం, జూలై 25న కేంద్ర ప్రభుత్వంతో జరిగిన చర్చల ఫలితంగా ఉద్యమాన్ని తాత్కాలికంగా ఉపసంహరించుకున్నారు. నిరసనకారులపై నమోదైన ఎఫ్ఐఆర్లను ఉపసంహరించుకుంటామని, బాధిత కుటుంబాలకు పరిహారం అందిస్తామని ప్రభుత్వం అప్పట్లో హామీ ఇచ్చినట్లు సిజెపి ప్రతినిధులు వెల్లడించారు. దింతో ఒక నెల గడిచినా ప్రభుత్వం తన హామీలను నెరవేర్చకుండా సాంకేతిక అంశాల వెనుక దాక్కుంటోందని సిజెపి ఆగస్టు 24న తీవ్ర ఆరోపణలు చేసింది. ఇదిలా ఉండగా రిటైర్డ్ ఢిల్లీ పోలీస్ అధికారి రాజేంద్ర సింగ్ సుప్రీం కోర్టును ఆశ్రయిస్తూ, లుటియన్స్ ఢిల్లీలోని ఇండియా గేట్, సెంట్రల్ విస్తా వంటి సున్నిత ప్రాంతాల్లో ముందస్తు అనుమతి లేని నిరసనలను నిషేధించాలని పిటిషన్ వేశారు. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో జరగనున్న బ్రిక్స్ సమ్మిట్ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ ఊరేగింపులను వాయిదా వేయాలని ఆయన కోరారు. ఢిల్లీ పోలీసులు కూడా ఇప్పటివరకు సిజెపి నుంచి అనుమతి

Vem Narender Reddy: మహబూబాబాద్‌లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీస్ ఉద్యోగాల ఉచిత శిక్షణ శిబిరంలో రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే మార్చి నాటికి రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించారు. అలాగే వారానికి ఒక ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని వేం నరేందర్ రెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించి నిరుద్యోగులకు వరుసగా అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. వచ్చే డిసెంబర్లో మరోసారి పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆయన ప్రకటించారు. పోలీస్ ఉద్యోగాల భర్తీని మూడు విడతల్లో చేపట్టనున్నట్లు తెలిపారు. పోలీస్ శాఖలో ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తమ ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రజలకు వివరించడంలో వెనుకంజలో ఉందని వేం నరేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో తమవాళ్లు కొంత వెనుకబడ్డారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించిన అనేక ప్రశ్నపత్రాల లీకేజీలు జరిగాయని ఆయన గుర్తు చేశారు. చివరకు జిరాక్స్ సెంటర్లలో కూడా ప్రశ్నపత్రాలు లభించే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ప్రస్తుతం ఉద్యోగ నియామక ప్రక్రియలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు

కదులుతున్న బస్సులో ఇంటర్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం అఘాయిత్యానికి పాల్పడిన కండక్టర్, డ్రైవర్ తల్లి చీవాట్లతో అలిగి బంధువుల ఇంటికి బయల్దేరిన యూపీకి చెందిన విద్యార్థిని గమ్యస్థానానికి ముందే బస్సు దిగిన బాలిక మాయమాటలు నమ్మి మరో బస్సులోకి.. దాంట్లోనే దారుణం.. నిందితుల అరెస్టు ఆగస్టు 4న ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి ఢిల్లీలో నర్సరీ చదివే చిన్నారిపై పాఠశాల బస్సు డ్రైవర్ లైంగికదాడి న్యూఢిల్లీ, ఆగస్టు 31: దేశ రాజధాని ఢిల్లీలో మరో ‘నిర్భయ’ తరహా దారుణం చోటుచేసుకుంది. 16 ఏళ్ల ఓ బాలికపై ఇద్దరు దుండగులు నడుస్తున్న బస్సులో లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆగస్టు 4వ తేదీన జరిగినప్పటికీ.. వివరాలు సోమవారం వెల్లడయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురికి చెందిన 11వ తరగతి విద్యార్థిని.. తల్లి తిట్టిందన్న కోపంతో ఇల్లు వదిలి, ఢిల్లీ శివార్లలోని నోయిడా సెక్టార్ 63లో ఉండే తమ బంధువుల ఇంటికి బస్సులో బయల్దేరింది. చీకటి, దానికితోడు వర్షం కురుస్తుండటంతో ఆ బాలిక తాను దిగాల్సిన ప్రాంతాన్ని గుర్తించలేక, రాత్రి 9 గంటల సమయంలో సెక్టార్ 63 చేరుకోకముందే బస్సు నుంచి దిగేసింది. అక్కడి నుంచి వాళ్ల బంధువుల ఇల్లు మరో 25 కి.మీ.ల దూరం ఉండటంతో.. ఎలా వెళ్లాలా అని ఆలోచిస్తూ అక్కడే ఉండిపోయింది. ఇంతలో ఓ స్లీపర్ బస్సు వచ్చి ఆమె ముందు ఆగింది. దాంట్లో ఉన్న కండక్టర్ తాము నోయిడా సెక్టార్ 63 వైపే వెళ్తున్నామని చెప్పటంతో, ఆ బాలిక బస్సు ఎక్కింది. బస్సులో డ్రైవర్, కండక్టర్ తప్ప ఎవరూ లేరు. బస్సు బయల్దేరిన కొంతసేపటికి, కండక్టర్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగికదాడి జరిపాడు. ఆ తర్వాత డ్రైవర్ కూడా దారుణానికి పాల్పడ్డాడు. ఇదంతా బస్సు కదులుతుండగానే జరిగింది. స్లీపర్ బస్సు కావటంతో కిటికీలకు ఉన్న తెరల వల్ల.. లోపల జరుగుతున్న అఘాయిత్యం గురించి బయట ఎవరికీ కనిపించలేదు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి, ఓల్డ్

తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగ చింతల గోపాలరావును అరెస్ట్ చేసినట్లు తిరువూరు రూరల్ డీసీపీ బి. లక్ష్మీ నారాయణ వెల్లడించారు. అతడి వద్ద నుంచి రూ.30 లక్షల విలువైన బంగారు ఆభరణాలతోపాటు రూ.2 వేల నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. తిరువూరు, ఆగస్టు 22: తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగ చింతల గోపాలరావును అరెస్ట్ చేసినట్లు తిరువూరు రూరల్ డీసీపీ బి. లక్ష్మీ నారాయణ వెల్లడించారు. అతడి వద్ద నుంచి రూ.30 లక్షల విలువైన బంగారు ఆభరణాలతోపాటు రూ.2 వేల నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. శనివారం తిరువూరు సర్కిల్ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. పుట్రేల సమీపంలో స్కూటిపై వెళ్తున్న నిందితుడు గోపాలరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. సీసీ కెమెరాల ఆధారంగా అతడిని అరెస్ట్ చేశామన్నారు. తమ విచారణలో ఈ చోరీలకు పాల్పడినట్లు అంగీకరించారని పేర్కొన్నారు. ఏ కొండూరు, విస్సన్నపేట, తిరువూరు మండలాల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకొని అతడు వరుస చోరీలకు పాల్పడుతున్నాడని వివరించారు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ అతడి స్వస్థలమని డీసీపీ చెప్పారు. ఆగస్టు10వ తేదీన ఏ. కొండూరు మండలం చీమలపాడు, విస్సన్నపేట మండలం కలగర, తిరువూరు మండలం మల్లేల గ్రామాల్లో వరుస చోరీలు జరిగాయి. ఆయా ఇళ్ల తాళాలను పగులగొట్టి బంగారు నగలు, వెండి వస్తువులతోపాటు నగదు దొంగలించినట్లు ఫిర్యాదు అందిందన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారని తెలిపారు. దీంతో నిందితుడి కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారని చెప్పారు. సీసీ కెమెరాల ఫుటేజీతోపాటు ఇతర సాంకేతిక ఆధారాలతో నిందితుడి కదలికలపై నిఘా పెట్టామన్నారు. అలా అతడిని శనివారం అరెస్ట్ చేసినట్లు డీసీపీ లక్ష్మీనారాయణ వెల్లడించారు. రామగుండం ఎరువుల కర్మాగారం మూసివేతపై కేంద్రం జోక్యం చేసుకోవాలి: మంత్రి తుమ్మల దూసుకొచ్చిన కొండచిలువ
సోషల్ మీడియాలో గత కొద్దిరోజులుగా తీవ్ర వివాదాస్పదంగా మారిన జానపద కళాకారులు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ల వ్యవహారం ఇప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. నెట్టింట వైరల్ అవుతున్న వార్తలపై డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఎట్టకేలకు స్పందించడమే కాకుండా, తనపై దాడి చేసిన వారిపై రివర్స్ కేసు పెట్టడం ఇండస్ట్రీ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. వేములవాడలోని రెడ్డి భవన్లో ఉన్న సమయంలో ఈశ్వర్ సాయి భార్య శరణ్య తనపై అకారణంగా దాడికి పాల్పడ్డారని మాధురి రాథోడ్ వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కొందరితో కలిసి వచ్చిన శరణ్య, తనను అసభ్యకర పదజాలంతో దూషించడమే కాకుండా భౌతికంగా దాడికి తెగబడ్డారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా దాడి చేస్తున్న సమయంలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించారని మాధురి ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆ గొడవ సమయంలో తన వద్ద ఉన్న రూ. 50 వేల విలువైన ఐఫోన్‌ను దొంగిలించారని ఆమె పోలీసుల దృష్టికి తీసుకెళ్లడం గమనార్హం. ఈ వ్యవహారంపై నిజానిజాలు తెలుసుకోకుండా తన వ్యక్తిగత జీవితాన్ని కించపరిచేలా కథనాలు ప్రసారం చేసిన కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా ఛానళ్లపై కూడా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. మాధురి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈశ్వర్ సాయి భార్య శరణ్యతో పాటు సంబంధిత వ్యక్తులపై వేములవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లో 'బాసింగా బలాలు' పాటతో ఈశ్వర్ సాయి, అనేక ప్రైవేట్ జానపద గీతాలతో మాధురి రాథోడ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పోలీసులు ఈ కేసు నమోదు చేయడంతో తదుపరి విచారణలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయోనని నెటిజన్లు ఎంతో ఉత్కంఠగా గమనిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ రిస్క్ ఫలించింది.. ఇరుముడి 200 కోట్లు పక్కా తమిళ ఇండస్ట్రీలో సంక్షోభం.. సెప్టెంబరు 1
ఎయిర్ హోస్టెస్‌గా కెరీర్ ప్రారంభించి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో అర్హత సాధించి మధ్యప్రదేశ్ క్యాడర్ అధికారిణి నేహా పచీసియా తీవ్ర అవినీతి, అక్రమ ఆరోపణల్లో చిక్కుకున్నారు. కట్నీ సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (CSP)గా విధులు నిర్వర్తించిన ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. కుత్లా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన రెండు రోజుల్లోనే ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఆదేశాల మేరకు సీఎస్పీ నేహా పచీసియాను సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ కాలంలో ఆమె భోపాల్‌లోని పోలీస్ ప్రధాన కార్యాలయానికి అటాచ్ అయి ఉంటారు.జైలులో ఉన్న హత్య కేసు నిందితుడు రమేష్ లోధి కుటుంబంపై అధికారాన్ని ఉపయోగించి ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. మార్కెట్ లేదా ప్రభుత్వ రికార్డుల ప్రకారం రూ. 82.86 లక్షల విలువైన ఆస్తిని కేవలం రూ. 18.20 లక్షలకే మారూఫ్ అహ్మద్ హనాఫీ అనే వ్యక్తికి విక్రయించేలా చేశారని విచారణలో తేలింది.రిజిస్ట్రేషన్ ప్రకారం రూ. 15 లక్షలు చెక్కు ద్వారా, రూ. 3.20 లక్షలు నగదుగా చెల్లించారు. కానీ, జులై 11, 2025 నాటికి కొనుగోలుదారుడు హనాఫీ బ్యాంక్ ఖాతాలో కేవలం రూ. 3,036 మాత్రమే ఉండటం గమనార్హం.రిజిస్ట్రేషన్ జరిగిన ఏప్రిల్ 15, 2026 నాడే హనాఫీ ఖాతాలోకి రూ. 10 లక్షలు సైన్ పార్ట్నర్స్ నుంచి, రూ. 5 లక్షలు క్షితిజ్ రాజ్ బారాపాత్రే అనే మరో వ్యక్తి ఖాతా నుంచి జమ అయ్యాయి. అయితే, ఈ రెండు ఖాతాలు ఒకే పాన్ కార్డుతో అనుసంధానమై ఉన్నాయని, బారాపాత్రే నేహా పచీసియాకు అత్యంత ఆప్తుడని విచారణలో బయటపడింది. ఈ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయడానికి లోధి కుటుంబం రద్దుచేసుకోడానికి ప్రయత్నించగా బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాగా, గతంలో కూడా ఒక ట్రాన్స్పోర్ట్ వ్యాపారి వద్ద రూ. 30,000 లంచం డిమాండ్ చేశారనే ఆరోపణలపై విచారణ నడుస్తోంది.2012లో ఎంపీపీఎస్సీ పరీక్ష రాసి రాష్ట్రస్థాయిలో 20వ ర్యాంకు

సాక్షి, గుంటూరు: గుంటూరులో మరోసారి టీడీపీ గూండాలు బరితెగించారు. కానిస్టేబుల్‌పై టీడీపీ నేత అశోక్, అనుచరులు దాడి చేశారు. బస్టాండ్‌లో పిల్లర్లు ధ్వంసం చేసేందుకు యత్నించిన టీడీపీ మూకలను కానిస్టేబుల్ ఠాగూర్ అడ్డుకున్నారు. కానిస్టేబుల్‌ను వెంటాడి మరీ టీడీపీ గూండాలు దాడి చేశారు. తిరిగి కానిస్టేబుల్‌పైనే అశోక్ తప్పుడు ఫిర్యాదు చేశారు. అశోక్‌పై కేసు కట్టకుండా పోలీసులపై టీడీపీ నేతలు ఒత్తిడి తెస్తున్నారు. ఫ్రెండ్స్‌తో ఫుల్ జోష్‌లో ఆనంది..(ఫోటోలు) చీర కట్టుతో శెట్టి..చూపుతిప్పుకోనివ్వని నిధి..(ఫోటోలు) బ్యూటీఫుల్ డ్రెస్‌లో మలయాళ బ్యూటీ అభిరామి అందాలు.. ఫోటోలు శారీలో హీరోయిన్ ఆదితి శంకర్ అందాలు.. ఫోటోలు గచ్చిబౌలిలో కుప్పకూలిన భవనం.. శిథిలాల కింద మృతదేహాలు చిరంజీవి బర్త్‌డే స్పెషల్.. మెగా 158 గ్లింప్స్ వచ్చేసింది.. ఇక GOLD కొనలేమా? భారీగా పెరిగిన బంగారం ధరలు నన్ను ఆపే దమ్ము నీకుందా..? జేసీ ప్రభాకర్ ని ఏకిపారేసిన పెద్దారెడ్డి జియోకి జీవోకి తేడా తెలియని నువ్వు... జగనన్నలా ఛాలెంజ్ చేసే దమ్ముందా?

శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన పోలీసులే మద్యం మత్తులో నగర వాసులను బెంబేలెత్తించారు. మద్యం మత్తులో న్యూసెన్స్ క్రియేట్ చేయడంతోపాటు పోలీసులే ఒకర్నొకరు ఘోరంగా కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన వరంగల్ జిల్లా ఉర్సుగుట్టలో జరిగింది. ఈ ఘటన నేపథ్యంలో సంబంధిత పోలీస్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల్ని కాపాడాల్సిన పోలీసే ఇలా మద్యం సేవించి ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఏం జరిగిందంటే..? వరంగల్ జిల్లా ఉర్సుగుట్టలోని బార్ లో ఓ బెటాలియన్ కానిస్టేబుల్ ఫుల్ గా మద్యం సేవించాడు. మద్యం మత్తులో బార్ వద్ద షర్ట్ విప్పి న్యూసెన్స్ క్రియేట్ చేశాడు. వచ్చిపోయేవారిని బెదిరిస్తూ కొద్దిసేపు హల్ చల్ చేశాడు. అయితే ఇది గమనించిన బార్ సిబ్బంది బెటాలియన్ కానిస్టేబుల్ పై 112 కు ఫిర్యాదు చేశారు. వెంటనే అక్కడకు చేరుకున్న బీట్ కానిస్టేబుల్ సంతోష్ రెడ్డి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశాడు.బెటాలియన్ కానిస్టేబుల్ ను అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పాడు. అయితే అందుకు ఆయన అంగీకరించలేదు. షర్ట్ వేసుకుని మర్యాదగా ప్రవర్తించాలని చెప్పాడు. అందుకు బెటాలియన్ కానిస్టేబుల్ ససేమిరా అనడంతో అతని చెంపపై కానిస్టేబుల్ సంతోష్ రెడ్డి కొట్టాడు. దీంతో ఆగ్రహించిన బెటాలియన్ కానిస్టేబుల్ తిరిగి సంతోష్ రెడ్డి చెంప చెళ్లుమనిపించాడు.దాంతో అసలు వివాదం మొదలైంది. ఇరువురు కొట్లాడకు దిగారు. మద్యం మత్తులో ఉన్న బీట్ కానిస్టేబుల్ ను కానిస్టేబుల్ సంతోష్ రెడ్డి లాఠీతో చితకబాదాడు. ఆయనకు తోడు స్థానికులు కూడా బెటాలియన్ కానిస్టేబుల్ ను చితకబాదారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. పోలీసులు ఇలా ప్రవర్తించడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.మరో ఘటనలో పోలీసులు డిజిటల్ దందాలకు తెర లేపినట్లు పలు ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. పటాన్ చెరులో పోలీసులు డిజిటల్ లంచాల దందా

Sullurpeta: చెంగాళమ్మ లేఅవుట్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం! సూళ్ళూరుపేట: సూళ్ళూరుపేటలోని చెంగాళమ్మ లేఅవుట్ వద్ద లభ్యమైన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని నాయుడుపేట డీఎస్పీ శ్రీ జి. చెంచుబాబు స్వయంగా పరిశీలించారు. ఘటనాస్థలాన్ని సందర్శించిన ఆయన, మృతదేహం లభ్యమైన పరిస్థితులు, పరిసరాలను పరిశీలించి, లభించిన ఆధారాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి దర్యాప్తు అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. సూళ్ళూరుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం. మురళీకృష్ణ పర్యవేక్షణలో, ఎస్సై జి. అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. మృతుడు సుమారు 30 నుంచి 35 సంవత్సరాల వయస్సు గల వ్యక్తిగా గుర్తించారు. ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా, గుర్తుతెలియని వ్యక్తులు అతనిపై దాడి చేసి హత్య చేసి, అనంతరం మృతదేహాన్ని చెంగాళమ్మ లేఅవుట్ వద్ద పడేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, మృతుడి గుర్తింపు మరియు ఆచూకీకి సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయని పోలీసులు తెలిపారు. మృతుడిని ఎవరైనా గుర్తించినట్లయితే లేదా అతనికి సంబంధించిన ఏదైనా సమాచారం తెలిసినట్లయితే, వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా సూళ్ళూరుపేట పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు