
రేవంత్ రెడ్డి పాలన ఎల్నినో కంటే ప్రమాదకరం: బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు తీవ్ర విమర్శలు
కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న నిర్ణయాలు, వైఫల్యాలపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రకృతి వైపరీత్యమైన ఎల్నినో కంటే రేవంత్ రెడ్డి పరిపాలనే తెలంగాణకు ఎంతో ప్రమాదకరంగా మారిందని ఆరోపించారు. రైతు సంక్షేమం, అభివృద్ధిని కాంగ్రెస్ గాలికి వదిలేసిందని ఆయన మండిపడ్డారు.
















































