translateexpand_more

Congress News

Latest updates from Telugu Digital news sources.

10TV Telugu02 Jun, 12:03 pm
తెలంగాణలో తిరుగుతాం, పోటీ చేస్తాం.. ఇదేమైనా పాకిస్తానా?- పవన్ కల్యాణ్

Pawan Kalyan: హైదరాబాద్ లో తన నివాసంలో ప్రెస్ మీట్ లో మాట్లాడారు జనసేనాని పవన్ కల్యాణ్. తెలంగాణలో జనసేన పోటీపై పవన్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందని పవన్ ప్రకటించారు. తెలంగాణలో తిరుగుతాం, పోటీ చేస్తాం అని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో జనసేన ఉంటుందని పవన్ అన్నారు. తెలంగాణ భారత్ లో అంతర్భాగం అని చెప్పారు. తెలంగాణను వ్యతిరేకించిన వాళ్లే నేడు ఎమ్మెల్యేలు అయ్యారని వ్యాఖ్యానించారు. తెలంగాణలోకి ఎలా వస్తావో చూస్తామని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారు.. వైఎస్ హయాంలో యూత్ కాంగ్రెస్ వాళ్లు బెదిరిస్తే తన్ని తరిమేశాం అని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. ”నేను ఇప్పటివరకు నిర్ణయించుకోలేదు. మీరు అంటున్నారు కాబట్టి చెబుతున్నా. తెలంగాణలో జనసేన ఉంటుంది. మేము పోటీ చేస్తాం. ఎప్పుడూ పోటీ చేస్తుంటాం. అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం. నేనే తిరుగతా. మేమే తిరుగుతాం. ప్రతి సమస్య మీద మాట్లాడతాం. ఎదుర్కొంటాం. ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఈ తెలంగాణ నా భారత దేశంలో అంతర్భాగం. మీరు కూర్చోబెట్టి రాకూడదు అంటే భరించాం. పదేళ్లకు పైగా భరించాము. దీనికి ఫుల్ స్టాప్ పెడతాం మేము. తెలంగాణను వ్యతిరేకించిన వారంతా పదవుల్లో కూర్చున్నారు. తెలంగాణను వ్యతిరేకించిన వారంతా ఎమ్మెల్యేలు అయ్యారు. 12 ఏళ్లు తెలంగాణ గురించి ఒక్క మాట మాట్లాడలేదు. కాంగ్రెస్ నేతలు అంటున్నారు.. తెలంగాణలోకి ఎలా అడుగు పెడతారో చూస్తాం అంటున్నారు. ఇలాంటి ప్రగల్బాలే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యువజన కాంగ్రెస్ వాళ్లు మాట్లాడితే… ఆరోజు వారిని తన్ని తగలేశాం” అని పవన్ కల్యాణ్ ఆవేశంగా అన్నారు. Also Read: మీరెవరు నన్ను బెదిరించడానికి? తెలంగాణ మీ అయ్య జాగీరా? పవన్ కల్యాణ్ మాస్ స్పీచ్

10TV Telugu02 Jun, 10:54 am
పవన్ కల్యాణ్ ని బలి చేయకండి, పవన్ కు రాజకీయాలు తెలీదు- అద్దంకి దయాకర్

Addanki Dayakar – Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఫైర్ అయ్యారు. పవన్ ప్రెస్ మీట్ కి పర్మిషన్ ఇవ్వడం కుదరదని అద్దంకి దయాకర్ తేల్చి చెప్పారు. మంచి ఉద్దేశ్యంతో మీటింగ్ పెడతామంటే పర్మిషన్ ఇస్తామన్న అద్దంకి దయాకర్.. కుట్రతో పర్మిషన్ అడిగితే అనుమతి ఇవ్వము అని తేల్చి చెప్పారు. లా అండ్ ఆర్డర్ కాపాడే బాధ్యత తెలంగాణ ప్రభుత్వానిది అని ఆయన స్పష్టం చేశారు. ప్రజల మధ్య చిచ్చు, కుట్ర పెట్టాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. కాగా, గతంలో పవన్ కల్యాణ్ వారాహి బస్సు యాత్ర చేస్తామంటే పర్మిషన్ ఇచ్చామని ఆయన గుర్తు చేశారు. బీజేపీ తన స్వార్థం కోసం పవన్ కల్యాణ్ ని బలి చేయొద్దని అద్దంకి దయాకర్ కోరారు. పవన్ కల్యాణ్ కి రాజకీయాలు ఏమీ తెలియవన్నారు. ”చేగువేరా వారసుడిగా చెప్పుకుంటూ సనాతనం కోసం పాటుపడే వ్యక్తి పవన్. పవన్ రాజకీయాలన్నీ బీజేపీకి అనుకూలంగానే ఉంటాయి. ప్రజలను రెచ్చగొట్టేందుకు పవన్ ప్రయత్నం చేస్తున్నారు. టార్గెట్ తెలంగాణ అని మోదీ అంటే మేం అర్థం చేసుకోలేకపోయాం. మోదీ ఓట్ల మ్యాజిక్ తో గెలవగలరు. ప్రజలను గెలవలేరు. తెలంగాణ వచ్చినందుకు 11 రోజులు అన్నం తినని వ్యక్తి పవన్. జూన్ 2న పవన్ మీటింగ్ ఎందుకోసం పెట్టారో తెలియదా? బీజేపీ అనుకూల రాజకీయాలు చేసేందుకు బీఆర్ఎస్ స్పాన్సర్ చేస్తున్న కార్యక్రమమే పవన్ మీటింగ్. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ కలిసే పవన్ ను తెరపైకి తెచ్చాయి. రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారుతారా? తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంపై దెబ్బ కొట్టే వాళ్ళు మా వ్యతిరేకులే. ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొడితే ఊరుకోము. బీజేపీ నేతలు నల్లి కుంట్లోళ్ళు . తెలంగాణపై ఇంత దాడి జరిగితే కేసీఆర్ ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు? తెలంగాణపై బీజేపీ నిలువెల్లా విషం కక్కుతోంది. రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తానంటేనే మోదీతో రేవంత్ కలుస్తారు. సుష్మా స్వరాజ్ అంటే మోదీకి ఇష్టం ఉండదు” అని అద్దంకి దయాకర్ అన్నారు. Also Read: తెలంగాణ భవన్‌లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు.. కేటీఆర్ కీలక కామెంట్స్.. అందుకే సింహం తన కథ తను చెప్పుకోవాలి