translateexpand_more

Janasena News

Latest updates from Telugu Digital news sources.

10TV Telugu02 Jun, 03:54 pm
కేసీఆర్, రేవంత్ వేరే రాష్ట్రాలకు పోవచ్చు.. పవన్ కల్యాణ్ సభ పెట్టుకోకూడదా? కాంగ్రెస్ పై రఘునందన్ రావు ఫైర్

Raghunandan Rao: తెలంగాణలో జనసేన సభకు అనుమతించకపోవడంపై తెలంగాణ బీజేపీ నాయకులు స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ మైండ్ సెట్ తో ఉందని టీ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు విమర్శించారు. తెలంగాణలో పవన్ కల్యాణ్ సభ పెడితే కాంగ్రెస్ ప్రభుత్వానికి భయమేంటి అని ప్రశ్నించారు ఎంపీ రఘునందన్ రావు. ”పవన్ కల్యాణ్ ఒక సభ పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఇబ్బంది ఏంటో నాకు అర్థం కావడం లేదు. దేశంలో అనేకమంది అనేక ప్రాంతాలకు వెళ్లి మాట్లాడుతుంటాం. రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి మీడియాతో చిట్ చాట్ చేస్తానే ఉంటారు. మరో రాష్ట్ర డిప్యూటీ సీఎం పక్క రాష్ట్రానికి వచ్చి ప్రెస్ మీట్ లేదా సభ పెడితే అంత ఆందోళన చెందాల్సిన అవసరం నాకైతే కనిపించడం లేదు. ఎవరు ఎక్కడ సభ పెడతామన్నా, ఏ నాయకుడు ఏ రాష్ట్రంలో సభ పెడతామన్నా అభ్యంతరాలు చెప్పాల్సిన అవసరం ఉందని నేను అనుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో జనసేన సభకు ఎందుకు అనుమతి ఇవ్వలేదో కాంగ్రెస్ పార్టీ నాయకులే చెబితే బాగుంటుంది. రేవంత్ రెడ్డి వేరే రాష్ట్రాలకు వెళ్లి ప్రచారం చేస్తారు. కేసీఆర్ వేరే రాష్ట్రానికి పోయి రైతులకు పైసలు ఇచ్చి వస్తారు. రకరకాల వ్యక్తులు రకరకాల పనులు చేసినప్పుడు ఒక రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి వచ్చి సభ పెట్టుకుంటే అంత ఉలిక్కి పడాల్సిన అవసరం ఏముందో నాకు అర్థం కాలేదు. పవన్ కల్యాణ్ ఎన్డీయేలో భాగం. ఆయనను మేము ఎలా వేరు చేస్తాం. ఆయన ఏ రాష్ట్రంలో ఉంటే ఏంటి? ఎన్డీయే భాగస్వామ్య కూటమిలో ఉన్నారు, ఉంటారు కూడా. ఎన్డీయే భాగస్వామ్య కూటమిలో ఉన్నటువంటి వారు వేరే రాష్ట్రాలకు పోవద్దని ఏమైనా ఉందా? తప్పకుండా పోతాం. దాన్ని మీరు అడ్డుకునేది ఏముంది? అని ఎంపీ రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. Also Read: మీరెవరు నన్ను బెదిరించడానికి? తెలంగాణ మీ అయ్య జాగీరా? పవన్ కల్యాణ్ మాస్ స్పీచ్

10TV Telugu02 Jun, 02:22 pm
ఎక్కువ ప్యాకేజీ ఇస్తే జగన్ కి కూడా మద్దతిస్తారు..!- పవన్ కల్యాణ్ పై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఫైర్

Mla Anirudh Reddy: తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తెలంగాణకు రావొద్దని నన్ను బెదిరించడానికి మీరెవరు? తెలంగాణ మీ అయ్య జాగీరా? అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఘాటుగా స్పందించారు. సినీ పరిశ్రమలో ప్యాకేజ్ ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ల సినిమాలో నటిస్తారు.. రాజకీయాల్లో సైతం ప్యాకేజీ ఎక్కువ ఇచ్చిన వాళ్ళకే పవన్ మద్దతిస్తున్నారు అని అనిరుధ్ రెడ్డి విమర్శించారు. జగన్ ఎక్కువ ప్యాకేజీ ఇస్తే పవన్ ఆయనకి కూడా మద్దతిస్తారని ఎద్దేవా చేశారు. చంద్రబాబును జైల్లో కలవడమే పవన్ ప్లస్ పాయింట్ అని అన్నారు. ”పవన్ కల్యాణ్ తెలంగాణకి క్షమాపణ చెప్తారని అనుకున్నా. నరదృష్టి ఉన్న దగ్గరికి పవన్ ఎందుకు రావాలి? పవన్ వెళ్ళి గుజరాత్ లో పోటీ చేయాలి. నల్లగా అయిపోతాననే పవన్ విజయవాడ వెళ్ళడం లేదు. గ్లామర్ కాపాడుకోవడం కోసమే పవన్ హైదరాబాద్ లో ఉంటున్నారు. టీటీడీ డబ్బులపై కూడా పవన్ రాజకీయం చేస్తున్నారు? పవన్ ఇంగ్లీషులో మాట్లాడింది అమిత్ షా కి అర్థం కావడానికే. కేసీఆర్, అమిత్ షాను ఇంప్రెస్ చేయడానికే పవన్ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ కి భూముల వ్యవహారమే తెలీదు. పవన్ కబ్జా చేసిన భూమి దగ్గరికి వెళ్తే కేసులు పెడతారా? రెండు స్థానాల్లో పోటీ చేసి ఓడిన వ్యక్తి పవన్ కళ్యాణ్. రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యేసరికి పవన్ డిప్రెషన్ లో ఉన్నారు” అని అనిరుధ్ రెడ్డి అన్నారు. Also Read: తెలంగాణలో తిరుగుతాం, పోటీ చేస్తాం.. ఇదేమైనా పాకిస్తానా?- పవన్ కల్యాణ్

10TV Telugu02 Jun, 01:56 pm
తెలంగాణ మా అయ్య జాగీరే- పవన్ కల్యాణ్ కు మంత్రి పొన్నం కౌంటర్

Ponnam Prabhakar – Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణకు రావొద్దని నన్ను బెదిరించడానికి మీరెవరు? తెలంగాణ మీ అయ్య జాగీరా అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం తీవ్రంగా స్పందించారు. మిస్టర్ పవన్ కల్యాణ్… ఇది మా అయ్య జాగీరే అని మంత్రి పొన్నం అన్నారు. తెలంగాణ.. 4 కోట్ల మంది ప్రజల జాగీరు. మీ అయ్య జాగీరు కాదు అని ఎదురుదాడికి దిగారు. ”పవన్ కల్యాణ్ ఇక్కడికి వచ్చి చేసేదేంటి? పవన్ పెయిడ్ ఆర్టిస్ట్. నా దగ్గర డబ్బులు ఉంటే నేను కూడా పవన్ తో ఒక క్యారెక్టర్ చేయిస్తా. తెలంగాణపై పవన్ మరోసారి అక్కసు వెళ్లగక్కారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వ్యక్తి పవన్. గద్దర్ కు కార్ కొనిచ్చినా అని చెప్పినందుకు ముందు క్షమాపణ చెప్పు. చనిపోయిన వారి గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? తనకి ఆంధ్రాలోనే దిక్కు లేదని పవన్ చెప్పుకున్నారు. ఉద్యమ సమయంలో కూడా ఆంధ్రా వాళ్ళని మేము ఏమీ అనలేదు. మేం ఆంధ్రా వాళ్ళని ఏదో అన్నట్టు పవన్ అబద్ధాలు చెబుతున్నారు. పార్లమెంటులో ఏ బిల్లు చేసినా తలుపులు మూసే పాస్ చేస్తారు. కొండగట్టుకు ఇచ్చిన పైసలు మీ అయ్యా జాగీరా? తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున మీటింగ్ పెట్టడం గెలకడం కాదా? పవన్ తిరిగితే జనాలు వస్తారు. కానీ, ఓట్లు వేయరు. పవన్ వచ్చినా, పోయినా మాకేం సంబంధం లేదు. తెలంగాణ ఎప్పుడైనా ఏపీ ప్రజలను స్వాగతిస్తూనే ఉంటుంది. సినిమా నటుడిగా పవన్ ఎక్కడ తిరిగినా మాకేం ఇబ్బంది లేదు” అని కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. Also Read: తెలంగాణలో తిరుగుతాం, పోటీ చేస్తాం.. ఇదేమైనా పాకిస్తానా?- పవన్ కల్యాణ్

Sakshi02 Jun, 12:21 pm
తెలంగాణలో జనసేన ఉంటుంది

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది.

10TV Telugu02 Jun, 12:03 pm
తెలంగాణలో తిరుగుతాం, పోటీ చేస్తాం.. ఇదేమైనా పాకిస్తానా?- పవన్ కల్యాణ్

Pawan Kalyan: హైదరాబాద్ లో తన నివాసంలో ప్రెస్ మీట్ లో మాట్లాడారు జనసేనాని పవన్ కల్యాణ్. తెలంగాణలో జనసేన పోటీపై పవన్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందని పవన్ ప్రకటించారు. తెలంగాణలో తిరుగుతాం, పోటీ చేస్తాం అని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో జనసేన ఉంటుందని పవన్ అన్నారు. తెలంగాణ భారత్ లో అంతర్భాగం అని చెప్పారు. తెలంగాణను వ్యతిరేకించిన వాళ్లే నేడు ఎమ్మెల్యేలు అయ్యారని వ్యాఖ్యానించారు. తెలంగాణలోకి ఎలా వస్తావో చూస్తామని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారు.. వైఎస్ హయాంలో యూత్ కాంగ్రెస్ వాళ్లు బెదిరిస్తే తన్ని తరిమేశాం అని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. ”నేను ఇప్పటివరకు నిర్ణయించుకోలేదు. మీరు అంటున్నారు కాబట్టి చెబుతున్నా. తెలంగాణలో జనసేన ఉంటుంది. మేము పోటీ చేస్తాం. ఎప్పుడూ పోటీ చేస్తుంటాం. అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం. నేనే తిరుగతా. మేమే తిరుగుతాం. ప్రతి సమస్య మీద మాట్లాడతాం. ఎదుర్కొంటాం. ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఈ తెలంగాణ నా భారత దేశంలో అంతర్భాగం. మీరు కూర్చోబెట్టి రాకూడదు అంటే భరించాం. పదేళ్లకు పైగా భరించాము. దీనికి ఫుల్ స్టాప్ పెడతాం మేము. తెలంగాణను వ్యతిరేకించిన వారంతా పదవుల్లో కూర్చున్నారు. తెలంగాణను వ్యతిరేకించిన వారంతా ఎమ్మెల్యేలు అయ్యారు. 12 ఏళ్లు తెలంగాణ గురించి ఒక్క మాట మాట్లాడలేదు. కాంగ్రెస్ నేతలు అంటున్నారు.. తెలంగాణలోకి ఎలా అడుగు పెడతారో చూస్తాం అంటున్నారు. ఇలాంటి ప్రగల్బాలే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యువజన కాంగ్రెస్ వాళ్లు మాట్లాడితే… ఆరోజు వారిని తన్ని తగలేశాం” అని పవన్ కల్యాణ్ ఆవేశంగా అన్నారు. Also Read: మీరెవరు నన్ను బెదిరించడానికి? తెలంగాణ మీ అయ్య జాగీరా? పవన్ కల్యాణ్ మాస్ స్పీచ్

Oneindia Telugu02 Jun, 11:58 am
తెలంగాణ మీ అయ్య జాగీరా ? బెదిరింపులపై పవన్ ఫైర్

ఆంధ్రలో తనను తిరగనివ్వనని అంటే, తన వారాహికి అనుమతి ఇచ్చింది తెలంగాణాయే అని పవన్ కళ్యాణ్ (Pawan kalyan) తెలిపారు. ఇక్కడి జనసైనికులే తనకు అండగా నిలిచారన్నారు. తెలంగాణలో పార్టీ బలోపేతం చేద్దామని మా నాయకులు అంటే.. ప్రజలు కోరుకుంటే చూద్దామని చెప్పినట్లు వెల్లడించారు. ఇక్కడ కూర్చొన్నా ఆంధ్రలోనే అధికారం కోరుకుంటానని, తెలంగాణలో కేవలం మార్పు మాత్రమే కోరుకుంటానన్నారు. ఈ మధ్య మాట్లాడితే ఆంధ్ర ఆంధ్ర అంటున్నారని, తెలంగాణ ప్రజలకు, నాయకులకు ఆంధ్ర మీద విద్వేషం లేదని, వాళ్లంతా విద్వేషం చూపించి ఉంటే ఆంధ్ర ప్రాంత వ్యక్తులు ఇక్కడ ఉండే వారు కాదన్నారు. దీన్ని ఎవరూ మర్చిపోరన్నారు. హైదరాబాద్ లో ఎలా అడుగుపెడతావని, ఇక్కడేం పని అని అడుగుతున్నారని, మీరెవరు నన్ను బెదిరించడానికి అన్నారు. బెదిరించే వాళ్ల అయ్య జాగీరా తెలంగాణా అని ప్రశ్నించారు. తెలంగాణలో కంటే ఆంధ్రాలోనే తనకు బెదిరింపులు ఎక్కువన్నారు. తెలంగాణలో రానివ్వనంటారని, ఆంధ్రలో అయితే కోనసీమలో తల తీసేయమంటారన్నారు.తాను 2019లో ఓడిపోయినప్పుడు తెలంగాణ నాయకులు ఇక్కడ ఉంటే అలాంటి పరిస్ధితి రానిచ్చే వాళ్లం కాదన్నారు. తెలంగాణలో తాను సాధించేది ఏమీ లేదన్నారు. ప్రెస్ మీట్ కూడా ఇంట్లోనే ఎందుకు పెట్టానంటే, దాడి చేసే వాళ్లకు అవకాశం కోసమేననన్నారు. బాంచెన్ సారు కాల్మొక్తా అనే వాళ్లం అయితే పార్టీ ఎందుకు పెడతామన్నారు. మీ ఇష్టానికి మాట్లాడితే భయపడాలా అన్నారు. 12 ఏళ్లలో ఒక్క తెలంగాణ నాయకుడిని అయినా ఒక్క మాట అనలేదన్నారు. తనకు పౌరుషం చచ్చిపోలేదని, తెలంగాణపై ప్రేమ కూడా చావలేదన్నారు. ప్రజలు కోరుకున్నప్పుడు మాట్లాడతానన్నారు. తెలంగాణలో జనసేన ఎదగాలని కోరుకుంటున్నానని, ఇక్కడి జర్నలిస్ట్ కాలనీలో ఉన్న జనసేన హెడ్ ఆఫీసును మంగళగిరిలో పెట్టుకున్నానన్నారు. తన గుండెల్లో తెలంగాణ ఉందని, తనను ఎంత తిట్టినా బెదిరిపోనున్నారు. ఏపీలో వైసీపీ గూండాల బెదిరింపుల కంటే ఇక్కడి వాళ్ల బెదిరింపులు ఎక్కువేమీ కాదన్నారు. ఓ విశ్లేషించే వ్యక్తి వల్లే ఈ గొడవ ప్రారంభమైందన్నారు. ఆయన మీడియాలో అమిత్ షా, తాను మాట్లాడుకున్నట్లు చెప్తే దాన్ని ఖండించామన్నారు. తనను ఓ మాట అంటే జనసైనికులు కేసులు పెట్టారని, ఆ విషయం తెలిసి వదిలేయమని చెప్పానన్నారు. తెలంగాణ వచ్చి 12 ఏళ్లు అయినా అభివృద్ది లేకపోవడానికి ఇంకా ఆంధ్రోళ్లు, పవన్ కళ్యాణే కారణమా అని అడిగారు. ఆంధ్రా ప్రజలు, తెలుగు సినీ ఇండస్ట్రీ ఇక్కడికి రావడానికి కారణం మర్రి చెన్నారెడ్డి వంటి నాయకులే అన్నారు. పాలకులు వేరు, ప్రజలు వేరన్నారు. తెలంగాణకు అన్యాయం చేసిన వారిలో పవన్ కళ్యాణ్ ఉంటే ఆయన్నూ ఉరి తీయాలన్నారు. గుజరాతీలు సూరత్ లో, నాందేడ్ లో స్థానికులు తెలుగు వాళ్లు వద్దని తరిమేస్తే దేశం నిలబడుతుందా అని పవన్ అడిగారు. నాగేశ్వర్ ను ప్రశ్నిస్తే తనకు తెలంగాణ అంటే పడదు, వ్యతిరేకం అని, చెరువు కబ్జా చేశానని ఆరోపణలు చేస్తున్నారని, తనకేం పనిలేదా అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అంటే తనకు గౌరవమని, పవన్ కళ్యాణ్ కనుక ఆ చెరువును ఆక్రమించుకున్నాడని తేలితే దాన్ని తెలంగాణ ప్రభుత్వానికి రాసిచ్చేస్తానన్నారు. ప్రపంచ కార్మికులారా ఏకంకండి అన్న ఓ అనలిస్ట్ .. వామపక్ష భావజాలాన్ని వదిలి ప్రాంతీయవాదానికి వచ్చారన్నారు. గద్దర్ మీద తన ప్రేమ ఈనాటిది కాదన్నారు. ఆయనకు తాను బండి కొనిచ్చానన్నారు. బతికున్నప్పుడు గద్దర్ కు మీరేం చేశారని ప్రశ్నించారు. ఒకప్పుడు తెలంగాణకు వ్యతిరేకం అని చెప్పిన వైఎస్ కు కొమ్ముకాసిన వ్యక్తులు ఇవాళ తన నాలుకలు కోస్తామంటున్నారని పవన్ విమర్శించారు. కేసీఆర్ బీఆర్ఎస్ పెట్టి ఆంధ్రకు వస్తే తాను స్వాగతించానని, గుంటూరులో బీఆర్ఎస్ కార్యాలయం పెట్టి, గతంలో జనసేనలో పనిచేసిన వ్యక్తిని ఏపీకి అధ్యక్షుడిగా పెడితే స్వాగతించామన్నారు. ఆంధ్రాలో సీఎంకు దిక్కులేని పవన్ కళ్యాణ్.. ఇక్కడ ముఖ్యమంత్రి ఎలా అవుతాడని ప్రశ్నించారు. కానీ ఇక్కడి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తామనే భయం అన్నారు. 2 వేల మంది జనసైనికులతో సభ పెట్టుకుంటామంటే అనుమతి ఇవ్వనంటే ఎలా అన్నారు. ఓ అనలిస్ట్ కూర్చుని అమిత్ షా గురించి మాట్లాడితే, తాను దాన్ని ప్రశ్నిస్తే ఇందులో ప్రాంతీయత ఎక్కడ ఉందని, తెలంగాణలో అవమానం ఎక్కడుందని, కులాలు ఎక్కడ వచ్చాయని, మాకు నొచ్చుకునే హక్కు కూడా లేదా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. పీకలు కోసుకుంటా కానీ తనకు భయం అయితే రాదన్నారు. తెలంగాణలో ఆంధ్రా వాళ్లకు ఏం పని అడుగుతున్నారని, అక్కడి కాంట్రాక్టర్లు ఇక్కడ బాగానే ఉన్నారని, మీరు ఎవరిని పిచ్చోళ్లని చేస్తారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. నిజంగా వద్దనుకుంటే పవన్ కళ్యాణ్ ను రానివ్వబోమని తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం పెట్టాలన్నారు. తన ప్రేమను శంకిస్తే .. ఇప్పటిదాకా నిర్ణయించుకోలేదని, మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా.. తెలంగాణలో జనసేన ఉంటుంది, మేం పోటీ చేస్తామన్నారు. అవసరమైతే తెలంగాణలో తిరిగేందుకు సిధ్దమన్నారు. ప్రతీ సమస్య మీదా మాట్లాడతామనని, ప్రతీ అన్యాయాన్నీ ఎదుర్కొంటానన్నారు. తెలంగాణ భారత్ లో అంతర్భాగమని మర్చిపోవదన్నారు. మీరు బెదిరిస్తే భరించేది లేదన్నారు. దశాబ్దం

10TV Telugu02 Jun, 11:26 am
మీరెవరు నన్ను బెదిరించడానికి? తెలంగాణ మీ అయ్య జాగీరా? పవన్ కల్యాణ్ మాస్ స్పీచ్

Pawan Kalyan: హైదరాబాద్ లో తన నివాసంలో ప్రెస్ మీట్ లో జనసేనాని పవన్ కల్యాణ్ మాట్లాడారు. హైదరాబాద్ లో పవన్ కు ఏం పని? అని కొందరు వ్యక్తులు పదే పదే బెదిరిస్తున్నారు.. మీరెవరు నన్ను బెదిరించటానికి.. తెలంగాణ మీ అయ్య జాగీరా? అని పవన్ కల్యాణ్ ఎదురు దాడికి దిగారు. తెలంగాణలో బెదిరింపుల కంటే ఏపీలో బెదిరింపులు ఎక్కువ అని చెప్పారు. ఏపీలో నా తల తీసేయాలని కోనసీమలో కొంతమంది అంటారు అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ”తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు జనసేన వ్యతిరేకం కాదు. ఇది తెలంగాణ ప్రజలకు స్పష్టంగా తెలియజేస్తున్నాం. నేను కష్టాల్లో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం ఆంధ్రాలోకి అడుగు పెట్టనివ్వం అంటే తెలంగాణ జనసైనికులు నాకు అండగా వచ్చారు. ఆంధ్రప్రదేశ్ లోనే అధికారం కోరుకోని వాడిని, తెలంగాణలో కోరుకుంటానా? ఒక మార్పు తప్ప. జనసేన ప్రయాణం తెలంగాణలో మొదలైంది. మీరు సమస్యల మీద పోరాడండి అని మా పార్టీ నాయకులను కోరా. మాట్లాడితే ఆంధ్రా అంటున్నారు. హైదరాబాద్ లో ఏం పని? అంటున్నారు. హైదరాబాద్ లో అడుగుపెట్టనివ్వం అని బెదిరిస్తున్నారు. మీరెవరు నన్ను బెదిరించటానికి? మీ అయ్య జాగీరా తెలంగాణ? నాకు తెలంగాణలో కంటే ఆంధ్రలో బెదిరింపులు ఎక్కువ. ఆంధ్రలో నా తల తీసేయాలని కోనసీమలో కొంతమంది అంటారు. తెలంగాణ అద్భుతంగా ఉండాలి, యువతకు మంచి అవకాశాలు రావాలని కోరుకుంటాను తప్ప నాకిక్కడ కొత్తగా బాగుకునేది ఏమీ లేదు. బెదిరించే వాళ్లకు అందరికీ చెబుతున్నా.. నా ఇంటి ముందు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టానంటే.. ఎవరన్నా దాడి చేయాలంటే సంతోషంగా రండి.. ఇదే నా ఇంటి అడ్రస్. మీ అందరికీ తెలియజేస్తున్నా. నాకు ఎలాంటి భయాలు లేవు. బాంచన్ కాల్మొక్తా అనే ఉద్దేశం ఉంటే పార్టీ ఎందుకు పెడతా? భయపడే వాళ్లమే అయితే పార్టీ పెడతామా? మీ ఇష్టానికి మాట్లాడితే భయపడాలా? తెలంగాణ రాష్ట్రం వచ్చిన 12 ఏళ్లలో నేను తెలంగాణ నాయకులను ఒక్క మాట కూడా అనలేదు” అని పవన్ కల్యాణ్ అన్నారు.

Oneindia Telugu02 Jun, 11:21 am
తెలంగాణతో బంధం కొత్తదేం కాదు..! ఆ గొంతుకలు..పవన్ కామెంట్స్

జనసేన పార్టీని తెలంగాణ నడిబొడ్డున హైదరాబాద్ లోనే స్థాపించామని, తెలంగాణ మీద తమ పార్టీకి ఉన్న ప్రేమ రాజకీయాలకు అతీతమైందని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pawan kalyan) తెలిపారు. తన చుట్టు పక్కల ఉన్న నాయకులంతా 2007-08 నుంచి అప్పటి యువరాజ్యంలో ఉన్న నాయకులే అన్నారు. ఈ రోజు కొత్తగా తెలంగాణ మీద తెచ్చుకున్న ప్రేమ తనది కాదన్నారు. తెలంగాణ విభజన సమయంలో వచ్చిన ప్రేమ కాదన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలన్న ఆలోచన రాక ముందే ఇక్కడి సంస్కృతి, పోరాట స్ఫూర్తి నుంచి ఉత్తేజం పొందామని, సినిమాలు, సంస్కృతి పరంగా ముందుకు తీసుకెళ్తూనే ఉన్నామన్నారు. ఇవాళ తమను విమర్శించే గొంతులు 2007లో లేవన్నారు. తాను తెలంగాణ నలుమూలలా పెరిగిన వాడిని, వెళ్లిన వాడిని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో అన్ని కార్పోరేషన్లలో మువ్వన్నెల జెండా తాము ఎగురవేశామన్నారు. ఇది కొత్తగా వచ్చిన ప్రేమ కాదన్నారు. ఆదిలాబాద్ జిల్లాల్లో, నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పుడు తనను విమర్శిస్తున్న నాయకులు ఎప్పుడూ తిరగలేదన్నారు. ఆదిలాబాద్ గోండు తండాల్లో, గెలుస్తానో లేదో తిరగని పరిస్ధితుల్లో తాను తిరిగామన్నారు. ఓట్లు పడతాయని కాదని, తనకు తెలంగాణ అంటే ఇష్టమన్నారు. తెలంగాణపై తనకు ఎంత ప్రేమ ఉందో నిరూపించుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. వారికి చెప్పాల్సిన అవసరం కూడా లేదన్నారు. తెలంగాణ ఏర్పాటుకు జనసేన వ్యతిరేకం కాదని, విభజించిన తీరుకు మాత్రమే వ్యతిరేకమన్నారు. సామాజిక తెలంగాణలో అన్ని కులాలు బాగుండాలని చెప్పి మరీ వచ్చామన్నారు. పార్లమెంట్ తలుపులు మూసి తెలంగాణ, ఆంధ్రను విభజించిన తీరు తప్పని మాత్రమే చెప్పానన్నారు. తెలంగాణ సంస్కృతీ, ఇక్కడి ప్రజలకు ఎప్పుడూ తాను వ్యతిరేకం కాదన్నారు.

10TV Telugu02 Jun, 10:54 am
పవన్ కల్యాణ్ ని బలి చేయకండి, పవన్ కు రాజకీయాలు తెలీదు- అద్దంకి దయాకర్

Addanki Dayakar – Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఫైర్ అయ్యారు. పవన్ ప్రెస్ మీట్ కి పర్మిషన్ ఇవ్వడం కుదరదని అద్దంకి దయాకర్ తేల్చి చెప్పారు. మంచి ఉద్దేశ్యంతో మీటింగ్ పెడతామంటే పర్మిషన్ ఇస్తామన్న అద్దంకి దయాకర్.. కుట్రతో పర్మిషన్ అడిగితే అనుమతి ఇవ్వము అని తేల్చి చెప్పారు. లా అండ్ ఆర్డర్ కాపాడే బాధ్యత తెలంగాణ ప్రభుత్వానిది అని ఆయన స్పష్టం చేశారు. ప్రజల మధ్య చిచ్చు, కుట్ర పెట్టాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. కాగా, గతంలో పవన్ కల్యాణ్ వారాహి బస్సు యాత్ర చేస్తామంటే పర్మిషన్ ఇచ్చామని ఆయన గుర్తు చేశారు. బీజేపీ తన స్వార్థం కోసం పవన్ కల్యాణ్ ని బలి చేయొద్దని అద్దంకి దయాకర్ కోరారు. పవన్ కల్యాణ్ కి రాజకీయాలు ఏమీ తెలియవన్నారు. ”చేగువేరా వారసుడిగా చెప్పుకుంటూ సనాతనం కోసం పాటుపడే వ్యక్తి పవన్. పవన్ రాజకీయాలన్నీ బీజేపీకి అనుకూలంగానే ఉంటాయి. ప్రజలను రెచ్చగొట్టేందుకు పవన్ ప్రయత్నం చేస్తున్నారు. టార్గెట్ తెలంగాణ అని మోదీ అంటే మేం అర్థం చేసుకోలేకపోయాం. మోదీ ఓట్ల మ్యాజిక్ తో గెలవగలరు. ప్రజలను గెలవలేరు. తెలంగాణ వచ్చినందుకు 11 రోజులు అన్నం తినని వ్యక్తి పవన్. జూన్ 2న పవన్ మీటింగ్ ఎందుకోసం పెట్టారో తెలియదా? బీజేపీ అనుకూల రాజకీయాలు చేసేందుకు బీఆర్ఎస్ స్పాన్సర్ చేస్తున్న కార్యక్రమమే పవన్ మీటింగ్. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ కలిసే పవన్ ను తెరపైకి తెచ్చాయి. రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారుతారా? తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంపై దెబ్బ కొట్టే వాళ్ళు మా వ్యతిరేకులే. ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొడితే ఊరుకోము. బీజేపీ నేతలు నల్లి కుంట్లోళ్ళు . తెలంగాణపై ఇంత దాడి జరిగితే కేసీఆర్ ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు? తెలంగాణపై బీజేపీ నిలువెల్లా విషం కక్కుతోంది. రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తానంటేనే మోదీతో రేవంత్ కలుస్తారు. సుష్మా స్వరాజ్ అంటే మోదీకి ఇష్టం ఉండదు” అని అద్దంకి దయాకర్ అన్నారు. Also Read: తెలంగాణ భవన్‌లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు.. కేటీఆర్ కీలక కామెంట్స్.. అందుకే సింహం తన కథ తను చెప్పుకోవాలి