ప్రపంచ చెస్ దిగ్గజం మాగ్నస్ కార్ల్‌సన్‌ను ఎదుర్కోవడమంటే ప్రత్యర్థులకు ఓ పెద్ద సవాల్. అలాంటి ఆటగాణ్ని భారత యువ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద వరుస విజయాలతో బెంబేలెత్తిస్తున్నాడు. నార్వే చెస్ టోర్నమెంట్‌లో కార్ల్‌సన్‌ను క్లాసికల్ విభాగంలో ప్రజ్ఞానంద మరోసారి ఓడించాడు. ఈ అద్భుత విజయం తర్వాత మాట్లాడిన ప్రజ్ఞానంద.. కార్ల్‌సన్‌ను చూసి భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు.కార్ల్‌సన్‌తో మ్యాచ్ అంటే ఇష్టంకార్ల్‌సన్‌ను చూసి ఎప్పుడైనా భయపడ్డారా? అని అడిగిన ప్రశ్నకు ప్రజ్ఞానంద చాలా కూల్‌గా సమాధానం ఇచ్చాడు. తాను ఎప్పుడూ భయపడనని, కార్ల్‌సన్‌తో ఆడటానికి ఉత్సాహంగా ఉంటుందని చెప్పాడు. ఆయనతో మ్యాచ్ అనగానే తనలోని అత్యుత్తమ ఆట బయటకు వస్తుందని అన్నాడు. ఇద్దరి మధ్య ఎప్పుడూ హోరాహోరీ పోరు జరుగుతుందని, దాన్ని తాను బాగా ఎంజాయ్ చేస్తానని వివరించాడు.రిస్క్ తీసుకుని విజయంఈ టోర్నమెంట్‌లో క్లాసికల్ విభాగంలో కార్ల్‌సన్‌పై ప్రజ్ఞానందకు ఇది మూడో విజయం. ఒకే టోర్నమెంట్‌లో రెండుసార్లు కార్ల్‌సన్‌ను ఓడించడం విశేషం. ఈ మ్యాచ్‌లో తానే ఎక్కువ రిస్క్ తీసుకున్నానని ప్రజ్ఞానంద చెప్పాడు. గెలవాలనే పట్టుదలతో ఇద్దరం ఆడామని, చివరికి కార్ల్‌సన్ చేసిన చిన్న పొరపాటు వల్ల తనకు విజయం దక్కిందని అన్నాడు. ఈ గెలుపుతో ప్రజ్ఞానందకు మూడు పాయింట్లు వచ్చాయి.మేమంతా టాప్ ప్లేయర్లమేచెస్‌లో కొత్త తరం హవా నడుస్తోందన్న వార్తలను ప్రజ్ఞానంద తోసిపుచ్చాడు. తమ తరం ఆటగాళ్లు ఇప్పటికే ప్రపంచంలోనే అత్యుత్తమ ప్లేయర్లుగా ఎదిగారని స్పష్టం చేశాడు. దీన్ని ఏదో పెద్ద మార్పుగా చూడాల్సిన అవసరం లేదన్నాడు. సీనియర్ ఆటగాళ్లు ఇప్పటికీ టాప్‌లోనే ఉన్నారని, అదే
Praggnanandha News
Latest updates from Telugu Digital news sources.
AP7AM03 Jun, 06:43 am
కార్ల్ సన్ ను చూస్తే భయమా? ప్రజ్ఞానంద అదిరిపోయే సమాధానం