translateexpand_more

Rajasthan Royals News

Latest updates from Telugu Digital news sources.

TV9 Telugu02 Jun, 01:31 pm
సచిన్, కోహ్లీల రికార్డులు అవుట్.. 15 ఏళ్లకే బ్లాంక్ చెక్కులు అందుకుంటున్న వైభవ్ సూర్యవంశీ

Vaibhav Sooryavanshi : క్రికెట్ ప్రపంచంలో ప్రస్తుతం ఒకే ఒక్కడి పేరు మారుమోగిపోతోంది. అతడే 15 ఏళ్ల టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్‌లో ఈ బుడ్డోడు సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. రాజస్థాన్ రాయల్స్ (RR) జట్టు తరఫున ఆడిన వైభవ్.. తన బ్యాటింగ్ విశ్వరూపంతో క్రికెట్ దిగ్గజాలనే ఆశ్చర్యపరిచాడు. ఐపీఎల్ ముగింపు వేడుకల్లో మేజర్ అవార్డులన్నింటినీ ఇతడే క్లీన్ స్వీప్ చేశాడు. దాంతో రాత్రికి రాత్రే ఈ బిహార్ కుర్రాడి బ్రాండ్ వాల్యూ ఆకాశాన్ని తాకింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను సైతం పక్కకు నెట్టి కార్పొరేట్ కంపెనీలు ఈయన వెనుక పరుగులు పెడుతున్నాయి. ఐపీఎల్ 2026 సీజన్‌లో రన్నరప్ రేసులో రాజస్థాన్ క్వాలిఫైయర్-2 లో ఓడిపోయినప్పటికీ, వైభవ్ సూర్యవంశీ మాత్రం చరిత్ర సృష్టించాడు. ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సాధించడంతో పాటు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ (MVP), ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్, సూపర్ స్ట్రైకర్, సూపర్ సిక్సెస్ అవార్డులను కైవసం చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చిన్న వయసులో ఈ అవార్డులు గెలవడమే కాకుండా.. ఒకే సీజన్‌లో ఎంవీపీ, ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డులు రెండూ సాధించిన ఏకైక ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ సైతం స్పందిస్తూ.. భవిష్యత్తులో బాలీవుడ్, హాలీవుడ్ స్టార్ల కంటే పెద్ద సెలబ్రిటీ వైభవ్ అవుతాడని జోస్యం చెప్పారు. ఐపీఎల్‌లో వైభవ్ చూపించిన ప్రతాపానికి బ్యాట్ స్పాన్సర్‌షిప్ మార్కెట్ అప్సెట్ అయిపోయింది. కోహ్లీ బ్యాట్ స్పాన్సర్ ఎమ్ఆర్ఎఫ్, రోహిత్ శర్మ బ్యాట్ స్పాన్సర్ సియట్ లాంటి దిగ్గజ క్రీడా సంస్థలు వైభవ్ బ్యాట్ రైట్స్ కోసం పోటీ పడుతున్నాయి. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం ఒక ప్రముఖ కంపెనీ అయితే ఈ 15 ఏళ్ల కుర్రాడికి ఏకంగా బ్లాంక్ చెక్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రేజ్ చూసి వైభవ్ తన కమర్షియల్ యాడ్స్ రేట్లను ఏకంగా రెట్టింపు చేసేశాడు. వైభవ్ సూర్యవంశీ కమర్షియల్ జర్నీ ప్రముఖ న్యూట్రిషన్ బ్రాండ్ కాంప్లాన్ ఇండియాతో ప్రారంభమైంది. 2026 ప్రారంభంలోనే కాంప్లాన్ సంస్థ అతనితో థోడా ప్లాన్, థోడా కాంప్లాన్ అనే క్యాంపెయిన్ కోసం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ దాదాపు రూ.75 నుంచి 80 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఈ యాడ్‌లో వైభవ్ క్రమశిక్షణతో కూడిన శిక్షణ, క్రీడాకారులకు పోషకాహారం ఎంత ముఖ్యమనే విషయాలను హైలైట్ చేశారు. రెడ్ బుల్ ఛాలెంజ్.. గూగుల్ పే పాకెట్ మనీ యాడ్ ఐపీఎల్ 2026 టోర్నీ జరుగుతున్న సమయంలోనే వైభవ్ తన రాజస్థాన్ రాయల్స్ టీమ్‌మేట్ ధ్రువ్ జురెల్‌తో కలిసి రెడ్ బుల్ ఇన్నోవేటివ్ ఛాలెంజ్‌లో కనిపించాడు. స్పిన్నింగ్ వీల్ గేమ్ ద్వారా 30 బంతుల్లో 60 పరుగులు చేసే టాస్క్‌లో పాల్గొని అలరించాడు. దీనితో పాటు ప్రముఖ డిజిటల్ పేమెంట్ యాప్ గూగుల్ పే పాకెట్ మనీ క్యాంపెయిన్‌లో కూడా వైభవ్ ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. టీనేజర్లు తమ యూపీఐ ఐడీలను తల్లిదండ్రుల బ్యాంక్ అకౌంట్లకు లింక్ చేసుకునే ఈ ఫీచర్ యాడ్‌లో 15 ఏళ్ల వైభవ్ రోజువారీ డిజిటల్ పేమెంట్స్ చేస్తూ కనిపించాడు. జార్ఖండ్ ఆరోగ్య శాఖ అంబాసిడర్‌గా.. ఎస్ఎస్ బ్యాట్ డీల్ మే 30వ తేదీన జార్ఖండ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఇర్ఫాన్ అన్సారీ ఒక కీలక ప్రకటన చేశారు. వైభవ్‌ను యూత్ ఎనర్జీకి నిలువెత్తు రూపంగా అభివర్ణిస్తూ, త్వరలోనే జార్ఖండ్ ఆరోగ్య శాఖ తరుఫున ప్రచారకర్తగా నియమించనున్నట్లు పేర్కొన్నారు. ఇక క్రికెట్ కిట్ విషయానికి వస్తే.. ప్రముఖ స్పోర్ట్స్ తయారీ సంస్థ సరీన్ స్పోర్ట్స్ (SS – Sareen Sports)తో వైభవ్‌కు ఎప్పటి నుంచో ఒప్పందం ఉంది. ఈ ఎస్ఎస్ బ్యాట్ స్పాన్సర్‌షిప్ ద్వారా వైభవ్‌కు ఏడాదికి దాదాపు రూ.50 లక్షల ఆదాయం లభిస్తోంది. మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Andhra Jyothy02 Jun, 07:06 am
టీమిండియాలోకి వైభవ్ ఎంపికపై హడావిడి వద్దు

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో సంచలన ప్రదర్శనతో భారత క్రికెట్‌లో హాట్ టాపిక్‌గా మారాడు 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ. ఈ సీజన్‌లో 776 పరుగులు చేసి.. ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. పలు అరుదైన రికార్డులు కొల్లగొట్టాడు. అతడిని వెంటనే టీమిండియాలోకి తీసుకోవాలంటూ డిమాండ్లు వినిపిస్తున్న వేళ.. భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తొందరపడి వైభవ్ సూర్యవంశీని జాతీయ జట్టులోకి తీసుకురావద్దని తెలిపాడు.

‘సంజు శాంసన్, అభిషేక్ శర్మ తర్వాతి వరుసలో వైభవ్ సూర్యవంశీ ఉంటాడు. అయితే అతడిని నేరుగా న్యూజిలాండ్, సౌతాఫ్రికా వంటి విదేశీ పర్యటనలకు పంపడం సరైన నిర్ణయం కాకపోవచ్చు. ముందుగా ఐపీఎల్ తరహా బ్యాటింగ్‌కు అనుకూలమైన పరిస్థితుల్లో వైభవ్‌ను పరీక్షించాలి. అయితే అతడికి ఐపీఎల్ ఫామ్‌ను విదేశాల్లోనూ కొనసాగించే సామర్థ్యం ఉంది. కానీ వైభవ్‌పై అతిగా అంచనాలు పెట్టుకుని విదేశీ పర్యటనలకు ఎంపిక చేయడం సరికాదు. వైభవ్ టీమిండియాలో ఎలా రాణిస్తాడు? ఒత్తిడిని తట్టుకుంటాడా? వంటి ప్రశ్నలు కూడా వేస్తున్నారు. కానీ అది మన పని కాదు. నిజానికి అది బీసీసీఐ పని కూడా కాదు. వైభవ్‌ ఒక వ్యక్తి.. అతడి చుట్టూ కోచ్‌లు, మార్గదర్శకులు ఉంటారు. జీవితంలో అతడు ఏం సాధించాలని అనుకుంటున్నాడో అతడే నిర్ణయించుకోవాలి’ అని సంజయ్ మంజ్రేకర్ తెలిపాడు.

అందులో తప్పేమీ లేదు..

‘వైభవ్ కేవలం టీ20 ఫార్మాట్ స్పెషలిస్ట్‌గా మారాలనుకుంటే అలాగే ఉండొచ్చు. అందులో తప్పేమీ లేదు. కానీ అప్పటి నుంచి అతడిని టీ20 ప్లేయర్‌గానే అంచనా వేస్తారు. వన్డే క్రికెట్‌లో వైభవ్ ఆడితే.. తొలి 10 ఓవర్లలో అతడు చేసే విధ్వంసానికి అవధులు ఉండవు. గేమ్‌ను వన్ సైడ్ మార్చేసే సత్తా అతడిలో ఉంది. రంజీ ట్రోఫీ ఆడాలనుకుంటే వైభవ్ కూడా జట్టులో తన స్థానం కోసం పోటీ పడాలి. ఐపీఎల్ ప్రదర్శనల ఆధారంగా వెంటనే అవకాశాలు ఇవ్వడం కొంతమంది అర్హులైన ఆటగాళ్లకు అన్యాయం చేసినట్టు అవుతుంది. బిహార్ క్రికెట్ అకాడమీ తరఫున ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్న ఆటగాళ్లు ఉన్నారు. కాబట్టి వైభవ్‌పై అనవసర ఒత్తిడి పెట్టకుండా.. అతడు ఏ దిశలో వెళ్లాలనుకుంటున్నాడో అతడే నిర్ణయించుకునేలా వదిలేయాలి’ అని మంజ్రేకర్ సూచించాడు.

ఇవి కూడా చదవండి:

టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ.. బీసీసీఐ రియాక్షన్ ఇదే!

జట్టు ఓడిపోవడం కోహ్లీకి అస్సలు నచ్చదు: వెంకటేశ్ అయ్యర్

Andhra Jyothy02 Jun, 04:43 am
టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ.. బీసీసీఐ రియాక్షన్ ఇదే

ఇంటర్నెట్ డెస్క్: వైభవ్ సూర్యవంశీ.. ఐపీఎల్ 2026లో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న వైభవ్.. ఈ సీజన్‌లో 776 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. వైభవ్ సూర్యవంశీని వెంటనే టీమిండియాలోకి తీసుకోవాలంటూ గత కొద్దిరోజులుగా డిమాండ్లు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 15 ఏళ్ల కుర్రాడి ఎంపికపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు దారితీశాయి. త్వరలోనే వైభవ్‌ను భారత జట్టులోకి తీసుకోనున్నారంటూ వార్తలు వస్తున్నాయి.

‘భారత క్రికెట్‌కు వైభవ్ కొత్త వండర్ కిడ్. భవిష్యత్తులో అతడు ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తాడు. ఐపీఎల్ మ్యాచ్‌లను బీసీసీఐ సెలక్టర్లు పరిశీలిస్తున్నారు. చాలా సందర్భాల్లో వారు ప్రత్యక్షంగా స్టేడియానికి వెళ్లి ప్లేయర్ల ప్రతిభను గమనిస్తున్నారు. త్వరలో జరిగే భారత జట్టు ఎంపిక సమావేశాల్లో వైభవ్ ప్రదర్శనను తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటారు. అతడి భవిష్యత్తుకు ఏది మంచిదో దాని బట్టే బీసీసీఐ సెలక్టర్లు నిర్ణయం తీసుకుంటారు. ఈ ఐపీఎల్ సీజన్‌లో చాలామంది యువ ప్లేయర్లు అద్భుతంగా రాణించారు. కానీ వైభవ్ సూర్యవంశీ ప్రతిభ అసాధారణం. భారత క్రికెట్‌కు ఇలాంటి ప్లేయర్ దొరకడం సంతోషంగా ఉంది. వైభవ్ త్వరలోనే మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటాడు’ అని దేవజిత్ సైకియా ప్రశంసించారు.

ప్లేయర్ల ఫిట్‌నెస్‌పై బీసీసీఐ దృష్టి

ప్లేయర్ల వర్క్‌లోడ్‌పై కూడా దేవజిత్ స్పందించారు. ‘భారత జట్టుకు ఎంపికయ్యే అవకాశమున్న ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను బీసీసీఐ సాంకేతిక బృందం నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఐపీఎల్ రెండు నెలలపాటు ఫ్రాంచైజీల నియంత్రణలో జరుగుతుంది. ఈ సమయంలో ప్రతి చిన్న విషయాన్ని మేము నియంత్రించలేం. అయితే ఆటగాళ్లకు ముందుగానే ఫిట్‌నెస్ ప్రణాళికలు, మార్గదర్శకాలు అందజేస్తాం. దేశానికి ఆడే అవకాశం ఉన్న ఆటగాళ్లకు చేయాల్సినవి, చేయకూడనివి అన్నీ స్పష్టంగా తెలుసు. వారు వాటిని పాటిస్తున్నారనే నమ్మకం మాకు ఉంది’ అని సైకియా వివరించారు. కాగా వైభవ్ సూర్యవంశీపై బీసీసీఐ నుంచి వచ్చిన ఈ ప్రశంసలు, సంకేతాలు చూస్తుంటే.. టీమిండియా అరంగేట్రం వైభవ్‌కు ఎంతో దూరంలో లేదనే అభిప్రాయం క్రికెట్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. జాతీయ జట్టులోకి తీసుకురావాలా? వద్దా? అన్న నిర్ణయం ప్రధాన ఎంపిక కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ ప్యానెల్ చేతుల్లో ఉంది.

ఇవి కూడా చదవండి:

కోల్‌కతాలో మెస్సి విగ్రహం తొలగింపు.. ఎందుకంటే?

ఆర్సీబీ హిట్టర్ టిమ్ డేవిడ్‌పై సస్పెన్షన్ వేటు