translateexpand_more

Richest Cm In India Dk Shivakumar News

Latest updates from Telugu Digital news sources.

Zee Telugu03 Jun, 06:05 am
చంద్రబాబు ఆ రికార్డుకు బ్రేక్ చేయబోతున్న డీకే శివకుమార్

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Andhra Pradesh Vs Karnataka : కర్టాటకలో ఎన్నో తీవ్ర రాజకీయ పరిణామాల తర్వాత సిద్దరామయ్య తన ముఖ్యమంత్రి పదవిని వీడి రాజీనామా చేశారు. ఎట్టకేలకు కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ పగ్గాలు అందుకోబోతున్నారు. కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ స్థాయికి వచ్చారు. అంతేకాదు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ తరుపున ఫండింగ్ చేసిన నేతగా గుర్తింపు పొందారు. అంతేకాదు కర్ణాటకలో బీజేపీ అంతర్గత కుమ్ములాటలను క్యాష్ చేసుకొకి ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో డీకే కృషి చేశారు. కానీ కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం సిద్దరామయ్యను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది. చెరో రెండున్నరేళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని షరతుతో సిద్దరామయ్యకు సీఎం పీఠం దక్కింది. కానీ రెండేన్నరేళ్ల తర్వాత కూడా సీఎం పీఠం ఒదులుకోవడానికి సిద్దరామయ్య సిద్దపడకపోవడంతో ఈ పంచాయితీ కాంగ్రెస్ పెద్దలకు చేరింది. చివరకు ఎలాగో అలా సిద్దరామయ్యను బుజ్జగించి ఆయనను రాజీనామా చేయడానికి ఒప్పించారు. ఆయన కూడా కాంగ్రెస్ హై కమాండ్ బాటలో తన పదవికి రాజీనామా చేశారు. ఇక కొత్త సీఎల్పీ నేతగ డీకే శివకుమార్ పేరును ప్రతిపాదించారు. ఈ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న డీకే శివకుమార్ ప్రస్తుతం ఆస్తుల విషయంలో మన దేశంలో అత్యంత సంపన్న సీఎంగా నిలవనున్నారు. ఇంత మరకు తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబుకి గాని జగన్ కిగాని ఒక రికార్డు ఉంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశంలో రిచెస్ట్ సీఎం జగనే చంద్రబాబు నాయుడు ఉండేవారు. ఆ తర్వాత 2019 -2024 మధ్య జగన్ అత్యంత సంపన్న సీఎంగా రికార్డు క్రియేట్ చేశారు. 2014 నుంచి ఇప్పటి వరకు భారతదేశం మొత్తంమీద రిచెస్ట్ ముఖ్యమంత్రి మనవాల్లే ఉండేవారు. అటు రిచెస్ట్ ప్రతిపక్ష నేతగా జగన్ ..జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు చంద్రబాబు అత్యంత ధనవంతుడైన ప్రతిపక్షనేతగా ఉండేవారు. డీకే మనదేశంలోనే అత్యంత సంపన్న సీఎం కాబోతున్నాడు.. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న డికే శివకుమారుభారతదేశంలోని రిచెస్ట్ ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఈయన ఎన్నికల అఫిడవిట్‌లో రూ. 1413 కోట్ల ఆస్తులున్నట్టు చూపించారు. ఇక చంద్రబాబు నాయుడు అధికార లెక్కల ప్రకారం రూ. 931 కోట్ల ఆస్తి ఉన్నట్టు ఎన్నికల ప్రమాణ పత్రంలో చూపించారు. ఈ రకంగా మన దేశంలో సెకండ్ రిచెస్ట్ ముఖ్యమంత్రిగా రెండో స్థానంలో వస్తారు. ఇక జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు రూ. 650 కోట్ల ఆస్తులతో మన దేశంలో అత్యంత ధనిక సీఎంగా చెలామణి అయ్యేవారు. ఇక సిద్దరామయ్య మొన్నటి వరకు రూ. 332 కోట్ల ఆస్తులతో మూడో స్థానంలో ఉన్నారు. ఇక డీకే రాకతో ఈ లెక్కలన్ని మారిపోయాయి. ప్రస్తుతం లెక్కల ప్రకారం తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ రూ. 603 కోట్ల ఆస్తులతో రెండో స్థానంలో ఉన్న ఈయన డీకే రాకతో మూడో స్థానంలో కొనసాగుతారు. పెమాఖండు రూ. 332 కోట్ల ఆస్తులతో నాల్గో స్థానంలో నిలవనున్నార. నాగాలాండ్ ముఖ్యమంత్రి నెప్యూ రాయ్ రూ. 46 కోట్ల ఆస్తులతో ఐదో స్థానంలో నిలిచారు.మధ్యప్రదేశ్ ముఖ్యమం్తరి మోహన్ యాదవ్ 6వ స్థానం. పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి 7వ స్థానం.. రేవంత్ రెడ్డి ..8వ స్థానం.. భూపేంద్రపటేల్ .. 9వ స్థానం.. ప్రమోద్ సావంత్ 10వ స్థానంలో నిలవనున్నారు. మొత్తంగా డీకే రాకతో మొదటి మూడు స్థానాలు మారిపోనున్నాయి. Also Read:DK Shivakumar: కర్ణాటక కాబోయే ముఖ్యమంత్రి డీకే శివకుమార్ రాజకీయ ప్రస్థానం ఇదే.. ఇంతకీ ఎవరీ డీకే.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Richest Cm In India Dk Shivakumar News Keyword | Telugu Digital