
పర్పుల్ ఎస్బీఐ కార్డ్, ఫోన్‌పేపై గరిష్టంగా 1,000 రివార్డ్ పాయింట్లు జూలై 1 నుంచి ఈ ఎస్బీఐ కార్డు పేమెంట్లపై రివార్డ్ పాయింట్లు పొందలేరు ఫోన్‌పే ఖర్చులపై గరిష్టంగా 750 రివార్డ్ పాయింట్లు మాత్రమే PhonePe SBI Card : ఫోన్‌పే ఎస్బీఐ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. మీరు పర్పుల్ లేదా ఫోన్‌పే ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ బ్లాక్ వాడుతున్నారా? అయితే, ఇది మీకోసమే. ఈ రెండు క్రెడిట్ కార్డులకు సంబంధించి రివార్డ్ పాయింట్లను మార్చాలని ఎస్‌బీఐ కార్డ్ నిర్ణయించింది. ఈ కొత్త నిబంధనలు జూలై 1, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. ఎస్‌బీఐ మార్పులతో కొన్ని రకాల ఖర్చులపై రివార్డ్ పాయింట్ల లిమిట్ తగ్గించింది. అలాగే అనేక (PhonePe SBI Card) రకాల పేమెంట్లపై కూడా ఇకపై రివార్డ్ పాయింట్లు లభించవు. ముఖ్యంగా ఇన్సూరెన్స్, పవర్ బిల్లు, వాటర్ బిల్లులు, విద్యా రుసుములు, ఆభరణాల కొనుగోళ్లు, టోల్ పేమెంట్ల కోసం కార్డును వాడినా రివార్డు పాయింట్లు రావని గుర్తుంచుకోండి. పర్పుల్ కార్డులో మార్పులేంటి? : పర్పుల్ ఎస్బీఐ కార్డ్ హోల్డర్లు ఫోన్‌పే ద్వారా చేసే ఖర్చులపై నెలకు గరిష్టంగా 1,000 రివార్డ్ పాయింట్లను సంపాదించేవారు. ఆన్‌లైన్ ఖర్చులకు కూడా 1,000 రివార్డ్ పాయింట్ల లిమిట్ ఉండేది. కానీ, ఈ నిబంధన జూలై 1, 2026 నుంచి మారనుంది. ఇకపై ఇన్సూరెన్స్ సంబంధిత ఖర్చులపై నెలకు గరిష్టంగా 250 రివార్డ్ పాయింట్లు మాత్రమే లభిస్తాయి. Read Also : Honor X7e Launch : చార్జింగ్ టెన్షన్‌కు గుడ్‌బై.. 7,500mAh బ్యాటరీతో హానర్ కొత్త ఫోన్.. కాగా, ఇతర ఫోన్‌పే ఖర్చులపై గరిష్టంగా 750 రివార్డ్ పాయింట్లు మాత్రమే లభిస్తాయి. ఆన్‌లైన్ ఖర్చుపై సంపాదించే రివార్డ్ పాయింట్ల లిమిట్ కూడా 1,000 నుంచి 750కి తగ్గించారు. మీ ఖర్చు నిర్దేశించిన లిమిట్ మించినప్పటికీ మీరు నిర్దిష్ట పరిమితి వరకు మాత్రమే రివార్డ్ పాయింట్లను పొందగలరు. ఫోన్‌పే, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ బ్లాక్‌లో మార్పులేంటి? : సెలెక్ట్ బ్లాక్ కార్డ్ హోల్డర్ల కోసం రివార్డ్ పాయింట్ల లిమిట్ కూడా తగ్గించారు. గతంలో, ఫోన్‌పే ఖర్చులపై నెలకు గరిష్టంగా 2వేల రివార్డ్ పాయింట్లు లభించేవి. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఖర్చులపై కేవలం 500 రివార్డ్ పాయింట్లు, ఇతర ఫోన్‌పే ఖర్చులపై గరిష్టంగా 1,500 రివార్డ్ పాయింట్లు మాత్రమే లభిస్తాయి. అదనంగా, ఆన్‌లైన్ ఖర్చుల కోసం రివార్డ్ పాయింట్ల లిమిట్ 2వేల నుంచి 1,000కి తగ్గించారు. ఏయే ఖర్చులపై రివార్డ్ పాయింట్లు రావంటే? : రివార్డ్ పాయింట్లు పొందలేని పేమెంట్ల జాబితాను ఎస్‌బిఐ కార్డ్ విస్తరించింది. అందులో ప్రధానంగా టోల్, బ్రిడ్డ్ రుసుముల చెల్లింపు గిఫ్ట్, సోవెనీర్స్ కొనుగోళ్లు ఆభరణాల షాపింగ్ పాఠశాలలు, కాలేజీలు లేదా ఇతర సంస్థలకు చేసిన పేమెంట్లు ఫోన్‌పే యాప్ ఇతర యాప్ ద్వారా ఎలక్ట్రిసిటీ, వాటర్ లేదా ఇతర యుటిలిటీ బిల్లుల పేమెంట్లు ఫోన్‌పే యాప్ యేతర ఇన్సూరెన్స్ ప్రీమియం పేమెంట్లు ఫోన్‌పే యాప్ యేతర చేసిన యూపీఐ లావాదేవీలు మిగతా బెనిఫిట్స్ యథాతథం : రివార్డ్ పాయింట్ల లిమిట్స్, కొన్ని పేమెంట్లపై పొందే బెనిఫిట్స్‌లో ఎలాంటి మార్పులు లేవని ఎస్‌బీఐ కార్డ్ క్లారిటీ ఇచ్చింది. ఈ రెండు కార్డుల ఇతర ఫీచర్లు, బెనిఫిట్స్ యథాతథంగా పొందవచ్చు. అందుకే, ఫోన్‌పే ఎస్‌బిఐ క్రెడిట్ కార్డ్ పర్పుల్, సెలెక్ట్ బ్లాక్ కార్డ్‌లతో కస్టమర్లు ఈ కొత్త నిబంధనలకు అనుగుణంగా ఖర్చులను ప్లాన్ చేసుకోవడం బెటర్.