translateexpand_more

Sleep News

Latest updates from Telugu Digital news sources.

AP7AM03 Jun, 10:06 am
నైట్ షిఫ్ట్ లా? ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉందా?.. అయితే నిద్రను బ్యాలెన్స్ చేసుకునే సూపర్ టెక్నిక్

ఇంట్లో పెళ్లి వేడుకలు ఉన్నా, ఆఫీసులో అర్జెంట్ ప్రాజెక్ట్ ఉన్నా.. రాబోయే రోజుల్లో నిద్ర కరవవుతుందని ముందే తెలిసిపోతుంది. ఇలాంటి బిజీ షెడ్యూల్స్ వల్ల నిద్ర సరిపోక శరీరం, మనస్సు తీవ్ర అలసటకు గురవుతాయి. అయితే రాబోయే రోజుల్లో నిద్ర తగ్గినా సరే, శరీరం అంతే ఎనర్జిటిక్‌గా, ఫ్రెష్‌గా ఉండటానికి ఆరోగ్య నిపుణులు ఒక సూపర్ టెక్నిక్ చెబుతున్నారు. దాన్నే ‘స్లీప్ బ్యాంకింగ్’ అంటారు.ఏంటి ఈ టెక్నిక్?మనం భవిష్యత్తు అవసరాల కోసం బ్యాంకులో డబ్బులు దాచుకున్నట్లే.. రాబోయే రోజుల్లో నిద్ర తగ్గుతుందని తెలిసినప్పుడు, ముందే అదనంగా నిద్రపోవడాన్ని స్లీప్ బ్యాంకింగ్ అంటారు. బిజీ షెడ్యూల్స్ ప్రారంభం కావడానికి కొన్ని రోజుల ముందు నుంచే రోజువారీ నిద్ర సమయాన్ని పెంచాలి. ఇలా చేయడం వల్ల నిద్రలేమి కారణంగా శరీరంపై పడే ప్రతికూల ప్రభావాన్ని తాత్కాలికంగా తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు.పరిశోధనలు ఏం చెబుతున్నాయి?నైట్ షిఫ్ట్‌లు చేసే డాక్టర్లపై జరిగిన ఓ పరిశోధనలో స్లీప్ బ్యాంకింగ్ అద్భుతంగా పనిచేస్తుందని తేలింది. నైట్ షిఫ్ట్ ప్రారంభం కావడానికి ఒక వారం ముందు నుంచే రోజుకు 8 గంటల కంటే ఎక్కువ నిద్రపోయిన వారు విధుల్లో చాలా చురుగ్గా పనిచేసినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ పద్ధతి వల్ల బాడీ ఒత్తిడిని తట్టుకోవడమే కాకుండా జ్ఞాపకశక్తి ఏకాగ్రత కూడా బాగా పెరుగుతాయని క్లినికల్ స్లీప్ మెడిసిన్ జర్నల్ వెల్లడించింది.నిద్ర లేకపోతే వచ్చే నష్టాలునిద్రలేమి అంటే కేవలం అలసట మాత్రమే కాదు. దీర్ఘకాలం పాటు సరిగా నిద్రపోకపోతే టైప్-2 డయాబెటిస్, విపరీతంగా బరువు పెరగడం, గుండె జబ్బులు,

Sleep News Keyword | Telugu Digital