translateexpand_more

Sonarpur Incident News

Latest updates from Telugu Digital news sources.

Andhra Jyothy31 May, 06:59 am
ఆస్పత్రి సీఈఓకు మమతా బెనర్జీ వార్నింగ్.. దుమారం రేపుతున్న వీడియో

కోల్‌కతా, మే 31: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ పార్టీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడి ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. శనివారం సోనార్‌పూర్‌లో స్థానికులు అభిషేక్‌పై విచక్షణా రహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ ఆయనను సిబ్బంది కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. తర్వాత అక్కడి నుంచి బెల్ వ్యూ ఆస్పత్రికి తరలించారు. మేనల్లుడిపై దాడి జరిగిన విషయం తెలియగానే మమతా బెనర్జీ బెల్ వ్యూ ఆస్పత్రికి వెళ్లారు. అభిషేక్‌ను పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..

తీవ్రంగా గాయపడ్డ అభిషేక్‌కు చికిత్స అందించవద్దంటూ డాక్టర్లపై, ఆస్పత్రి యాజమాన్యంపై బీజేపీ ఒత్తిడి తెస్తోందని ఆరోపించారు. రాజకీయాలను రాజకీయాలుగానే చూడాలని, హింస, ఆయుధాలు, భయంతో రాజకీయాలకు సమాధానం చెప్పకూడదని హితవు పలికారు. ఆస్పత్రి లోపల బెల్ వ్యూ సీఈఓ ప్రదీప్ టాండన్‌తో మమతా బెనర్జీ గొడవకు దిగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో మమతా బెనర్జీ ఆస్పత్రి సీఈఓకు వార్నింగ్ ఇస్తున్నట్లుగా వాయిస్ ఉంది.

ఆ వీడియోలో.. ‘టాండన్ మీరు చాలా తప్పు చేస్తున్నారు. మేము మీకు చేసిన సాయాన్ని దయచేసి గుర్తు తెచ్చుకోండి. మిమ్మల్ని దేవుడు క్షమించడు. మీరు తప్పుదోవపట్టిస్తున్నారు. ఇలా చేయడానికి మీకు సిగ్గుండాలి. ప్రతీ ఒక్కరు మీ దురుసు ప్రవర్తనను గుర్తు పెట్టుకుంటారు. ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది. రేపు ఉండదు. అప్పుడు మేము చేయాల్సింది చేస్తాం’ అని మమతా అన్నట్లుగా ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.

ఇవి కూడా చదవండి

స్టార్ ఆటగాళ్ల మధ్య ఆసక్తికర పోరు.. ఎవరిది పైచేయి?

<a target="_blank"

Andhra Jyothy31 May, 03:10 pm
టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడి కేసులో ట్విస్ట్

టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడి కేసులో అరెస్టైన నిందితుల్లో కొందరికి టీఎంసీ మాజీ ఎమ్మెల్యే లవ్లీ మైత్రాతో సంబంధాలు ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడి కేసులో పోలీసులు ఇప్పటికే ఐదుగురిని అరెస్టు చేశారు. వీరికి టీఎంసీ మాజీ ఎమ్మెల్యే లవ్లీ మైత్రాతో సంబంధాలు ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. పోలీసులు అరెస్టు చేసిన తపన్ మైతీ, ఆకాశ్.. ఎంపీ అభిషేక్‌పై దాడి వీడియోల్లో కనిపించినట్టు సమాచారం. వీరికి టీఎంసీ మాజీ ఎమ్మెల్యే లవ్లీ మైత్రాతో దగ్గరి సంబంధాలు ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ కేసుకు సంబంధించి పోలీసుల అదుపులో ఉన్న నిర్మాల్యా సేన్‌గుప్తా, కాజల్ దాస్, దేబాశిష్ దత్తా కూడా టీఎంసీ నేత లవ్లీ మైత్రాతో సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. జాతీయ మీడియా కథనాల ప్రకారం, అకాశ్ స్థానికులకు టీఎంసీ కార్యకర్తగా పరిచయం. నిర్మాల్య సేన్ గుప్తాకు కూడా టీఎంసీతో సుదీర్ఘకాలంగా సంబంధం ఉందని తెలుస్తోంది.సేన్‌ను అక్రమంగా ఈ కేసులో ఇరికించారని ఆయన కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే, ఆయనకు 1998 నుంచి పార్టీతో అనుబంధం ఉందని తెలిపారు. ఈ దాడికి బీజేపీ కారణమని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. బీజేపీ మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేస్తోంది. మాజీ సీఎం మమత ఇంట్లో మీటింగ్.. ఎమ్మెల్యేల డుమ్మా? పాక్ కుట్ర.. ఉగ్రవాదులకు సాయంగా భారత్‌లోకి టెలికం సిగ్నల్స్

Andhra Jyothy30 May, 02:33 pm
టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడి.. ఖండించిన ఖర్గే

ఇంటర్నెట్ డెస్క్: సోనార్‌పూర్‌లో (పశ్చిమబెంగాల్) టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై శనివారం జరిగిన దాడిని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ఖండించారు. రాజకీయ భేదాభిప్రాయాలున్నంత మాత్రాన హింసకు దిగడం ఎంతమాత్రం సమర్థనీయం కాదని స్పష్టం చేశారు. ఎన్నికల నేపథ్యంలో జరిగిన హింసాత్మక ఘటనల బాధితులను పరామర్శించేందుకు టీఎంసీ ఎంపీ శనివారం సోనార్‌పూర్ వెళ్లిన సందర్భంగా కొందరు కోడి గుడ్లు, రాళ్లతో దాడి చేసిన విషయం తెలిసిందే.

ఈ దాడిని తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఎక్స్ వేదికగా ఖండించారు. ఆయనకు తగినంత పోలీసు భద్రత లేకపోవడాన్ని బట్టి బీజేపీ రాజకీయాలు, ప్రతీకారాలను అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రతిపక్ష నేతల భద్రత కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

మరోవైపు, సమాజ్ వాదీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ కూడా అభిషేక్ బెనర్జీపై దాడిని ఖండించారు. తాము ఎంతటి ద్వేషపూరిత రాజకీయాలకైనా దిగగలమని బీజేపీ ఈ దాడితో రుజువు చేసిందని వ్యాఖ్యానించారు. సున్నిత ప్రాంతాల్లో కూడా పోలీసు భద్రత లేకపోవడం కుట్ర కోణాన్ని సూచిస్తోందని ఎక్స్ వేదికగా కామెంట్ చేశారు. బీజేపీ కార్యకర్తలే అభిషేక్ బెనర్జీపై దాడికి దిగారని టీఎంసీ ఆరోపించింది.

ఈ వార్తలనూ చదవండి:

డీకే ప్రమాణస్వీకారం తేదీ ఖరారు.. ప్రకటించిన కేసీ వేణుగోపాల్

ఆపరేషన్ సిందూర్ 2.0కు సిద్ధం... ఆర్మీ చీఫ్ ద్వివేది